‘‘ఏంటీ పేపర్ చదువుతూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మాకూ చెబితే మేమూ నవ్వుతాం కదా? ఐనా నవ్వుకోవడానికి ఏముంది ప్రమాదాలు, మరణాలు, కరువు వార్తలే కదా? పత్రికల నిండా!’’
‘‘సంతోషంలోనే కాదు అప్పుడప్పుడు బాధతో కూడిన నవ్వులు కూడా ఉంటాయి’’
‘‘మరి నీ నవ్వు ఏమిటో? ’’
ఆ సంగతి ఎందుకు కానీ ... రెండు రాష్ట్రాల పాలన చూస్తే ఏమనిపిస్తోంది? నాకైతే ఈ రాజకీయాలను చూశాక వీళ్లు అపూర్వ సహోదరులు అనిపిస్తోంది’’
‘‘ఎందుకలా’’
‘‘చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తుకొస్తున్నది చెప్పమంటావా? ’’
‘‘ఇరు రాష్ట్రాల పాలన గురించి చెబుతానని చెప్పి కథ చెబుతానంటావేమిటి?’’
‘‘అర్ధం చేసుకుంటే రెండూ ఒకటే’’
‘‘సర్లే చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు వద్దన్నా ఊరుకుంటావా? చెప్పు వింటాను’’
‘‘ఒక అడవిలో కొంగ నక్క స్నేహితులు’’
‘‘అడవిలో నక్కలుంటాయి కానీ కొంగలుంటాయా? ఉన్నా వాటి మధ్య స్నేహం ఉంటుందా? ’’
‘‘అలా అంటే ఈ రోజుల్లో నక్కలు అడవిలో ఉన్నాయో లేవో కానీ జనారణ్యంలో మాత్రం నక్కలకు కొదవ లేదు. చిన్నప్పటి కథ అన్నాను కథ వినాలంటే లాజిక్కులుండవద్దు. చెప్పింది విను ’’
‘‘చిన్నప్పుడు విన్న కథే అందుకే ప్రశ్నలడిగాను. సరే వింటాను చెప్పు ’’
పైకి ఆ రెండూ స్నేహితులుగానే ఉన్నా ఒకటంటే ఒకదానికి పడదు. మా ఇంట్లో పాయసం చేశాను రా అని నక్క కొంగను పిలుస్తుంది. వెడల్పైన పళ్లెంలో పాయసం పోస్తే పొడవైన ముక్కుతో పాయసం తాగలేక కొంగ ఇబ్బంది పడితే నక్క మాత్రం మొత్తం తాగేస్తుంది. కడుపు మాడ్చుకుని కొంగ తిరిగి వెళుతుంది. భలే అవమానించాను అని నక్క మురిసిపోతుంది. కొంత కాలానికి ఈ విషయం నక్క మరిచిపోతుంది. చేపల పులుసు చేశాను రా మావా అంటూ కొంగ నక్కను విందుకు ఆహ్వానిస్తుంది. ఇరుకు మూతిగల రెండు కూజాల్లో చేపల పులుసు పోస్తుంది. కొంగ పొడవైన ముక్కుతో కూజాలోని చేపల పులుసు లాగించేస్తుంది. నక్క మాత్రం ఏమీ చేయలేక కడుపు మాడ్చుకుంటుంది. ఇదీ కథ’’
‘‘ చిన్నప్పుడే చదివానులే.. ఇంతకూ ఎందుకు చెబుతున్నావు’’
‘‘ ఏందుకో సడెన్‌గా గుర్తుకొచ్చింది. సృష్టిలో ప్రతి ప్రాణికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. ప్రాణులకే కాదు ప్రాంతాలకూ ఉంటాయి. కొంగ పొడవైన ముక్కుతో పాయసం తాగలేనప్పుడు నక్క నవ్వుకుంది. ఆ సమయంలో పొడవైన ముక్కు కొంగకు ప్రతికూల అంశం. అదే పొడవైన ముక్కు చేప పులుసు దగ్గరకు వచ్చే సరికి అనుకూల అంశంగా మారిం ది. ఎంత జిత్తుల మారి నక్కయినా ఇరుకు మూతిలో నుంచి చేప పులుసు తినలేదు కదా?.. సింహంతో స్నేహానికి సైతం ఆ జిత్తుల మారితనం ఉపయోగపడవచ్చు . అక్కడ జిత్తుల మారి తనమే నక్కకు అనుకూల అంశం ’’
‘‘ ఔను నిజం చీమలాంటి చిన్న ప్రాణికి సైతం సృష్టిలో ఏవో కొన్ని ప్రత్యేకతలుంటాయి.’’
‘‘ అది సరే ఇప్పుడా కథ ఎందుకూ ?’’
‘‘తెలివి మా సొంతం అనుకుంటే పప్పులే కాలేస్తారు..... రోజులన్నీ ఒకేలా ఉండవు అని చెప్పడానికి’’
‘‘ చెప్పేదేదో నేరుగా చెప్ప వచ్చు కదా? డొంక తిరుగుడు ముచ్చట్లెందుకు? ’’
‘‘ రెండు రాష్ట్రాల పాలనను చెప్పేందుకు ఈ కథ చెప్పాను అని నేను అంటే నీ నుంచి వచ్చే మొదటి ప్రశ్న.. ఇందులో నక్క ఎవరు, కొంగ ఎవరు? అనే ప్రశ్న వస్తుంది కదా? ’’
‘‘ వచ్చి తీరుతుంది. ఇంతకూ నక్క ఎవరు? కొంగ ఎవరు? ’’
‘‘ అందుకే నేరుగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పాల్సి వస్తున్నది’’
‘‘ నాకు పలానా నాయకుడు కొంగలా, మరో నాయకుడు నక్కలా కనిపిస్తే, నీకూ అలానే కనిపించాలనేమీ లేదు. నాకు కనిపించిన దానికి రివర్స్‌లో నీకు కనిపించ వచ్చు కదా? ’’
‘‘అయితే’’
‘‘ అప్పుడు మనిద్దరి మధ్య కూడా రెండు రాష్ట్రాల పాలకుల్లా ఘర్షణ తప్పదు’’
‘‘ ఆ నేత చక్కగా చర్చలకు ఆహ్వానించాడు కదా’’
‘‘ చర్చకు కాదు కత్తియుద్ధానికి ఆహ్వానించినట్టుగా ఉంది’’
‘‘నీకెందుకలా అనిపించింది’’
‘‘చెప్పాను కదా ఇప్పుడు మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. కొన్ని విషయాలు నేరుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇబ్బంది. ‘అఖల్‌మంద్‌కో ఇషారా’ చాలన్నట్టు చెబితే అర్ధం చేసుకోవాలి ’’
‘‘ సరే అలాగైనా చెప్పు’’
ఎప్పుడైనా బంధువుల పంచాయితీ విన్నావా?
ఊ చెప్పు
చర్చలకు ఇద్దరి ఆహ్వానాలు విన్నాక
బంధువుల మధ్య సాగే గొడవ గుర్తుకొచ్చింది.
***
‘‘ఇదిగో వదినా మీరెంత దౌర్జన్యం చేసినా, మీరెంత రౌడీయజం చేసినా నాది మీలాంటి చిన్న మనసు కాదు. మీరెంత దుర్మార్గులైనా మంచి మనసుతో మాట్లాడుకుందామని పిలుస్తున్నాను. ఇప్పుడే చెబుతున్నాను ఐదేళ్లలో మీ ఇల్లు నాది కాకపోతే అప్పుడడగండి. ఇది నా చాలెంజ్. నా ఇల్లు నాదే, ఐదేళ్ల తరువాత మీ ఇల్లు నాదే. బస్తీమే సవాల్.. అయినా సరే గౌరవించి మాట్లాడుకుందామని పిలుస్తున్నాను. ఇదే నా ఆహ్వానం రా! మాట్లాడుకుందాం.’’
‘‘ నీ ముదనష్టపు తెలివి తేటలు తెలియందెవరికీ? ముందా నల్లికుట్ల పనులు మానుకుంటానంటే మీ ఆహ్వానాన్ని మన్నించి చర్చలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానొదినా. కరెంటాఫీసుకు వెళ్లి మా ఇంటికి కరెంటు పీకేయమని ఫిర్యాదు చేశావు. నీ మాట వినకుండా వాళ్లు చీవాట్లు పెట్టి పంపారు. ఎక్కడికి పోయినా నీ నల్లికుట్ల వ్యవహారాలు పని చేయలేదు. ఇరుగు పొరుగు వారితో బుద్ధిగా మసులుకో అని బుద్ధి చెప్పి పంపించారు. అయినా నీ వంకర బుద్ధి మారలేదు. కానీ నేను నీలాంటి దాన్ని కాదు అందుకు నీ బుద్ధి మార్చుకుంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాను. అయితే నీ బుద్ధి మారిందని ముందుగా లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలి ’’
***
‘‘చర్చలకు ఎంత చక్కగా ఆహ్వానించుకున్నారు కదూ. అచ్చం మన పాలకుల మాదిరిగానే.’’
‘‘ వ్యవహారం చూస్తే భయమేస్తోంది.. ఎటు పోతుందో అని’’
‘‘భయమెందుకు? ఇద్దరిదీ రాజకీయమే... వారి రాజకీయ భవిష్యత్తు కోసమే ఇదంతా! రాజకీయం అన్నాక ఒక్క వ్యాపారమే కాదు నాటకం కూడా తప్పదీ నాటకాలు.... (06/07/2014)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం