6, జులై 2011, బుధవారం

‘ధర్మకిరణ్’... ముఖ్యమంత్రి అంటే అతనేరా! రాష్ట్రం అంటే మనదేరా!

ఏడుపొచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో అంటాడో హీరో. పెళ్లయినప్పుడు ఎవరైనా కంటారు పెళ్లికాకున్నా కనడమే హీరోయినిజం అంది ఆ మధ్య మాజీ హీరోయిన్ నీనాగుప్తా. ప్రజాభిమానం ఉన్నోడు ఎలాగైనా గెలుస్తాడు ప్రజాభిమానం లేకున్నా గెలవడమే గొప్ప అని కొందరు ప్రజాప్రతినిధులు అంటే. ప్రజాభిమానం లేకున్నా నియోజక వర్గంలో గెలిచిన మీరే అంత గొప్పవాళ్లయితే ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని నేను 294 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానంటే నా సంగతేమిటి? అని కిరణ్ ప్రశ్నిస్తున్నారు.


 ఆయన ఎప్పుడూ తనకు జనామోదం ఉందని చెప్పలేదు మన అదృష్టం బాగుంటే పదవి వరిస్తుందని చెప్పారు. 150 మంది ఎమ్మెల్యేలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అమ్మగారికి మహజరు సమర్పించారు. కానీ దానిపై సంతకం చేసే అర్హత లేని రోశయ్యను అమ్మగారు ఏరి కోరి ఆ పదవికి ఎంపిక చేశారు.
వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్టు రెడ్డిగారిని రెడ్డిగారితోనే కొట్టాలనుకున్న అమ్మగారు యువరెడ్డి కిరణాన్ని రంగంలో దించారు. ఈసారి జగన్‌కు సిఎమ్ పదవి ఇవ్వాలని సంతకం చేయని ఏకైక నేతను పిలిచి సిఎమ్ పదవి ఇచ్చారు. అప్పుడాయన స్పీకర్. వారు బహిరంగంగా సంతకాలు చేయరు కదా!



 ఏడేళ్ల క్రితం ఓడిపోయిన బాబును, ఏడాదిన్నర క్రితం చనిపోయిన వైఎస్‌ఆర్‌లనే జనం ముఖ్యమంత్రిగా గుర్తుంచుకుంటున్నారు కానీ విజయవంతంగా ద్విశతదినోత్సవం పూర్తి చేసుకున్న కిరణ్‌ను అంతగా పట్టించుకోవడం లేదు.


 మెగాస్టార్లు, ప్రిన్స్‌ల సినిమాలు కూడా ఒకటి రెండు వారాలు నడవడం లేదండి అలాంటప్పుడు కిరణ్ సినిమా రెండువందల రోజులు పూర్తి చేసుకోవడం మామూలు విషయమా! ఎవరి ద్వారా వచ్చామని కాదు ముఖ్యమంత్రిని అయ్యానా? లేదా?- అని ఏజిల్లాలోనూ వినిపించని సొంత యాసలో కిరణ్ ప్రశ్నిస్తున్నారు.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని అంటారు. రాజకీయాల్లో కలిసొస్తే కిరణ్‌లా సిఎమ్ అవుతారు.



 టిడిపి అధికారంలోకి వస్తే ఎవరు సిఎమ్ అవుతారు అని పిచ్చివాన్ని అడిగినా బాబుగోరు అంటారు . కానీ బాబుకు మరీ అంత పెద్ద గోర్లేమీ లేవు. ఆయనేమీ శ్రీరాముడు కాదు , పాదుక పట్టాభిషేకం  మాదిరిగా గోరుకు అధికారం కట్టబెట్టడానికి. ఆయన తన నీడనే కాదు సొంత ‘గోరు’ను కూడా నమ్మరు. అధికారం వస్తే ఆయనే సిఎమ్ అవుతారు, ‘గోరు’ను కానివ్వరన్నమాట !

 కిరణ్‌కుమార్ రెడ్డిప్రతిభను పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ తరిచి చూస్తే ఆయనలో ఒక ధర్మరాజు కనిపిస్తాడు. యుద్ధం చేసింది అర్జునుడు, చేయించింది శ్రీకృష్ణుడు, మరణించింది కౌరవులు , కానీ అధికారం వరిచింది ధర్మరాజును. ఇక్కడ సరిగ్గా అలానే ఎన్నికల్లో వీరోచితంగా పోరాడింది వైఎస్‌ఆర్, ఓడిపోయింది బాబు కానీ అధికారం అనుభవిస్తున్నది కిరణ్.

 ద్రౌపదీ స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించింది అర్జునుడు. ఆమె ఐదుగురు భర్తల్లో మొదటి స్థానం ధర్మరాజుదే. కిరణ్ సొంత నియోజక వర్గంలో పలుకుబడి అంతంత మాత్రమే, అభ్యర్థి ఎంపిక ద్వారా బాబు, ప్రచారం ద్వారా వైఎస్‌ఆర్ ఆయన విజయానికి తమవంతు కృషి చేశారు. మహాభారత యుద్ధంలో ధర్మరాజు ఎప్పుడూ ఆయుధాలు పట్టుకుని పెద్దగా పోరాడింది లేదు.

 మనం మహాభారత యుద్ధం చూడలేదు కదా! చూసింది సినిమాలోని యుద్ధమేనాయె. అందులో కర్ణుడి చేతిలో చిత్తయిన సందర్భంలో మాత్రమే ధర్మరాజు యుద్ధరంగంలో కనిపిస్తారు. కానీ శత్రువులపై ఆయుధాలతో కలియబడినట్టు ఏ సినిమాలోనూ కనిపించలేదు.

 నాలుగు దశాబ్దాల సినిమా ఇమేజ్‌ను నిచ్చెనగా మార్చుకుని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన్ని సొంత ఇంటివారు, మిత్రులు ఎవరూ కుదురుగా కుర్చీలో కూర్చోనివ్వలేదు. ప్రత్యర్థులు సైతం అబ్బురపడేట్టుగా పథకాలు అమలు చేసినా వైఎస్‌ఆర్‌కూ పెద్దగా మెజారిటీ రాక ప్రభుత్వం పరిస్థితి ఏమిటో? అనే దిగులు ఆ పార్టీ వారిలో కనిపించేది.

 కానీ అధికార పక్షం మద్దతు అస్సలు లేకున్నా ప్రతిపక్షం‘ నైతిక’మద్దతుతో అధికారాన్ని చెలాయిస్తున్న కిరణ్ అజాత శత్రువు అంటే కాదనేవారెవరుంటారు? నాటి ప్రకాశం పంతులు మొదలుకుని, ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ వరకు ముఖ్యమంత్రులు జనం అభిమానం సంపాదించారు కానీ ప్రతిపక్షం చేతిలో ముప్పు తిప్పలు పడ్డారు. కానీ కంటికి రెప్పలా కాపాడుకునే ప్రతిపక్షాన్ని కలిగి ఉన్న కిరణ్‌ను మించిన ఆజాత శత్రువు రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయ చరిత్రలో సైతం ఎక్కడా కనిపించరు.

 అవసరం అయితే దొంగతనం చేసైనా, బిక్షమెత్తయినా ప్రాజెక్టులు నిర్మిస్తాం అని అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్ ఇంగ్లీష్ జాతీయాన్ని చెబితే, అదిగో ముఖ్యమంత్రిగా ఉండి చట్టవిరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడు, దొంగతనం చేస్తానన్నాడు చర్య తీసుకోండి, దిగిపోండి అని గోల చేసిన ప్రతిపక్షం ఇప్పుడు కిరణ్‌ను ఇంటెన్సివ్ కేర్‌లోని నవజాత శిశువులా చూసుకుంటోంది. డజను మెజారిటీతో ఉన్న ప్రభుత్వంలో 37మంది ఎమ్మెల్యేలు రోజూ జగన్‌తోనే ఉంటున్నారు. 40కి పైగా తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. పిజెఆర్, మర్రి ఇద్దరు మాత్రమే అసంతృప్తితో ఉన్నప్పుడు అసంతృప్తితో వైఎస్ ప్రభుత్వం కూలిపోతుంది అని బాబు, ఆయన మీడియా చేసిన గగ్గోలు సామాన్యమైనదా?

 అలాంటి బృందం నుండి అసలు లేనే లేని ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడం అంటే కిరణాల ప్రభావం సామాన్యమైనదా? ఔను మేం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అంటూ ఏకంగా కోర్టుకిచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్న ‘రాజగురువు’ మద్దతు సాధించి సూర్యుని వెనక కిరణాల్లా తన వెనక వెలిగిపోయేట్టు ఏర్పాటు చేసుకున్నారంటే కిరణ్‌కు సాటిరాగల 
నాయకులెవరున్నారు? ధర్మకిరణాలకు ఎదురు లేదు !

27 కామెంట్‌లు:

  1. jagan ni thittadame desa seva anukone blog posts..choosi..choosi...chivaraku oka manchi 'reality' post chadivaa....

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత చెప్పారు...
    Non-sense!
    6 జూలై 2011 12:38 సా
    అజ్ఞాత గారు నాన్సెన్స్ అని పేరు చెప్పడానికి మొహమాట మెందుకండి

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత చెప్పారు...
    jagan ni thittadame desa seva anukone blog posts..choosi..choosi...chivaraku oka manchi 'reality' post chadivaa....
    6 జూలై 2011 1:03 సా
    ఈ అభిప్రాయం చెప్పడానికి అజ్ఞాతం ఎందుకండి. సరే నచ్చినందుకు థాంక్స్
    ---------- ఇట్లు అజ్ఞాత

    రిప్లయితొలగించండి
  4. @Sravya Vattikuti
    @ భాస్కర రామి రెడ్డి
    @సాయి
    @శిశిర
    @వేణూ శ్రీకాంత్
    మీ అందరికీ నచ్చినందుకు థాంక్స్ అండీ

    రిప్లయితొలగించండి
  5. Brilliant!
    "టిడిపి అధికారంలోకి వస్తే ఎవరు సిఎమ్ అవుతారు అని పిచ్చివాన్ని అడిగినా బాబుగోరు అంటారు . కానీ బాబుకు మరీ అంత పెద్ద గోర్లేమీ లేవు. ఆయనేమీ శ్రీరాముడు కాదు , పాదుక పట్టాభిషేకం మాదిరిగా గోరుకు అధికారం కట్టబెట్టడానికి. ఆయన తన నీడనే కాదు సొంత ‘గోరు’ను కూడా నమ్మరు. అధికారం వస్తే ఆయనే సిఎమ్ అవుతారు, ‘గోరు’ను కానివ్వరన్నమాట !"......ఇది సూపరో సూపరు :))))))))

    రిప్లయితొలగించండి
  6. కొత్తావకాయ6 జులై, 2011 2:43 PMకి

    ధర్మజునితో కిరణ్ కి పోలిక, జస్టిఫికేషనూ మాత్రం మీకు మాత్రమే తట్టే చమక్కు. అదరగొట్టేసారు!

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగా నచ్చేసింది మురళీగారు ఈ టపా...ప్రతిపక్షాలు కిరణ్ ని నవజాత శిశువులా చూసుకోవడమనే మాట భలే ఉంది.మొత్తం టపా అంతా బాగా నడిపించారు..
    మా హీరో డైలాగ్ మాత్రం మార్చేసారు కదా...నిజానికి సినిమాలో అయితే అది హీరోయిన్ డైలాగ్....పైగా నవ్వొచ్చినప్పుడు ఎవరైనా నవ్వగలరు..ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో!! అదీ అసలు డైలాగ్...సరేలెండి..పోస్టులో దీన్నిబాగా ఉపయోగించుకున్నారు..

    అజ్ఞాతలు పాపం ఒక్కోసారి అజ్ఞాతలుగా ఉండొద్దనుకున్నా తప్పని పరిస్థితి వస్తుందండీ..కామెంట్ అయ్యాక చూడండి...ప్రొఫైల్ ఎంచుకోమంటే..గూగూల్ అకౌంట్ లేదనుకోండి...కిందనున్న ఆప్షన్స్ లో వాళ్ళకి మిగిలినదేమిటి చెప్పండి.....అజ్ఞాత తప్ప... కామెంట్ కిందనే పేరు రాయొచ్చు అన్నది తట్టకపోతే అంతే....అదే అజ్ఞాత కథ.

    రిప్లయితొలగించండి
  8. @ఆ సౌమ్య గారు నచ్చినందుకు థాంక్స్ . ఏమోనండి నాకూ తెలియకుండానే నేను బాబు గురించి బోలెడు ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది .
    @ కొత్త ఆవకాయ గారు ధర్మ రాజు లోని కొన్న అంశాలు మాత్రమే కిరణ్ కు సరిపోతాయి . అందుకే వాటి వరకే పరిమితం అయ్యాను .
    @ సుధాగారు అర్రే ...ఇప్పుడు గుర్తుకు వస్తుందండీ. మా అందరికీ తెలుగు పాటాలు చెబుతూ ఇన్ని రోజులు మీ పేరు ఇంగ్లిష్ లో రాశారు . మీ పేరు తెలుగులోకి మార్చుకునేంత వరకు మేం గుర్తించ లేక పోయాం. నేను సినిమాలు చూడడం తక్కువ ఆ డైలాగు నాకూ ఆ విధంగా గుర్తుండి పోయింది .

    రిప్లయితొలగించండి
  9. perfect .. why dont you submit this to News papers?
    I think Sakshi Media should focus on Blog world to pick up so many important campaign elements.,

    రిప్లయితొలగించండి
  10. ఏమోనండి నాకూ తెలియకుండానే నేను బాబు గురించి బోలెడు ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది .....హహహ...నాకెందుకో హిరణ్యకశిపుడు, శ్రీహరి గుర్తొస్తున్నారు...వైస్ వర్సాగా అయినా సరే...

    రిప్లయితొలగించండి
  11. బాబుగోరు కేక.
    అందుఖే ఆయన రోజూ తన గోళ్ళని కత్తిరించి పారేస్తుంటారు! :)

    రిప్లయితొలగించండి
  12. బాగుందండీ.. అన్నట్టు ఆ రెండు పత్రికలూ రోశయ్యగారిని కూడా కంటికి రెప్పలా 'చూచు'కున్నాయ్...
    ధర్మరాజు తమ్ముల్లనీ, భార్యనీ పణంగా పెట్టి జూదం ఆడాడు.. ఈ ధర్మరాజు ఏం చేయనున్నాడో..
    చివరగా ఇంకో సందేహం.. ఎటూ భారతం ప్రసక్తి వచ్చింది కాబట్టి దృతరాష్ట్రుడు ఎవరంటారు?

    రిప్లయితొలగించండి
  13. @మురళి గారు మీ ప్రశ్నకు సోనియా అని సమాధానం రాస్తేనే ఎక్కువ మార్కులు వస్తాయని నాకూ అనిపిస్తోందండి. అదేం చిత్రమో ఆ రెండు పత్రికలు ఎవరిపై కరుణ చూపితే వారు మునిగిపోతున్నారు.
    @సుధా గారు హిరణ్య కశపుడు తన రాక్షస ధర్మాన్ని నిర్వర్తించాడు కానీ వెన్నుపోటు ఎక్కడ పోడిచాడండి. మీలో మరీ ఇంత రాక్షస వ్యతిరేకత కాదండి ( సమాధానం కరెక్టే కదండీ )
    @కొత్తపాళి గారు థాంక్స్

    రిప్లయితొలగించండి
  14. బాగుంది, సో అయితే మీరు "ఏ పార్టీ పదవిలోకి వచ్చిందని కాదన్నయ్యా, ఏ సీ. ఎం. వ్యక్తిగతంగా మంచి చేసాడనేదే ముఖ్యం" అంటారు. అంతేనా?

    రిప్లయితొలగించండి
  15. సునీత గారు ఈ కాలంలో ముఖ్య మంత్రులపై మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోలెం . సియం మంచి చేసుకొంటూ , ప్రజలకు కొంత మంచి చేస్తే అదే సంతోషం

    రిప్లయితొలగించండి
  16. -------దృతరాష్ట్రుడు ఎవరంటారు?

    --------------------

    తొందరగా ఈ కొచ్చన్ కు సమాదానం కావలని
    కొరుకుంటున్నామద్యచ్చా!
    బొత్స బావ్ అని మాత్రం అనకండే.

    రిప్లయితొలగించండి
  17. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్షా ఎందుకంటే సమాదానం ముందే చెప్పం . అవకాశం వస్తే కుర్చీపైకి గెంతాలని చూస్తున్నబొత్స దృతరాష్ట్రుడు ఎలా అవుతాడు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం