ఏరా ఈసారైనా ఎంసెట్‌లో గట్టెక్కుతావా? లేక నీ చదువు సంకనాకిపోయినట్టేనా?- అని చంద్రున్ని వాళ్ల చిన్నాన్న కోపంగా అడిగాడు. ‘‘ లేదు బాబాయ్ ఈసారి చూస్తావు కదా స్టేట్ టాప్ ర్యాంక్ కొట్టేయకపోతే నా పేరు చంద్రుడే కాదు. పరిస్థితులన్నీ నాకు అనుకూల కనిపిస్తున్నాయి. ఈసారి ననె్నవరూ ఆపలేరు’’ అని చంద్రుడు చెప్పాడు. ‘‘ ఔను కాబోయే స్టేట్ ర్యాంకర్ అని మనోడ్ని లోకల్ పేపర్స్‌లో ముందే ఇంటర్వ్యూలు చేశాయి. కేబుల్ టీవి వాళ్లు కూడా ముఖా ముఖి నిర్వహించారు. మన బడుద్దాయి వాళ్లడిగిన ప్రశ్నలకు ఎంత చక్కగా సమాధానాలు చెప్పాడు. వాడు టీవిలో అచ్చం హీరోలా కనిపించాడురా! ’’అని చంద్రుడి వాళ్ల నాన్న మురిసిపోతూ చెప్పాడు.
‘‘అది కాదు అన్నయ్య నువ్వు కూడా వాడి మాటలు నమ్మితే ఎలా వరుసగా రెండుసార్లు ఎంసెట్‌లో బొక్క బోర్లా పడ్డాడు. అప్పుడు కూడా స్టేట్ ర్యాంక్ నాదే అని ముందస్తుగానే లోకల్ పేపర్లను మేనేజ్ చేసుకుని రాయించుకున్నాడు. తీరా ఏమైంది ఆ ఎదురింటి సందింటి వాళ్ల కొడుకు చేతిలో చావు దెబ్బతిన్నాడు. మనవాడేమో ఫార్ములా వన్ పేరుతో కార్లరేస్ నిర్వహించాలనుకుంటే , అతనేమో ఏకంగా పాదయాత్ర జరిపి మన వాడ్ని చితగ్గొడితే ఇప్పటి వరకు లేవలేదు’’ అని చంద్రుడి బాబాయ్ చిన్నారావు ఆవేదనగా పలికాడు. సరే ఇది లాస్ట్ చాన్స్ అని మూడోసారి లాంగ్ టర్మ్ కోచింగ్‌కు పంపిస్తున్నాం, అదన్నా సరిగ్గా వెలగబెడుతున్నాడా? తింగరి వేషాలు చూస్తుంటే ఈసారి కూడా గట్టెక్కేట్టు కనిపించడం లేదని చిన్నారావు నిట్టూర్చాడు.
చంద్రుడికి రోషం ముంచుకొచ్చింది. ‘‘బాబాయ్ నువ్వు తెలియకుండా మాట్లాడకు ఎంసెట్‌లో ఫస్ట్‌టైం నేను ఎందుకు ఫైయిల్ అయ్యానో నీకు తెలియదా? ప్రశ్నా పత్రం అందజేసిన ఇన్విజిలేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు. నేను పరీక్ష బాగానే రాశాను. నాకు రావలసిన మార్కులు ఇతరులకు కలిపి నేను ఫైయిల్ అయ్యేట్టు చేశారు. అంతే తప్ప నాకు చదువు రాక కాదు ’’ ‘‘ ఓహో అలాగా మరి రెండోసారి తమరు ఎందుకు చిత్తయ్యారో సెలవిస్తారా’’ అని చిన్నారావు వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘‘ప్రపంచ మంతటికీ తెలిసిన విషయం నీకు తెలియకపోవడం ఏంటి బాబాయ్ నాకొచ్చిన మార్కులను కంప్యూటర్‌లో లెక్కించడం వల్లనే ఇలా జరిగింది’’ అన్నాడు. ‘‘కంప్యూటర్ లో ప్రపంచానికే పాఠాలు చెప్పిన నువ్వు కంప్యూటర్‌ను అనుమానిస్తున్నావా?’’ అని చిన్నారావు ఆశ్చర్యపోయాడు. ‘‘ నిజం బాబాయ్ నాకొచ్చిన మార్కులను కరెక్ట్‌గా లెక్కిస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంకు నాదే. ఆరుగురం కలిసి మహాకూటమిగా ఏర్పడి కంబైండ్ స్టడీ చేశాం. మాలో అంతా బాగానే చదివారు కానీ మన కులం కానొడొకన్ని మనలో చేర్చుకోవడంతో వాడివల్ల నాకు ర్యాంక్ రాకుండా పోయింది. వాడే మనకు గుదిబండలా తయారయ్యాడు. అందుకే ఎంసెట్ రిజల్ట్స్ రాగానే మా టీం నుంచి వాడ్ని బయటకు పంపించేశాం’’ అని చంద్రుడు చెప్పుకొచ్చాడు. ‘‘ చదువుకునే వాడు తన మానానా తాను నిశ్చబ్దంగా చదువుకుంటాడు. పరీక్షలు రాయకముందే పస్ట్ ర్యాంకు నాదే అని ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏమిటి? ఐదారుగురిని పోగేసి పోచుకోలు కబుర్లుచెప్పుకుంటూ అదే కంబైన్డ్ స్టడీ అని చెప్పడం ఏమిటి?’’ అని చిన్నారావు నిలదీశాడు.‘‘ మీ ఇంటికి వచ్చే ముందు ఆ ఎర్రన్నల ఇంటికి వెళ్లి వచ్చానన్నయ్య వాళ్లు మీ వాడి గురించి చెప్పిన మాటలు విన్నాక తల తీసేసినట్టు అయింది. మీ వాడితో తిరిగాక ఊళ్లో ఎవరూ మా వాళ్లను కూడా నమ్మడం లేదట. ఈసారికి తమని వదిలేయమని చెప్పండి అని వేడుకున్నారు. వచ్చే పరీక్షలకు వాళ్లు మన చంద్రుడితో కంబైండ్ స్టడీకి వస్తారనే నమ్మకం నాకైతే లేదు’’ అని చిన్నారావు పలికాడు. సరే ఆ కడపలో మాక్ ఎంసెట్ నిర్వహిస్తున్నారట వెళ్లి నీ సత్తా ఏంటో చూసుకో, ఆ మాక్ ఎంసెట్‌లో నీ కొచ్చే ర్యాంకును బట్టే తరువాత జరిగే ఎంసెట్‌లో నీ స్థానం ఏమిటో తెలుస్తుంది తరువాత నీ ఇష్టం’’ అని చిన్నారావు చెప్పాడు.
‘‘కడపలో టీచర్లు మంచి వాళ్లు కాదు బాబాయ్ చివరకు అక్కడి ఉద్యోగులు, టీచర్లు, ప్రజలు అంతా డమ్బుకు అమ్ముడుపోయారు. అక్కడి గాలిని కొందరు కొనేశారు. నేను అక్కడికి వెళ్లినప్పుడు ఊపిరాడకపోవడంతో ఈ విషయం తెలిసింది. ఐనా ప్రతిభా వంతున్ని ఎవరూ ఆపలేరు కడప మాక్ ఎంసెట్‌లో గెలుపు నాదే బాబాయ్’’అని చంద్రుడు మీసం మెలేశాడు.
కడప కాలేజీవాళ్లు నిర్వహించిన మాక్ ఎంసెట్‌లో చంద్రుడు మళ్లీ ఎప్పటి మాదిరిగానే అధ్వాన్నమైన స్థాయిలో ప్రతిభ చూపించాడు. చంద్రుడు మైకు అందుకుని ,‘‘ఈ పరీక్షలను నేను గుర్తించడం లేదు. నేను ముందే చెప్పాను చెప్పినట్టుగానే జరిగింది. డబ్బు, మద్యంతో మొత్తం ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నాకొచ్చిన మార్కులను ఎదురింటి సందింటాయన కొడుక్కు కలిపారు. ప్రపంచంలోనే ఇంత అధ్వాన్నంగా పరీక్షలను గతంలో ఎప్పుడూ నిర్వహించలేదు. పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు విఫలమయ్యారు. విద్యావ్యవస్థ విఫలమైంది, మొత్తం ప్రపంచమే విఫలమైంది ’’ అని చంద్రుడు ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు.
‘‘ నాలాంటి విద్యార్థిని టాపర్‌గా నిలపని ఈ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది’’ - అని ఆవేశంగా పలికాడు.‘‘ ఊరందరిదీ ఒక దారి ఐతే ఉలికిపిట్టది ఒకదారి అన్నట్టు నీ వైఖరేంటో నాకస్సలు అర్ధం కావడం లేదురా!’’ అని చిన్నారావు చిన్నగా పలికాడు. ‘‘నా ఒక్కరి వైఖరే కాదు బాబాయ్ మా రాజగురువు వైఖరి నా వైఖరి ఒకటే. ప్రపంచంలో మేం తప్ప అంతా అమ్ముడు పోయారు బాబాయ్. ఎదురింటి సందింటి వాళ్ల కొడుకు గెలుపు ఒక గెలుపే కాదని నేనూ, మా రాజగురువు నమ్ముతున్నాం. మీ నమ్మకాలు మీకెంత ముఖ్యమో మా నమ్మకాలు మాకంత ముఖ్యం. నమ్మకమే జీవితం ’’అని చంద్రుడు పలికాడు.
‘‘ఏమోరా! కడప మాక్ ఎంసెట్ చూస్తుంటే లాంగ్‌టర్మ్ కోచింగ్‌లు కూడా నీమీద పని చేసేట్టుగా కనిపించడం లేదు’’ అని చిన్నారావు నిర్వేదంగా పలికాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం