12, ఏప్రిల్ 2012, గురువారం

వావ్ బ్లాగ్స్ పై i news లో అద్భుతమైన స్టొరీ ?????



ఇప్పుడే బ్లాగ్స్ పై i news లో  ప్రత్యేక వార్తా చూశాక ఇది రాయకుండా ఉండలేక పోతున్నాను. తెలుగు నాట బ్లాగ్స్ ప్రారంభించడం బాగా పెరిగింది అని ఓ కథనం ప్రసారం చేశారు . ఒక్క తెలుగు అక్షరం కనిపించ నివ్వ కుండా , ఒక్క తెలుగు బ్లాగ్ చూపించ కూడా తెలుగు బ్లాగ్స్ పై భలే స్టొరీ చేశారు .. ఇక బ్లాగ్స్ గురించి ఒక అమ్మాయితోతెలుగు వార్తల్లో చక్కని ఇంగ్లిష్లో   మాట్లాడించారు .  నాకు తెలిసినంత వరకు  i news  తెలుగు వార్తా చానల్ . వార్తలు తెలుగులోనే ప్రసారం చేస్తారు . పోనీ తెలుగు రాని ఆఫ్రికా వాడెవడో తెలుగులో బ్లాగ్స్ పై స్టొరీ చేయమంటే అలా చేశాడని అర్ధం చేసుకోవచ్చు . కానీ  ఒక్క తెలుగు అక్షరం, తెలుగు బ్లాగ్ కనిపించకుండా తెలుగు నాడులో బ్లాగ్స్ పై స్టొరీ ఏమిటో ? ( ఆ వార్తా ఎలాగూ మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తారు వీలుంటే మీరూ చూడండి )

18 కామెంట్‌లు:

  1. అమృత మధనం గారు,

    తెలుగు బ్లాగ్ పై తెలుగు లో వార్త వస్తే ఎంత అప్రతిష్ట ! ఎంత అప్రతిష్ట!
    అందుకే తెలుగు లేదన్న మాట అందులో ! ఈ సూక్ష్మం గ్రహించక పొతే ఎలాగండీ మరి !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా పిల్లలకు తెలుగు రాదు అని గొప్పగా చెప్పుకుంటున్నట్టు ... మా తెలుగు చానల్స్ లో తెలుగు వార్తలు లేవు అని గొప్పగా చెప్పుకునే రోజులు వస్తాయేమో నండి జిలేబి గారు

      తొలగించండి
  2. ఒక్క తెలుగు అక్షరం, తెలుగు బ్లాగ్ కనిపించకుండా తెలుగు నాడులో బ్లాగ్స్ పై స్టొరీ ఏమిటో ?___________మరీ వెరైటీ అనుకుంటానండీ!నేనూ చూస్తానుండండి. కనీసం ఒక్క తెలుగు బ్లాగ్ గురించైనా చెప్పలేదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓ వైపు తెలుగులో బ్లాగ్స్ గురించి పుస్తకాలు కూడా వస్తుంటే వాళ్ళేమో ............................

      తొలగించండి
  3. తెలుగులో చెప్పాల్సిన తెలుగు బ్లాగు లేవి లేవని వారి ఉద్దేశ్యం కాబోలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @బులుసు సుభ్రమణ్యం గారు థాంక్స్ .. i news లో పని చేసే మిత్రులకు కూడా తెలుగు బ్లాగ్స్ ఉన్నాయండి

      తొలగించండి
  4. sir e story nenu chudaledu, office lo cheppi visual marpiche prayatanam chestanu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ravi adidam గారు థాంక్స్ కోపం తో రాయలేదు. తెలుగు చానల్స్ లో తెలుగును పట్టించుకోకపోతే ఎలా ? అనే బాధ వేసి రాశాను

      తొలగించండి
  5. తెలుగు బ్లాగర్ ల మీద తట్టుకోలేని కోపం ఏదో ఉండే ఉంటుందని అనిపిస్తుంది ఆ న్యూస్ చేసిన వారికి.. మొన్న సాక్షి దినపత్రిక కూడా ఏ ఒక్క బ్లాగ్ ని ఉటంకించకనే మొత్తం ఆర్టికల్ ని రాసిపడేసారు .

    రిప్లయితొలగించండి
  6. మంచి పోస్టు. బ్లాగులపై ఒక ఐటం ప్రసారం చేయడం మంచిదే . అయితే ఎది నేను చూడలేదు. మీ సూచన బాగుంది. రవి అడిదం గారి స్పందన బాగుంది. పోస్టుకు ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  7. అమృత మధనం గారు,మొన్న కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు గొప్ప సీనియర్ బ్లాగర్ల గురించి ఆంధ్ర జ్యొతి వారు వారి పత్రికల్లొ మన బ్లాగర్లకు చెప్పకుండా వాళ్ళ గొప్పలను ప్రచారం చేశారని చాలామంది బ్లాగర్లు చాలా బాధపడ్డారు..
    అందుకే ఈ సారి i news వారు మన బ్లాగర్లను బాధపెట్టకూడదన్న సదుద్దేశ్యంతో జాగ్రత్త వహించినట్లున్నారు.. అని నా అభిప్రాయము..

