26, జులై 2023, బుధవారం
సర్వేల రాజకీయం .... కోరిన వారికి కోరికలు తీర్చే సర్వేలు .. తెలంగాణ తో రాజకీయాలకు , సర్వేలకు లగడపాటి దూరం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -80
సర్వేల రాజకీయం .... కోరిన వారికి కోరికలు తీర్చే సర్వేలు ..
తెలంగాణ తో రాజకీయాలకు , సర్వేలకు లగడపాటి దూరం ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -80
------------------------------------
కొన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించక పోయినా సర్వేల్లో ఘన విజయం సాధిస్తుంటాయి . లగడపాటి సర్వేకు తిరుగులేదు అని అతన్ని ఆకాశానికి ఎత్తిన జ్యోతిని , లగడపాటిని నమ్మి తెలంగాణా ఎన్నికలపై పందెం కాసి రోడ్డున పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు . చివరకు కెసిఆర్ సైతం ఓడిపోతాడు అని ఓ సారి , జ్యోతి , మరోసారి లగడపాటి సర్వేల్లో కొన్ని పార్టీలను సంతృప్తి పరిచాయి .
సర్వేలు నిజమవుతాయా ? అంతా అబద్ధమేనా ? అంటే .. సర్వేలు అన్నీ అబద్దాలే అని నేను రాయాలి అనుకుంటే ఘోరంగా దెబ్బ తిన్న సర్వేలు బోలెడు ఉన్నాయి . వాటిని ఉదహరిస్తూ సర్వేలు అన్నీ అబద్దాలే అని రాయవచ్చు . ఒక వేళ సర్వేలు నిజం అవుతాయి అని రాయాలి అనుకుంటే నిజం అయిన సర్వేలు ఎన్నో ఉన్నాయి , వాటిని ఉదాహరణలుగా తీసుకోని సర్వేలు అన్నీ నిజమే అని రాయవచ్చు .
2004 ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ ఓడిపోతుంది అని , కాంగ్రెస్ తెరాస కూటమి గెలుస్తుంది అని తేల్చాయి . జ్యోతికి ఇది ఎంత మాత్రం నచ్చలేదు . ఎన్నికల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక పేజీల్లో గతంలో నిజం కానీ పలు సర్వేలు - వాస్తవ ఫలితాలు ఏ విధంగా వచ్చాయో పేర్కొంటూ సర్వేలను నమ్మవద్దు నిజం కావు అని తేల్చారు . 2004 ఎన్నికల్లో ఈ సర్వేల వ్యవహారంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు .
2004 లో రెండు దఫాలుగా పోలింగ్ జరిగింది . తొలి విడత పోలింగ్ జరిగే జిల్లాల రిపోర్టర్ ల నుంచి సమాచారం తీసుకోని ఆంధ్రభూమిలో టీడీపీ ఓడిపోతుంది అని పెద్ద వార్త వచ్చింది . ఆ తరువాత రెండవవిడత పోలింగ్ జరిగే జిల్లాల సమాచారం సరిగ్గా అదే విధంగా టీడీపీ ఓడిపోతుంది అని తేలింది . కానీ ఆశ్చర్యంగా ఆంధ్రభూమిలో మాత్రం రెండవ విడత పోలింగ్ జరిగే జియోజక వర్గాల్లో టీడీపీ దూసుకెళ్తుంది అని పెద్ద వార్త వచ్చింది . విషయం ఏమిటా ? అంటే యాజమాన్యానికి , బాబుకు మధ్య ఉన్న అనుబంధం అని తేలింది . మీడియాకు , బాబుకు ఉన్నంత ఘాడమైన అనుబంధం ఓటరుకు , బాబుకు మధ్య లేకపోవడం వల్ల ఏ పత్రిక సర్వేతో ఏం చెప్పించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది . ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి అతి తక్కువ సీట్లు (47) వచ్చింది 2004 లోనే .
ఈనాడులో అలా వచ్చింది .
టీడీపీ ఓడిపోతున్నట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్ . అది ఈనాడులో బాగానే ప్రచురించారు . తరువాత ఏం జరిగిందో కానీ ఢిల్లీకి చెందిన జివి ఎల్ నరసింహారావు అనే వారి చిత్రమైన సర్వే ను మొదటి పేజీలో పెద్దగా ప్రచురించారు . తొలివిడత పోలింగ్ ముగిసిన తరువాత నరసింహారావు హడావుడిగా తమ సంస్థ సర్వే జరిపినట్టు హడావుడిగా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో ప్రకటించారు . ఒక దశ పోలింగ్ ముగిశాక , రెండో దశ కోసం సర్వే ఏమిటీ ? మొత్తం రాష్ట్రంలో సర్వే చేస్తారు కానీ సగం సర్వే ఎందుకు చేశారు ? ఎవరి కోసం చేశారు అని ప్రశ్నిస్తే , మా గత చరిత్ర బ్రహ్మాండంగా ఉంది . మేం చేసిన సర్వే నిజం అవుతుంది . టీడీపీ గెలుస్తుంది అని తేల్చి చెప్పారు .
సాధారణంగా ఇలాంటి సంస్థల సర్వేలను పత్రికలు లోపలి పేజీలో చిన్నగా వేస్తారు . ఏ బంధం వల్లనో కానీ ఈనాడు లో మొదటి పేజీలో దాదాపు సగం పేజీ వచ్చింది . సర్వేల మతలబు తెలియని నాయకులకైతే అది చూస్తే గుండె గుభేలు మనేది .
శ్రీనివాస్ రెడ్డి అని జర్నలిస్ట్ , తరువాత హోంమంత్రిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి వద్ద పిఎ గా చేశారు . వై యస్ ఆర్ ను కలిసి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పబోతుంటే .. మనం గెలుస్తున్నాం వదిలేయ అని చెప్పింది కూడా వినలేదు . సర్వేలు , మీడియా ఏం చెప్పినా గెలుపు పై అప్పుడు వై యస్ ఆర్ పూర్తి ధీమాగా ఉన్నారు .
తెలంగాణ ఏర్పాటు లగడపాటి రాజ్ గోపాల్ కు రాజకీయ సన్యాసం ఇప్పిస్తే .. తెలంగాణలో తెరాస విజయం లగడపాటికి సర్వేల బిజినెస్ కూడా లేకుండా చేసింది . అంతకు ముందు లగడపాటి సర్వేలను నమ్ముకొని పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాసేవారు . తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి జోస్యం ఘోరంగా దెబ్బ తినడంతో ఆ తరువాత ఎన్నికల జోస్యం కూడా చెప్పడం లేదు .
*****
ఎన్టీఆర్ భవన్ వద్ద 2004లో మీ ఇష్టం వచ్చినట్టు సర్వేలు అని రాస్తే మేం చూస్తూ ఉండాలా ? అని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కట్టా జనార్దన్ వార్త రిపోర్టర్ ను దాదాపు కొట్టినంత పని చేస్తూ బెదిరిస్తున్నాడు . 2004 ఎన్నికలకు సంబంధించి వార్త సర్వే ప్రచురించింది . కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని , టీడీపీకి 72 సీట్లు వస్తాయి అని సర్వే సారాంశం . కాంగ్రెస్ పత్రిక ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ? అంటూ సంఘీని తిడుతూ కట్టా ఆగ్రహంతో వార్త రిపోర్టరును నిలదీస్తున్నాడు . నేను జోక్యం చేసుకొని వార్త సర్వే లో 72 సీట్లు అని రాశారు కదా ? 72 కూడా రావు . మీ అంచనా ప్రకారం టీడీపీకి సీట్లు వస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాను , 72 కూడా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి అని అడగడంతో... ... ఎన్నికల సమయంలో ఇలా రాస్తే ఎలా అని తగ్గాడు . 72 కూడా రాలేదు . 47 మాత్రమే వచ్చాయి .
******
ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి . గతంలో పత్రికలు మాత్రమే సర్వేలు ప్రచురించేవి . ఇది సామాజిక మాధ్యమాల యుగం ఇప్పుడు లెక్కకు మించిన సర్వేలు వస్తుంటాయి . సర్వేలే కాదు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే , కొందరు మరో అడుగు ముందుకు వేసి వారం క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు . ఎన్నికల సమయంలో బిబిసి మొదలుకొని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వరకు అనేక ఛానల్స్ సర్వే అంటూ వాట్స్ ఆప్ యూనివర్సిటీ సర్వేలను ప్రచారం చేస్తుంటారు . ఆయా రాజకీయ పార్టీలు కోరుకున్నానని సీట్లు ఈ సర్వేల్లో లభిస్తుంటాయి . అడగని వారిదే పాపం ప్రధాన పార్టీలే కాదు శివసేనను సైతం గెలిపిస్తుంటారు .
అన్ని రాజకీయ సర్వేలే అని చెప్పలేం కొన్ని ప్రముఖ సంస్థలు సీరియస్ గానే సర్వేలు జరుపుతాయి . గతం లో వారు చేసిన సర్వేలు , ఫలితాలు ఎంత దగ్గరగా ఉన్నాయి అనే దానిని బట్టి సర్వే సంస్థలకు విశ్వసనీయత ఉంటుంది . సరైన సర్వే నిర్వహిస్తే ఎంత కాలం అయినా ఆ సంస్థకు డిమాండ్ ఉంటుంది . బేరాల సర్వే ఐతే లగడ పాటి సర్వేలా ? ఒక్క దానికే షాప్ మూత పడుతుంది . సర్వే జరిపిన సంస్థ విశ్వసనీయతను బట్టి సర్వేను చూడాలి . కొన్ని సార్లు విశ్వసనీయ సంస్థ పేరుతో , లేదా ఆ సంస్థకు దగ్గరగా ఉండే పేరు పెట్టి నకిలీ సర్వేలు ప్రచారంలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్న తరువాత ఏ సర్వేలు కూడా వారిని మార్చలేవు అని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి .
హెచ్చరిక: సర్వే పేరుతో వాట్స్ ఆప్ లో అంకెలు కనిపిస్తే మురిసిపోకండి , కంగారు పడకండి . రోజూ వాట్స్ ఆప్ లో వచ్చే జోకుల్లో ఈ సర్వే అంకెలు కూడా ఒక జోక్ గా చూడండి ..
- బుద్దా మురళి
------------------------------------
కొన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించక పోయినా సర్వేల్లో ఘన విజయం సాధిస్తుంటాయి . లగడపాటి సర్వేకు తిరుగులేదు అని అతన్ని ఆకాశానికి ఎత్తిన జ్యోతిని , లగడపాటిని నమ్మి తెలంగాణా ఎన్నికలపై పందెం కాసి రోడ్డున పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు . చివరకు కెసిఆర్ సైతం ఓడిపోతాడు అని ఓ సారి , జ్యోతి , మరోసారి లగడపాటి సర్వేల్లో కొన్ని పార్టీలను సంతృప్తి పరిచాయి .
సర్వేలు నిజమవుతాయా ? అంతా అబద్ధమేనా ? అంటే .. సర్వేలు అన్నీ అబద్దాలే అని నేను రాయాలి అనుకుంటే ఘోరంగా దెబ్బ తిన్న సర్వేలు బోలెడు ఉన్నాయి . వాటిని ఉదహరిస్తూ సర్వేలు అన్నీ అబద్దాలే అని రాయవచ్చు . ఒక వేళ సర్వేలు నిజం అవుతాయి అని రాయాలి అనుకుంటే నిజం అయిన సర్వేలు ఎన్నో ఉన్నాయి , వాటిని ఉదాహరణలుగా తీసుకోని సర్వేలు అన్నీ నిజమే అని రాయవచ్చు .
2004 ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ ఓడిపోతుంది అని , కాంగ్రెస్ తెరాస కూటమి గెలుస్తుంది అని తేల్చాయి . జ్యోతికి ఇది ఎంత మాత్రం నచ్చలేదు . ఎన్నికల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక పేజీల్లో గతంలో నిజం కానీ పలు సర్వేలు - వాస్తవ ఫలితాలు ఏ విధంగా వచ్చాయో పేర్కొంటూ సర్వేలను నమ్మవద్దు నిజం కావు అని తేల్చారు . 2004 ఎన్నికల్లో ఈ సర్వేల వ్యవహారంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు .
2004 లో రెండు దఫాలుగా పోలింగ్ జరిగింది . తొలి విడత పోలింగ్ జరిగే జిల్లాల రిపోర్టర్ ల నుంచి సమాచారం తీసుకోని ఆంధ్రభూమిలో టీడీపీ ఓడిపోతుంది అని పెద్ద వార్త వచ్చింది . ఆ తరువాత రెండవవిడత పోలింగ్ జరిగే జిల్లాల సమాచారం సరిగ్గా అదే విధంగా టీడీపీ ఓడిపోతుంది అని తేలింది . కానీ ఆశ్చర్యంగా ఆంధ్రభూమిలో మాత్రం రెండవ విడత పోలింగ్ జరిగే జియోజక వర్గాల్లో టీడీపీ దూసుకెళ్తుంది అని పెద్ద వార్త వచ్చింది . విషయం ఏమిటా ? అంటే యాజమాన్యానికి , బాబుకు మధ్య ఉన్న అనుబంధం అని తేలింది . మీడియాకు , బాబుకు ఉన్నంత ఘాడమైన అనుబంధం ఓటరుకు , బాబుకు మధ్య లేకపోవడం వల్ల ఏ పత్రిక సర్వేతో ఏం చెప్పించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది . ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి అతి తక్కువ సీట్లు (47) వచ్చింది 2004 లోనే .
ఈనాడులో అలా వచ్చింది .
టీడీపీ ఓడిపోతున్నట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్ . అది ఈనాడులో బాగానే ప్రచురించారు . తరువాత ఏం జరిగిందో కానీ ఢిల్లీకి చెందిన జివి ఎల్ నరసింహారావు అనే వారి చిత్రమైన సర్వే ను మొదటి పేజీలో పెద్దగా ప్రచురించారు . తొలివిడత పోలింగ్ ముగిసిన తరువాత నరసింహారావు హడావుడిగా తమ సంస్థ సర్వే జరిపినట్టు హడావుడిగా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో ప్రకటించారు . ఒక దశ పోలింగ్ ముగిశాక , రెండో దశ కోసం సర్వే ఏమిటీ ? మొత్తం రాష్ట్రంలో సర్వే చేస్తారు కానీ సగం సర్వే ఎందుకు చేశారు ? ఎవరి కోసం చేశారు అని ప్రశ్నిస్తే , మా గత చరిత్ర బ్రహ్మాండంగా ఉంది . మేం చేసిన సర్వే నిజం అవుతుంది . టీడీపీ గెలుస్తుంది అని తేల్చి చెప్పారు .
సాధారణంగా ఇలాంటి సంస్థల సర్వేలను పత్రికలు లోపలి పేజీలో చిన్నగా వేస్తారు . ఏ బంధం వల్లనో కానీ ఈనాడు లో మొదటి పేజీలో దాదాపు సగం పేజీ వచ్చింది . సర్వేల మతలబు తెలియని నాయకులకైతే అది చూస్తే గుండె గుభేలు మనేది .
శ్రీనివాస్ రెడ్డి అని జర్నలిస్ట్ , తరువాత హోంమంత్రిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి వద్ద పిఎ గా చేశారు . వై యస్ ఆర్ ను కలిసి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పబోతుంటే .. మనం గెలుస్తున్నాం వదిలేయ అని చెప్పింది కూడా వినలేదు . సర్వేలు , మీడియా ఏం చెప్పినా గెలుపు పై అప్పుడు వై యస్ ఆర్ పూర్తి ధీమాగా ఉన్నారు .
తెలంగాణ ఏర్పాటు లగడపాటి రాజ్ గోపాల్ కు రాజకీయ సన్యాసం ఇప్పిస్తే .. తెలంగాణలో తెరాస విజయం లగడపాటికి సర్వేల బిజినెస్ కూడా లేకుండా చేసింది . అంతకు ముందు లగడపాటి సర్వేలను నమ్ముకొని పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాసేవారు . తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి జోస్యం ఘోరంగా దెబ్బ తినడంతో ఆ తరువాత ఎన్నికల జోస్యం కూడా చెప్పడం లేదు .
*****
ఎన్టీఆర్ భవన్ వద్ద 2004లో మీ ఇష్టం వచ్చినట్టు సర్వేలు అని రాస్తే మేం చూస్తూ ఉండాలా ? అని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కట్టా జనార్దన్ వార్త రిపోర్టర్ ను దాదాపు కొట్టినంత పని చేస్తూ బెదిరిస్తున్నాడు . 2004 ఎన్నికలకు సంబంధించి వార్త సర్వే ప్రచురించింది . కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని , టీడీపీకి 72 సీట్లు వస్తాయి అని సర్వే సారాంశం . కాంగ్రెస్ పత్రిక ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ? అంటూ సంఘీని తిడుతూ కట్టా ఆగ్రహంతో వార్త రిపోర్టరును నిలదీస్తున్నాడు . నేను జోక్యం చేసుకొని వార్త సర్వే లో 72 సీట్లు అని రాశారు కదా ? 72 కూడా రావు . మీ అంచనా ప్రకారం టీడీపీకి సీట్లు వస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాను , 72 కూడా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి అని అడగడంతో... ... ఎన్నికల సమయంలో ఇలా రాస్తే ఎలా అని తగ్గాడు . 72 కూడా రాలేదు . 47 మాత్రమే వచ్చాయి .
******
ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి . గతంలో పత్రికలు మాత్రమే సర్వేలు ప్రచురించేవి . ఇది సామాజిక మాధ్యమాల యుగం ఇప్పుడు లెక్కకు మించిన సర్వేలు వస్తుంటాయి . సర్వేలే కాదు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే , కొందరు మరో అడుగు ముందుకు వేసి వారం క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు . ఎన్నికల సమయంలో బిబిసి మొదలుకొని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వరకు అనేక ఛానల్స్ సర్వే అంటూ వాట్స్ ఆప్ యూనివర్సిటీ సర్వేలను ప్రచారం చేస్తుంటారు . ఆయా రాజకీయ పార్టీలు కోరుకున్నానని సీట్లు ఈ సర్వేల్లో లభిస్తుంటాయి . అడగని వారిదే పాపం ప్రధాన పార్టీలే కాదు శివసేనను సైతం గెలిపిస్తుంటారు .
అన్ని రాజకీయ సర్వేలే అని చెప్పలేం కొన్ని ప్రముఖ సంస్థలు సీరియస్ గానే సర్వేలు జరుపుతాయి . గతం లో వారు చేసిన సర్వేలు , ఫలితాలు ఎంత దగ్గరగా ఉన్నాయి అనే దానిని బట్టి సర్వే సంస్థలకు విశ్వసనీయత ఉంటుంది . సరైన సర్వే నిర్వహిస్తే ఎంత కాలం అయినా ఆ సంస్థకు డిమాండ్ ఉంటుంది . బేరాల సర్వే ఐతే లగడ పాటి సర్వేలా ? ఒక్క దానికే షాప్ మూత పడుతుంది . సర్వే జరిపిన సంస్థ విశ్వసనీయతను బట్టి సర్వేను చూడాలి . కొన్ని సార్లు విశ్వసనీయ సంస్థ పేరుతో , లేదా ఆ సంస్థకు దగ్గరగా ఉండే పేరు పెట్టి నకిలీ సర్వేలు ప్రచారంలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్న తరువాత ఏ సర్వేలు కూడా వారిని మార్చలేవు అని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి .
హెచ్చరిక: సర్వే పేరుతో వాట్స్ ఆప్ లో అంకెలు కనిపిస్తే మురిసిపోకండి , కంగారు పడకండి . రోజూ వాట్స్ ఆప్ లో వచ్చే జోకుల్లో ఈ సర్వే అంకెలు కూడా ఒక జోక్ గా చూడండి ..
- బుద్దా మురళి
25, జులై 2023, మంగళవారం
తెలంగాణ లో రాజకీయ దుమారం లేపిన బెంగళూరు మిర్చి కథ... తెలంగాణ ను అడ్డుకోవడానికి క్యాప్సికం నూ వదల లేదు .... జర్నలిస్ట్ జ్ఞాపకం -79
తెలంగాణ ను అడ్డుకోవడానికి క్యాప్సికం నూ వదల లేదు .
జర్నలిస్ట్ జ్ఞాపకం -79
--------------------------------------------------------------
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం లో క్యాప్సికం కూడా రాజకీయాల్లో పెను దుమారం సృష్టించింది . తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన రాజకీయ పక్షాలు అన్నీ కెసిఆర్ పై దాడికి క్యాప్సికం తమకు లభించిన పెద్ద ఆయుధం అని సంబరపడ్డాయి .
మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి ఎనిమిది ఎకరాల్లో టమాటా పంట పండించాడు . రెండు నెలల పంట ఇప్పటి వరకు ఏడు వేల బాక్స్ ల టమాటా అమ్మితే కోటిన్నర ఆదాయం వచ్చింది . మరో నెల రోజుల్లో ఇంకో ఐదువేల బాక్స్ ల టమాటా చేతికివస్తుందట . అంటే కోటిన్నర వచ్చింది , మరో కోటి వస్తుంది . టమాటా తో కోట్లు సంపాదిస్తున్న రైతు వార్త పత్రికల్లో చూడగానే తెలంగాణ ఉద్యమ కాలం లో పదేళ్ల క్రితం రాజకీయాల్లో దుమారం లేపిన క్యాప్సికం ( బెంగళూరు మిర్చి ) ఉదంతం గుర్తుకు వచ్చింది .
టమాటా రైతులు కోట్లు సంపాదిస్తున్న వార్తలు మన వద్దనే కాదు దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నాయి . కానీ రైతు అంటే మాసిన ముతక బట్టలతోనే ఉండాలి అనేది చాలా మందిలో బలంగా ముద్రించుకొని పోయింది . మీడియా వారిలో సైతం .
2013 తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకుంది . కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సైతం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది . మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామం లో కెసిఆర్ కు దాదాపు 60 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది . ఉద్యమ కాలం లో ఈ వ్యవసాయ క్షేత్రం గురించి రాజకీయ నాయకులు రకరకాల ఆరోపణలు చేసేవారు . మీడియా లో సైతం అనేక కథనాలు రాసేవారు . ఈ కథనాల మధ్య ఓ సారి కెసిఆర్ జర్నలిస్ట్ లను తన వ్యవసాయ క్షేత్రం చూపించడానికి పిలిచారు . దాదాపు 50 మంది జర్నలిస్ట్ లు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు . ఆ క్షేత్రంలో అల్లం పంట , వివిధ రంగుల్లో ఉన్న క్యాప్సికం ( బెంగళూరు మిర్చి ) ను చూపించారు . బెంగళూరు మిర్చి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది . ఈ వ్యవసాయ క్షేత్రంలో పసుపు పచ్చ , ఎరుపు రంగులో ఉన్న బెంగళూరు మిర్చి పండిస్తున్నారు .
వ్యవసాయ క్షేత్రం అంతా చూశాక , కెసిఆర్ జర్నలిస్ట్ లతో పిచ్చా పాటి కబుర్లు మాట్లాడుతూ బెంగళూరు మిర్చి పంటపై కి చర్చ వెళ్ళింది . ఎకరానికి ఎంత పంట వస్తుంది ? రంగురంగుల్లో ఉన్న బెంగళూరు మిర్చిని ఎవరు తీసుకుంటారు అంటూ రకరకాల ప్రశ్నలు రాగా కెసిఆర్ వాటి గురించి వివరించారు . ఆకు పచ్చ రంగులో ఉండే బెంగళూరు మిర్చి మాములు ధర కే అమ్ముతారని , పసుపు రంగు , ఎరుపు రంగులో ఉండే బెంగళూరు మిర్చికి బెంగళూరులో మంచి డిమాండ్ ఉంటుందని ఒక్కో సారి మంచి ధర పలుకుతుందని , ధర బాగున్నప్పుడు రంగు రంగుల బెంగళూరు మిర్చికి ఎకరానికి 20 లక్షలు కూడా వస్తాయని కెసిఆర్ చెప్పుకొచ్చారు .
*****
అంతే వరదలో కొట్టుకుపోయే వాడికి గడ్డి పోచ దొరికినట్టు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శక్తులన్నీ బెంగళూరు మిర్చిని పట్టుకొని రాజకీయం చేశాయి . ఉమ్మడి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మొదలుకొని అప్పటి నాయకులంతా బెంగళూరు మిర్చిపై రాజకీయం చేశారు . కెసిఆర్ నల్ల ధనాన్ని , తెల్ల ధనం గా మార్చడానికి బెంగళూరు మిర్చికి ఎకరానికి 20 లక్షల వరకు వస్తాయని చెబుతున్నారని ఆరోపించారు . దీనిపై విచారణ జరిపించాలి అని అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిమాండ్ చేశారు . మా వద్ద ఉన్న భూమి తీసుకోని ఎకరానికి 20 లక్షలు ఇచ్చి చూపండి అని అప్పుడున్న పలువురు మంత్రులు డిమాండ్ చేశారు . దాదాపు రెండు వారాల పాటు రాజకీయం మొత్తం బెంగళూరు మిర్చి చుట్టూ తిరిగింది .
ఎకరానికి 20 లక్షలు వచ్చాయి అని చెప్పలేదు , మంచి ధర ఉంటే ఎకరానికి 20 లక్షలు కూడా రావచ్చు అని చెప్పిన అంశాన్ని పట్టించుకోకుండా మీడియా సైతం బెంగళూరు మిర్చి తెలంగాణ ఉద్యమం నుంచి తమను రక్షిస్తుంది అని బోలెడు ఆశలు పెట్టుకొంది . రాజకీయ నాయకులే కాదు అప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం జరిపేవారు సైతం బెంగళూరు మిర్చి ఎకరానికి 20 లక్షల ఆదాయం అనే దానిలో భారీ కుంభకోణం ఉందని తెగ ప్రచారం చేశారు .
