బయట సన్నని వాన ముసురు. మీ గదిలో మీరొక్కరే. మీ పక్కన ఒకవైపు వేడి పకోడీ. అంత కన్నా వేడివేడి టీ.. మరోవైపు ఈజీచైర్‌లో మీరు.. మీ ఒళ్లో పత్రిక- చేతిలో టీ. టీవీలో సూపర్‌స్టార్ కృష్ణ చిటాపటా చినుకులతో కురిసింది వాన! మెరిసింది జాణ అంటూ హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. కృష్ణకు డ్యాన్స్ రాదని అన్నవాడెవడు? అనే ప్రశ్న మీ మనసులో ఆ సందర్భంలో అస్సలు గుర్తుకు రాదు. ఎందుకంటే విజయనిర్మలను అంత అందంగా మీరెప్పుడూ చూడలేదు. విజయనిర్మల అందాన్ని చూసి మెరిసింది జాణ అని కృష్ణ పలికిన మాటలో ఈసమంత అబద్ధం కూడా లేదనిపించింది. కృష్ణ అంత ఉత్సాహంగా హీరోయిన్‌తో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు. విజయనిర్మల అందాన్ని అలా చూస్తూ భలే జంట అనిపిస్తుంది తప్ప మరో ఆలోచన రాదు. చిటపట చినుకుల పాట వినగానే అక్కినేని నాగేశ్వరరావు, బి సరోజల జంటనే గుర్తుకు వస్తుంది కానీ ఆ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా దానికి పోటీ అన్నట్టుగా కృష్ణ విజయనిర్మలపై చిటాపటాచినుకులతో పాటుంది. విజయనిర్మల చెక్కిలిపై పడ్డ వర్షపు చినుకులను చూసి కృష్ణకే కాదు ఆనాటి యువతకు కూడా చినుకునైనా కాకపోతే అనిపించే ఉంటుంది. టీవీ చూస్తూ ఆ పాటలో లీనమైపోయిన మీకు ఒక్కసారి మీ అదృష్టంపట్ల మీకే ఆసూయ కలిగి తీరుతుంది... ఆగండాగండి ఇదేమీ ఊహ కాదు.. కథ కాదు... కళ్ల ముందు వనిత టీవిలో కనిపించిన దృశ్యం.
సినీ అభిమానుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక థియేటర్లలో పన్నుల విధానంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని పాత సినిమాలను థియేటర్లలో చూడాలనుకునే వారికి శాపంగా మారింది. గతంలో సినిమా హాళ్లలో ఉదయం పూట పాత సినిమాలు ప్రదర్శించే వారు. వాటిని చూసే వారి సంఖ్య తక్కువేమీ కాదు. కొత్త సినిమాలు మొదటి వారం మాత్రమే నాలుగు షోలు ప్రదర్శించే వారు తరువాత ఉదయం పూట పాత సినిమాలే. కత్తి వీరుడు కాంతారావు, ఎన్టీఆర్ గండికోట రహస్యం ఒకటేమిటి అద్భుతమైన సినిమాలను చూసే అవకాశం ఉండేది. నటుడు ముఖ్యమంత్రి అయ్యాక మనకా అదృష్టం లేకుండా పోయింది. ఆ తరువాత టీవీలు వచ్చాక పాత సినిమాలు సినిమా హాల్‌లో చూడడం అనేది కలగానే మిగిలిపోయింది.
ఇప్పుడు పలు చానల్స్ ఏదో ఒక సమయంలో పాత సినిమాలను, పాత సినిమాల్లోని పాటలను, దృశ్యాలను చూపిస్తున్నాయి. కలర్స్ చానల్‌లో సీరియల్ కోసం రిమోట్ లాగేసుకునే ఇల్లాలు, కార్టూన్ చానల్ కోసం ప్రపంచ యుద్ధం కోసమన్నట్టు సైరన్ మ్రోగించే పిల్లలు అంత ఈజీగా పాత సినిమాలను చానల్స్‌లో చూడనివ్వరు కానీ. అలా చూసే చాన్స్ ఉంటే మీరొక్కరు మాత్రమే మీ గదిలో ప్రశాంతంగా చూడగలిగే అవకాశం ఉంటే మీరు అదృష్టవంతులే. ఏదో ఒక తెలుగు చానల్స్‌లో ఏదో ఒక సమయంలో పాత ఆణిముత్యాలను దర్శించవచ్చు.
ఒక సినిమా సీడీ కొనుక్కొని చూడడం వేరు. టీవీలో సినిమా చూడడం వేరు. సినిమా హాలులో చూడగలిగితే ఇంకా అదృష్టమే కానీ పన్ను విధానం, మారిన పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా వనిత చానల్‌లో పాత సినిమాలకు కొదవ లేదు. ఎంత మంది చూస్తారు, వీవర్ షిప్ ఎలా ఉంది, టిఆర్‌పి రేటింగ్ ఏమిటి? అనే ప్రశ్నలను పక్కన పెడితే వనితా టీవీలో పాత సినిమాలకు కొదవ లేదు.
ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలకు వనిత చానల్‌లో ఆమని పేరుతో అరగంట పాటు మధురమైన పాత పాటలను వ్యాఖ్యానంతో చూపిస్తున్నారు. వ్యాఖ్యానం చక్కగా ఉండి పాటలూ బాగుంటున్నాయి. అదే విధంగా సోమవారం నుండి గురువారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు గోల్డెన్ క్లాసిక్ పేరుతో పాత పాటలను వినిపించడమే కాకుండా ఆ పాట గురించి పాత విషయాలు చెబుతున్నారు. అంతేనా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పాత సినిమాలోని కొంత భాగాన్ని సీరియల్‌గా చూపుతున్నారు. వనిత, సప్తగిరి( దూరదర్శన్) పాత సినిమాలను డైలీ సీరియల్ మాదిరిగా ప్రదర్శిస్తున్నాయి.
శనివారం ఉదయం 8.30కి సప్తగిరిలో ఆణిముత్యాలు పేరుతో పాత సినిమా చరణదాసి సీరియల్‌గా ప్రసారమయింది. ఆ తరువాత న్యూస్ చానల్ టీవి 5 చూస్తే పాటల పల్లకిపై పేరుతో మధురమైన పాత పాటలను చూపించారు. కల్లాకపటం తెలియని వాడా!... ఏరువాకా సాగారోరన్నో చిన్నన్న అంటూ వహీదా రెహమాన్ నృత్యం చేస్తుంటే గిలిగింతలు పెట్టకుండా ఉంటుందా? కొసరాజు, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టులైన సినీగేయ రచయితల గురించి చెబుతూ వారు రాసిన పాటలు ప్రసారం చేశారు. న్యూస్ చానల్స్‌లో సైతం అపురూపమైన సినిమాలు కనిపించడంతో టైమ్ మిషన్‌లో ఒక్కసారిగా ఆనాటి స్వర్ణయుగానికి వెళ్లినట్టు అనుభూతి కలిగింది. రమణారెడ్డి అయ్యయ్యో చేతిలో డబ్బులో పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే అని పాడుతుండగానే పక్కన రేలంగి పేకాడుతూనే కనిపించారు. ఆనాటి ఈ పాట నేటికీ ముచ్చటగానే అనిపించింది కానీ కొద్ది మందినైనా మార్చే ఉంటుంది. ఆ తరువాత శ్రీశ్రీ తెలుగువీర లేవరా పాట వినిపించారు. ఈపాట ఒక తరానే్న తట్టిలేపింది. ఇద్దరు తెలుగువారిని కూర్చోబెట్టి చర్చల పేరుతో తన్నుకునేట్టు చేయడంలో మాత్రమే సామర్ధ్యం ఉన్న
న్యూస్ చానల్స్ అపురూపమైన పాత పాటలపై దృష్టిసారించడం చూస్తే ఇది నిజమా? కలా అని అనిపించకుండా ఉంటుందా?
మహాటీవి సైతం పాత సినిమాల పాటలకు చోటు కల్పిస్తోంది. ఇక ఈటీవిలో సైతం రాత్రి పొద్దు పోయిన తరువాత పాత సినిమా చూపుతున్నారు. ఆ సమయంలో పాత సినిమాల అభిమానులకు ఆ సినిమా చూడడం కష్టమే.
చానల్ వారికి ప్రైమ్ టైమ్‌లో పాత సినిమాలు చూపడం చానల్ వారికి కష్టం. పాత సినిమానో, పాత సినిమాలోని పాటలో విందామనుకునే వారికి తెలుగు చానల్స్‌లో ఏ సమయంలోనైనా ఏదో ఒక చానల్‌లో అదృష్టం వరిస్తుంది. అయితే వీటిని వీక్షించాలంటే ఇంట్లో అందరితో పాటు చూసే చాన్స్ తక్కువే. కాలం మారింది అభ్యంతరకరమైన దృశ్యాలున్న సినిమాలను, వర్షంలో హీరోయిన్ పూర్తిగా తడిచిపోయి అందాలను ఆరవేసే దృశ్యాలను, డబుల్ మీనింగ్ డైలాగులను కుటుంబంతో కలిసి చూడలేకపోవడం నిన్నటి మాట, ఇప్పుడు పాత సినిమాలను ఇంట్లో అందరితో కలిసి చూడలేకపోవడం నేటి సమస్య. మీరు పాత సినిమా చూస్తానంటే ఇంట్లో వారికి చాదస్తంగా వయసు మీరిన వారిగా కనిపించవచ్చు, లేదా మీ అధికారం చెల్లుబాటు కాకపోవచ్చు. అందుకే ఒక్కరే చూడగలిగే చాన్స్ అవకాశం ఉంటే మాత్రం అదృష్టవంతులే. అలాంటి అదృష్టం మీకుంటే మీ అదృష్టం మీద మీకే జెలసీ కలిగేంత అద్భుతమైన పాటలు వినొచ్చు.
ఏడుపుగొట్టు సీరియల్స్, మనుషుల మధ్య వైరాన్ని పెంచే వార్తా చానల్స్‌లను చూశాక టీవి అంటేనే వెగటు పుట్టేవారికి సైతం కొన్ని చానల్స్‌లో వేసవిలో పన్నీటి జల్లు కురిసినట్టుగా ఉంటోంది. అయితే వీటికి అద్భుతమైన వీవర్ షిప్ ఉంటుందనే అత్యాశ పెట్టుకోవద్దు.
బయట సన్నని వాన ముసురు. మీ గదిలో మీరొక్కరే. మీ పక్కన ఒకవైపు వేడి పకోడీ. అంత కన్నా వేడివేడి టీ.. మరోవైపు ఈజీచైర్‌లో మీరు.. మీ ఒళ్లో పత్రిక- చేతిలో టీ. టీవీలో సూపర్‌స్టార్ కృష్ణ చిటాపటా చినుకులతో కురిసింది వాన! మెరిసింది జాణ అంటూ హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. కృష్ణకు డ్యాన్స్ రాదని అన్నవాడెవడు? అనే ప్రశ్న మీ మనసులో ఆ సందర్భంలో అస్సలు గుర్తుకు రాదు. ఎందుకంటే విజయనిర్మలను అంత అందంగా మీరెప్పుడూ చూడలేదు. విజయనిర్మల అందాన్ని చూసి మెరిసింది జాణ అని కృష్ణ పలికిన మాటలో ఈసమంత అబద్ధం కూడా లేదనిపించింది. కృష్ణ అంత ఉత్సాహంగా హీరోయిన్‌తో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు.
విజయనిర్మల అందాన్ని అలా చూస్తూ భలే జంట అనిపిస్తుంది తప్ప మరో ఆలోచన రాదు. చిటపట చినుకుల పాట వినగానే అక్కినేని నాగేశ్వరరావు, బి సరోజల జంటనే గుర్తుకు వస్తుంది కానీ ఆ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా దానికి పోటీ అన్నట్టుగా కృష్ణ విజయనిర్మలపై చిటాపటాచినుకులతో పాటుంది. విజయనిర్మల చెక్కిలిపై పడ్డ వర్షపు చినుకులను చూసి కృష్ణకే కాదు ఆనాటి యువతకు కూడా చినుకునైనా కాకపోతే అనిపించే ఉంటుంది. టీవీ చూస్తూ ఆ పాటలో లీనమైపోయిన మీకు ఒక్కసారి మీ అదృష్టంపట్ల మీకే ఆసూయ కలిగి తీరుతుంది... ఆగండాగండి ఇదేమీ ఊహ కాదు.. కథ కాదు... కళ్ల ముందు వనిత టీవిలో కనిపించిన దృశ్యం.
సినీ అభిమానుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక థియేటర్లలో పన్నుల విధానంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని పాత సినిమాలను థియేటర్లలో చూడాలనుకునే వారికి శాపంగా మారింది. గతంలో సినిమా హాళ్లలో ఉదయం పూట పాత సినిమాలు ప్రదర్శించే వారు. వాటిని చూసే వారి సంఖ్య తక్కువేమీ కాదు.
కొత్త సినిమాలు మొదటి వారం మాత్రమే నాలుగు షోలు ప్రదర్శించే వారు తరువాత ఉదయం పూట పాత సినిమాలే. కత్తి వీరుడు కాంతారావు, ఎన్టీఆర్ గండికోట రహస్యం ఒకటేమిటి అద్భుతమైన సినిమాలను చూసే అవకాశం ఉండేది. నటుడు ముఖ్యమంత్రి అయ్యాక మనకా అదృష్టం లేకుండా పోయింది.
ఆ తరువాత టీవీలు వచ్చాక పాత సినిమాలు సినిమా హాల్‌లో చూడడం అనేది కలగానే మిగిలిపోయింది.
ఇప్పుడు పలు చానల్స్ ఏదో ఒక సమయంలో పాత సినిమాలను, పాత సినిమాల్లోని పాటలను, దృశ్యాలను చూపిస్తున్నాయి. కలర్స్ చానల్‌లో సీరియల్ కోసం రిమోట్ లాగేసుకునే ఇల్లాలు, కార్టూన్ చానల్ కోసం ప్రపంచ యుద్ధం కోసమన్నట్టు సైరన్ మ్రోగించే పిల్లలు అంత ఈజీగా పాత సినిమాలను చానల్స్‌లో చూడనివ్వరు కానీ. అలా చూసే చాన్స్ ఉంటే మీరొక్కరు మాత్రమే మీ గదిలో ప్రశాంతంగా చూడగలిగే అవకాశం ఉంటే మీరు అదృష్టవంతులే. ఏదో ఒక తెలుగు చానల్స్‌లో ఏదో ఒక సమయంలో పాత ఆణిముత్యాలను దర్శించవచ్చు.
ఇప్పుడు పలు చానల్స్ ఏదో ఒక సమయంలో పాత సినిమాలను, పాత సినిమాల్లోని పాటలను, దృశ్యాలను చూపిస్తున్నాయి. కలర్స్ చానల్‌లో సీరియల్ కోసం రిమోట్ లాగేసుకునే ఇల్లాలు, కార్టూన్ చానల్ కోసం ప్రపంచ యుద్ధం కోసమన్నట్టు సైరన్ మ్రోగించే పిల్లలు అంత ఈజీగా పాత సినిమాలను చానల్స్‌లో చూడనివ్వరు కానీ. అలా చూసే చాన్స్ ఉంటే మీరొక్కరు మాత్రమే మీ గదిలో ప్రశాంతంగా చూడగలిగే అవకాశం ఉంటే మీరు అదృష్టవంతులే. ఏదో ఒక తెలుగు చానల్స్‌లో ఏదో ఒక సమయంలో పాత ఆణిముత్యాలను దర్శించవచ్చు.
ఒక సినిమా సీడీ కొనుక్కొని చూడడం వేరు. టీవీలో సినిమా చూడడం వేరు. సినిమా హాలులో చూడగలిగితే ఇంకా అదృష్టమే కానీ పన్ను విధానం, మారిన పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా వనిత చానల్‌లో పాత సినిమాలకు కొదవ లేదు. ఎంత మంది చూస్తారు, వీవర్ షిప్ ఎలా ఉంది, టిఆర్‌పి రేటింగ్ ఏమిటి? అనే ప్రశ్నలను పక్కన పెడితే వనితా టీవీలో పాత సినిమాలకు కొదవ లేదు.
ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలకు వనిత చానల్‌లో ఆమని పేరుతో అరగంట పాటు మధురమైన పాత పాటలను వ్యాఖ్యానంతో చూపిస్తున్నారు. వ్యాఖ్యానం చక్కగా ఉండి పాటలూ బాగుంటున్నాయి. అదే విధంగా సోమవారం నుండి గురువారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు గోల్డెన్ క్లాసిక్ పేరుతో పాత పాటలను వినిపించడమే కాకుండా ఆ పాట గురించి పాత విషయాలు చెబుతున్నారు. అంతేనా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పాత సినిమాలోని కొంత భాగాన్ని సీరియల్‌గా చూపుతున్నారు. వనిత, సప్తగిరి( దూరదర్శన్) పాత సినిమాలను డైలీ సీరియల్ మాదిరిగా ప్రదర్శిస్తున్నాయి.
శనివారం ఉదయం 8.30కి సప్తగిరిలో ఆణిముత్యాలు పేరుతో పాత సినిమా చరణదాసి సీరియల్‌గా ప్రసారమయింది. ఆ తరువాత న్యూస్ చానల్ టీవి 5 చూస్తే పాటల పల్లకిపై పేరుతో మధురమైన పాత పాటలను చూపించారు. కల్లాకపటం తెలియని వాడా!... ఏరువాకా సాగారోరన్నో చిన్నన్న అంటూ వహీదా రెహమాన్ నృత్యం చేస్తుంటే గిలిగింతలు పెట్టకుండా ఉంటుందా? కొసరాజు, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టులైన సినీగేయ రచయితల గురించి చెబుతూ వారు రాసిన పాటలు ప్రసారం చేశారు. న్యూస్ చానల్స్‌లో సైతం అపురూపమైన సినిమాలు కనిపించడంతో టైమ్ మిషన్‌లో ఒక్కసారిగా ఆనాటి స్వర్ణయుగానికి వెళ్లినట్టు అనుభూతి కలిగింది. రమణారెడ్డి అయ్యయ్యో చేతిలో డబ్బులో పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే అని పాడుతుండగానే పక్కన రేలంగి పేకాడుతూనే కనిపించారు. ఆనాటి ఈ పాట నేటికీ ముచ్చటగానే అనిపించింది కానీ కొద్ది మందినైనా మార్చే ఉంటుంది. ఆ తరువాత శ్రీశ్రీ తెలుగువీర లేవరా పాట వినిపించారు. ఈపాట ఒక తరానే్న తట్టిలేపింది. ఇద్దరు తెలుగువారిని కూర్చోబెట్టి చర్చల పేరుతో తన్నుకునేట్టు చేయడంలో మాత్రమే సామర్ధ్యం ఉన్న
న్యూస్ చానల్స్ అపురూపమైన పాత పాటలపై దృష్టిసారించడం చూస్తే ఇది నిజమా? కలా అని అనిపించకుండా ఉంటుందా?
మహాటీవి సైతం పాత సినిమాల పాటలకు చోటు కల్పిస్తోంది. ఇక ఈటీవిలో సైతం రాత్రి పొద్దు పోయిన తరువాత పాత సినిమా చూపుతున్నారు. ఆ సమయంలో పాత సినిమాల అభిమానులకు ఆ సినిమా చూడడం కష్టమే.
ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలకు వనిత చానల్‌లో ఆమని పేరుతో అరగంట పాటు మధురమైన పాత పాటలను వ్యాఖ్యానంతో చూపిస్తున్నారు. వ్యాఖ్యానం చక్కగా ఉండి పాటలూ బాగుంటున్నాయి. అదే విధంగా సోమవారం నుండి గురువారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు గోల్డెన్ క్లాసిక్ పేరుతో పాత పాటలను వినిపించడమే కాకుండా ఆ పాట గురించి పాత విషయాలు చెబుతున్నారు. అంతేనా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పాత సినిమాలోని కొంత భాగాన్ని సీరియల్‌గా చూపుతున్నారు. వనిత, సప్తగిరి( దూరదర్శన్) పాత సినిమాలను డైలీ సీరియల్ మాదిరిగా ప్రదర్శిస్తున్నాయి.
శనివారం ఉదయం 8.30కి సప్తగిరిలో ఆణిముత్యాలు పేరుతో పాత సినిమా చరణదాసి సీరియల్‌గా ప్రసారమయింది. ఆ తరువాత న్యూస్ చానల్ టీవి 5 చూస్తే పాటల పల్లకిపై పేరుతో మధురమైన పాత పాటలను చూపించారు. కల్లాకపటం తెలియని వాడా!... ఏరువాకా సాగారోరన్నో చిన్నన్న అంటూ వహీదా రెహమాన్ నృత్యం చేస్తుంటే గిలిగింతలు పెట్టకుండా ఉంటుందా? కొసరాజు, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టులైన సినీగేయ రచయితల గురించి చెబుతూ వారు రాసిన పాటలు ప్రసారం చేశారు. న్యూస్ చానల్స్‌లో సైతం అపురూపమైన సినిమాలు కనిపించడంతో టైమ్ మిషన్‌లో ఒక్కసారిగా ఆనాటి స్వర్ణయుగానికి వెళ్లినట్టు అనుభూతి కలిగింది. రమణారెడ్డి అయ్యయ్యో చేతిలో డబ్బులో పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే అని పాడుతుండగానే పక్కన రేలంగి పేకాడుతూనే కనిపించారు. ఆనాటి ఈ పాట నేటికీ ముచ్చటగానే అనిపించింది కానీ కొద్ది మందినైనా మార్చే ఉంటుంది. ఆ తరువాత శ్రీశ్రీ తెలుగువీర లేవరా పాట వినిపించారు. ఈపాట ఒక తరానే్న తట్టిలేపింది. ఇద్దరు తెలుగువారిని కూర్చోబెట్టి చర్చల పేరుతో తన్నుకునేట్టు చేయడంలో మాత్రమే సామర్ధ్యం ఉన్న
న్యూస్ చానల్స్ అపురూపమైన పాత పాటలపై దృష్టిసారించడం చూస్తే ఇది నిజమా? కలా అని అనిపించకుండా ఉంటుందా?
