7, మే 2011, శనివారం

జగన్ గెలిచాక ఎవరికి కృతజ్ఞత చెప్పాలి ?

కడప ఎన్నికల పలితాలు రాగానే జగన్ తొలుత తనను ఇంతటి వాడిని చేసిన సోనియాకు ఆతరువాత రామోజికి ఆ తరువాత రోజు లక్ష కోట్లు సంపాదించాడని విస్తృతంగా ప్రచారం చేసిన బాబుకు కృతజ్నతలు చెప్పాలి. వీరిలో ఏ ఒక్కరి సహకారం, కృషి లేక పోయిన జగన్ ఈ రోజు బెంగళూరు లో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు . తొలత జగన్ కాంగ్రెస్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని ఉహాగానాలు సాగినప్పుడు. బయటకు వచ్చి పార్టీ పెడితే అడ్రెస్స్ లేకుండా పోతాడు అనిపించింది. తరువాత క్రమంగా బాబు, రామోజిల బయం రోజు రోజుకు పెరగడం తో విరిద్దరిని ఎదిరించే సత్తా జగన్ కు  మాత్రమే ఉండనే అభిప్రాయం బలంగా ఏర్పడింది . దాంతో కాంగ్రెస్స్ డమ్మిగా మారి జగన్ బలపడుతున్నాడు. హిరణ్య కశ్యపుడు నిరంతరం విష్ణు నామ స్మరణ చేసినట్టు రామోజి బృందం రోజు జగన్ నమ స్మరణ చేసి అతన్ని చివరకు హీరోను చేస్తున్నారు . బాబు , రామోజిల బృందం జగన్ ను యెంత వ్యతిరేకిస్తే రాజకీయాల్లో ఆతను అంతగా ఎదిగి పోతాడు. మీడియా వ్యతిరేకత వల్లనే మోడి మళ్లీ మళ్లీ గెలుస్తున్నాడు. మీడియా వ్యతిరేకత వల్లనే    వై స్  ఆర్  రెండో సారి గెలిచాడు. మీడియా వ్యతిరేకించినంత కాలం కాంగ్రెస్స్ పరిస్తితి బాగుండేది . వై యస్ ఆర్  మరణం తరువాత రోశయ్య కాలం నుంచి మీడియా కాంగ్రెస్స్ పట్ల కాస్త అనుకూల దొరని చూపుతోంది . అప్పటి నుంచే కాంగ్రెస్స్ ప్రజాలకు దూరమైంది. చివరకు రాజ కియంగా దిక్కు లేని స్తితి లో ఉన్నా చిరంజీవి యిప్పుడు కాంగ్రెస్స్ కు పెద్ద దిక్కు గా మారారు.  గెలిచాక జగన్ అది తన బలం అనుకుంటే పొరపాటు తనను యింతవాడిని చేసిన మీడియాను మరువవద్దు.  

3 కామెంట్‌లు:

  1. media vyathirekatavalla modi gelavatamledhu, athanu gujarath state nu devolop chesadu, evarinina one angle lo mathrame chudakudadhu

    రిప్లయితొలగించండి
  2. ఎన్నికల్లో గెలవడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. కేవలం అభివృద్ధి మాత్రమే సరిపోదు,. అలా ఐతే కేంద్రం లో బిజెపి పాలించినప్పుడు అభివృద్ధి లేదా. కులాలు, మతం, అభ్యర్తుల ఎంపిక, చివరకు వర్షాలు రావడం, రాకపోవడం వంటి వాతావరణ అంశాలు, శాంతి బద్రతలు , అభివృద్ధి తో పటు ఎన్నో అంశాలు పనిచేస్తాయి. నేను కేవలం మీడియా వ్యవహారం పై మాత్రమే రాశాను కాబట్టి మీడియా వ్యతిరేకత ఉన్నా గెలిచినా వారి పేర్లు ప్రస్తావిస్తూ మోడి పేరును ఉదహరించాను

    రిప్లయితొలగించండి
  3. Definitely What ur analysed is correct....

    Generally people Loves Rebellians.....Congress should have ignored or taken it easily about jagan's Odaarpu.....

    and Ramoji&Babu lost their Credibility long ago...they did not have capacity to find out their strategical flaws....


    and also...Jagan's own media is 50% responsible for Jagan's success/failure

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం