13, మే 2023, శనివారం
పీఎం , సీఎం ఏం మాట్లాడుకున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుస్తుంది? ఓ జ్ఞాపకం
పీఎం , సీఎం ల మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుస్తుంది?
జగన్ , నరేంద్ర మోడీల్లో ఎవరో ఒకరు ఆయన సోర్స్ కావచ్చు ఆ సంగతి నాకు తెలియదు ... కానీ ఆయన రిపోర్టర్ గా తిరిగేప్పుడు ... ఆయనకు తెలియంది , సామాన్య జర్నలిస్ట్ కు తెలిసింది . ఓ జ్ఞాపకం ఉంది చెబుతాను .
ఓ జ్ఞాపకం
కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి వద్ద .. పొలిట్ బ్యూరో సభ్యులు , బాబు సన్నిహిత జర్నలిస్ట్ రాధాకృష్ణ లతో ఉండి ..... వీరికన్నా ఎక్కువ తెలిసిన వారు ఎవరుంటారు ? ఈ రోజు ఇంతకు మించి ఏమీ ఉండదు అని ఆఫీస్ కు వెళ్లి వార్త రాసి హాయిగా నిద్ర పోయి తెల్లవారగానే పత్రిక చూస్తే అంతకు మించి జరిగింది చదివితే మన అతి విశ్వసం పై ఎవరో కొట్టినట్టు ఉంటుంది .
***
బాబు తొలి సారి సీఎం అయినప్పుడు రాజ్యసభ ఎన్నికలు ... ఐదుగురిని ఎంపిక చేయాలి ... అర్ధరాత్రి వరకు పొలిట్ బ్యురో... నాలుగు పేర్లు బయటకు వచ్చాయి .మీటింగ్ తరువాత నలుగురైదుగురు జర్నలిస్ట్ లు బాబుతో సమావేశం ... అందులో ఒకరు రాధాకృష్ణ ... ఆయన రిపోర్టర్ గా రంగంలో తిరిగే రోజులు ... నాలుగు పేర్లు ఫైనల్ అయ్యాయి . ఐదవ పేరు రేపు అని బాబు ... బాబుగారే చెబుతున్నారు కదా వెళదాం అని రాధాకృష్ణ ... హేమాహేమీలైన్ పొలిట్ బ్యూరో నేతలు సైతం అదే మాట ...
సరే అని అంతా వారి వారి ఆఫీస్ లకు ...
తెల్లవారును జ్యోతి తో పాటు అన్ని పత్రికల్లో నాలుగే పేర్లు ....
ఒక్క వార్తలో తప్ప .... అందులో ఐదు పేర్లు ...ఐ దూ కరెక్ట్ పేర్లే ... బాబు ఆత్మకు .... హేమా హేమీలకు తెలియని పేరు వార్త రిపోర్టర్ నాగేశ్వర రావు కు ఎలా తెలిసింది ... పైగా ఆ రోజు అర్ధరాత్రి వరకు బాబు ఇంట్లో బాబు తో ఉన్న రిపోర్టర్ లలో అతను లేడు ....
మరుసటి రోజు అతన్ని పట్టుకొని ఎలా ? హౌ ? అని అడిగితే ....
మీరంతా బాబు ఇంట్లో ఉన్నారు కదా . అప్పుడు నేను అక్కడికి రాకుండా ఆ చౌరస్తా లో ఉన్నాను ...
పొలిట్ బ్యూరో అయిపోగానే నేతలు వెళ్లేప్పుడు ....చందూలాల్ మీరు అతన్ని నాయకుడిగానే చూడరు .. అతను పొలిట్ బ్యూరో మెంబర్ ... వెళ్లి అతని కారులో కూర్చొని ......పేర్లు తీసుకున్నాను..... బాబు , నంబర్ టూ అనుకునే మంత్రుల కన్నా ఎవరూ పట్టించుకోని చిన్న మంత్రులు మనం పలకరిస్తే మురిసి పోయి చెబుతారు .....జర్నలిస్ట్ లు ఆచరించాల్సిన పాఠం ఇది ... చిన్న వారి వద్దే పెద్ద సమాచారం పొందడం ఈజీ ...
మరి జగన్ మోడీ రహస్యం గా మాట్లాడు కునేది రాధాకృష్ణకు ఎలా తెలుసో చెప్పలేదు ...
అది చాలా ఈజీ
అక్కడ ఏం మాట్లాడుకున్నారో రాయాలి అంటే సోర్స్ ఉండాలి ..
రాయాలి అనుకున్నది రాసేసేందుకు సోర్స్ ఎందుకు ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం