‘‘రోజుకు ఇరవై గంటలు కష్టపడుతూ ఊపిరి తీసుకునేంత సమయం కూడా లేని నాయకులే ఉత్సాహంగా కనిపిస్తుంటే నువ్వేంట్రా అంత దిగులుగా ఉన్నావ్’’
‘‘నేత కష్టాలు నేతవి, పీత కష్టాలు పీతవి’’
‘‘ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగివి. ఊళ్లో పొలం, నగరంలో ఫ్లాట్లు అద్దెలు. వర్షాలొస్తే వర్షాల అలవెన్స్ కరువోస్తే కరవు భత్యం నీకేంటి కష్టాలు’’
‘‘అమ్మాయి పెళ్లిడుకొచ్చింది ’’
‘‘ఐటి కంపెనీలో మంచి ఉద్యోగం, హీరోయిన్ అంత అందంగా ఉంటుంది. మీ అమ్మాయికేంటిరా కళ్లకద్దుకొని పెళ్లి చేసుకుంటారు’’
‘‘ కళ్లకద్దుకొని పెళ్లి చేసుకుంటామని చాలా మందే వస్తున్నారు కానీ వాళ్లె వరూ మా అమ్మాయికి నచ్చడం లేదు. పోలీస్ కానిస్టేబుల్‌నే చేసుకుంటాను అని మొండిపట్టు పట్టింది. ’’
‘‘ ఇదేం కోరికరా నువ్వు చెప్పినా నేను నమ్మలేక పోతున్నాను ’’
‘‘ అదేరా నా దిగులు. ఒక్క సినిమాల విషయం తప్ప అన్నింటిలో ఫర్‌ఫెక్ట్. ఐఐటిలో సీటు కోసం మూడో తరగతిలోనే తెల్లవారు జామున మూడు గంటలకే కోచింగ్ సెంటర్‌లో దించితే మళ్లీ రాత్రి పదకొండు గంటలకు అన్ని ఇన్‌స్టిట్యూట్‌ల కోచింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేది. దాంతో పగలు, రాత్రి ఎలా ఉంటుందో? ప్రపంచం ఎలా ఉంటుందో ఆ పిచ్చి తల్లికి అస్సలే తెలియకుండా పోయింది. ఉద్యోగంలో చేరిన తరువాత ఒక్కసారిగా సినిమా పిచ్చి పట్టుకుంది. తాను చిన్నప్పటి నుంచి చూడాలనుకున్న సినిమాలన్నీ వరుస పెట్టి చూసేస్తున్నది. చూసి వదిలేస్తే బాగుండు ఆ సినిమా కథల ప్రభావం అమ్మాయి మీద తీవ్రంగా ఉందిరా! అంతులేని కథ చూసి అసలు పెళ్లి చేసుకోను కుటుం బం కోసం త్యాగం చేస్తాను అంది ఆ అవసరం లేదు తల్లి అని ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. అదేదో సినిమాలో కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటూ ఆ హీరో చెప్పిన డైలాగుతో పెళ్లంటూ చేసుకుంటే కానిస్టేబుల్‌నే చేసుకుంటాను అంటోంది. చివరకు ఒక పోలీసు సంబంధం తీసుకు వచ్చాను. మూడు సింహాలే కనిపిస్తున్నాయి. కనిపించని ఆ నాలుగో సింహం కావాలంటోంది. ’’
‘‘దురదృష్టంలోనూ నువ్వు అదృష్టవంతుడివిరా ఇంకా నయం దొంగ రాము డు, రిక్షా రాముడు, డ్రైవర్ రాముడు సినిమాలు చూసి ఉంటే దొంగ కోసమో, రిక్షా వాడి కోసమో తిరగాల్సి వచ్చేది.’’
‘‘ఏదైనా సలహా చెబుతావేమో అని వస్తే నన్నింకా భయపెడతావా? ’’
‘‘ సినిమాలో హీరో రిక్షా తొక్కితే ప్రపంచంలో అతి ముఖ్యమైన వృత్తి రిక్షా తొక్కడమే, రిక్షా తొక్కే వాడిలో నిజాయితీ ఉంటుంది అని చూపిస్తారు. హీరో దొంగ అనుకో బలమైన కారణం వల్ల హీరో దొంగతనాలు చేస్తాడు. కానీ దొంగ చాలా మంచోడు. దొంగతనం పవిత్రమైన వృత్తి అని చూపిస్తారు. అలానే విలన్ స్మగ్లర్ అయితే అది దేశ ద్రోహం, అదే హీరో స్మగ్లర్ అయితే ఎంతో తెలివిగా అందరి కళ్లు కప్పి స్మగ్లింగ్ చేస్తాడు. ఇందులో ఆ పాత్ర వృత్తి గొప్పతనం కాదు. హీరో ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్ర గొప్పతనం. ఈ మాత్రం తెలియకుండా మీ అమ్మాయి మరీ ఇంత పిచ్చిగా సినిమాలో లీనం అయితే ఎలా? ’’
‘‘మా అమ్మాయి ఒక్కదాని ఆలోచనలోనే ఏదో తప్పున్నట్టు మాట్లాడతావు. కోట్లాది మంది సామాన్యులు, మేధావుల్లో కూడా ఈ ప్రభావం ఉంటుంది’’
‘‘ నేను నమ్మను’’
‘‘అమెరికాలో ఐటి ఉద్యోగం చేసొచ్చిన కెటిఆర్ శ్రీమతుండు సినిమా చూసి ఎంతగా స్పందించారు. ట్విట్టర్‌లో మహేశ్‌బాబును ఆకాశానికెత్తేయలేదా! అలానే మహేశ్‌బాబు స్పందించి ఏకంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోలేదా? ’’
‘‘ఆ ఇద్దరు ఒకరినొకరు పొగుడు కోవడానికి ఎవరి లెక్కలు వాళ్లకుంటా యి..’’
‘‘ తెలుగు వారికో రాష్ట్రం ఉన్నా, మద్రాస్‌లోనే జీవిత కాలమంతాగడిపిన ఎన్టీఆర్ సినిమా ఎండింగ్‌లో రాజకీయ పార్టీని స్థాపిస్తే ఎన్నో సినిమాల్లో ఆయన పేదలను ఆదుకున్న దాన్ని చూసే కదా తెలుగు ఓటర్లు ఆయనకు పట్టం కట్టింది. మా అమ్మాయిని తప్పు పడుతున్నావు మరి దీనే్నమంటావు. ’’
‘‘ఎన్టీఆర్ సినిమాల్లో విలన్లను మట్టికరిపించినా జీవితంలో మాత్రం తానే విలన్ల చేతిలో ఘోరంగా దెబ్బతిని మానసిక క్షోభతో పైకి పోయారు. అప్పటి పరిస్థితుల వల్ల ఎన్టీఆర్‌ను జనం గెలిపించారు. అదే జనం చిరంజీవి వస్తే గెలిపించలేదు కదా?’’
‘‘మా అమ్మాయికి ఆ దేవుడే ఓ దారి చూపించాలి.’’
‘‘ మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిర్చే బాధ్యత నాది ఆ సంగతి నాకు వదిలేయ్’’
****
‘‘నాన్నా నేను ప్రవీణ్‌ను చేసుకుంటాను’’
‘‘సంతోషం ’’
****
‘‘ థాంక్స్ రా .. అసాధ్యుడివి .. ఏం మంత్రం వేశావు ’’
‘‘ సినిమా పోస్టర్లకు క్షీరాభిషేకాలు చేసేది, హీరో కోసం తలలు పగుల గొట్టుకునేది పెళ్లి కాని, బాధ్యతలు లేని వాళ్లే.’’ఇంకా నయం మీ అమ్మాయి సినిమాలో హీరో వృత్తినే ప్రేమించింది . ఒక్కోసారి రోగానికి రోగమే చికిత్సలా పని చేస్తుంది. అదేదో కొత్త సినిమా అందులో హీరో హార్డ్‌వేర్... ప్రపంచమంతా ఆ హీరో వృత్తిపైనే ఆధారపడి ఉందని ఆ సినిమాలో చూపించారు. ప్రపంచాన్ని నాశనం చేయాలన్నా, కాపాడాలన్నా ఆ హీరో వల్లే సాధ్యం అనేది కథ. ప్రవీణ్ మా బంధువుల అబ్బాయే హార్డ్‌వేర్. మీ సాఫ్ట్‌వేర్ అమ్మాయికి సరైన సంబంధం అనిపించింది. ఇద్దరికీ నేనే పరిచయం చేశాను. ఇద్దరూ కలిసి సినిమాకెళ్లారు. హార్డ్‌వేర్ అబ్బాయి, సాఫ్ట్‌వేర్ అమ్మాయి ఒకటయ్యారు. ’’
‘‘ నీ సహాయం జీవితంలో మరువలేను’’
‘‘ పెళ్లితో సినిమాకు శుభం కార్డు పడుతుంది.జీవితంలో కాదు. జీవితం వేరు, సినిమా వేరు. జీవితంలో పెళ్లితోనే అసలు కథ మొదలవుతుంది. మహామహా ఎన్టీఆరే నిజ జీవితంలో విలన్‌లను ఎదుర్కోలేక బొక్క బోర్లా పడ్డారు. ఈ హార్డ్‌వేర్ కుర్రాడెంత. పెళ్లయింది కదా మెల్లగా మీ అమ్మాయికే జీవితం వేరు, సినిమా వేరని అర్ధమవుతుంది లే!

చాలా బాగుంది సినిమా
రిప్లయితొలగించండి