4, జనవరి 2012, బుధవారం

మందుదేవో భవ! ......మద్యం ప్రియుల కోసం గాంధీభవన్లో బొత్స టోల్ ఫ్రీ నెంబర్ ..మందు ధరల తగ్గింపునకు బాబు ఉద్యమం

గాంధీభవన్‌లో ట్రింగ్ ట్రింగ్ మని సౌండ్ వినగానే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉత్సాహంగా ఫోన్ ఎత్తారు. ఎదురుగానే చాలా మంది విలేఖరులు కూడా ఎప్పటి మాదిరిగానే ముచ్చట్లాడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా మందు అభిమానులు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి పిసిసి అధ్యక్షునితో ముచ్చట్లాడుకోవచ్చు. మంచి చెడు చెప్పుకోవచ్చు.
‘‘ఆ చెప్పమ్మా’’ అంటూ బొత్స తొలి కాల్ అందుకున్నారు. ‘‘షారూ! బొచ్చషారుగారేనా నేను గుంపులో గుర్నాధాన్ని మాడుతున్న’’ అన్నాడు. ‘‘తమ్ముడు అన్‌డ్యూటీలోనే ఉన్నట్టున్నాడు’’ అంటూ బొత్స నవ్వాడు. ‘‘ మీకేమీ ఇబ్బంది లేదు కదా! మద్యం దొరక్క ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? చేతి నిండా తిండి, నోటి నిండా మందు, ఇంటి వద్దకే మద్యం అనేది మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఎంత పెద్దవారు అడ్డువచ్చినా పక్కకు తప్పిస్తాం ’’ అంటూ బొత్స భరోసా ఇచ్చాడు.



‘‘ ఎంత పెద్దవారైనా తప్పిస్తాను అంటున్నాడంటే ముఖ్యమంత్రిని తప్పిస్తానని వార్నింగ్ ఇవ్వడమే కదా? కిరణ్‌ను తప్పించడానికి సిద్ధమవుతున్న బొత్స అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేద్దామా?’’అని చానల్ కొత్త రిపోర్టర్ ఒకరు పక్కనున్న సీనియర్ చెవిలో ఊదాడు. చెవి ఓనర్‌కు తప్ప అక్కడున్న అందరికీ ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ‘‘నా ఉద్దేశం అది కాదయ్యా? కాంగ్రెస్‌లో అందరం ఒక్కటే.. మాకు అడ్డు వచ్చేది అంటే బాబు అని అర్ధం చేసుకోవాలి’’ అని బొత్స వివరణ ఇచ్చారు.


 బ్రేకింగ్ న్యూస్ ముందు బ్రేక్ చేయాలి కానీ అభిప్రాయం ఎవరికీ చెప్పొద్దని కొత్త రిపోర్టర్ తొలి పాఠం నేర్చుకున్నాడు.
‘‘షారూ ఇక్కడ నేన్ లైన్‌లో ఉంటే మీరూ మీరూ మాట్లాడుకుంటే ఇంక మేమెందుకు? ఆదాయం ఇచ్చేవాళ్ల మాటకు ఇలువేలేదా? ఇదేనా షారు’’ అని గుర్నాధం ఆవేదన వ్యక్తం చేశాడు.‘‘ అయ్యో కస్టమర్ ఇస్ గాడ్ అని మహాత్మాగాంధీ అన్నారు. నేను కస్టమర్‌ను చిన్నచూపు చూస్తానా? నెవర్ చెప్పండి’’ అన్నాడు.


‘‘షారూ బార్లో మా మానాన మేం తాగి రోడ్డుమీద పడి ఆనందంతో దొర్లుతుంటే కొందరు వెహికిల్స్‌తో మాకు అడ్డంగా వస్తున్నారు. రాత్రి ఎనిమిది నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రోడ్లు మీదికి వెహికిల్స్‌ను అనుమతించొద్దు . దాన్ని మా సమయంగా ప్రకటించాలి. ఈ సంగతి మీకు చెబుదామని ఫోన్ చేశాను’’అన్నాడు గుర్నాధం. ‘‘నేనెలాగూ రవాణా శాఖ మంత్రినే కాబట్టి తప్పకుండా ఆలోచిస్తాను. మంచి సలహా ’’అని బొత్స నోట్ చేసుకున్నాడు. ‘‘మీరే మా ప్రగతి రథ సారధులు మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి చెప్పండి’’ అంటూ బొత్స మరో కాల్ అందుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరితో ఫోన్‌లో మాట్లాడి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటా? అని బొత్స పలికాడు.


‘‘సార్ మీ కార్యక్రమాన్ని నేను చాలా సేపటి నుండి చూస్తున్నాను. మనకు మంచి చేసిన మహనీయులందరినీ ఒకసారి స్మరించుకోవడం మన ధర్మం. నేను ఎన్టీఆర్ వీరాభిమానిని కాని ఆయన మాకు ద్రోహం చేశారు. నిషేధం విధిస్తే పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, యానాం వెళ్లి మందు కొట్టాల్సి వచ్చేది. మా కష్టాలను కడతేర్చడానికి ఆ దేవుడే బాబుగారిని పంపించారు. ఆయన నిషేధాన్ని ఒక్క తన్ను తన్ని ఆరువేల మద్యం షాపులు పెట్టారు. బెల్ట్ షాపులను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవలసిన అవసరం లేదా?’’ అని ఆ వ్యక్తి బొత్సను నిలదీశాడు. ‘‘చూడమ్మా ఇది మా పార్టీ ఆఫీసు మేం మా వాళ్లు చేసిన మంచి పనులనే స్మరించుకుంటాం’’ అని బొత్స సమాధానం చెప్పారు.


 ‘‘సార్ చేసిన మంచిని ప్రజలు ఎప్పుడూ మరిచిపోరు. మీ ఇమేజ్ జనంలో రోజు రోజుకు పెరిగిపోతోంది’’ అని ఇదంతా ఎన్టీఆర్ భవన్ నుండి లైవ్‌లో చూస్తున్న తెలుగునేతలు బాబును అభినందించారు.
కొన్ని కాల్స్ విన్నతరువాత బాబు ముఖంలో రంగులు మారాయి. బొత్స ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు, భవిష్యత్తులో అతనితోనే పోటీ అని అన్నారు. ‘‘మనం సచివాలయాన్ని మించిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని వందల మంది సిబ్బంది ఉన్నారు ఏం లాభం మీ ఎవ్వరికీ మందు ప్రియుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలనే ఈ ఆలోచన తట్టలేదు ’’ అని బాధపడ్డారు.



 బాబు 2004లో ఐటి వారిని నమ్ముకుంటే రోడ్డున పడేశారు. ఇది కాదని వారిని జెపికి వదిలేసి 2009లో పొలం బాట పట్టారు. అదీ వర్కవుట్ కాలేదు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఓటర్లుంటే, ఓటర్లలో 80 శాతం వరకు మందు ఖాతాదారులే అనే విషయం గ్రహించిన తరువాత వారి అభిమానాన్ని చూరగొనాలని ఉద్యమ బాట పట్టారు. మద్యం ధర తగ్గించాలని ఉద్యమ బాట పట్టారు. రెట్టింపు ధరకు అమ్మడం వల్ల ఫుల్‌బాటిల్ తాగాల్సిన వారు సగం, ఆఫ్ బాటిల్ తాగాల్సిన వారు క్వార్టర్‌తో సరిపుచ్చుకుంటున్నారు ఇంత కన్నా అన్యాయం ఏమన్నా ఉందా? ధర తగ్గించాల్సిందే క్వార్టర్ బాటిల్ ధరతో ఫుల్‌బాటిల్ తాగండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మందు ప్రియుడ్ని నేరుగా కలుసుకొని వారికి దగ్గరవుదాం. తాగిన వాళ్లు అబద్ధంచెప్పరు, ఈసారి మనదే అధికారం ’’అంటూ బాబు ఉత్సాహంగా పలికారు.

5 కామెంట్‌లు:

  1. Sir,

    Now a days, Rather than the poverty,
    Unemployment is one of the major issue

    in future these (un-employed) people will submit their resumes to political parties too.

    Other wise they will start by them selves by making a team to do this type of political business.

    This is a short term business which will provides long term fruits.

    The main drawback of the present politicians is they don't know how to escape & exit (close their boards) from politics.

    The new seeds of the present/past politicians will come (with a fixed goal) with a new plan they well known how to enter in to this political market and after earning sufficient amount they will exit form there with a proper pre-planned process.

    All are well known that there are so many stupidity options are available in the present system for these type of issues.


    :(

    ?!

    రిప్లయితొలగించండి
  2. ఎందుకో ఏమో గారు మీ స్పందన బాగుందండి . ఐతే కాలం ఎప్పుడూ ఇలానే ఉండదు . రెండు మూడు దశాబ్దాల క్రితం యువత రాజకీయ పార్టీల పట్ల పిచ్చి అభిమానంతో పరుగులు తీసేవారు. ఇప్పుడు పరిస్తితి మారింది అందరు దొంగలే అని గ్రహించారు . చరిత్ర పునరాగటం అవుతుంది అన్నట్టు ఈ విసుగుదల నుండి కొంత కాలానికైనా మంచి రాయకియలు వస్తాయని ఆశిద్దాం

    రిప్లయితొలగించండి
  3. నేను particular గా మీ post లో comments షేర్ చేసుకునేందుకు
    ఉద్దేశ్యం బలంగా ఉంది, సర్,
    నాకు సరిగ్గా రాకున్న పైది english లో రాసింది అందుకే.
    అమృత మథనం titile కి తగినట్లు చివరికి అమృతం వస్తుందనే ఆశాభావం నాకు లేక పోలేదు.
    కాని మీలా సత్య దర్శనం (వాస్తవంగా సమాజం లో ఉన్న విషం ) చూప గలుగుతున్నారు
    మీ వ్యాఖ్యల ద్వారా.

    కానీ ఇంకా సందేహాలే ఉన్నాయి.
    సమాచార హక్కు ఉంది అంటూ media నే గగ్గోలు పెడుతుంది.
    కానీ మొన్న ఈ మధ్యన ఈ లిక్కర్ సిండికేట్ విషయం లో
    http://endukoemo.blogspot.com/2011/12/kompani-hot-news-of-ap.html
    రాష్ట్ర రాజకీయప్రముఖులను నేరుగా టార్గెట్ చేస్తున్న వార్త లిక్కర్ సిండికేట్ వ్యవహారం
    please సీ the second video of the above link once ....

    ఏదో ఏవేవో ఆధారాలతో సహా
    చిన్ని వాడి నుంచి పై అధికారి దాక అన్ని దొరికేసాయ్ అంటూ రోజంతా గగ్గోలు చేసాయి.
    కాని ఒక్క ఆధారం చూపించి ఏ వోక్కడిపై action తీసుకోక పోవటం ఎందుకు చూపించవు ???

    కారణం చెప్ప మంటార?
    ఈ media వాళ్ళని నమ్ముకోవటం శుద్ధ దండగ

    అది పక్కా business పక్క business
    sorry సర్, ఒళ్ళు మండుతోంది.
    వాచక తపస్సు మూలాన ఎక్కువ మాట్లాడలేక పోతున్న

    ఒకప్పుడు media లో చేరాలని తెగ ఆశగా ఉండేది.
    మామూలుగా కాదు పిచ్చ ఇష్టం
    ఇప్పుడు గౌరవం కూడా పోయింది.

    సర్, మీరు ఈ అమృత మథనం మాత్రం ఎత్తి పరిస్థితులలోను తగ్గించకండి.
    అలా continue అయితేనే ఆ ఆశాభావానికి అర్థం ఉంటుంది.
    మీలాంటి వాళ్ళకు కూడా ఒక్క సారి
    ఈ సమకాలీన అంశాల మీద చిరాకు విసుగు నిర్వేదం కలిగిందా,...

    ఇక అంతే ఎవ్వడు ఏమీ చేయలేడు...


    thanks

    ?!

    రిప్లయితొలగించండి
  4. ఎందుకో ఏమో గారు తొలత ఈ బ్లాగ్ వ్యక్తిత్వ వికాసం కోసం చిన్న చిన్న పురాణ కథలతో మంచి మాటలు రాయాలనుకున్నాను .మొదట్లో రాసిన పోస్ట్లు అలాంటివే . ఆ ఉద్దేశ్యం తోనే అమ్రుతమథానం అని పేరుపెట్టాను . మళ్లీ ఆలాంటి కోణం లో త్వరలోనే కొన్ని పోస్ట్లు రాస్తాను నా బ్లాగ్ లోని రాతలు మీకు నచ్చినదుకు థాంక్స్ . మన ప్రజాస్వామ్య వయసు కేవలం ఆరు దశాభ్దాలు మాత్రమే కచ్చితంగా మార్పు వస్తుంది .

    రిప్లయితొలగించండి
  5. నిజమే. ఒకసారి ప్రభుత్వ సారా ధరలు పెరిగిన సందర్భంలో కార్మిక సోదరుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఆ ధరలు తగ్గించాలని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో మేం వారంరోజులు కాలేజీ మానేసి సమ్మె చేశాం!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం