‘‘అప్పుడే సంతోషం, ఆందోళన, ముసిముసి న వ్వులు.. ముఖంలో క్షణక్షణం రంగులు మారుతున్నాయి. మైమ్ కళ ప్రదర్శిస్తున్నావా?’’
‘‘ముందు సంతోషం కలిగించిన విషయం చెప్పాలా? బాధకలిగించిన విషయం చెప్పాలా?’’
‘‘చెప్పాలనుకున్నది చెప్పు?’’
‘‘విప్లవం మరణించింది.. ఒక తార రాలిపోయింది’’
‘‘చిన్నప్పుడంటే ఆరుబయట ముచ్చట్లు చెప్పుకుంటూ పడుకునే వాళ్లం. అత్తలు తమ కోడళ్ల పెంకి తనం గురించి, కోడళ్లు తమ అత్తల సాధింపుల గురించి, మగాళ్లేమో మందు గురించి, పిల్లలం సినిమాలు, స్కూల్‌లో టీచర్ల గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ పడుకునే వాళ్లం. అప్పుడు రాత్రి ఆకాశంలో చుక్కలు రాలడం కనిపించేది. ఇప్పుడు ఏసీ గదుల్లో బందీలమైన తరువాత కరెంటు బిల్లు చుక్కలు చూపిస్తుంది కానీ నిజమైన చుక్కలు కనిపించడం లేదు. ఇంత కాలనికి చుక్కలు రాలడం చూశావా? విప్లవం ఇప్పుడు చనిపోవడం ఏంటీ? ఎప్పుడో చనిపోయింది. ఆర్థిక సంస్కరణలతో ఎప్పుడో విప్లవ దహన సంస్కారాలు పూర్తయ్యాయి. నువ్వే ఆలస్యంగా గుర్తించావు అంతే ..’’
‘‘విప్లవం చనిపోయింది అని నేను చెప్పిన అర్థం వేరు, నువ్వనుకుంటున్న అర్థం వేరు.. నువ్వనుకునే విప్లవం మరణించడం ఎప్పుడూ సాధ్యం కాదు. విప్లవం నిరంతర అగ్నిజ్వాల. పెట్రోల్ రేటులా విప్లవం ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటుంది. ఒక తార రాలితే వంద తారల ప్రభవిస్తాయి. నీలాంటి పెట్టుబడిదారుడి ప్రియపుత్రులు విప్లవం మరణించిందని సంబరాలు చేసుకోవచ్చు . కానీ నాలాంటి వారు విప్లవానికి అండగా ఉంటారని గుర్తుంచుకో. ఒక్కరు లేక ఇద్దరు పిల్లలు చాలని కుటుంబ నియంత్రణ గురించి ఏళ్లతరబడి ప్రచారం చేసినా జనాభా పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. అలాంటిది విప్లవంలో ఒకరు మరణిస్తే వంద మంది పుట్టుకు వస్తారని పాటలు పాడి ప్రచారం చేస్తున్నాక విప్లవం అంతరిస్తుందని ఎంత అమాయకంగా అనుకుంటున్నావుబ్రదర్’’
‘‘రావణుడు సీతాదేవిని అపహరించిన తరువాత సుగ్రీవుని సహకారంతో శ్రీరాముడు సీతానే్వషణకు ప్రయత్నిస్తాడు. వానర సేన ఒక్కో బృందం ఒక్కో వైపు సీతను వెతికేందుకు వెళుతుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీత జాడ కనుగొంటాడు. ఇతర మార్గాల్లో వెళ్లిన వానర సేన ఇంకా సీత జాడను అనే్వషించడంలోనే ఉందని ఓ జానపద కథ ఉంది’’
‘‘ఉంటే?’’
‘‘సీత జాడ కోసం అమాయకంగా వానర సేన ఇంకా వెతుకుతున్నట్టే అడవిలో విప్లవం కోసం కొంత మంది వెతుకుతూ ఉండొచ్చు.. నేను కాదనడం లేదు. విప్లవం అడవిలో లేదు వ్యాపారంలో ఉందని గ్రహించిన వర్గం ముందుగానే జన జీవన స్రవంతిలో కలిసి చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి విద్యా వ్యాపారం వరకు అన్ని వ్యాపారాల్లో పాతుకు పోయారు. అడవిలో దారి తప్పి తిరుగుతున్న వారు ప్రపంచానికి దారి చూపిస్తామని చెబుతున్నారు. వారికి బయటకు వచ్చే దారి తెలియడం లేదు. లోపల ఉండే మార్గం లేదు. ఐనా మనకు దారి చూపాలనే వారి ప్రయత్నం అభినందనీయం. సీత కోసం ఇంకా వానర సేన అనే్వషిస్తున్నట్టు దారి కోసం వీళ్లు అనే్వషిస్తున్నారన్నమాట’’
‘‘కోతికథలు నాకెందుకు? కానీ విప్లవం చనిపోయింది అని నేనన్నది మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు విప్లవ సినిమాలతో సినిమా హాళ్లను ఎరుపెక్కించిన విప్లవ శంఖం మాదాల రంగారావు గురించి.. ఆయన మరణించాడు క దా? కవితాత్మకంగా చెప్పాను.’’