    రిప్లయితొలగించండి
  8. మీరు విషయాన్ని సరిగా అర్థం చేసుకున్నట్టు లేదు . ఉదాహరణకు చార్మినార్ పై స్టొరీ అని తాజ్మహల్ ను చూపిస్తే ఎలా ఉంటుంది . తాజ్మహల్ చార్మినార్ కన్నా గొప్పది కదా అనుకుందామా .తెలుగు చానల్ లో తెలుగు వార్తల్లో,తెలుగు బ్లాగ్స్ పై స్టొరీ చేస్తూ తెలుగు అక్షరం కనిపించక పోవడం నాకయితే ఆశ్చర్యం కలిగించింది . ఇక స్పందించిన వారిలో ఆ చానల్ ప్రిన్సిపల్ కరస్పందేంట్ ఒకరు ఉన్నారు . విషయం వారికి అర్థం అయింది . నిజంగా అలా స్టొరీ వచ్చిందో లేదో అతనికి తెలియదు కానీ జరిగి ఉంటే అది సరి కాదని గ్రహించారు తెలుగునాట బ్లాగ్స్ గురించి స్టొరీ అంటే పలానా వ్యక్తి బ్లాగ్ చూపలేదు అని కాదు . ఒక్క తెలుగు అక్షరం కూడా చూపలేదు . చివరకు ఎవరో నేహ అని విద్యార్తి తో ఇంగ్లిష్ లో మాట్లాడించారు . ఆమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వస్తే అతనితో మనం తెలుగులో మాట్లాడిన్చాలెం ఆతను ఇంగ్లిష్ లో మాట్లాడితే దాని అర్థం తెలుగులో అనువాదం చేసుకొని చెప్పాల్సిందే. కానీ తెలుగు న్యూస్ చానల్ తెలుగు వార్తల్లో, తెలుగు బ్లాగ్స్ గురించి చెబుతూ ఇంగ్లిష్ లో బ్లాగర్ తో మాట్లాడించడం ఏమిటో ?.
    ఆంధ్ర జ్యోతి వాళ్ళు బ్లాగర్ అనుమతి లేకుండా పబ్లిష్ చేసిన అంశానికి, దీనికి సంబంధం లేదండి. ఉదాహరణకు ఒక బ్లాగ్ ను వంద మందే చూస్తారు, ఆంధ్ర జ్యోతి నీ ప్రపంచం లో ఉన్న పది కోట్ల మంది తెలుగు వారు చదువుతారు అనుకుందాం . పది కోట్ల మంది చదువుతారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మీ బ్లాగ్ లోని అంశాలను వాడు కుంటాము అంటే కుదరదు . కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. బ్లాగ్ లో ఉన్న అంశాన్ని వాడు కోవడం వేరు , బ్లాగ్స్ పై స్టొరీ వేరు. ( కొందరు పేరు కోసం పరితపిస్తున్నట్టు మీ బ్లాగ్ లో ఏదో రాశారు . మీ కామెంట్ లో అమృత మధనం గారు అని రాశారు . నా పేరు అది కాదు . వెతికితే నా పేరు చిన్న అక్షరాల్లో కనిపిస్తుంది)

    రిప్లయితొలగించండి
  9. :) నాకెప్పుడూ ఒక అనుమానం వస్తూ ఉంటుంది. హిందీ సినిమాల గురించి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు తెర మీద హిందీ లో మాట్లాడే కళాకారులు ఒక్కరూ హిందీ లో మాట్లాడరు. అందరూ దాదాపు ఆంగ్లం లోనే మాట్లాడుతారు. ఇదీ అలాంటిదే అయ్యుండవచ్చు..

    రిప్లయితొలగించండి
  10. కృష్ణప్రియ గారు ఏమో కావచ్చు కానీ మీరు ఎప్పుడయినా ఇంగ్లిష్ చానల్స్ లో ఇంటర్వ్యులో ఎవరయినా తెలుగు లో మాట్లాడడం చూశారా ?

    రిప్లయితొలగించండి
  11. :) మీ పాయింట్ నాకర్థమైంది.. నాకు ఎప్పుడూ చాలా ఆశ్చర్యం గా ఉంటుంది. తీసిన వాళ్లు హిందీ వాళ్లు, సినిమా భాష కూడా హిందీ, చూసేవాళ్లు హిందీ.. అసలు ఇంగ్లిష్ లో మాట్లాడటం ఎవరికోసం? అని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ ప్రియ గారు,

      ఇంగ్లీషు దేశ భాషల లో కలిసి పోయిందేమో నండీ! తెలుగులో ఇంగ్లీషు మాట్లాడితే , హిందీ లో ఇంగ్లీషు మాట్లాడితే అది సరిఅయిన భాష !

      చీర్స్
      జిలేబి.

      తొలగించండి
    2. జిలేబి గారు ఇంగ్లిష్ దేశ భాషలో కలిసిపోతే సంతోషమే .. దేశ భాషలను మింగేస్తేనే కష్టం

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం