26, జులై 2011, మంగళవారం

జగన్ ఒడిలో నుండి జారిపోతున్న చానల్స్ ........ ఈ వారం తెలుగు ఛానల్స్ ఆపద్బాంధువు మందకృష్ణ

విధేయతను బదిలీ చేస్తున్న చానల్స్


రాజుల కాలంలో శత్రురాజ్యంపై విజయం సాధించాలంటే వారి కాల్బలం, ఏనుగులు, గుర్రాల బలం ఎంతో ముందు తెలుసుకునే వారు. అంతకు మించిన బలాన్ని సమకూర్చుకున్నాకే యుద్ధం చేసేవారు. రోజులు మారాయి. రాజరికం నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. ఆయుధాలు కూడా మారాయి. అప్పుడు ఏనుగులు, గుర్రాలు ఆయుధాలు అయితే ఇప్పుడు మీడియానే ప్రధాన ఆయుధం. మీడియా బలం సమకూర్చుకోకుండా యుద్ధ రంగంలోకి అడుగుపెడితే ఎంత గొప్ప హీరో అయినా మట్టికరిచిపోతారని జనమే కాదు ఆ యోధుడు సైతం గ్రహించాడు. అందరి వాడిని.. అన్ని ఛానల్స్ నావే అనుకున్న చిరంజీవి చివరకు ప్రత్యర్థుల చానల్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. అనుభవం అయిన తరువాత ఆయనకు తత్వం బోధపడింది. ఇప్పుడు సొంత చానల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏదో ఒక రోజు అవకాశం రాకుండా పోదు. అప్పటి వరకు బలమైన ఆయుధాన్ని సమకూర్చుకోవాలనేది ఆయన లక్ష్యం. ఆయనో న్యూస్ ఛానల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
చిరంజీవి అనుభవమే కాకుండా తన తండ్రి అనుభవాన్ని సైతం దగ్గరి నుండి చూసిన జగన్ ముందు నుండి మీడియా బలాన్ని బాగానే అంచనా వేశారు. మీడియా విషయంలో తన ప్రత్యర్థి చంద్రబాబు కన్నా ఒక అడుగు ముందుకేశారు. సొంత మీడియానే కాకుండా అనుబంధ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. తాతకు దగ్గులు నేర్పుతావా? అనుకున్న ప్రత్యర్థి సైతం ఈ ఎత్తుకు పైఎత్తు వేశారు. దీంతో జగన్ ఒడిలో నుండి ఒక్కో మీడియా జారిపోతోంది. జగన్‌కు సొంత ఛానల్ ఎలాగూ చేతిలో ఉంది . ఒప్పందాలు ఏమిటో బయటకు తెలియదు కానీ సొంత ఛానల్‌తో పాటు కొన్ని చానల్స్ జగన్‌కు మద్దతుగా ఉండేవి. వీటిలో ఒక్కొక్కటి జారుకుంటోంది.
మొన్నటి వరకు ఒక నాయకుడిని తీవ్రంగా విమర్శించే ఛానల్ హఠాత్తుగా ప్లేటు మార్చి ఆ నాయకుడిని తీవ్రంగా విమర్శిస్తుంటే తెరపై చూసినప్పుడు నిష్పక్షితత్వానికి మారు పేరు అనిపిస్తుంది. లోతుగా విషయ పరిశీలన చేస్తే అసలు విషయం నిష్పక్షపాతం కాదు విధేయతగా మారింది అని తెలుస్తుంది.
2009 ఎన్నికల సమయంలో ఒక ఛానల్ మొదటి విడత పోలింగ్ మొత్తం టిడిపిని విమర్శిస్తూ, వైఎస్‌కు అండగా నిలిచింది. బాబు, ఆ ఛానల్ యజమాని ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి. అక్కడ ఇద్దరూ తారసపడ్డారు. ఏంటయ్యా మనవాడివై ఉండి మనకు వ్యతిరేకంగా మీ ఛానల్ ఉందేమిటి? అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేస్తాం ఎటు నుండి సహాయం వస్తే అటుండాలి, మీ నుండి ఆశించిన సహాయం రాలేదు అన్నారు. ఏం సహాయం అందిందో కానీ మొదటి విడత పోలింగ్‌లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ఆ ఛానల్ రెండవ విడత పోలింగ్‌లో బాబును భుజానికెత్తుకుంది. ఫలితాలు వచ్చాక మళ్లీ జగన్ పక్షం వహించింది. ఇప్పుడు ఛానల్ తన విశ్వసనీయతకు పచ్చదనం పులుముకుంది.
మరో ఛానల్ నిర్మొహమాటంగా జగన్‌కు రాంరాం చెప్పి కిరణ్‌లోని పాలనా పటిమను ప్రపంచానికి చాటడంలో మునిగిపోయింది.
గతంలో టీవి9 పట్ల చంద్రబాబు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. మీ ఛానల్ వైఎస్‌ఆర్ కొమ్ము కాస్తోంది మీ సంగతి చూస్తాం, మిమ్ములను మేం బహిష్కరిస్తాం అని బాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ ఛానల్‌ను జగన్ కొనేశాడు అని టిడిపి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అందులో నిజం ఎంతో, తరువాత ఏం జరిగిందో కానీ ఇప్పుడా ఛానల్ పేరు వింటేనే జగన్ వర్గం మండిపడుతోంది. జగన్‌పై విషం కక్కడంలో ఆ ఛానల్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఐతే ఇదే శాశ్వతం అని భావించాల్సిన అవసరం లేదు అవసరాన్ని, పరిస్తితులను బట్టి విధేయత మళ్లీ మరో వైపు మారవచ్చు.  ఇక తెలంగాణ వారు టివి ౯ ఛానల్‌కు తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేశారు.

ఛానల్స్ ఆపద్బాంధవుడు
గతంలో ఒకే ఛానల్ ఉన్నప్పుడు వారు ఆడిందే ఆట వారు చెప్పిందే వార్త. ఇప్పుడు పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఛానల్స్ ఉండడం వల్ల అందరి వాదనలు తెలుసుకునే అవకాశం ప్రజలకు లభిస్తోంది. ఈ వారం టీవీ ఛానల్స్ పాలిట ఆపద్బాంధవుడిగా మందకృష్ణ మాదిగ మారారు. యాదిరెడ్డి ఆత్మహత్య అంశంపై ఢిల్లీలో దళిత అధికారిపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేయి చేసుకున్నారు. తరువాత క్షమాపణ చెప్పారు. అప్పటి వరకు జగన్ సభ ముగిసిన తరువాత మైదానంలో కనిపించే కొద్దిమందిని చూపించి జనం లేరు అని చెప్పడం, మద్యం షాపుల వద్ద కార్యకర్తలను చూపించడం. ప్రతి మీటింగ్‌కూ రెడీమేడ్‌గా ఇవే దృశ్యాలు చూపుతూ అదే అద్భుతంగా భావిస్తూ మురిసిపోయిన యువ బాబు ఛానల్ స్టూడియో ఎన్ ఢిల్లీ సంఘటనపై ఒక్కసారిగా మేల్కొంది. దళితునిపై దొరల దౌర్జన్యం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాబు ఆదేశాలపై టిడిపి దళిత నేతలతో పాటు దళిత సంఘాలతో మాట్లాడించారు. పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా మహేశ్వర్‌రావువంటి కొందరు నేతలు ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారం చేడులో దళితులను ముక్కలుగా నరికి గోనె సంచుల్లో మూటకట్టి ఊరవతల పారేసిన ‘మహానుభావుల వర్గం’ ఒక్కసారిగా దళిత ప్రేమను కుమ్మరించింది. వారిలో ఇంతటి మార్పు వస్తే ఆహ్వానించదగిందే. ఈ సంఘటనతో పలు  పాలిట మందకృష్ణ మాదిగనిగా కనిపించారు. అప్పటి వరకు తెలంగాణ అంశంపై దాడి చేయడానికి అవకాశం లేదని ఆవేదన చెందిన ఛానల్స్ అన్నీ మందకృష్ణ మాదిగతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇక టిఆర్‌ఎస్‌కు చెందిన టీ ఛానల్ దీనిపై ఎదురుదాడి జరిపింది. టిఆర్‌ఎస్ దళిత నాయకులతో మాట్లాడించింది. పలు ఛానల్స్‌లో మందకృష్ణ మాట్లాడారు. ఈ అంశంపై ఐ న్యూస్‌లో కు ఆయన గురువు దళిత నాయకుడు ఉ సాంబశివరావుకు వాగ్వివాదం జరిగింది. టీ న్యూస్‌లో ఉ సాంబశివరావు మాట్లాడుతూ దాడిని ఖండించాల్సిందే,దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎంత వరకైనా పోరాడాలి. కానీ కొందరు వ్యక్తులు ఈ అంశాన్ని సాకుగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటికి మనం మద్దతుగా నిలిస్తే మన అసలు లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు.
గతంలో ఎబిఎన్ ఛానల్‌పై దాడికి దిగిన మందకృష్ణ తెలంగాణకు చెందిన నాయకుడు ఆయన చానల్స్‌కు ఆత్మబంధువుగా కనిపిస్తే, సీమాంధ్రకు చెందిన దళిత నాయకుడు ఉ సాంబశివరావు తెలంగాణ చానల్ టీ ఛానల్‌కు ఆత్మబంధువుగా కనిపించారు. రాజకీయాల్లోనే కాదు ఛానల్స్‌కు సైతం ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. నాయకత్వం స్థాయిలో ఉన్నవారు ఎలాంటి సందర్భంలోనైనా సంయమనం కోల్పోతే తన శత్రువు అవకాశం కల్పించిన వారవుతారని హరీష్ ఉదంతం నాయకులకు ఒక పాఠంగా నిలవాలి.

7 కామెంట్‌లు:

  1. జగన్ నుంచి చానల్స్ జారి పోయినంత మాత్రానా ఎమీ పెద్ద నష్టం ఉండక పోవచ్చు. ఇప్పటికే పచ్చ వర్గం గురించి అందరికి బాగా అర్థమయ్యేట్టు సాక్షి పేపర్ ద్వారా చేప్పాడు. ఒకప్పుడు ఆంధ్ర భూమి వారు రాజగురువు మీద ఎప్పుడో సంవత్సరానికి ఒక నిజం చేపుతూండేది. అది ప్రజల మేదడులోకి ఎక్కేది కాదు. సాక్క్షి అన్ని సాక్ష్యాలతో వీరి సంగతి బయట పెట్టింది. ఈ రోజు ఎడిటొరియల్ ఒకసారి చదవండి. మీకే తెలుస్తుంది రాజగురువు వలన గోదావరి లో గాస్ బావుల విషయం లో తెలుగు వారికి ఎంత నష్ట్టం జరిగిందో. ముందు బాబు వెనక రాజగురువు, ప్రజల తరపున పచ్చ వర్గానికే చెందిన ఎర్ర పార్టిల వారు, అవసరమైనపుడు కలవటం లేక పోతే న్యుట్రల్ గా ఉన్నట్టు నటించటం. ఇలాంటి సినేమా వేషాలు కథా,మాటలు స్రీన్ ప్లే,నిర్మాత,దర్శకత్వం, సినేమ డిస్త్రిబ్యుటర్లు, సినేమా హాళ్ళు రాజకీయాలలో కూడా వేసి పది చేతులతో బాగా కలసి సంపాదించి, పంచుకొన్నారు. అప్పుడప్పుడు ఎర్ర పార్టివారు బీదాబిక్కినేసుకొని అధికార పచ్చ పార్టి మీద పోరాటాలు చేయటం, రాజగురువు వాటిని తన అవసరానికనుగుణంగా కవరేజ్ ఇవ్వటం. పేదవారు ఎదో ఎర్ర పార్టి తమకు వొరగ పేడుతుమ్నాదని వారికి వోటు బాంక్ గా మారితే చివరికి ఎర్ర పార్టి వారు అధికార పచ్చపార్టి తో పొత్తులు పేట్టుకొని బీదవారి చేత మళ్ళి తమ పచ్చ వర్గం వారికి వోట్లు గుద్దించటం ఒక వ్యూహం. ఇక మధ్య తరగతి ప్రజలు నిద్దర లేచిన మొదలు కొని వీరి పేపర్ చదివి, వీరు మద్దతిచ్చే పార్టిలకే వోటు వేసి తమనెత్తిన తామే చేయి పెట్టుకొన్నారు. మహానేత మొడిపట్టుదల,ధైర్యం వలన వీరి గూడచర్యం బయట పడింది.వీరేంత తెలివిగలవారంటె ఎక్కడ తాము చేసే ఈ పనులు ఒక రోజు బయట పడితే జనం చేత తిట్టించుకొనవలసి వస్తుందో అని ముందుగాnE ఊహించి కుల పిచ్చిని వారివర్గం వారికి బాగా ఎక్కించారు. ఈ కులాభిమానం వలన కనీసం తమను కొంతమందైన సమర్ధిస్తారని, తాము చేసిన వెధవ పనులు వ్యాపార అభివృద్ది లో భాగం గా చూసి వారి వర్గ ప్రజలు క్షమిస్తారని ఒక గొప్ప వ్యూహంతో ఆంధ్రాప్రాంతం లో ఈ పిచ్చిని స్కులు లో 8వ తరగతి నుంచే వర్గ స్ప్రుహను పెంచి,పోషించటం మొదలు పెట్టారు.
    మత మౌడ్యం..కుల మౌడ్యం..దురభిమానం..కళ్ళకు..కమ్మిన మైకం.
    http://vanajavanamali.blogspot.com/2011/06/blog-post_09.html

    కాని యువనేత అతి చిన్న వయసులోనే సింగిల్ హాండ్ తో అన్ని రోల్స్ ని తానే సమర్ధవంతం గా పోషిస్తూంటే వారికి మతిమందగిస్తున్నాది. ఒకటి మటుకు నిజం యువనేత నిజంగా సమర్ధవంతమైన, ధైర్యసాహసాలుగల నేత.

    ఇప్పుడు తెలుగు ప్రజలు తేల్చుకోవలసిన విషయమేమిటంటే అవినీతి ఆరోపణలు గల భారతీయుడైన ఆంధ్రా యువనేత వైపు మొగ్గు చూపటమా లేక సమయాను కూలంగా రాజగురువు ఆధ్వర్యంలో పచ్చ+ ఎర్ర పార్టిలతో కలసి, 2జి, సి డబ్ల్యు జి కుంభకోణాలు కోrటు కేసులు ఎదుర్కొంట్టున్న కాంగ్రేస్ పార్టి టిం కి వోటు వేయటమా?

    http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=23870&Categoryid=1&subcatid=1

    SriRam

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత గారు మీతో నేను ఏకిభవించడం లేదు పార్టీల గురించి చర్చ జరిగేప్పుడు నేను ఒక మాట చెబుతాను చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ లో ఎవరు దేశభక్తులు, ఎవరు ఎక్కువ నిజాయితీ పరులు, ఎవరు ఎక్కువ ప్రజల కోసం తపిస్తారు అని అడుగుతాను. వాళ్ళది వ్యాపారం సిద్ధాంతం , దేశసేవ , విలువలు అవేంటి అని అని ఆశ్చర్య పోతారు . నా ఉద్దేశ్యం కూడా అదే అంటే అది బాబు పార్టీ ఐనా జగన్ పార్టీ , కాంగ్రెస్ తదితర పార్టీ లు ఏవైనా చందన , బొమ్మన లాంటివే . వారు చేసేది వ్యాపారం, కోరుకునేది లాభం . కడప పలితలకు ముందే నేను మీడియా బలహీనత గురించి, జగన్ భారి మెజారిటీ గురించి రాశాను. అంత మాత్రాన నేను జగన్ మహా నాయకుడు, దేశ భక్తుడు అని భావిస్తున్నట్టు కాదు . అతనిది వ్యాపారమే. ఒకప్పుడు బజాజ్ స్కూటర్ కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించే వారు హీరో హోండా వచ్చాక బజాజ్ ను ఏకంగా మూసేశారు. ఇప్పుడు అంతే జగన్ వ్యాపారం ముందు కాంగ్రెస్ వ్యాపారాలు నిలువ లేక పోవచ్చు అంతే తప్ప జగన్ తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడని కాదు. రాష్ట్రం లో పరిస్తితులు, కుల సమీకరణలు జగన్ కు తోడ్పడ వచ్చు. బాబు తొమ్మిదేళ్ళు పాలించడం వల్ల సహజంగా అతనికి సానుకూలత కన్నా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప రాజకీయ వ్యాపారం లో ఉన్న ఎవరు త్యాగ జీవులు కాదు.
    ఇక మీరు పంపిన వనజవనమాలి గారి పోస్ట్ ను మీరు ఓక కోణం లో అర్థం చేసుకున్నారు. అది నిజమే, నేను ఆమెలోని నిష్పాక్షికత కోణం లో చదివాను. అంటే వారిలో ఇలా ఆలోచించే వారు కూడా ఉన్నారనే కదా ? జగన్ అధికార అండ లేకుండానే అంత డబ్బు సంపాదించాడని మీరు నమ్ముతున్నారా?

    రిప్లయితొలగించండి
  3. వనజవనమాలి గారి పోస్ట్ ను నిష్పాక్షికత కోణంలో చదివాను. ఇక్కడ ఆ లింక్ ఇవ్వటానికి కారణం ప్రస్తుత పరిస్థితి తెలియజేయడానికే. జగన్ గ్లొబలైసేషన్ తరువాత తరానికి చెందిన నూతన రాజకీయ నాయకుడు. ఆంధ్రా రాజకీయాలలో అతనోక కొత్త మోడల్. అతను నిజాయితి పరుడని అనలేదు, అనను. కాని మిగతా పార్టిల వారు మొన్నటి వరకు సోషలిజం భావాలను ప్రచారం చేస్తూ,పైకి మంచి మాటలు చెపుతు, ఆచరణలో వేరే విధం గా ప్రవర్తించే నాయకులు. అందరిది వ్యాపారమే అని మీరంట్టున్నారు, కాదనను కాని పచ్చ వారి వ్యాపార నమునాకు ములాలు, తాత్వికత మొద|| ఉన్నాయి. లోడుకుంటూ పొతే హేతువాద ఉద్యమం దగ్గర వరకు వెళుతుంది. తాత్వికత+వ్యాపారం+అవినీతితో కూడిన రాజకీయాలు అన్ని కలిపి చేసినవారి వల్ల జరిగే నష్ట్టం, జగన్ లాంటి వారి అవినితీ పరుల కన్న ఎక్కువ జరుగుతుంది. మీరు బాబు గారిని ఒట్టి రాజకీయనాయకుడుగా చూస్తున్నారు. కాని ఆయన పార్టీ కి ఎర్రపార్టినుంచి ఎంతమంది వలస వచ్చారు? ఏ కారణాల వలన వారు అతనికి మద్దతు ఇస్తారు ?చాలా మార్లు ఎర్రపార్టిలు పచ్చ పార్టికి తోక పార్టిల మాదిరిగా ఎందుకు ఉంటాయి?అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు.

    SrI Ram

    రిప్లయితొలగించండి
  4. @MURALI

    Sir..had it been becaz of misusing Power...Jagan could have earned many more investments from many more companies...he got investments only from hardly 30 companies...but in 5 YSR's of YSR regime....some hundrads of companies got benifits and tax holidays and contracts....but why only some 30 companies have invested in JAGAN's business????

    I think JAAGN is legally Perfect...so How can we say him as Corrupt???He is not even an MLA or MP at that time...he did not enter into SECRATARIATE atleast a single time....

    Allegations are different from Evidences and Proofs...until it is proved we shuld not call him as corrupt....

    రిప్లయితొలగించండి
  5. vsr garu
    బాబు చెప్పినట్టు జగన్ లక్ష కోట్లు సంపాదించాడు అనడానికి అధరాలు లేవు . అలానే జగన్ అంత సొమ్ము నిజాయితితో, చమటోడ్చి సంపాదించాడు అంటే నమ్మా బుద్ధి కావడం లేదు. ౯౪ లో నేను వరంగల్ లో పని చేసేప్పుడు కొత్తగా యం బి ఏ కోసం కాలేజీ ఏర్పాటు చేసారు . దానికోసం టాటా సంస్థలో ఉన్నత స్తాయిలో పనిచేసే వర్మ అనే ఆతను వచ్చాడు . ఆతను ఆ రోజు చెప్పిన చాలా విషయాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నిజాయితీగా, నిబందనల మేరకు పనిచేసే సంస్థలు కనీసం జీతాలు కూడా చేల్లిన్చాలేవు. టాటా ఐనా రామోజీ ఐనా అని చెప్పాడు. ఇది టాటా- రాడియ వ్యవహారం బయట పడక ముందు చెప్పారండి. జనం కూడా తెలివి మిరి పోయారు బాబు ఎన్ని నాటిక విలుబాలు చెప్పిన, జగన్ గురించి ఎనాట ప్రచారం చేసినా అంత ఒకటే అనే నిర్ణయానికి వచ్చారు

    రిప్లయితొలగించండి
  6. *నిజాయితీగా, నిబందనల మేరకు పనిచేసే సంస్థలు కనీసం జీతాలు కూడా చేల్లిన్చాలేవు. టాటా ఐనా రామోజీ ఐనా అని చెప్పాడు.*
    మురళి గారు,
    టాటాను తీసుకొచ్చి మిగతా వారితో పోల్చటం బాగా లేదు. మీకు తెలిసే వుంట్టుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన సంఘటనలో కేంద్రం లో ఎర్ర పార్టి సిద్దాంతాల వైపు నెహ్రు గారు మొగ్గు చూపారు. దానికి సోషలిజం అనే పేరుతో పంచవర్ష ప్రణాళికలు అమలు చేయటం జరిపారు. ఆయన విధానాలను నచ్చక దూర దృష్ట్టి కలిగిన రాజాజీ మరికొందరు నార్త్ ఇండియా రాజకీయ నాయకులు లిబరల్ విధానాలు కొనసాగించాలని పోరాడుతూ కాంగ్రేస్ పార్టి నుంచి బయటకి వచ్చారు. అదే ఆంధ్రాకువస్తే ఆయన విధానాలను ఎవరు పెద్ద విమర్శించలేదు. మొదట్లో స్వాతంత్రద్యోమ స్పూర్తి తో కొన్ని పథకాలు అమలు అయినా తరువాత రాజకీయ నాయకులు ముఖ్యంగా కేంద్ర లోని వారు సోషలిజం పేరు తో తమకు నచ్చని వ్యాపారులను పీడించటం మొదలు పెట్టారు. వివరాల కొరకు గురుచరణ దాస్ రాసిన పుస్తకం చదివేది. వ్యాపారులు నిజాయితీ గా పనిచేయనీకుండే విధంగా చట్టాలను సవరించారు.
    ------------------------------
    కాని మీడీయా వారికి పైన రాసిన అనాలిసిస్ వర్తించదు. దానికి ఎన్నో కారణాలు వున్నాయి. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తరువాత అప్పటివరకు దేశం కోసం పని చేసిన పేపర్లు కొన్ని రోజులకు మూత పడటం. మీడియా హౌస్ లో కొంతమంది భాగస్వాములు, తమ వాటాలను ఇతరులకు అమ్మటం మొదలైయింది. క్రమంగా దేశభక్తుల స్థానలలో వేరే వారు వచ్చి చేరారు. ఆ తరువాత చాలా పేపర్లు ఎదో ఒక దేశానికి, భావజాలానికి మద్దతుగా పని చేయటం జరిగింది. భావజాలాన్ని ప్రమోట్ చేయటం లో ఎన్నో విదేశి శక్తులు వివిధ మార్గాలలో డబ్బులు కుమ్మరిస్తాయి. పేపర్ వారికి అచ్చంగా పేపర్ అమ్మితే వచ్చే డబ్బులేకాక, ఈ విధంగా వివిధ మార్గాలలో వచ్చే డబ్బులు ఉంటాయి. ఇటువంటి చేయలేని వారు పత్రికలను మూసుకొని ఇంటికి పోయారు.
    రష్యా పడి పోయినపుడు వారు ఇతర దేశాలలో తమ కనుకూలం గా పేపర్ ద్వారా ఎలా కథనాలు రాయించారో, ఎంత డబ్బులిచ్చారో మొదలైన అన్ని వివరాలు తెలిపే పత్రాలు బహిర్గతం చేశారు. అలాగే బ్రిటన్ కూడా చాలా పత్రాలను పీరియాడికల్ గా బహిర్గతం చేస్తూ వుంట్టుంది. పత్రికల వారు చేసేది వ్యాపారమైతే వారు తమ దేశానికి అనుకూలంగా పని చేయటమనేది కనీస ధర్మం. కాని చాలా మటుకు అలా చేయవు. ఇది అందరికి తెలిసిందే కదా!

    SrI Ram

    రిప్లయితొలగించండి
  7. @Murali

    Sir,
    If U follow BABU's allegations carefully We can find the uneven jumpings in the wealth of JAGAN....

    TDP and Yellow GANG 1st alleged that some thousand crs of wealth for JAGAN...and later yr they started to increase that amount gradually and by 2009 they fixed it at 1LAC crs....

    interestingly our STATE BUDGET also reached to 1lac + crs at that time....so TDP and Yellow GANG conveniently used that and propagated as JAGAN's welath is 1lac crs and blah blah....


    I say Business is different and Ethics are different.....and business ethics are different....

    If u a following the Procedures according to the LAW it is not illegal....after Economic Reforms we all know how fast the growth rate is.....so JAGAN is legally Perfect....not CBI even FBI can not do aything.....



    and coming to the political situation...I can clearly see the WAVE of JAGAN in AP now....actually SONIA..BABU are helping JAGAN by doing all these kind of things....

    in KADAPA also Jagan would have get some 3lacs majority had it been natural BY-POLLS...but by sending some 20 ministers...5 central ministers....50 MLAs....etc etc....SONIA and BABU gifted JAGAN 6lacs majority and they have LOST deposits....


    and in the STATE also this is going to happen....by doing all these things they are helping JAAGn to get more seats......

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం