‘‘ఈసారి మనం పీపుల్స్ మ్యానిఫెస్టో ప్రకటిద్దాం. చట్టబద్ధమా? చట్ట వ్యతిరేకమా? అనే సందేహం వద్దు, ఏం కావాలో ప్రజలు చెబితే, మనం వాటిని ఇచ్చేస్తున్నామని తీర్మానం చేసి మ్యానిఫెస్టోలో చేరుద్దాం. మీమీ నియోజక వర్గాల జనం డిమాండ్లతో నిర్మొహమాటంగా ఒక జాబితా రూపొందించి, వచ్చేవారం తీసుకు రండి’’అని అధ్యక్షుడు ప్రకటించాడు.
***
నియోజక వర్గాల నుంచి వచ్చిన నాయకులు వరుసగా జాబితాలు చదివారు. కలర్ టీవి, ల్యాప్‌టాప్, నెలకు వెయ్యి రూపాయల టాక్ టైం ఫ్రీ, రోజుకు రెండు పూటల భోజనం, ఉదయం టిఫిన్, సాయంత్రం టీ పథకం ఇలా కామన్‌గా ఉన్న డిమాండ్లతో ఒక జాబితా రూపొందించారు. మహిళలకు నెలకో చీర, వారానికో లిప్‌స్టిక్, ఏడాదికో మేకప్ బాక్స్, మగవారికి రోజుకో సిగరెట్ డబ్బా, గుట్కా, యువతకు హెరాయిన్, నవతకు రెండు రోజులకో సినిమా టికెట్ పథకాల డిమాండ్లను చదివి వినిపించారు. అధ్యక్షుడు మైకు పుచ్చుకుని ’’ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు కోరుకున్న పాలన. ప్రజలు మద్యం , హెరాయిన్ కోరుకుంటే అందించడం వారి ప్రతినిధులుగా మన బాధ్యత. అధికారంలోకి రాగానే చట్టాలను మార్చి ఇంటింటికి హెరాయిన్ పథకాన్ని ప్రవేశపెడదాం’’ అని అధ్యక్షుడు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు. ఒక నేత లేచి దీనిపై నాకు కొంత అభ్యంతరం ఉంది అని మైకు అందుకున్నాడు.
‘‘మనం ఎక్కడికి వెళుతున్నాం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, భారతీయత మనలో లోపిస్తోంది. విదేశీ హెరాయిన్ పై ప్రేమ చూపించే మీరు మన భారతీయ గంజాయి గురించి ఒక్కసారైనా ఆలోచించారా? ఇదేనా మీ దేశభక్తి ఇందుకేనే మనం రాజకీయాల్లోకి వచ్చింది’’ అని ఆవేశంగా మాట్లాడాడు. అధ్యక్షుడు లేచి ‘‘ఆవేశం వద్దు మా దేశ భక్తి మీ దేశభక్తికన్నా విశాలమైంది. అది ఒక్క దేశానికే పరిమితం కాలేదు. అనేక దేశాలపై మాకు భక్తి ఉంది. అందుకే అన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టాను, బ్యాంకుల్లో దాచుకున్నాను. నీది దేశ భక్తి అయితే నాది దేశాల భక్తి. నా దేశాల భక్తిని ఎవరూ శంకించలేరు. ఇంటింటికి హెరాయిన్ అంటే అందులో గంజాయి, గుట్కా, వంటి స్వదేశీ ఉత్పత్తులన్నీ వస్తాయి’’ అని ఆవేశంగా చెప్పాడు.
స్టూవర్ట్‌పురం నాయకుడు లేచి మా వర్గ ప్రయోజనాలు మాకు ముఖ్యం. మేం స్టూపవర్ట్‌పురం నియోజక వర్గానికి మాత్రమే పరిమితం అయ్యామనుకుంటే పొరపాటు జనాభాలో మేం తొమ్మిదిన్నర శాతం మందిమి ఉన్నాం . పేర్లు వేరైనా మీది మాది ఒకే వృత్తి. కానీ మీకేమో బోలెడు ప్రచారం మాకేమో రిస్క్ ఎక్కువ. ఇంత కాలం ప్రభుత్వంపై ఆధారపడకుండా మా వృత్తిలో మేం బతికాం ఇక మా డిమాండ్లు ఆమోదించాల్సిందే. రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎవరినీ రోడ్డుపైకి రానివ్వకుండా నిషేధాజ్ఞలు విధించాలి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండరాదు. వృత్తిలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 60 ఏళ్లు దాటిన వారు వృత్తిలో చురుగ్గా ఉండలేరు వారికి ప్రత్యేక బృతి ఇవ్వాలి’’ అంటూ డిమాండ్ల జాబితాను చదివి వినిపించారు. అధ్యక్షుడు లేచి ‘‘ ఇంతోటి డిమాండ్లకు అంత బిల్డప్ ఇచ్చావేమిటయ్యా! ఈ డిమాండ్లన్నీ ధర్మబద్ధంగానే ఉన్నాయి ఏమంటారు’’ అని అధ్యక్షుడు. అడిగాడు.
చప్పట్లతో ఆ డిమాండ్లను ఆమోదిస్తున్నట్టు అందరూ చెప్పారు. ‘‘ అతి పురాతనమైన దొంగ వృత్తికి రిస్క్ అలవెన్స్‌తో పాటు, ప్రభుత్వ సొమ్ముతో రిస్క్ బీమా కూడా చేయిస్తామని హామీ ఇస్తున్నానని ’’ అధ్యక్షుడు చప్పట్ల మధ్య ప్రకటించాడు. విచారంగా కూర్చున్న ఓ నేత వైపు చూసి ‘‘తమ్ముడూ మీ డిమాండ్లను వినిపించనే లేదు. మనం ఉన్నదే ప్రజల కోసం ఎలాంటి డిమాండ్లయినా సరే మ్యానిఫెస్టోలో చేర్చడానికి రెడీ చెప్పు బ్రదర్ చెప్పు ’’అని మళ్లీ మళ్లీ అడిగాడు.
ఆ నేత కళ్ల నుంచి కన్నీరు ఉబుకుతోంది...‘‘ మనం రామరాజ్యం స్థాపిస్తామని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నాం. శ్రీరాముని కొలువులో ఇలానే గూఢచారి ప్రజలు అనుకున్న మాటలు చెప్పాల్సిన సందర్భం వస్తే సంకోచించాడు. కానీ రాముడేమన్నాడు ఎవరేమనుకున్నా సరే చెప్పమన్నాడా? లేదా? సీతను అడవులకు పంపాల్సిన విషయం అయినా సరే రాజు వద్ద రహస్యాలు దాచవద్దు చెప్పు బ్రదర్ చెప్పు’’ అని రెట్టించి అడిగాడు.
‘
భార్య ను అ డవులకు పంపడం పెద్ద త్యాగమేమీ కాదు అలాంటిదైనా ఎగిరి గంతేసి చెప్పేవాన్ని కానీ మా నియోజక వర్గ ప్రజలు దుర్మార్గమైన డిమాండ్లు వినిపిస్తున్నారు. చదవడానికే నాకు నోరు రావడం లేదు. అయినా చదవడం నా ధర్మం మనసు దిటవుచేసుకుని చదువుతున్నాను.
అయ్యా దొంగల రాజ్యం ధర్మప్రభువులకు మా నియోజక వర్గ ప్రజల డిమాండ్ మీ దోపిడీకి మేము ఎప్పుడూ అడ్డుగా నిలవం. మావి రెండే రెండు డిమాండ్లు అవి ఆమోదించిన వారికే మా ఓటు.
ఎంతటి స్థాయి నాయకుడైనా అక్రమంగా సంపాదించిన సొమ్ములో సగం నియోజక వర్గ ప్రజలకు సమానంగా పంచాలి. ఇక మిగిలిన సగం సింగపూర్‌లో పెట్టుబడులో, స్విస్‌బ్యాంకులో డిపాజిట్లు చేయడం మానేసి స్వదేశంలోనే పెట్టుబడులు పెట్టాలి అని పూర్తిగా చదవకముందే, అన్ని నియోజక వర్గాల అభ్యర్థులు నో అని ఏకగ్రీవంగా గట్టిగా అరిచారు. ఈ డిమాండ్లను మేమే కాదు మా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సైతం ఆమోదించరు, మెడమీద తలకాయ ఉన్న నాయకుడెవరూ ఆమోదించరు అని అందరూ కోరస్‌గా చెప్పారు.
‘‘ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవినీతి సొమ్ముపై ఆంక్షలా దేశం ఎటుపోతోంది . దేశంలో కొంత భాగం పక్కదేశం వాడికి ఇచ్చేయమంటే ఇస్తాం కానీ మా ఆక్రమ సంపాదన ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే అధికారం మాకు లేదంటే సహించం’’ అని అధ్యక్షుడు ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ కళ్లు తుడుచుకున్నాడు. నాయకుల అక్రమాస్తులకు ఎసరు పెట్టే ఇలాంటి ఆలోచనలకు పురిటిలోనే బ్రేకు వేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

chaala bagunadi matalu ravatam ledu atha baagunndi
రిప్లయితొలగించండి