ధర లేక టమాటా రోడ్డు మీద పారబోస్తుంటారు .. మంచి ధర ఉంటే రైతుకు టమాటా కోట్లు తెచ్చి పెడుతోంది . కోటిన్నరకు టమాటా అమ్మి ఇంకో కోటి రూపాయల టమాటా ఉన్న రైతు మహిపాల్ రెడ్డి టమాటాలు పండించిన కౌడిపల్లి , కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి దగ్గర దగ్గరగానే ఉంటాయి .
తెలంగాణ పల్లెల్లో వ్యవసాయ భూములు ఇప్పుడు కోట్ల రూపాయల పంటలు పండించడమే కాదు .. కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి . 2013 లో వ్యవసాయ క్షేత్రం దగ్గర ఓ రైతు కనిపిస్తే ఎకరం ఎంత ఉంటుంది అని మీడియా వాళ్ళు అడిగితే ఐదు లక్షలు అని చెప్పాడు . ఇప్పుడు నర్సాపూర్ , కౌడి పల్లి , గజ్వేల్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ధర పలుకుతుంది ఒక ఎకరం పొలం
24, జులై 2023, సోమవారం
నాది విష్ణుమూర్తి అవతారం . . బ్లో ఔట్ ను ఆర్పేది నేనే స్వామిజీలతో నేతలు - సివిల్ సర్వీస్ అధికారుల బంధాలు .... జ్ఞాపకాలు -77
నాది విష్ణుమూర్తి అవతారం . . బ్లో ఔట్ ను ఆర్పేది నేనే
స్వామిజీలతో నేతలు - సివిల్ సర్వీస్ అధికారుల బంధాలు
జ్ఞాపకాలు -77
---------------------------------
కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులకు మేమే సర్వం తెలిసిన వాళ్ళం , మిగిలిన వాళ్ళు అజ్ఞానులు అనే భావం చాలా బలంగా ఉంటుంది . తమపై అధికారం చెలాయించే మంత్రులకు గౌరవం ఇస్తున్నట్టు పైకి నటించినా , వాళ్ళు లేనప్పుడు వీళ్ళకేం తెలుసు అని జోకులు వేసుకునే అధికారులు కూడా ఉండేవాళ్ళు . తమ గురించి తాము ఇలా భావించే అధికారులు సైతం స్వామీజీలకు భక్తులుగా ఉండడం చాలా చోట్ల కనిపించింది . అధికారులు , రాజకీయ నాయకులు , కొన్ని చోట్ల మీడియా పెద్దల ప్రాపకం సంపాదించారు అంటే ఆ స్వామికి తిరుగు ఉండదు .
ఢిల్లీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరిచిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్ లభించలేదు . లెక్క లేనంత మంది మహిళలపై అత్యాచారాలు చేసి అరెస్ట్ చేయడానికి వెళితే యుద్ధ వాతావరణం సృష్టించిన డేరా బాబాకు లెక్క లేనన్ని సార్లు బెయిల్ లభించింది . బాబాల మహత్యం అది . వారి పవర్ అది .
టివి 5 వచ్చిన కొత్తలో పెనుగొండ స్వామి కుంభకోణాలపై ఓ స్టోరీ చేశారు . ఓ సామాన్య భక్తుడి తో మాట్లాడితో అతను చెప్పిన మాట అలా గుర్తుండి పోయింది . స్వామిని ఎలా నమ్మారు అని జర్నలిస్ట్ అడిగితే .. జిల్లా కలెక్టరే హెలికాఫ్టర్ లో స్వామి వద్దకు వచ్చి వెళ్లే వారు . ఇక సామాన్యుడిని నేను ఎంత ? అని ఆ ఆ సామాన్య భక్తుడు బదులిచ్చాడు . ఆ భక్తుడికి తెలియక పోవచ్చు కానీ బాబాల విజయ రహస్యం ఇందులోనే ఉంది .
మంత్రులు , మీడియా పెద్దలు , సివిల్ సర్వీస్ అధికారులు తమ దర్శనం కోసం రావడానికి స్వామీజీలు తీవ్రంగా ప్రయత్నిస్తారు . దీనికోసం స్వాములు , బాబాల వద్ద పి ఆర్ ఓ లు కూడా ఉంటారు . అధికారులు , మీడియా , మంత్రులు ఈ మూడు శక్తులు స్వామీజీల వద్ద కలుస్తాయి . పరస్పర ప్రయోజనాల కోసం వీరు ముగ్గురు స్వామి భక్తులు అవుతారు . వీరు ముగ్గురు స్వామి భక్తులు కావడం వల్ల స్వామి ఇమేజ్ పెరుగుతుంది . పెద్ద పెద్ద వాళ్ళే వెళుతున్నారు మనమెంత అని సామాన్యులు స్వామి దర్శనానికి క్యూ కడతారు . చాలా చోట్ల జరిగేది ఇదే . కొన్ని చోట్ల నిజంగానే భక్తి ఉండవచ్చు . ఉత్తరాదిలో కుమార్ విశ్వాస్ కు ఆథ్యాత్మిక ప్రచారంలో మంచి పేరుంది . ఆయన ప్రవచనాలను లక్షల మంది వస్తారు . ఓ టివి షోలో రాందేవ్ బాబా ను అడిగారు . మోడీ అధికారంలోకి వస్తే విదేశాల నుంచి నల్లధనం వస్తుంది అని మీరు హామీ ఇచ్చారు . నల్లధనం వచ్చే ఉంటుంది ఎక్కడుంది స్వామిజీ అని వ్యంగ్యంగా అడిగితే రాందేవ్ బాబా నవ్వి .. నాకూ కనిపించ లేదు . అందుకే ఈ మధ్య దాని గురించి మాట్లాడడం లేదు అన్నారు . ఢిల్లీ బాబాలను వదిలేస్తే ప్రతి జిల్లాలో చిన్న వారో పెద్ద వారో ఒక స్వామి కనిపిస్తారు . జిల్లాలలో పని చేసేప్పుడు ప్రతి జిల్లాల్లో ఓ స్వామి కలిశాడు .
*********
పాశర్లపూడి పూడి బ్లో ఔట్ గుర్తుందా ? గోదావరి జిల్లాల్లో అప్పుడు బ్లో ఔట్ వార్త కవర్ చేసిన జర్నలిస్ట్ లు తమ జీవితంలో ఈ సంఘటన మరిచిపోరు . ఆ సమయంలో వరంగల్ జర్నలిస్ట్ లకు సైతం బ్లో ఔట్ కు సంబంధించి జ్ఞాపకం ఉంది .
94లో పాశర్ల పూడిలో బ్లో ఔట్ మంటలు ఆర్పేందుకు అమెరికా నుంచి ఓ నిపుణుడిని పిలిపించారు . ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అయితే అమెరికా ఏజెంట్ 007 ను పిలిపించినప్పుడు సినిమాలో ఆ సీన్ ఎలా ఉంటుందో , పాశర్ల పూడిలో అతని రాక అలా ఉండేది .
అదే సమయంలో ఇక్కడ వరంగల్ లో ఉదయం జర్నలిస్ట్ మిత్రుడు మిట్టపల్లి శ్రీనివాస్ ఫోన్ చేసి బొట్టు స్వామి వద్దకు వెళదాం వస్తారా ? అని అడిగారు . చుక్కలు అన్ని కలిపితే దారి దొరుకుతుంది . ఇంత హఠాత్తుగా స్వామి వద్దకు ఎందుకా ? అంటే ?
అప్పుడు పివి నరసింహారావు ప్రధాని . పీవీకి సింగపురం రాజేశ్వర రావు అత్యంత సన్నిహితులు . ఎంత అత్యంతం అంటే రాజ్య సభ సభ్యత్వం ఇచ్చే అంత . సింగపురం బొట్టు స్వామి భక్తుడు . అప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి ఉదయం ఓనర్ . సింగపురం రాజేశ్వర రావుకు సుబ్బరామిరెడ్డి పరిచయం .. ఉదయం ఓనర్ గా సుబ్బరామిరెడ్డి ఎడిటర్ ను ఆదేశిస్తారు .. ఎడిటర్ రిపోర్టర్ ను ఆదేశిస్తారు . రిపోర్టర్ స్వామి వద్ద ప్రత్యక్ష మవుతారు . ఇదేమీ బ్రహ్మ రహస్యం కాదు జర్నలిస్ట్ లందరికీ తెలిసిందే .
ఎందో చూద్దాం అని బొట్టు స్వామి వద్దకు వెళ్ళాను . సాయంత్రం సమయం విశాలమైన ఆవరణలో స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు . అల్లా టప్పా దర్శనం కాదు . ఇంకా సెల్ ఫోన్ లు మన వద్ద మనుషుల చేతికి రాని రోజులు అవి . అచ్చం సెల్ ఫోన్ లో మిత్రులతో మాట్లాడుతున్నట్టుగానే బొట్టు స్వామి కైలాసం కు ఫోన్ చేసి శివునితో , పార్వతితో మాట్లాడారు . మన ఎదుట ఎవరైనా సెల్ ఫోన్ లో మాట్లాడితే వారు చెప్పింది నమ్మాలి కానీ అటు వైపు ఎవరు ఉన్నారో మనకు కనిపించదుకదా ? అలానే శివుడు , పార్వతి తో అతను మాట్లాడుతుంటే భక్తులు పారవశ్యంతో వింటున్నారు . భక్తులు అంటే పేద భక్తులు కాదు అక్కడున్నది చాలా మంది సంపన్న భక్తులే .
తరువాత స్వామి మీడియాతోనో , అక్కడున్న భక్తుల ముందు సంచలన ప్రకటన చేశారు . అప్పటికే అమెరికా 007 ఎంత ప్రయత్నిస్తున్నా బ్లో ఔట్ ఎంతకూ ఆరడం లేదు . నేను విష్ణు మూర్తి అవతారాన్ని , నాలోని ఆగ్రహం బ్లో ఔట్ రూపం లో బయటకు వచ్చింది . ఆ మంటలు ఆపడం ఎవరి తరం కాదు . నేను ఆర్పితే తప్ప ఆరవు అని సెలవిచ్చారు .
మీరు విష్ణు మూర్తి అవతారం కదా ? మరి ప్రజల కోసం మీరు రంగం లోకి దిగి ఆర్పుతారా ? అని భక్తి తో అడిగాను , నాలోని వ్యంగ్యం ఏమాత్రం బయటపడకుండా ....నా అంతట నేను వెళ్ళను , ప్రభుత్వం వచ్చి పిలిస్తే వెళతాను . అప్పటి వరకు వారు చేసే ప్రయత్నాలు అన్నీ వృధానే అని .. ప్రభుత్వమే తన వద్దకు వస్తుంది అని చాలా ధీమాగా చెప్పారు .
స్థానికులు ఆయన్ని బొట్టు స్వామి అనే వారు . అయన పేరు కన్నా ఈ పేరుతోనే పాపులర్ . స్వామి మహిమలు మీకు తెలియవు స్వామి పేరు రాయకుండా బొట్టు స్వామి అని రాశారేమిటి అని కొందరు భక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు . ఇప్పటికి క్షమించేయండి .. ప్రభుత్వం ఎలాగూ దిగివచ్చి బ్లో అవుట్ ఆర్పేయమని బతిమిలాడుతారు . అప్పుడు స్వామి ఆర్పేస్తారు . ఆ ఆతరువాత మీలా నే నేనూ పూర్తి కాలం భక్తుడిగా మారిపోతాను అని హామీ ఇచ్చాను .
*** ***
అమెరికా నుంచి వచ్చిన నిపుణుడు బ్లో ఔట్ ఆర్పేయలేక పోయాడు ..
మరి బొట్టు స్వామి ఆర్పేశాడా ?
లేదు అక్కడి సామాన్య ongc కార్మికులే బ్లో ఔట్ ను ఆర్పేశారు .
కాల చక్రం గిర్రున తిరిగింది . పివి, మాగుంట , సింగపురం లేరు ...
మరి విష్ణు మూర్తి అవతారం సంగతి తెలుసుకుందామని వరంగల్ జిల్లా లోని జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే .. విష్ణు మూర్తి అవతారం చాలించారు అని తెలిసింది .
వరంగల్ జిల్లాల్లో నేను తక్కువ కాలం పని చేయడం వల్ల ఆ స్వామి లీలలు ఎక్కువగా తెలుసుకోలేక పోయాను .
- బుద్దా మురళి
22, జులై 2023, శనివారం
రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు , డ్రామాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడిన మంత్రికి .. గుర్రాలతో వెంటాడిన నేతకు .. టికెట్ ఇచ్చిన బాబు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు , డ్రామాలు
రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడిన మంత్రికి .. గుర్రాలతో వెంటాడిన నేతకు .. టికెట్ ఇచ్చిన బాబు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
__________________________
రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి . డ్రామాలు ఉంటాయి . సినిమాలో హీరో ఎవరో ? విలన్ ఎవరో ముందే తెలిసి పోతుంది . శుభం కార్డు పడిన తరువాత కూడా హీరో ఎవరో విలన్ ఎవరో రాజకీయాల్లో అస్సలే తెలియదు . బాబు కోణం నుంచి సినిమా చూస్తే ఆగస్టు కుట్రలో బాబు హీరో , ఎన్టీఆర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ . అదే సినిమాను ఎన్టీఆర్ కోణం నుంచి చూస్తే ఎన్టీఆర్ హీరో , బాబు విలన్ . ఒక్క బాబే కాదు కుటుంబం మొత్తం విలన్ .అనుమానం ఉంటే జామాతా దశమ గ్రహం వీడియో వినవచ్చు .
సినిమాల్లో పలానా వ్యక్తి విలన్ అని ప్రేక్షకులకు తెలిసి పోయాక చివరి వరకు విలన్ గానే ఉంటాడు . రాజకీయాల్లో అలా కాదు ఒక పాత్ర ఒక సారి విలన్ అనిపించవచ్చు . కొంత కాలం గడిచాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపించ వచ్చు . ఒక సారి దుష్టుడు అని పించిన పాత్ర కాలం గడిచాక బాధితుడు పాపం అనిపించవచ్చు . అలాంటి ఓ బాధితుడిని టీడీపీనే శిక్షించింది , అక్కున చేర్చుకుంది . అతను విలనా ? బాధితుడా ? అంటే ఏమో ???సినిమాల్లో ఈజీగా చెప్పవచ్చు కానీ రాజకీయాల్లో చెప్పడం అంత ఈజీ కాదు .
****
ఒక మంత్రి లంచం తీసుకుంటున్నాడు అని అదే పార్టీ రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ...ఏసీబీ కి అప్పగించడం దేశంలో మొదటి సారి, చివరి సారి . ఐతే అలా పట్టుపడిన మంత్రికి ఎంపీగా టికెట్ ఇవ్వడం విన్నారా ? అంతేనా మొత్తం ఊరిని బ్యాంకు లో తాకట్టు పెట్టిన వ్యక్తి .. అక్రమాలు బయటపెట్టడానికి వెళితే గుర్రాలతో వెంటాడి దాడి చేశాడు అంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టిన బాబు అదే నేతకు ఎంపీగా టికెట్ ఇచ్చారు . ఇలాంటి వింతలు , సినిమాలను మించిన నాటకీయ పరిణామాలు ఎన్నింటికో మీడియా సాక్షిగా నిలిచింది
******
ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే 1996 పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి . అప్పటికే రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి అని చంద్రబాబు నాయుడు అనేక మీటింగ్ లలో చెప్పుకుంటూ వస్తున్నారు . ఆయన్ని వ్యతిరేకించేవారు ఉన్నట్టే .. రాజకీయాల్లో విలువలకు పట్టం కడతారు అని నమ్మినవారూ ఉన్నారు .
పార్లమెంట్ కు పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల జాబితా చూడగానే ఒక పేరు వద్ద దృష్టి ఆగిపోయింది . సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పేరు వద్ద దృష్టి అలానే నిలిచిపోయింది . ఆ పేరు బాగా పరిచయం ఉన్నట్టు తోచింది . కొద్ది సేపటి తరువాత గుర్తుకు వచ్చింది .రామచంద్రరావు అని ఖైరతాబాద్ నుంచి గెలిచిన శాసన సభ్యులు . 83లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రి . అవినీతిని నిర్ములింహ్కాడానికి అని ఎన్టీఆర్ మహాపాత్ర అని ఏర్పాటు చేశారు . రామచంద్రరావు 10 వేలో రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు . అవినీతికి సంబంధించి ఏసీబీకి తప్ప మరో సంస్థకు అధికారం లేదు . ఈ లెక్కన మహాపాత్ర ఏర్పాటే చట్ట వ్యతిరేకం . పైగా ఏసీబీ అధికారులు , ఉద్యోగులపై అవినీతి పై కేసులు పెట్టవచ్చు కానీ అప్పటి నిబంధనల ప్రకారం మంత్రి పై కేసు పెట్టె అవకాశం లేదు . ఆ రామచంద్రరావు ఏమో బాబోయ్ నాకే పాపం తెలియదు . వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి నన్ను బలి పశువును చేశారు అని లబోదిబో మన్నారు . ఆ తరువాత రామచంద్రరావు రాజకీయ చరిత్ర ముగిసిపోయింది .
ఓ నాటకం ఆది రామచంద్రరావును బలి చేశారు అని నమ్మిన వారు ఉన్నారు . ఎన్టీఆర్ కు అలా చేయాల్సిన అవసరం లేదు . రామచంద్రరావు తప్పు చేశాడు అని నమ్మిన వారూ ఉన్నారు . ఏదేమైనా రామచంద్రరావు పేరు మరుగున పడిపోయింది . ఎన్టీఆర్ ను దించి బాబు సీఎం కాగానే తొలి ఎన్నిక 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి . టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా చూస్తే సికింద్రాబాద్ నుంచి రామచంద్రరావుకు బాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు . రామచంద్రరావు జీవిత జీవితంలో ఎవరు విలన్ ? ఎవరు విలన్ అంటే ఏం చెబుతాం ? బాబు టికెట్ ఇచ్చారు కానీ అయన గెలువ లేదు . ఆ తరువాత రామచంద్రరావు మరణించినప్పుడే ఆయన పేరు వినిపించింది .
*******
2004 లో ఓడిపోయిన కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు మీడియాను వెంటబెట్టుకొని నాదర్ గుల్ గ్రామానికి తీసుకు వెళ్లారు . ఆ గ్రామం మొత్తాన్ని ఓ వ్యక్తి బ్యాంకు లో తాకట్టు పెట్టాడు అని మీడియాలో కథలు కథలుగా వచ్చింది . అప్పుడు ప్రతి రోజు ఆ వ్యక్తి అక్రమాల గురించి మీడియాలో ప్రధానంగా వచ్చేది . ఏం జరిగిందో ఏమో కానీ మీడియాలో రోజూ కథలు కథలుగా వచ్చేవి . గ్రామంలోకి మీడియాతో కలిసి బాబు వెళితే గుర్రాలతో దాడి జరిపారు అంటూ మీడియాలో షోలే సినిమాలో గబ్బర్ సింగ్ స్థాయిలో వార్తలు వచ్చాయి ,బాబు అదే స్థాయిలో వర్ణించారు . ఆ గ్రామానికి వెళ్లి వచ్చిన జర్నలిస్ట్గు లు కూడా గుర్రాల దాడులను ఒళ్ళు గగుర్పాటు కలిగే విధంగా వర్ణించి చెప్పేవారు .
గు ర్రాలతో వెంటాడడం నిజమే .. హైదరాబాద్ లో భూములు అంటే బంగారం , అలాంటి భూములను ఆక్రమించుకోవడానికి , అక్రమాలను బయట పెట్టడానికి వస్తే గుర్రాలతో దాడులు అంటే పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు . ఊరు మొత్తాన్ని ఆక్రమించుకొని బ్యాంకు లో తనఖా పెట్టాడు అని , ఈ అక్రమాలను బయటపెట్టడానికి వెళితే గుర్రాలతో దాడులు చేయించాడు అని చంద్రబాబు ఆరోపించింది నూకారపు సూర్యప్రకాశ రావు గురించి .... ఇక్కడి వరకు బాగానే ఉంది .. ఆరోపణల్లో నిజాలూ ఉండొచ్చు కానీ విశేషం ఏమంటే కొద్ది రోజుల తరువాత ఇదే నూకారపు సూర్యప్రకాశ రావుకు చంద్రబాబు అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గం ఎంపీగా టీడీపీ టికెట్ ఇచ్చారు . మీ పార్టీ ఓడిపోగానే తొలి ఉద్యమం నూకారపు మీదనే కదా ? మీడియాను వెంటబెట్టుకెళ్ళి అంత హడావుడి చేశారు ? గుర్రాలతో దాడి అన్నారు , భారీ కుంభకోణం అన్నారు , మీ పార్టీ టికెట్ ఇవ్వడం ఏమిటీ అంటే బాబు సింపుల్ గా ఆ ఆరోపణలు రుజువు కాలేదు కదా ? అందుకే టికెట్ ఇచ్చాము అని బదులిచ్చారు .. జగన్ లక్ష కోట్లు సంపాదించాడు అనేది ఋజువైందా ? రాజకీయ అవినీతి ఏ ఒక్క కేసు అయినా రుజువవుతుందా ? అని బాబును అడిగితే సమాధానం లేదు . బాబులో ఒక గొప్ప లక్షణం ఉంది నూకారపు మీద ఉగ్ర నరసింహుడిలా ధ్వజం ఎత్తిన బాబు గారే , నూకారపు ఎంత గొప్ప వారో అనకాపల్లి నుంచి ఆయన ఎందుకు గెలవాలో ఆ వెంటనే అంతే అద్భుతంగా చెప్పగలరు . చెప్పారు కూడా ...
బాబు టికెట్ ఇచ్చారు , విస్తృతంగా ప్రచారం చేశారు , సూర్య పత్రిక రోజూ అనకాపల్లి నియోజక వర్గం మొత్తం పంచి నూకారపును ఆకాశానికి ఎత్తారు . ఐతే నూకారపు అక్రమాల గురించి మొదట బాబు చేసిన ప్రచార ప్రభావం జనం మీద బలంగా పడినట్టు ఉంది . అనకాపల్లి ప్రజలు తొలుత బాబు చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకోని నూకారపును ఓడించారు.
ఆ రెండు పత్రికలు ...
ఆ రెండు పత్రికలు టీడీపీవి , వాటిని చదువ వద్దు అని వై యస్ రాజశేఖర్ రెడ్డి బహిరంగంగానే చెప్పేవారు . సీఎంగా శాసన సభలో కూడా చెప్పారు . ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు , ఆంధ్రజ్యోతి టీడీపీ పత్రికలు అని ధ్వజమెత్తేవారు . ఆ రెండు పత్రికలు అంటూ వై యస్ ఆర్ చెప్పిన మాటలు గుర్తుండి పోయాయి . మరో రెండు పత్రికల గురించి కూడా ఆయన చెప్పారు . ఐతే అందరికీ గుర్తుండక పోవచ్చు . మాకూ రెండు పత్రికలు వస్తున్నాయి అని చెప్పేవారు . ఒకటి సూర్య , రెండు సాక్షి . ఈ రెండూ కాంగ్రెస్ పత్రికలు అని వై యస్ ఆర్ బహిరంగంగానే చెప్పారు . సాక్షి ని వై యస్ ఆర్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి , సూర్యను నూకారపు సూర్యప్రకాశ రావు ఏర్పాటు చేశారు .
మా పత్రిక అని వైయస్ ఆర్ స్వయంగా చెప్పిన పత్రిక సూర్య . వైయస్ ఆర్ ఆత్మ గా పేరు పొందిన కెవిపి రామచంద్రరావుకు నూకారపు సన్నిహితులు . అలాంటి నూకారపు పత్రిక సూర్య పుట్టిన కొద్ది కాలానికే బాబు క్యాంపు లో చేరిపోయి , అనకాపల్లి ఎంపీ టికెట్ సాధించారు .
ఏ నాయకుడు ఏ క్యాంపు లో ఎంత కాలం ఉంటాడో , ఏ పత్రిక ఏ పార్టీ క్యాంపు లో ఉంటుందో చెప్పలేం .. ఎందుకంటే సినిమా ఐతే ట్విస్ట్ లను ఊహించగలం కానీ రాజకీయాల్లో ట్విస్ట్ లు ఊహించలేం ..
- బుద్దా మురళి
20, జులై 2023, గురువారం
నంబర్ 2 లు అలా తెరమరుగయ్యారు కనిపించని దేవేందర్ గౌడ్ .. వినిపించని నాగం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
నంబర్ 2 లు అలా తెరమరుగయ్యారు
కనిపించని దేవేందర్ గౌడ్ .. వినిపించని నాగం ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
-------------------------------------------
ఆ చెప్పండి సార్ నాగం జనార్దన్ రెడ్డిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా పావుగా వాడుకుంటున్నాడు , వాళ్ళ వ్యూహం ఏమిటీ ? నాగం , జగన్ మోహన్ రెడ్డి కలిసి బాబును ఎలా దెబ్బ తీయబోతున్నారు అంటూ ఆ జర్నలిస్ట్ ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించే సరికి వామ్మో అని మనసులోనే అనుకోని .. చదువుల సారమెల్ల గ్రహించితిని తండ్రి అని హిరణ్య కశ్యపుడి కి చెప్పిన ప్రహ్లదుడు గుర్తుకు వచ్చి .. బాబూ నీకు ఇంకొకరు జర్నలిజం పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు . టీవీలకు నీలాంటి వారే కావాలి .. నీకు తిరుగులేదు . నువ్వు జర్నలిస్ట్ గా పుట్టుకతోనే తలపండిన వాడివి అని చెప్పి ఫోన్ కట్ చేశాను .
******
దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది ఇది . హెచ్ ఏం టివిలో ముక్కామల చక్రధర్ అని జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవారు . భూమి నుంచి బయటకు వెళ్లి హెచ్ ఎం టివిలో చేరాడు . ఓ రోజు ఫోన్ చేసి మా ఛానల్ లో కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ ఒకడు ఉన్నాడు . అతనికి పొలిటికల్ రిపోర్టింగ్ ఆసక్తి . మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు అని చెప్పాడు . రాజకీయ వార్తల కోసం నీతో మాట్లాడుతాడు , కాస్త సలహా ఇవ్వమని చక్రధర్ చెబితే , సరే కాల్ చేయమని చెప్పాను అతని పేరు గుతూ లేదుకానీ మాట్లాడిన మాటలు గుర్తున్నాయి .
బాబును మీడియా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రోజులు అవి . బాబు కోసం ఎన్టీఆర్ ను సైతం ఎదిరించిన మీడియా వెలిగిపోతున్న రోజులు . ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతుండడం , టీడీపీ బలహీన పడుతోంది . దాంతో తెలంగాణ టీడీపీ నాయకులు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు . భవిష్యత్తు ఏమిటా ? అనే ఆలోచన వారిని వెంటాడుతుంది . అప్పటివరకు తెలంగాణ తానే నంబర్ టూ అని భావిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి దిక్కు తోచని పరిస్థితి . జేఏసీ నాయకునిగా ప్రొఫెసర్ కోదండరాం ను కెసిఆర్ ముందుకు తీసుకురావడం , రోజూ కోదండరాం మీడియాలో కనిపించడం తో నాగంను ఆందోళనకు గురి చేసింది . కోదండరాం తెలంగాణలో బలమైన రెడ్డి నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని ఓ సారి ఇష్టాగోష్టి లో చెప్పుకొచ్చారు .
టీడీపీలో ఉండలేడు , తెరాస లో చేరలేడు .. మరేం చేయాలో స్పష్టత లేదు . శాసన సభలోనే బాబు విధానాలపై విమర్శలు చేసి కలకలం సృష్టించి , తిరిగి బాబు పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టడం తో సీరియస్ నెస్ పోయింది .
ఈ దశలో మీడియాలో బోలెడు వార్తలు . నాగం తో వైయస్ జగన్ మోహన్ రెడ్డినే తిరుగుబాటు చేయిస్తున్నాడు అనేది మీడియా వార్తల సారాంశం . నాగం , జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ రెడ్డి నాయకులే ఈ ఒక్కటి తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి సామీప్యం లేదు . తెలంగాణ కు చెందిన నాగం , సమైక్యాంధ్ర ను కోరుకుంటున్న జగన్ చెప్పినట్టు ఎందుకు చేస్తారు ? చేస్తే అతనికి ఏ విధంగా ప్రయోజనం అనేది మీడియాకు అనవసరం , అంత ఆలోచించే ఓపిక లేదు . జగన్ చెబితేనే నాగం తిరుగుబాటు అంటే సరిపోతుంది . చాలా ఛానల్స్ లో, పత్రికల్లో ఇలానే వార్తలు వచ్చాయి .
హెచ్ ఏం టివి నుంచి ఫోన్ చేసిన కుర్ర జర్నలిస్ట్ నాగం విషయం ఏమిటీ అని ప్రశ్నిస్తే ఇది చెప్పేవాడిని , కానీ అతను ఫోన్ చేసి నాగం , జగన్ కుమ్మక్కు కుట్ర అని అతనే చెబుతుండడం తో ఇలాంటి వారికి చెప్పి వృధా అని నువ్వు అనుకుంటున్న విషయం తోనే ఛానల్ కు స్టోరీ చేసేయ్ అని చెప్పాను ...
టీడీపీలో దశాబ్దాల పాటు తెలంగాణకు సంబంధించినంత వరకు నంబర్ 2 గా అధికారం చెలాయించి తెలంగాణ ఉద్యమం తో ఎటు పోవాలో తెలియక , తెలంగాణ కోసం మొదట సొంత సంస్థ , తరువాత బిజెపి అటు నుంచి కాంగ్రెస్ లో చేరారు .
నాగం చెప్పలేదు , దేవేందర్ గౌడ్ చెప్పారు . మేం నంబర్ 2 గా ముందు వరుసలో ఉంటే కెసిఆర్ మూడవ వరుసలో ఉండేవారు , మేం తెరాస లో చేరి కెసిఆర్ నాయకత్వం లో పని చేయడం ఏమిటీ అందుకే అటు వెళ్లడం లేదు అని దేవేందర్ గౌడ్ చెప్పారు . నాగం మంత్రి అయినప్పుడు బహుశా రేవంత్ రెడ్డి విద్యార్ధి కావచ్చు . ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షుడు కాగా , నాగర్ కర్నూల్ నాయకునిగా నాగం కాంగ్రెస్ లో ఉన్నారు . నాగం కు నాగర్ కర్నూల్ టికెట్ కూడా గ్యారంటీ అని చెప్పలేం .
అచ్చిరాని నంబర్ 2
రాజకీయాల్లో నంబర్ 2 లు ఎప్పుడూ నంబర్ వన్ లకు అచ్చిరారు . అలానే నంబర్ 2 లకు కూడా నంబర్ వన్ ల నుండి గండం తప్పదు . ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో ఎన్ని జిల్లాల్లో దాదాపు అంతమంది నంబర్ 2 లు ఉండేవాళ్ళు . వీళ్ళలో కొందరు నంబర్ వన్ చేతిలో , కొందరు కాల ప్రవాహం లో కొట్టుకు పోయారు . నాదెండ్ల కో పైలట్ ను అని వెన్నుపోటుతో బయటకు వెళ్లారు . అలా నంబర్ 2 అనుకున్న దగ్గుబాటి తో సహా చాలా మందిని బాబు విజయవంతంగా బయటకు పంపారు . ఆ దశలోనే రాష్ట్రంలో ఒక నంబర్ 2 వద్దు , జిల్లాకో నంబర్ 2 ఉండాలి అని బాబు అలా మాధవరెడ్డి , నాగం , దేవేందర్ గౌడ్ అలా జిల్లా కొక నంబర్ 2ను ప్రోత్సహించారు .
తెలంగాణ ఉద్యమ సమయంలో దేవేందర్ గౌడ్ ఓ రోజు మేం ముందు వరుసలో ఉంటే కెసిఆర్ మూడవ వరుసలో ఉండేవారు . నేను అతని నాయకత్వంలో ఎలా పని చేస్తా అని ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో బాధపడ్డారు . మీరు మంత్రి కాక ముందు మీ జిల్లాలో వెలిగిపోయిన కాంగ్రెస్ నేతలు మారిన కాలంలో తెరమరుగు అయ్యారు . టివి 9 రవిప్రకాష్ సుప్రభాతంతో 3వేల జీతంతో పని చేసేప్పుడు నాకు భూమిలో అంతకు రెట్టింపు జీతం . ఇప్పుడు ఏమిటీ ? అనేది ముఖ్యం కానీ గతంలో నేను ఇది నువ్వు అది అంటే కుదరదు . సంపాదకుడిగా ఓ వెలుగు వెలిగిన పతంజలి రవిప్రకాష్ వద్ద పని చేశారు . ఈ రోజు ఏమిటీ అనేది ముఖ్యం కానీ నేను పైన ఉన్నప్పుడు కాలం అలానే ఆగిపోవాలి అని చాలా మంది కోరుకుంటారు . అది సాధ్యం కాదు . కాలం ఆగదు .
టీడీపీలో ఉండలేక , కాంగ్రెస్ లోకి వెళ్లలేక , తెరాస లో చేరే ఇష్టం లేక దేవేందర్ గౌడ్ తీవ్రంగా మదన పడ్డారు . ఆ దశలో కొందరు మేధావులకు ఆయన చిక్కి పోయారు .తెలంగాణ పేరుతో ఓ పార్టీ పెట్టారు . చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు .
బోర్డు ల మీద , వాహనాల మీద టిజి అని రాస్తే తెలంగాణ వస్తుందా ? ఇదేం ఉద్యమం అని అడిగితే .. ఎప్పుడు పెద్ద గడ్డం తో ఉండే ఓ మేధావి పేరు చెప్పి అతని సలహా .. ఇంకా వీటి పేర్లు మార్చాలి అని చెప్పాడో గుర్తు చేసుకున్నారు . రాజకీయంగా సంక్షోభ పరిస్థితి ఎదుర్కొని మానసికంగా దెబ్బ తిని , అనారోగ్యం పాలయ్యారు . నిజానికి రాజకీయాల్లో మంచి అభ్యుదయ కరమైన ఆలోచనలు ఉన్న కొద్ది మంది నాయకుల్లో దేవేందర్ గౌడ్ ఒకరు . సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక దెబ్బ తిన్నారు . ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో నంబర్ 2 ల శకం ముగిసింది .
- బుద్దా మురళి
19, జులై 2023, బుధవారం
దేశంలోని 16లో 15 మంది ప్రముఖ జ్యోతిష్యులు బాబే గెలుస్తాడని చెప్పారు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -75
దేశంలోని 16లో 15 మంది ప్రముఖ జ్యోతిష్యులు బాబే గెలుస్తాడని చెప్పారు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -75
-------------------------------------
తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , దేశంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు . పత్రికలు చదివే అలవాటు , కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఈజీగానే గెస్ చేసి చెప్పవచ్చు . రిపోర్టర్ గెస్ చేసి చెబితే వంద శాతం నిజం అయినా రూపాయి కూడా జీతం పెరగదు . అదే ఓ జ్యోతిష్యుడు చెబితే , అది ముందుగా విడియోలోనో , పత్రికలోనో రికార్డ్ అయి ఉంటే ఫలితాలు వచ్చాక ఆ వీడియోలు చూపి నేను ముందే చెప్పాను అని ఓ వీడియో రిలీజ్ చేస్తే అతని గిరాకీ పెరుగుతుంది , ఫీజు పెరుగుతుంది . ఒక్క వేణు స్వామి అనే కాదు రాజకీయ జోస్యాలు చెప్పే స్వాములు అంతా ఇంతే . అంచనా నిజం కావడం తప్ప ఇందులో ప్రత్యేక శక్తులు అంటూ ఏమీ లేవు , ఉండవు .
ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన ప్రధానులు పివి నరసింహారావు , మన్మోహన్ సింగ్ ల కంటే సంస్కరణలపై ఎక్కువ ప్రచారం పొందింది చంద్రబాబు నాయుడు . పివి ప్రధానిగా దిగిపోయి బాబు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేగంపేట రామానంద తీర్ధ ట్రస్ట్ లో ఓ కార్యక్రమం . బాబు కోసం పివి నిరీక్షించడం చూసి రాజకీయాల్లో ఇంతే అనిపించింది . ఆ కార్యక్రమంలో బాబు ఆర్థిక సంస్కరణలు , ట్రిలియన్ , మిలియన్ లు అంటూ చెబితే , పివి వాటి గురించి తనకు అంతగా తెలియదు అన్నారు .
ఇంగ్లీష్ మీడియా బాబును ముద్దుగా మీడియా డార్లింగ్ అంటూ పిలిచేది . దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రచారానికి బాబు తీవ్రంగా కృషి చేసేవారు . సంక్షేమ పథకాలు , రైతులు , వ్యవసాయం , ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు వంటి అంశాలు ఇంగ్లీష్ మీడియాకు బోరింగ్ అంశాలు . బాబు చెప్పే ఐటీ కబుర్లు , ఉచితాల రద్దు , సబ్సిడీ బియ్యం ధర పెంపు, ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలకు జాతీయ మీడియాలో సైతం మంచి అనుకూల ప్రచారం లభించేది .
దేశం లో ఏ రాష్ట్రంలో ఉన్న జ్యోతిష్యుడు ఐనా ఒకటే కదా ? పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా రాజకీయ జ్యోతిష్యం చెబుతారు . 2004 ఎన్నికల ముందు ఇండియా టుడే వారు ఓ ప్రయోగం చేశారు . బహుశా వాళ్ళు ఇంగ్లీష్ ఇండియా టుడే కోసం ఈ ప్రయోగం చేసి తెలుగు ఇండియా టుడే లో కూడా ప్రచురించి ఉంటారు . తెలుగు ఇండియా టుడే లో చూశాను . దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రముఖ జ్యోతిష్యులతో 2004 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అని అడిగారు . 16 మందిలో 15 మంది దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జ్యోతిష్యులు చంద్రబాబు జాతకం అద్భుతంగ ఉందని , బాబే మళ్ళీ బ్రహ్మాండంగా గెలుస్తాడు అని జ్యోతిష్యం చెప్పారు . ఆ ప్రముఖ జోతిష్యుని పేరు , వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు , అంతకు ముందు వారు చెప్పిన గొప్ప గొప్ప జ్యోతిష్యాలు కూడా ఆ వ్యాసంలో పేర్కొన్నారు . 16 మందిలో ఒకే ఒక్కరు బాబు గెలువరు , ఓడిపోతారు అని జ్యోతిష్యం చెప్పారు . మిగిలిన వారు నిజమైన జ్యోతిష్యులు కాదు వీరు ఒక్కరే నిజమైన వారు అని అపోహ అవసరం లేదు . బాబు ఓడిపోతాడు అని చెప్పిన ఏకైక జ్యోతిష్యులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు . అప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం , ఆ సమయంలో కమ్యూనిస్ట్ లు బాబును తీవ్రంగా వ్యతిరేకించారు . సహజంగా బెంగాల్ కమ్యూనిస్ట్ మీడియా లో సైతం బాబు విధానాల పట్ల వ్యతిరేక వార్తలు సహజం . ఆ ప్రభావం తో బాబు ఓడిపోతారు అని బెంగాల్ జ్యోతిష్యులు చెప్పారు .
****
అదే సమయంలో నేను ఏకంగా బాబుకే చెప్పాను ఈ సారి మీరు ఓడిపోతారు అని ...
రోడ్డు మీద ఉన్న వారితో మాట్లాడిన తరువాత ఓటమి ఖాయం అని గట్టిగా అనుకున్నా ..
రోడ్డు మీద చిలక జోష్యం వాడితో కాదు .. రోడ్డు మీద వ్యాపారం చేసే సామాన్యుల మాటలు విన్నాక ఓటమి ఖాయం అనిపించింది . . గ్రామాల్లో బస్టాండ్ లో సామాన్యులు , కూరగాయల వ్యాపారాలు , ఆర్డనరీ బస్సుల్లో ప్రయాణికులు , మాములు ఇరానీ హోటల్స్ లో వాళ్ళు మాట్లాడుకున్నది వినాలి . మహా మహా మీడియాలో మాట్లాడే విశ్లేషకుల మాటలు విని ఏర్పరచుకునే అభిప్రాయం కన్నా వీరి మాటలు విని ఏర్పరచుకునే అభిప్రాయం ఫలితాలను తేలుస్తుంది .
****
2004 ఎన్నికలకు ముందు బాబు ఇంట్లో బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ . టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఏఎం రాధా కృష్ణ ఉండేవారు . ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక సార్ మీతో మాట్లాడుతాడట ఆ గదిలో ఉండమన్నారు అంటే .. ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక రాధాకృష్ణ చూపిన గదిలో కూర్చున్నా . కొద్ది సేపటి తరువాత బాబు వచ్చి మాట్లాడితే ఈ సారి మీరు ఓడిపోయారు , ఎలా ఓడిపోయారో , ఎందుకు ఓడిపోతున్నారో వివరంగా చెప్పాను . ఎన్నికల ముందు పూజారిని కూడా హెలికాఫ్టర్ లో తీసుకువెళ్లి దేవాదుల ప్రాజెక్ట్ శంకుస్థాపన పూజ చేశారు . ఇలాంటివి జనం నమ్మరు . మీడియా ప్రచారం తప్ప గ్రామీణుల్లో , సామాన్యుల్లో అనుకూలత లేదు అని రోడ్డు మీద పండ్లు అమ్ముకునేవారు , ఇరానీ హోటల్ లో సామాన్యులు మాట్లాడిన మాటలు బాబుకు చెప్పాను . లేదు ఈ సారి గెలుస్తాం, గెలిచాక తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తాను అని బాబు చెప్పుకొచ్చారు .
****
అడిగిన వారికి , అడగని వారికి మాత్రమే బాబు ఎందుకు ఓడిపోతారో చెప్పేవాడిని . అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు క్లింటన్ హైదరాబాద్ వచ్చి వెళ్లారు . బాబుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు . ఆంధ్ర భూమిలో డెస్క్ ఇంచార్జ్ బుద్ధవరపు రాజేశ్వర ప్రసాద్ అని ఉండేవారు . బాబు ఎలా ఓడిపోతారో చెబితే అతనికి నచ్చలేదు . చివరగా నీకు అమెరికా అధ్యక్షుడు క్లింటన్ కన్నా ఎక్కువ తెలుసా? క్లింటన్ మెచ్చుకుంటే నువ్వేమో ఓడిపోతాడు అంటున్నావు అని ప్రశ్న సంధించాడు . క్లింటన్అ కు తెలిసినట్టుగా అమెరికా గురించి నాకు సముద్రంలో నీటి చుక్క అంత కూడా తెలియదు . బేగం పేట విమానాశ్రయం నుంచి అత్యంత వేగంగా కారులో హై టెక్ సిటీకి వెళ్లి , తిరిగి అంతే స్పీడ్ గా విమానాశ్రయానికి , అటు నుంచి అమెరికాకు వెళ్ళిపోయిన క్లింటన్ కు ఏం తెలుస్తుంది ఇక్కడ సామాన్య ఓటరు మనసులో ఏముందో ? క్లింటన్ కు తెలియదు సామాన్యుడి గురించి సామాన్యుడికే తెలుస్తుంది అని బదులిచ్చాను .
****
అలిపిరి లో నక్సల్స్ దాడి వల్ల సానుభూతి తో గెలుస్తానని భావించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది . కాంగ్రెస్ , తెరాస కూటమి విజయం సాధించింది .
దేశంలోని 16 మంది ప్రఖ్యాత జ్యోతిష్యుల్లో 15 మంది చెప్పిన జ్యోతిష్యం అబద్దం అయిందని ఇండియా టుడే వాళ్ళు రాయలేదు . మేం చెప్పింది నిజం కాలేదు అని ఆ జ్యోతిష్యులు ప్రకటించలేదు .
- బుద్దా మురళి
18, జులై 2023, మంగళవారం
మిద్దె రాములు ఒగ్గు కథ - కరీంనగర్ ఉప ఎన్నికల ఫలితం.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -74
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -74
--------------------------------------
కెసిఆర్ రాజీనామాతో కరీం నగర్ పార్లమెంట్ నియోజక వర్గం ఉప ఎన్నిక . టీడీపీ తరపున ఎన్నిక బాధ్యత దేవేందర్ గౌడ్ కు అప్పగించారు . తెలంగాణ ఉద్యమ సమయం. అన్ని పార్టీల ప్రచారంలో తెలంగాణ పాటలు చేరిన కాలం . ప్రచారం కోసం టీడీపీ కొన్ని సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసింది . ఆ బృందాలు ఎన్టీఆర్ భవన్ లో రిహార్సల్స్ చేస్తున్నాయి . దేవేందర్ గౌడ్ కొద్ది మంది విలేకరులతో కలిసి ఆ పాటలు వింటున్నారు . కొద్ది సేపటి తరువాత ఆ గాయకుడిని దేవేందర్ గౌడ్ పిలిచి నువ్వు మిద్దె రాములు తరహాలో పాడుతున్నావు కదా ? అని అడిగారు . అతను ఔను అని బదులిచ్చాడు . మిద్దె రాములు అద్భుతంగ ఒగ్గు కథ చెబుతాడు . చదువుకోలేదు కానీ గొప్ప ఒగ్గుకథ కళాకారుడు . వేముల వాడకు చెందిన వారు . దేవేందర్ గౌడ్ విలేకరులకు మిద్దె రాములు గురించి చెప్పారు . గాయకునితో .. ఒక పని చేయండి మీరు మిద్దె రాములులా ఒగ్గు కథ చెప్పడం ఎందుకు .. మిద్దె రాములును రమ్మనండి కరీం నగర్ ఎన్నికల ప్రచారంలో ఒగ్గు కథ ద్వారా ప్రచారం చేయాలి అని అడిగారు . మనం ఇంతకు ముందే పిలిచాం అతను రాడు సార్ అని గాయకుడు చెప్పాడు . అడిగినంత ఇద్దాం అని గౌడ్ చెబితే .. తెలంగాణ కోసం తెరాస కు ఉచితంగానే ప్రచారం చేస్తా కానీ రాను అన్నాడు సార్ అని గాయకుడు చెప్పగానే గౌడ్ ఆ విషయం వదిలేసి కరీం నగర్ లో గెలువ బోతున్నాం అంటూ లెక్కలు చెప్పారు .
మీ గాయకుడు చెప్పింది సరిగ్గా విశ్లేషించుకుంటే అతని మాటల్లో కరీం నగర్ ఫలితం ఎలా రాబోతుందో స్పష్టమైంది అని ... మీరు డబ్బులు ఇచ్చినా రాడు , తెలంగాణ కోసం తెరాస కు ఉచితం గా ప్రచారం చేస్తాడు అని మీ గాయకుడే చెబుతున్నాడు అంటే కరీం నగర్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం కావడం లేదా ? అంటే దేవేందర్ గౌడ్ తన స్టైల్ లో నవ్వి ఊరుకున్నారు .
*******
వై యస్ ఆర్ ఉంటేనా ?
చాలా మంది సమైక్య వాదులు వై యస్ ఆర్ ఉంటేనా ? తెలంగాణ రాక పోతుండే అంటూ చెబుతుంటారు . 2004 లో తెరాస , కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేస్తే కరీంనగర్ లో కెసిఆర్ కు 50 వేల మెజారిటీ వస్తే , వై యస్ ఆర్ , కెసిఆర్ ల మధ్య మాటల యుద్ధం సాగి కెసిఆర్ రాజీనామా చేశారు . ఎవరి వల్ల ఎవరు గెలిచారో తేల్చుకుందాం అని సవాల్ చేశారు . ఆ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ , టీడీపీ సర్వ శక్తులు ఒడ్డి పోరాడాయి . ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తెలంగాణ ఉద్యమానికి తాను నాయకత్వం వహించవచ్చు అని దేవేందర్ గౌడ్ భావించి తీవ్రంగా ప్రయత్నించారు . కెసిఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం ముగిసిపోయినట్టే అని భావించి వై యస్ ఆర్ సర్వ శక్తులు ఒడ్డి పోరాడారు . నిజానికి వీరి తీవ్ర ప్రయత్నం తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడించి . కెసిఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం ముగిసినట్టే అని భావించి తెలంగాణ వాదులు పార్టీలకు సంబంధం లేకుండా కృషి చేశారు . వై యస్ ఆర్ వ్యూహం తో తొలిసారిగా ఎం ఐ ఎం నాయకుడు అసదుద్దీన్ తమ పార్టీ కోసం కాకుండా కరీంనగర్ లో కాంగ్రెస్ కోసం ప్రచారం చేశారు . మందకృష్ణ మాదిగ ప్రచారం చేశారు . కరీంనగర్ లో డబ్బు ప్రవహించింది . కరీంనగర్ లో జనాభాను మించి కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినట్టు వై ఎస్ ఆర్ కు సన్నిహితంగా ఉండే రవిచంద్ ఓ సందర్భంలో చెప్పారు . నిజానికి ఒక్క నియోజక వర్గానికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు . ఐతే ఒక్క నియోజక వర్గంలో స్వయం గా కెసిఆర్ ను ఓడిస్తే మొత్తం ఉద్యమాన్ని ఆడించినట్టు , ఇక ఉద్యమం ఉండదు అనే భావనతో వై యస్ ఆర్ కరీం నగర్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు .
***********
ప్రచార పర్వం ముగిశాక ఓ రోజు ప్రెస్ క్లబ్ పక్కన ఉన్న చైనీస్ రెస్టారెంట్ లో నేనూ , సినీ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం , రవిచంద్ తింటూ .... కొద్ది సేపటి తరువాత కరీంనగర్ నగర్ ఫలితం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అని ధర్మవరపు నన్ను అడిగారు . ఎంత ఎక్కువ ప్రత్యర్థుల దాడి ఉంటే కెసిఆర్ కు మెజారిటీ అంత పెరుగుతుంది . కాంగ్రెస్ కులాల లెక్కలు వేస్తుంది . అక్కడ కులాల లెక్కలు ఉండవు తెలంగాణ లెక్కలు ఉంటాయి అని చెప్పాను . నా మాటలతో కరీంనగర్ ఫలితం తెలుస్తోంది అని ధర్మవరపు బదులిచ్చారు .మేమిద్దరం కాంగ్రెస్ అని తెలుసు , కాంగ్రెస్ ప్రచార బాధ్యత నిర్వహిస్తున్న సంగతి తెలుసు ఐనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తెరాస గెలుస్తుంది అని చెప్పావు అంటే .. అని ధర్మవరపు నవ్వారు .
***********
2009 లో 156 సీట్ల తో వైయస్ ఆర్ గెలిచారు . ఎప్పుడూ లేనన్ని పథకాలను ఐదేళ్ల పాటు అమలు చేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో 156 సీట్లు మాత్రమే వచ్చాయి . 294 సీట్లు ఉన్న అసెంబ్లీ లో కేవలం 8 సీట్ల మెజారిటీ మాత్రమే . సోనియా గాంధీ కి తెలంగాణా ఇవ్వాలి అని ఉన్నా , 2009 వరకు ఆపగలిగాం , 2014 లో మనకు ఇంత బలం ఉండదు , కాంగ్రెస్ అధిష్టానం ను ఆపలేం .. మీ మీ జిల్లాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంక్ధించి ఏమేమీ పనులు ఉన్నాయో పూర్తి చేసుకోండి అని సన్నిహిత మంత్రులతో చెప్పేవారు . అంతకు ముందు భూమిలో తరువాత ఎన్ టివి , సాక్షిలో చేసిన జర్నలిస్ట్ మిత్రుడు వై యస్ ఆర్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి సన్నిహితులు అతను ఓ సారి వై ఎస్ ఆర్ తో మాట్లాడితే తెలంగాణ వ్యక్తికి బంగారు ఇంటిని కట్టించి ఇచ్చినా తెలంగాణ గుడిసె కావాలి అంటాడు , తెలంగాణ అనివార్యం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పుకొచ్చాడు .
************
కరీంనగర్ లో ఏమైంది అంటే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే కెసిఆర్ 50 వేల మెజారిటీ వస్తే దేవేందర్ గౌడ్ ( టీడీపీ ) వై యస్ ఆర్ ( కాంగ్రెస్) సర్వ శక్తులు ఒడ్డి బోలెడు ఖర్చు చేసి పోటీ చేస్తే , కెసిఆర్ కు రెండు లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది .కెసిఆర్ కు 3,78,030 ఓట్లు వస్తే కాంగ్రెస్ జీవన్ రెడ్డికి 1,76,448 ఓట్లు , టీడీపీ రమణకు 1,70, 268 ఓట్లు వచ్చాయి .
కరీం నగర్ ఫలితం అన్ని పార్టీల్లోని తెలంగాణ నాయకులను ఆలోచనల్లో పడేసింది . తెలంగాణ అనివార్యం అనే భావం ఏర్పడేట్టు చేసింది . తెలంగాణ అనివార్యం అయినప్పుడు ఎటు వైపు ఉండాలి అనే ఆందోళన కాంగ్రెస్ వారిలో కన్నా టీడీపీ వారిలో ఎక్కువ ఆందోళన కలిగించింది . తెలంగాణ తెచ్చామని తెరాస , ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటుంది మరి మనమేం చెప్పుకోవాలి అనే ఆలోచన టీడీపీ తెలంగాణ నాయకుల్లో మొదలు కవాదనానికి కరీం నగర్ ఎన్నిక దోహదం చేసింది . కెసిఆర్ ప్రజలకు పరీక్ష పెడుతున్నారని జ్యోతి సంపాదకీయం . కెసిఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పుడు , మహబూబ్ నగర్ నుంచి రాజీనామా చేసి పోటీ చేసినప్పుడు చాలా మంది తప్పుడు వ్యూహం దెబ్బ తింటారు అన్నారు . ఫలితాలు వచ్చి , తెలంగాణ సాకారం అయ్యాక ఇప్పుడు ఏమన్నా అనుకోవచ్చు కానీ ఆ రోజుల్లో మాత్రం కెసిఆర్ రాజీనామా చేసినప్పుడు ఏమైనా ఐతే ఎలా అని ప్రతి తెలంగాణ వాది భయపడ్డారు . కెసిఆర్ మాత్రం నాకు తెలంగాణ ప్రజల మనసు తెలుసు అని ముందడుగు వేశారు .
బీజేపీలో చేరిన తరువాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ కెసిఆర్ రాజకీయం గురించి చెబుతూ కెసిఆర్ రాజకీయ జీవితం అంతా అఫెన్స్ లోనే సాగుతుంది . డిఫెన్స్ రాజకీయం ఉండదు అన్నారు .
- బుద్దా మురళి
17, జులై 2023, సోమవారం
ఉచిత విద్యుత్ కు బాబు అలా సై అన్నారు .... విద్యుత్ లో టీడీపీ హయాం కన్నా కాంగ్రెస్ ... కాంగ్రెస్ కన్నా తెరాస బెటర్ ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -73
ఉచిత విద్యుత్ కు బాబు అలా సై అన్నారు ....
విద్యుత్ లో టీడీపీ హయాం కన్నా కాంగ్రెస్ ... కాంగ్రెస్ కన్నా తెరాస బెటర్
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -73
--------------------------------------
మేం అధికారం లోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం అని 2004 ఎన్నికల ఫలితాల తరువాత ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ప్రకటించగానే అంతా అవాక్కయ్యారు . విలేకరుల కన్నా ముందు టీడీపీ ముఖ్యనాయకులంతా బాబు నోటి నుంచి ఈ మాట విని ఆ మాట అంటున్నది బాబే నా ? అని ఆశ్చర్య పోయారు . ఎందుకంటే అంతకన్నా ముందు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచవద్దు అని ఉద్యమిస్తే కాల్పులు జరిపి ముగ్గురి మరణానికి కారణం అయ్యారు . ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయని బాబు చాలా గట్టిగా వాదించారు . ఈ వాదనను పెద్ద సంఖ్యలో నమ్మినవారు కూడా ఉన్నారు .
2004 ఎన్నికల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఎన్నికల ప్రధాన అంశంగా మారించి . ఏదైనా ఒక బలమైన విమర్శ చేసేప్పుడు ముందు చంద్రబాబు చేయరు . నన్నపనేని రాజకుమారి లేదా మరో నేతతో ఆ మాట చెప్పించి , ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూశాక చంద్రబాబు చెబుతారు . అదే విధంగా ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికి వస్తాయని తొలుత రాజకుమారి విమర్శించారు . తరువాత బాబు , పార్టీ మొత్తం ఆ మాటను బాగా ప్రచారం లోకి తీసుకు వచ్చారు . చాలా మంది ఆ మాటలు నమ్మారు కూడా . ఫలితాలు వచ్చి టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామంలో రాజకీయ ప్రచారం కోసం విద్యుత్ తీగలపై నిజంగానే బట్టలు ఆరేసి ఈనాడులో మంచి ప్రచారం లభించేట్టు చేశారు . వాస్తవం తెలిసి తరువాత మౌనంగా ఉన్నారు .
అలాంటి రోజుల్లో ఉచిత విద్యుత మేమూ ఇస్తామని బాబు ప్రకటించడం మీడియాకే కాదు సొంత పార్టీ వారికి సైతం ఆశ్చర్యం కలిగించింది .
*****
2004 ఎన్నికల్లో ఓడిపోయిన దాదాపు మూడు నాలుగు నెలల తరువాత ఎన్టీఆర్ భవన్ లో పార్టీ కీలక సమావేశం . టీడీపీ మాజీ శాసన సభ్యురాలు శోభానాగిరెడ్డిని ఎన్టీఆర్ భవన్ లో పలకరించి మాట్లాడితే పార్టీ కీలక సమావేశం మేం వివిధ పథకాలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆమె సలహా అడిగారు . సమాచారం అనేది వన్ సైడ్ గా ఉండదు . నాయకులు , రిపోర్టర్ లు పరస్పరం , అభిప్రాయాలు, సమాచారం పంచుకుంటారు . వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మేమూ ఇస్తాం అని బాబును చెప్పమని మీటింగ్ లో సలహా ఇవ్వండి అని శోభానాగిరెడ్డికి చెప్పాను . ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది , ఉచిత హామీలు ఇప్పుడు ఇస్తే వచ్చేదేముంది అని ఆమె అడిగారు . .. ఉచిత విద్యుత ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అని మీరు అంత బలంగా ప్రచారం చేశారు కాబట్టి ఉచిత విద్యుత్ అంశం లో మీ పార్టీ ఏం చేసినా , ఏం చెప్పినా మీకు మైలేజ్ రాదు .. ఐతే మేమూ ఇస్తాం అని మీరు ప్రకటిస్తే 2009 కు విద్యుత్ అనేది ప్రచార అంశం కాదు . . మీరు బట్టలు ఆరేసుకోవడానికి విద్యుత్ తీగలు అనే మాట ఎంత కాలం అంటే అంత కాలం మీ ప్రత్యర్థులకు విద్యుత్ ప్రచార అస్త్రం అవుతుంది అన్నాను . మీటింగ్ లో శోభా నాగిరెడ్డి బాబుకు ఇదే మాట చెప్పారు . చాలా సేపు చర్చ .. ఇవే సందేహాలు , ఇదే సమాధానం ...
******
పార్టీ సమావేశం ముగిశాక అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ మేమూ ఇస్తామని టీడీపీ ప్రకటన .యూ టర్న్ తీసుకున్న బాబు అని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు . సంస్కరణల నుంచి వెనక్కి వెళుతూ యూ టర్న్ తీసుకున్నారని ఇంగ్లీష్ పత్రికల్లో మరింత పెద్ద వార్తలు . మీరు బాబును తప్పుదారి పట్టించారు అని అప్పుడు జ్యోతి టీడీపీ రిపోర్టర్ శోభానాగిరెడ్డి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు . ఆ రోజు పత్రికలో వార్త చూసి అప్పటికప్పుడు లాభనష్టాలు అంచనా వేయవద్దు . ఒక్క రోజు నెగిటివ్ వార్త వస్తుంది అని నేను మీకు ముందే చెప్పాను , కానీ తరువాత ఉచిత విద్యుత్ ఎన్నికల ప్రచార అంశమే కాకుండా పోతుంది అని శోభానాగిరెడ్డికి చెప్పాను .. టీడీపీ ప్రకటన తరువాత ఉచిత విద్యుత్ పెద్దగా ప్రచార అంశమే కాకుండా పోయింది .
*****
మేము తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల వల్లనే ఇప్పుడు వైయస్ ఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు . విద్యుత్ రంగంలో వై యస్ ఆర్ చేసిందేమి లేదు మేము అధికారంలోకి వచ్చాక మేమూ ఉచిత విద్యుత్ ఇస్తాం అని బాబు ప్రకటించారు .
ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా తట్టుకొని బాబు విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చారు . కానీ ప్రతిపక్షంలో ఉన్న వైయస్ ఆర్ ఉచిత విద్యుత్ సాధ్యమే అని నమ్మితే అధికారంలో ఉండి , వ్యవస్థ మొత్తం తన చేతిలో ఉన్నా ఉచిత విద్యుత్ ఇవ్వ వచ్చు అనే నమ్మకం బాబుకు కలుగలేదు . విద్యుత్ బోర్డు ను విడదీసి సంస్కరణలు తెచ్చిన బాబు హయాంలో ఉన్న అధికారులే వై యస్ ఆర్ హయాంలో ఉన్నారు . బాబు గొప్ప విజనరీ , కంప్యూటర్ కనిపెట్టారు , సెల్ ఫోన్ తెచ్చారు అనే ప్రచారమే తప్ప విద్యుత్ గురించి తన అవసరం ఏమిటో ఎలా సాధించాలో అధికారులకు చెప్పలేక పోయారు , వారి నుంచి సలహాలు పొందలేక పోయారు . వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటున్నాను , ఎలా ఇవ్వవచ్చో చెప్పండి అంటే వాళ్ళే మార్గం చూపేవారు . అలా చేయక పోవడం వల్ల ఎన్నికల్లో బాబును విద్యుత్ కాటేసింది . టీడీపీ కూడా ఉచిత విద్యుత్ ప్రకటించేసరికి ఆ తరువాత ఎన్నికల అంశమే కాకుండా పోయింది .
