వార్తా పత్రికల్లోని వార్తలు మేధస్సును ప్రదర్శించడానికి కాదు. ఐదవ తరగతి ఆరవ తరగతి చదువుకున్న వారికి సైతం విషయం అర్థమయ్యేట్టు ఉండాలి. అక్షరాలు చదవడం వస్తే చాలు పత్రికల్లోని వార్తలు అర్థం కావాలి. పత్రికల ప్రాథమిక సూత్రమిది. కవిత్వమో, కథలో అభిరుచి ఉన్నవారికి, మేధావులకు మాత్రమే అర్థమయ్యేట్టు రాస్తే ఫరవాలేదు. కానీ కచ్చితంగా వార్తలు మాత్రం అక్షర జ్ఞానం ఉన్నవారికి అర్థమయ్యే స్థాయిలో ఉండాలి. అతను ఇంగ్లీష్‌లో వార్త రాస్తే మేధావులకు సైతం అర్థ్ధమయ్యేది కాదు అని ఒక మేధావి గురించి చెబితే అలాంటి వ్యక్తిని వెంటనే ఆ స్థానం నుండి తొలగించాలి అని ఆ మాట విన్న జర్నలిస్టులు చెప్పారు. ఎందుకంటే మేధావు లకు మాత్రమే
అర్థమయ్యేట్టు రాసే అతనా పనికి పనికిరాడు. సామాన్యులకు అర్థ్ధమయ్యేట్టు రాయాలి. విషయం ఏమంటే పత్రికల్లో వచ్చే వార్తలపై ప్రతి రోజు ఉదయమే అన్ని తెలుగు చానల్స్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. అది అవసరమా? అంటే పత్రికల్లో వచ్చిన వార్తలు పాఠకులకు అర్థం కావా? వీళ్లు విడమరిచి చెబుతారా? పోనీ ఆ వార్తల వెనుకు ఉద్దేశం ఏమిటో చెబుతారా? అలాంటిదేమీ ఉండదు. మూడు నాలుగు పార్టీల వాళ్లు కూర్చుంటారు. మధ్యలో చానలాయన ఒకరు. ఈ నలుగురికి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ల ధర్మం వాళ్లు నిర్వహించాలి. ఎడ్డెమంటే తెడ్డం అంటూ తమతమ పార్టీల వాదనలు వినిపించాలి. తమ పార్టీ అధ్యక్షుడు ఎంత పనికిమాలిన పని చేసినా ఆ పార్టీ తరఫున చర్చల్లో పాల్గొనే వారు దాన్ని సమర్థ్ధిస్తూ మాట్లాడాలి.
తెలంగాణ నాయకుల వాదన ఆంధ్ర నాయకులకు నచ్చదు, ఆంధ్ర నాయకుల వాదన తెలంగాణ వారికి నచ్చదు. అక్కడికక్కడే ఆవేశంగా ఖండించుకుంటారు. ఏ ఒక్క చానల్‌లోనూ అర్థవంతమైన చర్చ జరగదు. అలా జరుగుతుందని ఆశించడం తప్పే! ఒక పార్టీ వాళ్లు టీవి చర్చలన్నింటిని రికార్డు చేసి తమ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. చర్చలో ఆ పార్టీ వాళ్లు వెనకబడ్డారట! చర్చల్లో ఎదుటి వాళ్లు ఏం మాట్లాడినా అడ్డు తగులుతూ రచ్చ రచ్చ
చేసేయడం ఎలానో వాళ్లు చక్కని శిక్షణ ఇస్తున్నారు. పార్టీ పరంగా ఏ అంశంలోనైనా మన వాదన వినిపించే పరిస్థితి లేకుండా మనం డిఫెన్స్‌లో ఉంటే ఆ అంశంపై గట్టిగా అడ్డదిడ్డంగా వాదిస్తూ వాతావరణాన్ని ఎలా మార్చవచ్చునో వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరువాత పరిస్థితి కాస్త మెరుగు పడిందని ఆ పార్టీ అధ్యక్షుడు పార్టీ వారికి కితాబు ఇచ్చారు. ఆ పార్టీ నుండి చర్చల్లో పాల్గొనే వారు పార్టీ ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ చెప్పినట్టుగానే వాదిస్తున్నారు. ఏ పత్రిక ఏ పార్టీ వాదం వినిపిస్తోందో, ఏ చానల్ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలుగు నాట ప్రజలు సులభంగానే అర్థం చేసుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే వార్తలు పాఠకులకేమైనా అర్థం కాకుండా ఉన్నాయా? చర్చల పేరుతో ఆయా రాజకీయ పార్టీల వాళ్లు వార్తలను విశే్లషించి చెబితే కానీ పాఠకులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా?
ఒక ప్రాంతం వారి ఉనికిని మరో ప్రాంతం వారు భరించే స్థితిలో లేరు. ఒక కులం పొడ మరో కులానికి పడడం లేదు. చర్చల్లో ప్రత్యక్షంగా ప్రాంతాల ప్రభావం కనిపిస్తే, పరోక్షంగా కులం ప్రభావం కనిపిస్తోంది.
కులం, ప్రాంతం పడనప్పుడు ఎవరేమన్నా అందులో తప్పే కనిపిస్తుంది అది చాలా సహజం ఇది కాదనలేని నిజం. రాజకీయ పక్షాల ప్రతినిధులు తమ పార్టీ వాదన వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఫరవాలేదు. కానీ పక్క పార్టీ వాళ్లతో పోట్లాటకు దిగి, అదే విజయం అనుకుంటే అది ఎవరికీ ప్రయోజనం కలిగించదు. గురువారం ఉదయం ఐ న్యూస్‌లో జరిగిన చర్చ పరోక్షంగా కుల ప్రభావం చూపింది. మంత్రి శంకర్‌రావుపై జరిగిన దాడి చర్చ తరువాత లోక్‌పాల్‌పై చర్చ జరగాల్సి ఉండగా, ఎవరికి ఏదీ ముఖ్యం అనే అంశం వాదన చోటు చేసుకుంది. చివరకు ఏది ముఖ్యం అనే చర్చకే పరిమితం అయ్యారు. దాంతో లోక్‌పాల్‌పై చర్చ జరపలేదు. ఒకరు ముఖ్యం అనుకున్నది ఇతరులకు అంత ప్రాధాన్యత లేని అంశం కావచ్చు, అలానే ఇతరులు చాలా ప్రాధాన్యత గల అంశం అనుకున్నది వారికి అంతగా ప్రాధాన్యత గల అంశం కాకపోవచ్చు. ఇలాంటి చర్చల్లో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అదంతా ముఖ్యమైంది కాదు మరో అంశం చర్చిద్దాం అంటే మాకు సంబంధించిన అంశం మీకు ముఖ్యమైంది కాదా? అనే ప్రశ్న ఆ వర్గం నుండి వస్తుంది. ఇది సహజం. తామరాకుమీద నీటిబొట్టులా లౌక్యంగా ఉండకపోతే ఇబ్బందిలో పడిపోతారు.
ఒక ప్రాంతం వారి ఉనికిని మరో ప్రాంతం వారు భరించే స్థితిలో లేరు. ఒక కులం పొడ మరో కులానికి పడడం లేదు. చర్చల్లో ప్రత్యక్షంగా ప్రాంతాల ప్రభావం కనిపిస్తే, పరోక్షంగా కులం ప్రభావం కనిపిస్తోంది.
కులం, ప్రాంతం పడనప్పుడు ఎవరేమన్నా అందులో తప్పే కనిపిస్తుంది అది చాలా సహజం ఇది కాదనలేని నిజం. రాజకీయ పక్షాల ప్రతినిధులు తమ పార్టీ వాదన వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఫరవాలేదు. కానీ పక్క పార్టీ వాళ్లతో పోట్లాటకు దిగి, అదే విజయం అనుకుంటే అది ఎవరికీ ప్రయోజనం కలిగించదు. గురువారం ఉదయం ఐ న్యూస్‌లో జరిగిన చర్చ పరోక్షంగా కుల ప్రభావం చూపింది. మంత్రి శంకర్‌రావుపై జరిగిన దాడి చర్చ తరువాత లోక్‌పాల్‌పై చర్చ జరగాల్సి ఉండగా, ఎవరికి ఏదీ ముఖ్యం అనే అంశం వాదన చోటు చేసుకుంది. చివరకు ఏది ముఖ్యం అనే చర్చకే పరిమితం అయ్యారు. దాంతో లోక్‌పాల్‌పై చర్చ జరపలేదు. ఒకరు ముఖ్యం అనుకున్నది ఇతరులకు అంత ప్రాధాన్యత లేని అంశం కావచ్చు, అలానే ఇతరులు చాలా ప్రాధాన్యత గల అంశం అనుకున్నది వారికి అంతగా ప్రాధాన్యత గల అంశం కాకపోవచ్చు. ఇలాంటి చర్చల్లో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, అదంతా ముఖ్యమైంది కాదు మరో అంశం చర్చిద్దాం అంటే మాకు సంబంధించిన అంశం మీకు ముఖ్యమైంది కాదా? అనే ప్రశ్న ఆ వర్గం నుండి వస్తుంది. ఇది సహజం. తామరాకుమీద నీటిబొట్టులా లౌక్యంగా ఉండకపోతే ఇబ్బందిలో పడిపోతారు.
గతంలో మాదిరిగా ఒకే ఒక చానల్ ఉంటే వారు ఆడిందే ఆట వారు చూపిన వారే అందగాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. చానల్స్‌ను తిడుతూ కూడా చానల్స్‌లో మాట్లాడేంత విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. మారిన పరిస్థితులను, ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఉదయం సమయంలో టీవిల్లో ఈ చర్చలు వింటుంటే బయటి వారికి ఆ ఇంట్లో కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు అలా అరుచుకుంటుంటారు. ఎవరి అభిప్రాయం వినడానికైనా ఎవరికీ సహనం ఉండడం లేదు. అసలీ చర్చలు అవసరమా? అనే ఆలోచన చేయాలి. అవసరం అనుకుంటే ఇప్పుడు సాగుతున్న తీరులో మార్పులు అవసరమేమో చూడాలి. వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా వాటిని అణిచిపెట్టుకుని పార్టీ వాదన మాత్రమే వినిపించక తప్పదు. దాంతో వారి నిజమైన అభిప్రాయం బయటపడే అవకాశమే లేదు. అలాంటప్పుడు పార్టీల ప్రతినిధులను పిలిచే కన్నా ఆయా రంగాలకు చెందిన నిపుణులను, వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులు, సామాజిక ఉద్యమ కారులకు చర్చలో అవకాశం కల్పించడం వల్ల కొంతలో కొంత మేలేమో
sir miru mi abhiprayam to 100 satam ekibhavistanu. ikkada gamaninchalsina vishayam marokati undi. adi visleshakula gurinchi. e madhay tv charchallo palgontunna visleshakulu kuda tama abhiprayame sraindane bhavanalo matladutunnaru. chivariki co participents aina rajakiya party nayakulato vadanalaku koda digutunnaru. amsanni vesleshinchadam poyi ila rajakiya nayakulato vadanalaku digadam chuste badha kalugutondi.
రిప్లయితొలగించండిచాలా చక్కగా వ్రాశారు. ఈ చర్చలన్ని ప్రజలకి పనికొచ్చేవి ఏవీలేవు. ఇవన్నీ ఏవో ప్రజల కోసమే వస్తున్నాయన్న భ్రమలో కొన్నాళ్ళు చూశాను...తరవాత అర్ధం అయిందేమిటంటే వాళ్ళు వాళ్ళ ఇగో కోసమే మాట్లా[పోట్లా]డుకొంటున్నారని.....అందులో ప్రజా ప్రజాప్రొయోజనాలు ఏమీలేవని...ఈ సంగతే ఒకాయన ఎంటివి సంథాన కర్తను ఫోనులో అడిగితే "రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే ప్రజలగురించి మాట్లాడటమే" అని ఆయన శలవిచ్చారు. అనంతరం నిర్ధాక్షణ్యంగా ఫొను కట్ చేశాడు. ఈ విధంగా టీవీల వాళ్ళు తమ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు.
రిప్లయితొలగించండిఇదే విషయం మీద ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... లో[Monday, May 2, 2011] వచ్చినప్పుడు ఈ క్రింది విధంగా కామెంటు చేశాను.
http://apmediakaburlu.blogspot.com/2011/05/blog-post_02.html
"అయ్యా ఒక ఏ.బి.ఎన్ చానలే కాదు, దరిదాపులు అన్ని చాన్నెల్స్ వారు ఇదే రీతిన ఉన్నారు. ప్రజలంటే వేరు తాము వేరు అన్న పద్ధతిలో చానల్ చేతిలో ఉన్నది కదా అని అహంకరిస్తున్నారు. ఎన్.టీ.వీ లో "లైవ్ విత్ కె.ఎస్.ఆర్" కార్యక్రమం నిన్నొ మొన్నొ చూసాను; ఆయనకి లైవ్ లో ఎవరొ ఫోను చేసి సారూ ఈ రాజకీయ పోచుకోలు కబుర్లెందుకు, ఇక్కడ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుకు చస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే .......... కె.ఎస్.ఆర్ గారి సమాదానం: "మనం రాజకీయ నాయకుల గురుంచి మాట్లాడుకొంటున్నాము అంటే దానర్ధం వారు ప్రాతినిధ్యం వహించే ప్రజల గురించే" అని వివరించి నిరంకుశంగా ఆ ఫోను కట్ చేసారు.
ఇక్కడ కె.ఎస్.ఆర్ గారికి ఒక సలహా: "బాబు కె.ఎస్.ఆర్ గారు రాజకీయ నాయకుల గురుంచి ఎందుకు?.... మనకు అనేక మతాల దేవుళ్ళు వున్నారు. వారి గురుంచి ప్రార్ధించి భజనలు చేయండి......" అప్పుడు మీరు దేశమే కాదు ప్రపంచ ప్రజల సమస్యల గుంచి చర్చించిన వారవుతారు.............. ఎందు కంటే దేవుళ్ళు విశ్వ పాలకులు కదా!!!!
రాధాకృష్ణ.
విజయవాడ."
vaari kosame
రిప్లయితొలగించండి@mettaseema గారు @ravi adidam గారు@ రాధ కృష్ణ గారు స్పందించినందుకు థాంక్స్ . రాజకీయ నాయకులకు ప్రజలకు ఎప్పుడో దూరం పెరిగిపోయింది. ఇప్పుడు మీడియాకు ప్రజలకు సైతం దూరం పెరిగింది . పజల నదిని అంచనా వేయడంలో మీడియా విఫల మవుతోంది
రిప్లయితొలగించండి@MURALI GARU....
రిప్లయితొలగించండిarticle is very gud...but in the ending U have suggested that these kind of discussions should be done with the participation of INTELECTUALS ...and SOCIAL WORKERS.....
Intelectuals like Pf.NAGESWAR are giving unbaised analysis where as self-claimed social workers like SANDHYA are giving biased comments in the discussions......
people r very clever to do and decide the things...today the availability of information is infinity....thr is NO NEED of these kind of analysis ...
this is my personal feeling....
Intelectuals like Pf.NAGESWAR are giving unbaised analysis where as self-claimed social workers like SANDHYA are giving biased comments in the discussions......
రిప్లయితొలగించండిyes he said right
my opinion also same
Now a days news watch is essential why because,
some newpapers are news makers, if they dont have sufficient stuff they are creating news by themselves.
recently ABN & andhrajyothi raised two issues,
1. NTR ashram gucchibouli
2. Chalam Samadhi issue,
After posting the same news on my blog some body told me that thats may be 99% fake news
because they are having evidences on chalam's blog.
Few More months ago
The same ABN concentrated on the Swamiji's " poorvaashrama " issues
weekly once they are targeting one swamiji
comming to this type of issues "news watch " type programs will gives the essence.
but the main drawback is they are offering politicians.
I have a big doubt
why don't calling atleast one ordinary people for that show????