మహాటీవి సైతం పాత సినిమాల పాటలకు చోటు కల్పిస్తోంది. ఇక ఈటీవిలో సైతం రాత్రి పొద్దు పోయిన తరువాత పాత సినిమా చూపుతున్నారు. ఆ సమయంలో పాత సినిమాల అభిమానులకు ఆ సినిమా చూడడం కష్టమే.
చానల్ వారికి ప్రైమ్ టైమ్‌లో పాత సినిమాలు చూపడం చానల్ వారికి కష్టం. పాత సినిమానో, పాత సినిమాలోని పాటలో విందామనుకునే వారికి తెలుగు చానల్స్‌లో ఏ సమయంలోనైనా ఏదో ఒక చానల్‌లో అదృష్టం వరిస్తుంది. అయితే వీటిని వీక్షించాలంటే ఇంట్లో అందరితో పాటు చూసే చాన్స్ తక్కువే. కాలం మారింది అభ్యంతరకరమైన దృశ్యాలున్న సినిమాలను, వర్షంలో హీరోయిన్ పూర్తిగా తడిచిపోయి అందాలను ఆరవేసే దృశ్యాలను, డబుల్ మీనింగ్ డైలాగులను కుటుంబంతో కలిసి చూడలేకపోవడం నిన్నటి మాట, ఇప్పుడు పాత సినిమాలను ఇంట్లో అందరితో కలిసి చూడలేకపోవడం నేటి సమస్య. మీరు పాత సినిమా చూస్తానంటే ఇంట్లో వారికి చాదస్తంగా వయసు మీరిన వారిగా కనిపించవచ్చు, లేదా మీ అధికారం చెల్లుబాటు కాకపోవచ్చు. అందుకే ఒక్కరే చూడగలిగే చాన్స్ అవకాశం ఉంటే మాత్రం అదృష్టవంతులే. అలాంటి అదృష్టం మీకుంటే మీ అదృష్టం మీద మీకే జెలసీ కలిగేంత అద్భుతమైన పాటలు వినొచ్చు.
ఏడుపుగొట్టు సీరియల్స్, మనుషుల మధ్య వైరాన్ని పెంచే వార్తా చానల్స్‌లను చూశాక టీవి అంటేనే వెగటు పుట్టేవారికి సైతం కొన్ని చానల్స్‌లో వేసవిలో పన్నీటి జల్లు కురిసినట్టుగా ఉంటోంది. అయితే వీటికి అద్భుతమైన వీవర్ షిప్ ఉంటుందనే అత్యాశ పెట్టుకోవద్దు.
ఏడుపుగొట్టు సీరియల్స్, మనుషుల మధ్య వైరాన్ని పెంచే వార్తా చానల్స్‌లను చూశాక టీవి అంటేనే వెగటు పుట్టేవారికి సైతం కొన్ని చానల్స్‌లో వేసవిలో పన్నీటి జల్లు కురిసినట్టుగా ఉంటోంది. అయితే వీటికి అద్భుతమైన వీవర్ షిప్ ఉంటుందనే అత్యాశ పెట్టుకోవద్దు.
ee vishayamlo nenu adrushtavanturaalini. endukante naaku ishtangaa nenu vundadam kosam job vadilesukunnanu. ishtamaina vaatilo meeru cheppina paata sinimaalu, paatalu chaala enjoy chestunnanu. T.V.lo paata vedio lu kooda veste baguntundi kadaa. naa manasu vundi raasinanduku dhanyavaadalu.
రిప్లయితొలగించండిబాగుందండీ.
రిప్లయితొలగించండిముఖ్యంగా శైలి.మీరే పోస్ట్ వేసినా
ఆసాంతం చదివించేదిగా ఉంటుంది.నైస్
మీ బ్లాగ్ పేరుకు వాడిన కలర్ మార్చగలరు
సరిగా కనిపించటం లేదు
ఈ ప్రోగ్రాంస్ బాగుంటున్నాయండి. అప్పుడప్పుడు ఇంట్లో అందరం కూర్చొని హాయిగా చూస్తున్నాము. టపా బాగుంది.
రిప్లయితొలగించండి