అబ్బో మనకిదేమన్నా కొత్తనా? ఎన్ని సినిమాలు చూడలేదు. హీరోయిన్ను హీరో తెగి ఏడిపిస్తుంటాడు. ఎలాగైనా హీరోను చితగ్గొట్టించాలని హీరోయిన్ ప్రయత్నిస్తుంటుంది. హీరోలో కసి మరింతగా పెరిగిపోతుంది. హీరో ఆగడాలను తట్టుకోలేక హీరోయిన్ తండ్రి చివరకు గుండాలను ఆశ్రయించి హీరోను తుదముట్టించమని డబ్బులిస్తాడు. ఆ హీరో గుండాలనే మట్టికరిపిస్తాడు. ఆ భీకరమైన ఫైటింగ్లో హీరో తలకు గడ్డం గీసుకుంటే అయ్యేంతటి చిన్నగాటు పడుతుంది. అప్పటి వరకు హీరోను తుదముట్టించాలనుకున్న హీరోయిన్ కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ రాజా అంటూ హీరో వళ్లో వాలిపోతుంది. ఈ రోజు కోసమే రాణి... నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.
. కూరగాయల మార్కెట్లో పుచ్చు వంకాయలు ఒక్కక్కటి ఏరుతూ మంచి వంకాయల కోసం నువ్వు పడ్డ తపన చూసినప్పుడే నేను నీమీద మనసు పారేసుకున్నాను.
నువ్వు నన్ను చూడలేదు కానీ ప్రకాశం మార్కెట్లో ఆ రోజు నువ్వు వంకాయలు కొంటున్నప్పుడే నేను బామ్మా పక్కనే టమాటాలు కొంటున్నాం. వయసైపోయిన బామ్మ, కూరగాయల గురించి తెలియని నేను వాడేవిస్తే అవి తీసుకొని, ఇంటికి వెళ్లాక పుచ్చువి ఏరి పారేసేవాళ్లం. కానీ అక్కడే పుచ్చువి తొలిగించి మంచివి తీసుకోవచ్చునని నిన్ను చూశాకే తెలిసింది.
. కూరగాయల మార్కెట్లో పుచ్చు వంకాయలు ఒక్కక్కటి ఏరుతూ మంచి వంకాయల కోసం నువ్వు పడ్డ తపన చూసినప్పుడే నేను నీమీద మనసు పారేసుకున్నాను.
నువ్వు నన్ను చూడలేదు కానీ ప్రకాశం మార్కెట్లో ఆ రోజు నువ్వు వంకాయలు కొంటున్నప్పుడే నేను బామ్మా పక్కనే టమాటాలు కొంటున్నాం. వయసైపోయిన బామ్మ, కూరగాయల గురించి తెలియని నేను వాడేవిస్తే అవి తీసుకొని, ఇంటికి వెళ్లాక పుచ్చువి ఏరి పారేసేవాళ్లం. కానీ అక్కడే పుచ్చువి తొలిగించి మంచివి తీసుకోవచ్చునని నిన్ను చూశాకే తెలిసింది.
అప్పటి నుంచి ఏనాటికైనా నిన్నే చేసుకోవాలనుకున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే అప్పటికే ఐదారు డజన్ల మంది వందల సార్లు చెప్పి ఉంటారు. వారిలో నన్ను ఒకడిగా జమకడతావు. అలా కాకుండా నిన్ను ద్వేషించడం ద్వారా నీ ప్రేమ పొందాలనుకున్నాను. రోజూ నిన్ను మానసికంగా హింసించాను, వెంటపడ్డాను, వేదించాను, చివరకు ద్వేషం నుంచి ప్రేమ పుట్టేట్టు చేశాను. నేను విజయం సాధించాను రాణి విజయం సాధించాను అని హీరో అంటాడు.
ఆ తరువాత డ్యూయెట్.
కొంచం అటూ ఇటుగా ఇలాంటి కథలు మనం ఎన్ని చూడలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, హరనాథ్, కాంతారావుల కాలం నుండి తొలి తరం హీరోల మూడో తరం మనవల వరకు ఈ కథలతో ఎందరి సినిమాలు వచ్చాయో?
విలన్ అయిన హీరోయిన్ తండ్రి 13 రీళ్ల వరకు పరమ భయంకరంగా కనిపించి చివరి రీలులో నా కళ్లు తెరిపించావు అల్లుడూ అని హీరోను హత్తుకుంటాడు. మన సినిమాల కథలు వాస్తవాలకు దూరంగా ఉంటాయని చులకన చేస్తాం కానీ కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఇలాంటి కథల్లో వాస్తవం లేదా?
జీవితంలోనే కాదు చివరకు రాజకీయాల్లో కూడా ఇలాంటి కథల కాలమే నడుస్తోంది. కెసిఆర్, లగడపాటి రాజ్‌గోపాల్ అంటే కాంతారావు, రాజనాలలా కనిపిస్తే కత్తులతో యుద్ధం చేసుకుంటారని, ఒకరంటే ఒకరికి పడదని సీమాంధ్రులు, తెలంగాణ వారు విడివిడిగా సంతోషించారు.
లగడపాటి చూపిన ప్రేమకు ఉబ్బి తబ్బయిన కెసిఆర్ సమస్త ప్రేక్షకుల ముందే ఐ లవ్ యూ రాజ్‌గోపాల్ అనకుండా ఉండలేకపోయారు. అప్పుడు ఇద్దరు ఎంతగా తిట్టుకున్నారో ఇప్పుడు అంతగా ప్రేమించుకుంటున్నారు. అదేం చిత్రమే కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నాయకులంతా ఇలాంటి ప్రేమలోనే మునిగిపోయారు.
ఆగర్భ శత్రువులు హఠాత్తుగా ప్రేమ సందేశాలు పంపించుకుంటున్నారు. పుట్టింది కాంగ్రెస్‌లోనే అయినా ఆ పేరు చెబితేనే శివాలెత్తే చంద్రబాబు సోనియాగాంధీకి వీరాభిమానిగా మారిపోయిట్టున్నారు. మన రాష్ట్రంలో మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా మీ నాయకత్వంలో ఉద్యమిద్దాం అని సోనియాకు రాహుల్‌కు చంద్రబాబు సందేశాలు పంపిస్తున్నారు. కాంగ్రెస్ మార్గమే నా మార్గం అని సోనియా మాటే నాకు వేదం అన్నట్టుగా ఉందాయన తీరు. కాంగ్రెస్స్ లో పుట్టిన జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్స్ ను పడగొడతానని సవాల్ చేస్తే , ఎలా పడగోడతవో నేను చూస్తా అని బాబు బయటి నుంచి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్స్ వాళ్ళ పంచలు ఉడగోట్టాలని ఎన్నిక ప్రచారం లో నిప్పులు చెరిగిన చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్స్ పై జగన్ చూపు పడకుండా గొడుగు పడతానని ముందుకు వచ్చారు. ని ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నట్టు మీ పార్టీకి మా పార్టీ అడ్డు అని చెబుతున్నారు. మీ మద్దతు పుణ్యమా అని రెండు పార్టీ లు సమన స్తాయికి చేరు కున్నాయని కొందరి బాధ . సమ ఉజ్జిల మద్యనే కదా స్నేహం కుదిరేది.
కాంగ్రెస్ పట్ల బాబు, చిరంజివిల్లో మరీ ఇంత ప్రేమ దాగుందని కాంగ్రెస్స్ వారె ఉహించి ఉండరు.
కాంగ్రెస్ పట్ల బాబు, చిరంజివిల్లో మరీ ఇంత ప్రేమ దాగుందని కాంగ్రెస్స్ వారె ఉహించి ఉండరు.
సృష్టి, స్థితి, లయ కారకుడు, సెల్ఫోన్లు ప్రజలకు ఉపయోగపడతాయని తొలుత కనిపెట్టిన వ్యక్తి, కంప్యూటర్ను ప్రపంచంలో తొలిసారిగా వినియోగించిన వ్యక్తి, ప్రపంచంలో అన్ని సమస్యలు పరిష్కరించే శక్తివంతుడు బాబు మాత్రమే అని త్రికరణ శుద్ధిగా నమ్మే టిడిపి నాయకులు సైతం ఇప్పుడు ఆయన వల్ల ఆయ్యేదేమీ లేదు కానీ సోనియా ఇంటికి వెళ్లి ధర్నా జరిపి తెలంగాణ తెచ్చుకుందామంటున్నారు.
మనిషి దగ్గరున్నప్పుడు అతని మీదున్న ప్రేమ తెలియదు దూరం అయ్యాక తెలిసొస్తుందని దేవేందర్‌గౌడ్ బాబుమీద ప్రేమ చూపిస్తున్నారు. టిడిపి మునిగిపోయే పడవ, బాబు పని ఐపోయింది అఒ చెప్పిన దేవేందర్‌గౌడ్ ఇప్పుడు బాబును మించిన నాయకుడు లేడని ప్రేమించడం మొదలు పెట్టారు. ఇక్కడ పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే అంటూ కెసిఆర్ ‘సెట్లర్ల’పై ప్రేమ కురిపిస్తున్నారని తెలంగాణ వాదులు ఆయనపై భగ్గుమంటున్నారు. ఈ దెబ్బతోకెసిఆర్పై సెట్లర్లకు ప్రేమ పుట్టకుండా ఉంటుందా?
ప్రేమను ప్రేమ ప్రేమిస్తుందనేది పాత మాట. ద్వేషం నుండే ప్రేమ పుడుతుందనేది నేటి నాయకుల మాట. మన నాయకుల ద్వేష ప్రేమకు మూలం తెలుగు సినిమా కథలు. మరి మన తెలుగు సినిమాల్లోని ప్రేమ కథల్లో ముందు ద్వేషం తరువాత ప్రేమ ఫార్మూలాకు మూలమేమిటో తెలుసా? ఔను పురాణాల్లోనే ఉంది. జయవిజయుల కథ తెలుసు కదా! ద్వేషం ద్వారా తక్కువ జన్మల్లోనే విష్ణువు ప్రేమను సాధించవచ్చుననే కదా, వారు విలన్ల పాత్రలకు ఒప్పుకున్నది!ప్రేమిస్తే ఎక్కువ సమయం పడుతుంది. ద్వేషిస్తే తక్కువ సమయంలో ప్రేమను సాధించవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం