ఒక సీతారామరాజు మరణిస్తే వందలాది మంది సీతారామారాజులు పుడతారు రూథర్‌ఫర్డ్! -అంటూ అల్లూరి సీతారామారాజు సినిమాలో కృష్ణ ఆవేశంగా చెబితే అది సినిమా అని కూడా మరిచిపోయి మన వెంట్రుకలు నిక్కబోడుచుకుంటాయి. స్కూల్ ఎగ్గొట్టి మిత్రులతో సినిమాకు వచ్చిన విషయం కూడా మరిచిపోయి మనలోని దేశ దేశ భక్తి ఉప్పొంగడం చూసి పులకరించి పోతాం.
నిజ జీవితంలో కాసింత అనుభవం వచ్చాక రూథర్‌ఫర్డ్‌లు మళ్లీ మళ్లీ పుడతారేమో కానీ సీతారామరాజులు పుట్టరని తెలుసుకుంటాం. అడుగడుగున మనకు గాడ్సేలు కనిపిస్తారు కానీ మహాత్మాగాంధీ తరువాత మనకు మరో గాంధీ పుట్టాడా? భగత్‌సింగ్, సీతారామరాజు, సుభాస్ చంద్రబోసు, మహాత్మాగాంధీ మరణించిన తరువాత అలాంటి వారు నూటా ఇరవై కోట్ల జనాభా దాటిన ఈ దేశంలో ఒక్కరు కూడా పుట్టలేదు.
నిజానికి అలా పుట్టక పోవడం వల్లనే వీరి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి.
మళ్లీమళ్లీ పుడితే మహాత్మునికి సైతం పెద్దగా ఆదరణ ఉండదు. ఇంటి ముందో మహాత్ముడు, పక్కింట్లో ఒక మహాత్ముడు ఉంటే మహాత్మున్ని గుర్తు చేసుకునేదెవరూ. కోట్లాది మందిలో ఒకరు మహాత్ముడైతేనే బాగుంటుంది కానీ కోట్లాది మంది మహాత్ములైతే గాడ్సేలే ప్రత్యేకంగా కనిపిస్తారు.
లాడెన్‌ను అమెరికా వాడు హతం చేశాడని తెలియగానే టెర్రరిస్టు అభిమానులు ఒక లాడెన్ మరణిస్తే వేలాది లాడెన్‌ను వస్తారు, మరింత విజృంభిస్తారు అమెరికాకు పక్కలో బల్లెంగా మారుతారు, ఇక నుంచే దాడులు ఎక్కువవుతాయి అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సరే మహనీయులు ఒకరు మరణిస్తే వందలాది మంది పుట్టుకొస్తారంటే అది నిజం కాదని అనుకోవచ్చు కానీ రాక్షసుల విషయంలో అలా కాదు ఒకరు మరణిస్తే వందలమంది పుట్టుకొచ్చిన సందర్భాలున్నాయి, అవకాశాలున్నాయి.అమెరికా అయినా మరే దేశమైనా ఈ సవాళ్లను తేలిగ్గా తీసుకోవద్దు అలా అని తమకు నచ్చని దేశాలన్నింటిని సర్వనాశనం చేయడానికి పూనుకోవద్దు. ఒక విధ్వసంసానికి అంత కన్నా భారీ విధ్వంసం సమాధానం కానే కాదు.
మనకెంత మంది రాక్షసులు లేరు వాడి రక్తం చుక్క భూమిపై పడగానే అలాంటి వందల మంది రాక్షసులు పుట్టిన కథలు కోకొల్లలు.
మళ్లీ విష్ణుదేవుడు మారు వేషం వేసి ఎలాగోలా ఆ రాక్షసున్ని సంహరించి దేవుళ్లను రక్షిస్తారు. బహుశా ఇలాంటి కథల స్ఫూర్తితోనే కావచ్చు రజనీకాంత్ ఆ మధ్య రోబో తీశారు. ఆ సినిమాలో రజనీ కాంత్ అచ్చం రజనీకాంత్‌లా ఉండే రోబోను తయారు చేస్తాడు. అది కాస్తా దారి తప్పడంతో దాన్ని ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పారేస్తే వేలాది మంది విలన్ రజనీకాంత్‌లు తయారై ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడతారు. సరే వేలాది రజనీకాంత్ రోబోలు, ఏకైక వృద్ధ రజనీకాంత్‌ల మధ్య ఫైట్ అయినప్పటికీ సినిమా అన్నాక హీరోనే గెలిచి తీరాలి కాబట్టి వేలాది రోబో రజనీకాంత్‌లను ముట్టుపెట్టి వృద్ధ రజనీకాంత్ విజయం సాధించి ఐశ్వర్యను దక్కించుకుంటాడు.
సరే అది శంకర్ సినిమా కాబట్టి ఆయన చెప్పినట్టు జరిగింది. అదే ఇప్పుడు జీహాద్ తలకెక్కిన వాళ్లు వేలాది మంది లాడెన్‌లను పుట్టిస్తే ఈ ప్రపంచం ఎలా తట్టుకుంటుంది? ప్రపంచంలో ఎక్కడేం జరిగినా రష్యావాళ్లకు తెలిసిపోతుందని గతంలో గట్టినమ్మకం ఉండేది. ఆ తరువాత అదే నమ్మకం మనం అమెరికా వాళ్లమీద పెట్టుకున్నాం. మనింట్లో ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్న విషయాలు కూడా అమెరికా వాడికి తెలిసిపోతాయి తెలుసా? అంటూ చెబుతుంటే ఆశ్చర్యంగా వినాల్సి వచ్చేది.
సోవియట్ రష్యానే కుప్పకూలిపోయాక, వీడి దేశంలో కూలిపోతున్న విషయం వీడికే తెలియదు ఇక మన సంగతి వాడికేం తెలుస్తుందనిపించింది. రష్యా గురించి మనం అనుకున్నది తప్పు కానీ అమెరికా విషయం మాత్రం అలా కాదు అని కమ్యూనిస్టులను కమానా ఇష్టులు (కమానా అంటే సంపాదించడం) ఆట పట్టించేవారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిలువునా కూలిపోయాక ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో ఎవడికీ తెలియదు కానీ ప్రపంచంలో ఎక్కడేం చేయాలన్నా చేసే సామర్ధ్యం లాడెన్ కుంది అని కోట్లాది మంది నమ్మారు. ఇప్పుడు నగరంలో ఆధునికి ఫ్యాషన్ అంటే చెవులకు కమ్మలు పెట్టుకోవడం, ఆడవాళ్లలా జుట్టు పెంచుకోవడం. గ్రామాల్లో వృద్ధుల చెవులకు ఈ ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. అవే ఇప్పుడు మహానగరాల్లో లేటెస్ట్ ఫ్యాషన్
.మరో పదిఇరవై ఏళ్లలో చీరలు మళ్లీ కొత్త ఫ్యాషన్ అవుతాయి. ఆగండి ఇందులో ఫ్యాషన్ ఏంటీ అంటే ఆడవాళ్లు కాదు మగవాళ్లు చీరలు కట్టుకుంటారన్నమాట! అలానే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విలన్‌లనే ప్రేమించడం లేటెస్ట్ ఫ్యాషన్. లాడెన్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. ఈ విషయం తెలిసే అమెరికా వాడు లాడెన్ శవానికి నరమానవుడు గుర్తించకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించేశాడు. ప్రపంచ సార్వభౌములం మేమే, ఏ దేశంలోనైనా, ఏమైనా చేస్తామని దీంతో అమెరికా మరోసారి ప్రపంచానికి చాటింది.
కరీంనగర్‌లో ఒక యువకుడు రావణాసురుడికి గుడి కట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు-అభిమానం ఉంటే అడ్రస్ కనుక్కొని చందాలివ్వండి! శ్రీరాముని అనుగ్రహం ఉంటే ఆ యువకుడి కోరిక తప్పక తీరుతుందని ఒక ఆశావాది చెప్పుకొచ్చాడు. చాలా మంది ఎన్టీఆర్‌లో శ్రీరామున్ని, శ్రీకృష్ణున్ని చూసుకుంటే ఎన్టీఆర్ తనలో దుర్యోధనుడు, రావణున్ని చూసుకున్నారు. పౌరాణిక విలన్లయిన వీరిని హీరోలుగా చూపుతూ ఎన్టీఆర్ చాలా సినిమాలు తీశారు. లాడెన్‌ను చంపడం కాదు.... లాడెన్లు పుట్టడానికి అమెరికా కారణం తాను కారాదు. లాడెన్లను పుట్టించి శత్రువులపైకి ఉసిగొల్పితే చివరకు వారు తమను పుట్టించిన వారినే చంపడానికి సిద్ధపడతారు. వరమిచ్చిన దేవుళ్లపైనే కదా రాక్షసులు తొలుత ఆ శక్తిని ప్రదర్శించింది.
ముక్తాయింపు.... ప్రపంచంలో ఎవరికీ రక్షణ లేదు. చివరకు పాకిస్తాన్‌లో టెర్రరిస్టులకు సైతం..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం