అంతా ఉత్సాహంగా ఉన్నారు.. రిపోర్టర్ లు అందరూ సంతోషంగా కనిపిస్తే నాకూ సంతోషమే .. గుర్నాథం ఏం స్టోరీ చేస్తున్నావ్?’’
‘‘అదేదో పేద రాష్ట్రంలో ఏదో ఆఫీసులో అటెండర్ ఇంట్లో ఏసీబీ దాడి జరిపితే వంద కిలోల బంగారం, 67 ప్లాట్లు, 50 ఎకరాల పొలం కాగితాలు, కోట్లకొద్దీ నగదు దొరికింది. దీనిపై స్టోరీ చేస్తున్నా సార్! ఒక అటెండర్ ఇంత సంపాదించడం సాధ్యమా? ఎవరికైనా బినామీనా? అని ’’
‘‘ఈ లెక్కలన్నీ ఏసీబీ వాళ్లు చెప్పినవే. అందులో నువ్వు పొడిచేసిందేమీ లేదు. ఆ అటెండర్ ఎవడో నాకు తెలియదు కానీ నా అంచనా ప్రకారం వాడి చేతికి వాచీ, మెడలో గొలుసు ఉండదు. ఆఫీసులో ఎప్పుడూ నైతిక విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మెడలో గొలుసు లేదు ఇంట్లో వంద కిలోల బంగారం.. చేతికి వాచీ లేదు కోట్ల రూపాయల నగదు అంటూ అదరగొట్టాలోయ్. మానవ జీవితంలో విలువ ప్రాధాన్యత గురించి అతను సమావేశాల్లో చేసిన బోధనల వీడియోలు వెతికితే దొరకవచ్చు. ’’

‘‘నిజమే సార్.. ఫొటో చూస్తే అతని చేతికి వాచీ లేదు. మీరు గ్రేట్ సార్’’
‘థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఇక్కడ.. ఇలాంటివి ఎన్ని చూడలేదు..? ఓ కొటేషన్ చెబుతా రాసుకో.

ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందన్నది నిన్నటి మాట. ప్రతి నైతిక విలువల ఉపన్యాసకుని వెనుక ఒక చీకటి జీవితం ఉంటుందన్నది నేటిమాట’’
‘‘వా.. వా.. ఏం చెప్పారు గురువు గారూ..’’
‘‘ఇలా పొగుడుతున్నావంటే.. నా సీటుకు ఎప్పుడైనా ప్రమాదం వస్తే గిస్తే అది నీవల్లేనోయ్!’’
‘‘ఏమోయ్ ట్రైనీ రిపోర్టర్.. ఏమిటీ ఆలస్యం ?’’
‘‘ఓ చోట భార్యాభర్తలు కొట్టుకుంటుంటే మానవత్వంతో అడ్డుకుని సర్ది చెప్పి వచ్చాను సార్ అందుకే లేటయింది’’
‘‘మన ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో ‘బతుకు బస్టాండ్’ ప్రోగ్రామ్‌కు వచ్చేవారు లేక చస్తున్నాం. భార్యాభర్తలు సరదాగా కీచులాడుకున్నా దాన్ని ఎలా పెద్దది చేయాలి? వారి బతుకును ఎలా బస్టాండ్‌గా మార్చాలని ఆలోచించాలి. ఇలా భార్యభర్తలను కలుపుతూ పోతే మనం చానల్ మూసేసి మఠంలో భజన చేయాల్సిందే. ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా? మీకు నెలనెలా అంతేసి జీతాలు ఎలా ఇస్తారని అనుకుంటున్నావ్’’
‘‘సార్! యమకింకర్ కాలేజీ విద్యార్థిని ర్యాంకు రాలేదని పదో అంతస్థు నుంచి కింద పడి చనిపోయింది. ర్యాంకుల పేరుతో కాలేజీ వాళ్లు చేస్తున్న వ్యాపారం, పిల్లలపై మానసిక ఒత్తిడి పై స్పెషల్ స్టోరీ ప్లాన్ చేస్తున్నా..’’
‘‘మీకు ప్రతీదీ అరటిపండు వలిచిపెట్టినట్టు నేర్పించాలి. ఆ స్టోరీ నేను ప్లాన్ చేస్తా.. యమకింకర్ ఓనర్‌కు ఫోన్ చేసి మాట్లాడుతా.. ఎలా ప్లాన్ చేయాలో నన్ను చూసి నేర్చుకోండి’’
‘‘ఓకే సార్...’’
‘‘హలో యమకింకర్ ఓనర్ గారూ.. బాగున్నారా? నేను చానల్ హెడ్‌ను. టాప్ చానల్స్‌నే కాదు సార్! మా చానల్‌ను కూడా గుర్తు పెట్టుకోండి. మీ కాలేజీ అమ్మాయి బిల్డింగ్ పైనుం చి పడి చనిపోయిందట క దా? ఐనా, రోజూ ఇలా ఎంతోమంది చనిపోతుంటారు. మీకెన్నని గుర్తుంటాయి? మనం పరస్పరం సహకార పద్ధతిలో పని చేసుకోవాలి. రెండు మూ డు యాడ్‌లు పంపండి. నూట పాతిక కోట్ల జనాభా ఉన్న దేశంలో మీ కాలేజీ వాటాగా వారానికో పాతిక మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ దేశానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదులెండి.. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. బకాసురుడికి ఊళ్లో వారంతా రోజుకొకరిని ఆహారంగా పంపినట్టు మీకొకరిని సమర్పించుకుంటారు.. ఏంటీ ఒకటే ప్రకటన ఇస్తారా ? మా సహకారాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు . విద్యార్థికి ర్యాంక్ వస్తే యమా కింకర కాలేజీకి రాంక్ అని రాస్తాం . ర్యాంక్ రాక చస్తే మాత్రం విద్యార్థి పేరే చెబుతాం , రాస్తాం కానీ కాలేజీ పేరు చెప్పం . తెలియక కాదు . మీ పట్ల అది మా సామాజిక బాధ్యత .. సరే ఈ సారికి సరిపెట్టుకొంటాం . తరువాత శవానికో యాడ్ లేకుంటే ఉరుకోము ... హా... హా... ప్రకటనలు పంపండి ఉంటా..’’
‘‘సార్.. స్టోరీ అన్నారు?’’
‘‘ఈ కుర్రళ్లతో ఇదే సమస్య.. ఏ సంఘటనను ఎలా డీల్ చేయాలో తెలియదు.’’
‘‘సార్! క్యాంటిన్‌లో ప్రవీణ్‌గాడు టీ కప్పు సరిగా కడిగి టీ ఇవ్వమంటే బూతులు తిడుతున్నాడు..’’
‘‘వాడ్ని పిలిచుకురా!’’
‘‘సార్.. పిలిచారట!’’
‘‘ఏరా.. ప్రవీణ్ క్యాంటిన్‌లో ఎంతకాలం పనిచేస్తావుకానీ.. నీ టాలెంట్‌కు తగిన పని అప్పగిస్తా.. ఈ కోటు వేసుకుని టీవీ చర్చల్లో నీకొచ్చింది మాట్లాడు. అచ్చం నీలానే బండబూతులు తిట్టే ఇద్దరిని టీవీ షోలో కూర్చోబెట్టి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి. మా పనిమనిషి ఎప్పటి నుంచో టీవీలో తనను చూపించాలంటూ ఒకటే పోరు. మీలానే బాగానే తిడుతుంది.. ఆమె టాలెంట్‌నూ వాడుకోండి.’’
‘‘సార్.. మీరుఅవినీతి పరుడని అప్పారావును అనవసరంగా మన ఛానల్ నుంచి తీసేశారు.. కోమాలో ఉన్న చానల్‌ను తన తిట్లతో పాపులర్ చేస్తున్నాడు.’’
‘‘ తెలియకుండా మాట్లాడకు .. అవినీతి పరుడని తీసేయలేదు . అవినీతిలో న్యాయంగా వాటా ఇవ్వనందుకు తీసేశాను . వాడి అక్రమాల్లో మనకు వాటా లేనప్పుడు వాడి అవినీతి ఎందుకు సహించాలి . వాడిని తీసేయకుండా భుజానికి ఎత్తుకుంటానా? ’’
‘‘ఖల్..ఖల్... మా రోజుల్లో జర్నలిజం విలువలతో ఉండేది. లోకం పాడైంది’’
‘‘ఇదిగో.. ఖల్.. ఖల్.. సుబ్బారావు గారూ.. మందుకొట్టి మీ బతుకును బస్టాండుగా ఎలా మార్చుకున్నది మాకు తెలియదనుకోకండి. రిటైర్ అయిన తరువాత జరుగుబాటుకు ఏమీ లేదంటే ఏదో పనికి వస్తాడులే అని అవకాశం ఇచ్చాం. మీ కాలంలో అంటే- 1950 ప్రాంతంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ సారి మాట్లాడుతూ ‘సబ్బుల వ్యాపారం ఎలాంటిదో మీడియా వ్యాపారం కూడా అలాంటిదే. అతిగా పవిత్రత ఆపాదించకండి’అని అన్నారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో- బ్రిటిష్ వాళ్లే పాలించాలి.. మా దేశానికి స్వాతంత్య్రం వద్దు అని వాదించిన పండితులున్నారు.. మీడియా ఉంది.. సతీ సహగమనం నిషేధ చట్టం వద్దేవద్దని వాదించిన మీడియా కూడా ఉంది తెలుసా? బాల్య వివాహాలను నిషేధించే శారదా బిల్లు వచ్చినప్పుడు ఘనత వహించిన ఆనంద వాహినిలో 1930 జనవరి సంచికలో వచ్చిన కవిత్వం వినిపించమంటారా?
మాకొద్దు భారత స్వరాజ్యం.. అయ్యా మనకొద్దు భారత స్వరాజ్యం అంటూ బ్రహ్మాండగా రాసేశారు. స్వాతంత్య్రం మాకేమొద్దు కానీ బాల్య వివాహాలను నిషేధించకండి. చాలా.. ’’
‘‘కాలమాన పరిస్థితులను బట్టి..’’
‘‘అప్పుడు మీడియా ఒక వర్గం చేతిలో ఉండేది. తరువాత ఒక పార్టీ వారి చేతిలో బందీ అయింది. ఇప్పుడు అన్ని పార్టీలకూ, అన్ని సామాజిక వర్గాలకూ మీడియా ఉంది. చీకటి వ్యవహారాలు కాస్తా ఇప్పుడు బట్టబయలు అవుతున్నాయి అంతే. మీ కాలం స్వర్ణయుగం, మా కాలం మట్టియుగం అనే భ్రమలు వద్దు. మీరేమీ యుగపురుషులు కాదు. అంతా యుగధర్మంగానే సాగుతోంది. ’’
‘‘ఐతే ఏమంటారు?’’
‘‘లేని పవిత్రత ఆపాదించొద్దు అంటా..’’
*బుద్దా మురళి (జనాంతికం 8-6-2018)

anthe anthe :)
రిప్లయితొలగించండి