19, మే 2023, శుక్రవారం
నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ జర్నలిస్ట్ లు నేర్చుకోదగిన పాఠాలు ఓ జ్ఞాపకం
నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్
జర్నలిస్ట్ లు నేర్చుకోదగిన పాఠాలు
ఓ జ్ఞాపకం
ఇదేం శీర్షిక ? గొనె ప్రకాష్ కు నోట్లో నాలుక లేకపోవడం ఏమిటి ? ఆయన ప్రత్యేకతే నోట్లో నాలుక ... ఒక సారి మాట్లాడడం మొదలు పెట్టారు అంటే ఆపడం యాంకర్ తరం కూడా కాదు . టివి 9 రజనీ కాంత్ కూడా ఆపలేడు . చరిత్ర చెబుతాడు . నాలుకేసుకొని బతికేస్తున్న గొనె ప్రకాష్ను నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ అంటావా ? అని కోపం రావచ్చు . ఒకసారి ఊహించండి నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ ఎలా ఉంటారో ? ఊహించ లేం కదా ? బహుశా కొమ్మినేని శ్రీనివాస రావు పరిస్థితి కూడా ఇలానే అయిందేమో గోనెకు నాలుక ప్రసాదించారు .
అదేదో సినిమాలో బ్రహ్మానందం డ్రాయర్ గురించి డైలాగులు చెబుతూ స్త్రీ ప్రసాదించిన జీవితం మగాడిది అని అంటాడు ..
అలానే గొనె అభిమానులకు కోపం వచ్చినా సరే కొమ్మినేని ప్రసాదించిన వరం గొనె ప్రకాష్ నాలుక ...
*****
ఉమ్మడి రాష్ట్రం లో టీడీపీ బీట్ రిపోర్టర్లు అందరూ శాసన సభలో టిడి యల్ పి - సియల్ పి ( టీడీపీ, కాంగ్రెస్ ) ల మధ్య పిచ్చాపాటి చర్చల్లో గొనె ప్రకాష్ వచ్చారు . రాజకీయ సంఘటనలు, నాయకుల పేర్లు , తేదీలు ఆయన నాలుక మీద నాట్యం చేస్తుంటాయి అని చాలా మంది నమ్మకం . ఆ చర్చలో nda ప్రభుత్వం. మంత్రి వర్గం లో టీడీపీ చేరింది అని గొనె వాదన ... ఎర్రం నాయుడు Nda లో మంత్రి అని గొనె వాదన .చేరలేదు బయటి నుంచి మద్దతు అని రాజకీయాల్లో ఓ కొత్త పదం కనిపెట్టి టీడీపీ మద్దతు ఇచ్చింది . స్పీకర్ పదవి ( బాలయోగి )తీసుకోవడం తప్ప మంత్రి వర్గం లో చేరలేదు అని కొమ్మినేని తో సహా టీడీపీ రిపోర్టర్ ల వాదన ... గొనె లో ఆవేశం రగులు కుంది . నేను చెప్పింది తప్పు అయితే నాలుక కోసుకుంటాను అని కొమ్మినేనితో పందెం . నాలుక కోసుకోవడం తో పాటు కొంత నగదు - పందెం . ఎర్రంనాయుడుకు ఫోన్ చేసి మంత్రివర్గం లో చేరారా లేదా అడగమని గొనె నాకు చెబితే ... నేను ఫోన్ చేయను నీకు ఆ మాత్రం తెలియదా అని ఎర్రం నాయుడు అంటారు అని నేను .. గోనెలో ఆవేశం మరింత పెరిగింది . రికార్డ్ లు చూపించి మీరంతా తప్పు అని నిరూపిస్తాను అని అసెంబ్లీ లో ఉన్న లైబ్రరీకి గొనె వెళ్లారు . విషయం తెలుసు కాబట్టి నేను రికార్డ్స్ చూసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు .
****
రికార్డ్స్ చూసి బయటకు వచ్చిన గొనె కొంత ఆశ్చర్యంగా ఈ రికార్డ్స్ చూసేంత వరకు నేను టీడీపీ మంత్రివర్గం లో చేరింది అనే అనుకుంటున్నాను . అనుకోవడమే కాదు ఎన్నో సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీనిపై తీవ్రంగా విమర్శించాను ... ఒక్క రిపోర్టర్ కూడా మీరు చెబుతున్నది తప్పు మంత్రివర్గం లో చేరలేదు అని చెప్పలేదు ఎందుకో అని విస్తు పోయారు . నగదు సంగతి తెలియదు కానీ నాలుక వద్దు అని కొమ్మినేని వదిలేశారు ..
***
గొనె మాటల ప్రకారం ఆయన ఒక తప్పును కొన్ని డజన్ల సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెబితే ఒక్కసారి కూడా అది తప్పు అనలేదు అంటే యాంత్రికంగా పని చేయడం అన్నమాట . క్లర్క్ లా చెప్పింది రాసుకోవడం కాదు ఆలోచించ గలగాలి . మనం రాసిన వార్త మనం చదువుకుంటే చాలు అని కాదు . పత్రిక మొత్తం చదివినప్పుడు ఇలా నాయకులు తప్పు చెబితే ప్రశ్నించ వచ్చు . ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక విలేఖరికి ఎక్కువ గౌరవం , తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక వారికి తక్కువ గౌరవం అనే అభిప్రాయం ఎలా ఉన్నా - విషయ పరిజ్ఞానం ఉన్న జర్నలిస్ట్ కు విలువ ఉంటుంది . జర్నలిజం లోనాలుగు కాలాలు ఉండాలి అనుకుంటే విషయ పరిజ్ఞానానికి నిరంతరం మెరుగులు దిద్దుకోవడం అవసరం .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం