వినోదం, విషాదం వేరువేరైనా చాలా సందర్భాల్లో రెండూ కలిసే ఉంటాయి. అక్కా చెల్లెళ్లలా ఒకదాని తరువాత ఒకటి కనిపిస్తుంది. కవల పిల్లల్లాంటి వినోదం, విషాదాన్ని చూసిన వారు అక్కను చూసి చెల్లె అనుకుంటారు, చెల్లెను చూసి అక్క అనుకుంటారు. మొత్తం మీద ఇద్దరూ కవలలే అనేది మాత్రం నిజం. క్లోజప్‌లో విషాదంగా కనిపించేది లాంగ్ షాట్‌లో వినోదంగా కనిపిస్తుందని ఒక మహానుభావుడన్నారు.
‘‘ ఔను క్లోజప్‌లో విషాదంగా కనిపించింది లాంగ్ షాట్‌లో వినోదంగా ఉంటుందనేది అక్షరాలా నిజం’’ అని చిన్నబుచ్చుకున్న ముఖంతో చిన్నారావు పలికాడు. జ్ఞానోదయానికి కారణమేంటో అని పెద్దారెడ్డి ప్రశ్నిస్తే, ‘‘ ఏడవ తరగతిలో నా పక్క బెంచి అమ్మాయి ప్రేమించడం లేదని జీవితం విషాదంగా అనిపించింది. ఇదీ ఒక జీవితమేనా ఆమె ప్రేమను పొందని జీవితం వృథాఅనుకున్నాను.
రాత్రిళ్లు ఎవరూ చూడకుండా కుమిలి కుమిలి ఏడ్చాను. ఛీ కనీసం విషాదాన్ని ప్రదర్శించడానికి గడ్డం పెంచే భాగ్యం లేదు, మందు కొట్టే వయసు కాదు అని ఏళ్ల తరబడి ఏడ్చాను.
నాకు పెళ్లయి ఏడేళ్లవుతుంది కదా! మొన్న రోడ్డు మీద వెళుతుంటే ఏడవ తరగతిలో ప్రేమించిన అమ్మాయిని రేషన్ షాపు క్యూలో చూశాను. ఎంత లావుగా ఉందో ముందు భయమేసింది తరువాత నవ్వోచ్చింది. ఆ అమ్మాయి ప్రేమించక పోబట్టి సరిపోయింది నిజంగా ప్రేమిస్తే నాపనేమయ్యేదనిపించింది. అప్పటి విషాదం ఇప్పుడు లాంగ్ షాట్‌లో వినోదంగా అనిపిస్తుంది’’అని చిన్నారావు నవ్వుతూ చెప్పాడు.
‘‘ నీ అనుభవమే కాదురా చిన్నా మన కళ్లముందు కనిపించే ప్రతి దాన్లోనూ ఇలాంటి వినోదం విషాదం కలిసిపోయి కనిపిస్తుంటాయి. మన స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాన్ని తలుచుకుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. చాతి సిక్స్‌ప్యాక్ బాడీ అవుతుంది. అదే సమయంలో ఇంత పెద్ద దేశాన్ని అంత చిన్న దేశం ఇంగ్లాండ్ నుండి వ్యాపారం కోసం వచ్చినోళ్లు అన్ని వందల సంవత్సరాల పాటు మనల్ని పాలించడం కన్నా మించిన వినోదం, విషాధం ఏముంటుందనిపించకుండా ఉంటుందా? ఈ దేశంలో పక్క ఒక కులం వాడి పొడ మరో కులం వాడికి పడదు కానీ ఖండాంతరాల నుంచి వచ్చిన వారికి దేశ నాయకత్వం అప్పగించేస్తాం.
ఇది విషాదంతో కూడిన వినోదమే కదా! వంద కోట్ల మంది భారతీయులున్న దేశాన్ని పాలించే ప్రధానమంత్రి డమీ కావడానికి మించిన విశాదం ఏ ముంటుంది. మన్ మోహన్ సింగ్ మేడంను ఎదరించనున్నారనే వార్తలను మించిన వినోదం ఏముంది. సొంత విగ్రహాలను తయారు చేయించుకునే మాయావతమ్మ, మంచం మీద నుంచే పాలన సాగించే తమిళ ముఖ్యమంత్రులు, మాఫియాలుగా పోలీసులకు చిక్కే మాజీ ముఖ్యమంత్రులు, జిన్నా సమాధిలో భారత భక్తిని వెతికే బిజెపి నేతలు వీరిని చూస్తే విషాదం, వినోదం ఏక కాలంలో కలగకుండా ఎలాఉంటాయి?
తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ఆత్మార్పణ చేసుకుంటే ఉద్యమ నేత కెసిఆర్ లగడపాటికి ఐ లవ్యూ అని చెప్పడం తెలంగాణ వాదుల గుండెలను పిండే విషాదం, అందరికీ బోలెడు వినోదం. రాష్ట్రంలో ఎంతో పోరాట చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీకి బఫూన్‌లను మించిన వినోదాన్ని పంచే వారు నాయకత్వం వహించడం వినోదం, విషాదం ఒకటే అనడానికి బలమైన ఉదాహరణ. నాలుక చీరేస్తా, తాట ఒలిచేస్తే, బస్తీమే సవాల్ అంటూ నారాయణ వీరంగం చూస్తుంటే నాటకాల్లో కేతిగాడి పాత్ర గుర్తుకు రావడం రాష్ట్ర కమ్యూనిస్టులకు విషాదం, మిగిలిన వారికి బోలెడు వినోదం.
ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఒకే వేదికపై లగడపాటి, నారాయణ, హరీశ్వర్‌రావు లాంటి వారంతా గ్రూప్ ఫోటుకు ఫోజులివ్వడం చూసిన వారికి బోలెడు వినోదం కలిగించింది. ప్రపంచ శాంతి చివరకు వినోదంగా మారడం విషాదకరం.
రాష్ట్రంలో పరిస్థితి చూస్తే కన్నీళ్లుస్తున్నాయని చాలా మంది నాయకులు విశాదంగా పలుకుతున్నారు కదా! నాకు మాత్రం బోలెడు వినోదంగా ఉంది అని పెద్దారెడ్డి చెప్పసాగాడు. నిన్నటి మంత్రివర్గ సమావేశమే చూడు. సార్ ఆ ఎంపిల సంగతి మాకు అప్పగించండి సార్ వాళ్ల సంగతి మేం చూసుకుంటాం అని ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. ఆ విషయం తెలిసిన ముగ్గురు ఎంపిలు ఆ మంత్రులు రౌడీ షీటర్లు వాళ్లా మా సంగతి చూసేది మా జోలికి వస్తే చూపిస్తాం.
. అభిమాన హీరో సినిమా సూపర్ హిట్టవుతుందో కాదోనని బెంగపెట్టుకుని అభిమాని గుండెపోటు తెచ్చుకుని ఆస్పత్రి పాలైతే, హీరో మాత్రం నా రెమ్యునరేషన్ నాకొచ్చేసింది, హిట్టయినా పట్టయినా నాకు సంబంధం లేదని మరో సినిమా షూటింగ్‌కు ముస్తాబవుతుంటే , అభిమాని పరిస్థితి మొదటి బాధ కలిగినా తరువాత నవ్వు తెప్పించుకుండా ఉంటుందా? తెలంగాణే తన ఊపిరి అంటున్న కెసిఆర్ ఇంటి ముందు తెలంగాణ వాదుల దీక్ష ఉద్యమాభిమానులకు విషాదం, ఇతరులకు వినోదం. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్టుగా, వినోదం విషాదంగా, విషాదం వినోదంగా కాలాన్ని బట్టి మారుతుంటుంది కానీ రెండూ ఒకటే.

:)
రిప్లయితొలగించండి