‘‘అవును ఆ రోజుల్లో రెండు గంటల సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ దాటి బయటకు వెళ్లడమే ఆలస్యం విప్లవం వచ్చేస్తుందని అనిపించేది. అదేంటో కానీ చివరకు మనం అలాంటి సినిమాలు చూడడం మానేశాం, ఆయన తీయడం మానేశారు. కానీ విప్లవం రానే రాలేదు. మైలు రాయి అక్కడే ఉన్నట్టు విప్లవం గమ్యాన్ని చేరుకోలేదు.’’
‘‘జనాన్ని చైతన్య పరచాల్సిన అవసరం ఉంది?’’
‘‘ఎలా?’’
‘‘ఏమో తెలియదు కానీ జనాన్ని చైతన్య పరచాలనేది నా చిన్నప్పటి కోరిక. చదువు,ఉద్యోగం వేట, పిల్లలు, వారి చదువు, జీవితంలో స్థిరపడడం వీటిలో పడిపోయి ఇంత కాలం బిజీగా ఉన్నాను. అన్ని బాధ్యతలు తీరిపోయాయి. తీరిగ్గానే ఉన్నాను. రిటైర్‌మెంట్ తర్వాత కాలక్షేపంగా ఉంటుందని జనాన్ని చైతన్య పరచాలనుకుంటున్నాను’’
‘‘తెలివైన వాడివి తెలివైన నిర్ణయం తీసుకున్నావు. ఏ వయసులో ఏం చేయాలో అది చేశావు... చేస్తున్నావు. రెబల్ స్టార్ ఐనా, రెడ్ స్టార్ అయినా తాము తీసిన సినిమాకు నాలుగు డబ్బులు వస్తేనే మళ్లీ సినిమా తీస్తారు. భక్తి,విప్లవం, ఆదర్శాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, దేశభక్తి అన్నీ వ్యాపార వస్తువులే.. ఒక్కో దానికి ఒక్కో కాలంలో మార్కెట్ ఉంటుంది. అప్పుడే అవి రంగప్రవేశం చేస్తాయి. గాంధీజీ ఆదర్శాలతో సినిమా తీస్తే చూసేవారుండరు. విజయ్ మాల్యా విజయగాథను రంగేలారాజా అంటూ చక్కని పేరుతో సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకు టైటిల్ ఒక్కటి చాలు మినిమం గ్యారంటీకి.’’
‘‘ఏంటా మాటలు?’’
‘‘ ఎంతో శ్రమ పడి డాక్టర్ అంబేద్కర్ పై సినిమా తీసిన వాళ్లను అడుగు.. నిజమో కాదో చెబుతారు’’
‘‘అది సరే.. ముసిముసి నవ్వులెందుకు నవ్వావు?’’
‘‘సొంత కొడుక్కి సార్వభౌమాధికారం అని పలకడం రాదు. నేర్పలేదు . కానీ ఎక్కడో మెట్‌పల్లికి చెందిన తెలంగాణ కుర్రాడు సివిల్ సర్వీస్ పరీక్షల్లో దేశంలో ఫస్ట్ వస్తే నేనే కారణం అని చెప్పుకునే ఆయన ధైర్యాన్ని చూసి ముచ్చటేసింది. నవ్వు వచ్చింది. ’’
‘‘దీనికి కావలసింది ధైర్యం కాదేమో! ఇంకో పదమేమో! ఎంత ఖర్చయినా వెనుకాడకుండా అబ్బాయికి తెలుగు నేర్పిస్తున్నారు..’’
‘‘సార్వభౌమాధికారం చేజారే లోగానైనా అబ్బాయి సార్వభౌమాధికారం అని పలకడం నేర్చుకుంటాడంటావా?’’
‘‘కాలమే చెప్పాలి’’*బుద్దా మురళి (జనాంతికం 1-6-2018)

"సొంత కొడుక్కి సార్వభౌమాధికారం అని పలకడం రాదు"
రిప్లయితొలగించండి"కృతఘ్నత" పదం పలకడం వాళ్ళ తాతకే రాలేదు, బొడ్డూడని బుడ్డోడు పాపం ఏమి చేయగలడండీ?