***********
ఇప్పుడు తెలిసో తెలియకనో కాంగ్రెస్ తెలంగాణ లో విద్యుత్ ను ఎన్నికల అంశంగా మార్చింది . మరో మూడు నెలల్లో ఎన్నికలు అనగా అధికారంలో ఉన్న బి ఆర్ యస్ కు కాంగ్రెస్ మంచి ప్రచార అస్త్రాన్ని అందించింది . మూడు గంటల విద్యుత్ కావాలా ? మూడు పంటల విద్యుత్ కావాలా ? అని మంత్రులు టి హరీష్ రావు , కె తారక రామారావు మంచి క్యాచీగా ఉన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు . సామాన్య ప్రజలకు , జిడిపి లు , గ్రోత్ రేట్ లు ,కేంద్ర సంస్థలు ఇచ్చే అవార్డుల గురించి తెలియక పోవచ్చు కానీ కరెంట్ గురించి బాగా తెలుసు . ఉచిత విద్యుత్ వల్ల టీడీపీ హయం కన్నా కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కాంగ్రెస్ కు మేలు చేసింది . 24 గంటల విద్యుత్ వల్ల టీడీపీ , కాంగ్రెస్ హయాంలో కన్నా తెరాస హయాంలో విద్యుత్ పరిస్థితి బాగుంది అని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది . అర్ధరాత్రి వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ కష్టాలను రైతులు చూశారు . ఇందిరా పార్క్ వద్ద విద్యుత్ కోసం పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారు . పరిశ్రమలకు వారానికి మూడు రోజులు విద్యుత్ హాలిడే అమలు చేశారు . ఉమ్మడి రాష్ట్రం చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ( కాంగ్రెస్ ) హయాంలో సచివాలయం వద్ద భారీ హోర్డింగ్ లు ఉండేవి ఏసీలను వాడకండి , విద్యుత్ పొదుపు పాటించండి అని . జెరాక్స్ సెంటర్ వంటి చిన్న వ్యాపారాలు సైతం రోజుకు కొన్ని గంటల పాటు విద్యుత్ కోత చూశారు . స్వయం గా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాసన సభలో ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి చనిపోతే బోరింగ్ వద్ద స్నానానికి వెళితే కరెంట్ లేదని ఆనాటి పరిస్థితి వివరించారు . కరెంట్ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు . ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంది . విద్యుత్ ఎన్నికల ప్రచార అంశం అయినప్పుడు అందరికీ ఆనాటి రోజులు , ఈనాటి రోజులు వద్దన్నా గుర్తుకు వస్తాయి .
- బుద్దా మురళి
14, జులై 2023, శుక్రవారం
వై యస్ ఆర్ కు తలపాగా - రేణుకా చౌదరి తలపై క్యాప్ లో ఫ్యాన్ .. అధికారమనే శక్తే నడిపిస్తుంది అన్నాను . -- జర్నలిస్ట్ జ్ఞాపకాలు -72
వై యస్ ఆర్ కు తలపాగా - రేణుకా చౌదరి తలపై క్యాప్ లో ఫ్యాన్
అధికారమనే శక్తే నడిపిస్తుంది అన్నాను
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -72
----------------------------------------
ఎన్టీఆర్ వద్ద ఉన్నప్పుడు నేను ఎన్నో చూశాను . వై యస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పాను ఇది సరైన సమయం కాదు ఇప్పుడే పాద యాత్ర వద్దు . ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పాను. కానీ ఆయన వినలేదు . - ఇది పర్వత నేని ఉపేంద్ర చెప్పిన మాట . మెదక్ జిల్లా జోగిపేట ప్రాంతంలో వై యస్ ఆర్ పాద యాత్ర సాగుతున్నప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుతుంటే ఉపేంద్ర ఈ మాట చెప్పారు . ఉపేంద్ర ఆ మాట చెబుతుంటే ఇతనే నా ఒకప్పుడు టీడీపీలో నంబర్ టూ అనిపించింది . ఎన్టీఆర్ ముఖ్యంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పుతుంటే , రాజ్యసభ సభ్యునిగా ఉపేంద్ర ఢిల్లీలో చక్రం తిప్పేవారు . ఒక రకంగా ఆయనది దాదాపు నంబర్ 2 పవర్ సెంటర్ . తరువాత కాంగ్రెస్ లో చేరారు .
మెదక్ జిల్లాలో వైయస్ ఆర్ పాదయాత్ర కవర్ చేయడానికి వెళ్ళాను .
పాదయాత్ర జరుగుతున్న కాలం లో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఎండలు . ఆ సమయంలోనే తొలిసారిగా తల పై క్యాప్ లో ఫ్యాన్ ఉండడం చూశాం . రేణుకా చౌదరి తలపై క్యాప్ దానిలో ఫ్యాన్ ధరించి ప్రత్యేకంగా కనిపించడం మీడియాలో ఫొటోతో మంచి ప్రచారం లభించింది . ఆ సమయంలో కాంగ్రెస్ శాసన సభా పక్షం కార్యాలయంలో రిపోర్టర్ లు అందరూ ఉంటే కెవిపి రామచంద్రరావు ఓ సలహా అడిగారు . ఎండలు బాగా ఉన్నాయి , ఫ్యాన్ ఉన్న క్యాప్ ధరిస్తే ఎలా ఉంటుంది అని .. ఫ్యాన్ ఉన్న క్యాప్ ధరిస్తే బాగుంటుంది అని ఒకరిద్దరి సలహా . ఆ సమయంలో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఎండలు , ఇంట్లో నుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితి . అందరూ ఈ ఎండలు చూసి వైయస్ ఆర్ ఎలా నడుస్తున్నాడో అనుకుంటున్నారు ... క్యాప్ , దానికో ఫ్యాన్ ఒక్క రోజు బోలెడు ప్రచారం వస్తుంది కానీ ఇప్పటి వరకు వచ్చిన సానుభూతి పోతుంది . పడే ఇబ్బంది ఏదో పడుతున్నారు అలానే కొనసాగించాలి అన్నాను . నేను ఎవరో కెవిపికి తెలిసే అవకాశం లేదు . నేను టీడీపీ బీట్ రిపోర్టర్ ను కాబట్టి.. పేరు తెలియక పోయినా ఓ రిపోర్టర్ అని తెలిసే అవకాశం ఉంది .
***********
తరువాత ఫ్యాన్ ఉన్న క్యాప్ కాదు కానీ ఎండ దెబ్బ తాకకుండా పెద్ద తలపాగా చుట్టుకొని , దాన్ని నీటితో తడుపుతూ పోయారు .
వైయస్ ఆర్ కు సన్నిహితంగా ఉండే రవిచంద్ పరిచయం ఉండడం వల్ల అతనితో చెప్పి ఈ పాదయాత్ర లో జోగిపేట లో వైయస్ ఆర్ ఇంటర్వ్యూ చేశాను . సరైన సమయం కాదు అనే మాటకు బదులిస్తూ కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు పాదయాత్ర ద్వారా వారిని పలకరించాలి కానీ మనకు కుదిరిన సమయంలో పలకరిద్దాం అంటే ఎలా అన్నారు . ఇంత ఎండలో ఎలా నడుస్తున్నారు ? మిమ్ములను నడిపిస్తున్న శక్తి ఏమిటీ అని అడిగితే .. ప్రజలు అంటూ ఏదో చెప్పారు . మిమ్ములను నడిపిస్తున్న ఆ శక్తి ఏమిటో చెప్పాలా అని నేనే చెప్పాను . పవర్ మిమ్ములను నడిపించే శక్తి .. అధికారానికి ఆ శక్తి ఉంటుంది అదే మిమ్ములను నడిపిస్తుంది అని నా అభిప్రాయం చెబితే వై యస్ ఆర్ నవ్వారు .
2004 లో టీడీపీ ఓటమి ఖాయం అని తేలిపోయింది . పాదయాత్రతో మీకు కాంగ్రెస్ లో ఎదురు లేకుండా పోతుంది అని నా అభిప్రాయం నేను చెప్పాను . ప్రశ్నకు వైయస్ నుంచి ఏం సమాధానం వస్తుందో నాకు తెలుసు నిజానికి నా ఈ అభిప్రాయం చెప్పడానికే ఆ ప్రశ్న అడిగాను .
అలిపిరిలో తనపై నక్సల్స్ హత్యా యత్నం చేయడం తో సానుభూతి పై ఆశలు పెట్టుకొని చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు . ఉపేంద్ర చెప్పినా వినకుండా సరైన సమయంలోనే వైయస్ ఆర్ పాదయాత్ర చేయడం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది . మేం ఎన్నికల కోసం పాదయాత్ర చేయడం లేదు అని చెప్పినట్టు అయింది , ముందస్తు వల్ల పాదయాత్ర ఎన్నికలకు ఉపయోగపడింది .
****
టీడీపీలో ఢిల్లీలో అధికార కేంద్రంగా చాలా కాలం చక్రం తిప్పిన ఉపేంద్ర మారిన పరిస్థితిని జీర్ణం చేసుకోలేక పోయారు . ఆయన ఒక్కరే కాదు రాజకీయాల్లో చాలా మంది ఒకప్పుడు చక్రం తిప్పి ఉంటారు . అది శాశ్వతం అనుకుంటారు . . ఉపేంద్ర కాంగ్రెస్ లో చేరినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు . ప్రాధాన్యత ఇవ్వలేదు . కాంగ్రెస్ లో తన ప్రభావం చూపాలి అని ప్రయత్నించినా సాధ్యం కాలేదు . 99లో స్వల్ప తేడాతో టీడీపీ గెలిచింది . విద్యుత్ ఉద్యమం , తెలంగాణ ఉద్యమం వల్ల టీడీపీ ఓటమి ఖాయం అని తేలిపోయింది . ఎర్రటి ఎండలో ధైర్యంగా పాదయాత చేసిన వైయస్ ఆర్ కు కాంగ్రెస్ లో ఎదురు లేకుండా పోయింది .
- బుద్దా మురళి
12, జులై 2023, బుధవారం
తానా సభల్లో ఆటా వర్గీయులకు చప్పట్లు స్టార్ హోటల్ లో , అమెరికాలో చప్పట్ల మత్తు ... ...జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 71
తానా సభల్లో ఆటా వర్గీయులకు చప్పట్లు
స్టార్ హోటల్ లో , అమెరికాలో చప్పట్ల మత్తు ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 71
----------------------------------------
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్నప్పుడు తెలంగాణను వ్యతిరేకించడం తో పాటు వై యస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేసే నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాయకులకు టిడిపిలో విశేష గౌరవం లభించేది . తానాకు కు నాయకత్వం వహించిన వారిలో ఎక్కువ మంది టీడీపీ అభిమానులు , వీరిలో కొందరు ఆంధ్రాలో టీడీపీటికెట్ల కోసం గట్టిగా ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు . వీరిలో ఎక్కువ మంది స మైక్యాంధ్ర కోరుకున్న వారు . తానా సభలకు తరుచుగా టీడీపీ మంత్రులను , నాయకులను పిలిచేవారు .
ఓ సారి ఎన్టీఆర్ భవన్ లో కింద ఆవరణలో నాగం జనార్ధన రెడ్డి తో మాట్లాడుతుంటే .. పై అంతస్తు నుంచి టీడీపీ శాసన సభ్యులు పయ్యావుల కేశవ్ నాగం ను చూసి .. అన్న నడిచొస్తే మాస్ .. మమ్మా మాస్ అంటూ పాట పాడి అభినందించారు . నాగం మురిసిపోయి ... తానా సభకు వెళ్ళాను , నా ఉపన్యాసానికి చప్పట్లతో హాలు మారుమ్రోగిపోయింది తెలుసా . నేను మాట్లాడిన ప్రతి మాటకు చప్పట్లు కొట్టారు అంటూ నాగం చెబుతుంటే .. తానా సభలో మీకు చప్పట్లు సహజమే , ఇదే ఉపన్యాసం ఆటా సభల్లో ఇచ్చి చూడండి తెలుస్తుంది అని అనగానే నవ్వుతూనే ఒక్క సారిగా గాలి తీసినట్టుగా ఉండి పోయారు .
తానా లో ఎక్కువ మంది టీడీపీ అనుకూలం , ఆటా లో ఎక్కువ మంది కాంగ్రెస్ అనుకూలం .. తానా నే ప్రపంచం అనుకున్నట్టున్నారు నాగం . తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర వాళ్ళు నాగం కు ప్రాధాన్యత ఇచ్చినా , తెలంగాణ ఏర్పడిన తరువాత తానా వాళ్ళు నాగం ను పట్టించుకోలేదు . సొంత సంస్థ , టీడీపీ , కాంగ్రెస్ , బిజెపిల మధ్య తిరిగి .... ఒకప్పుడు బాబు తరువాత తెలంగాణకు సంబంధించి నంబర్ టూ నాయకుడు అని ప్రచారం పొందిన నాగం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెంటనే చెప్పలేని పరిస్థితి . తన కార్య క్షేత్రం తానా కాదు , తానా పార్టీ కాదు .. తెలంగాణ నే తన కార్య క్షేత్రం అని ముందే గుర్తిస్తే ఇలా ఉండేది కాదేమో ...
********
2004 ఎన్నికలకు ముందు వైస్రాయ్ హోటల్ లో ఏదో సమావేశం . స్టార్ హోటల్ స్థాయి వారే ఆ సమావేశానికి వచ్చారు . ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉపన్యాసం . ఆయన మీడియా ను చూస్తూ ఉచిత విద్యుత్ సాధ్యం కాదు . నేను అదే చెబుతుంటే మీడియా వారికి అర్థం కావడం లేదు . మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టి మీడియా వారికి అర్థం అయ్యేట్టు చెప్పండి అని చంద్రబాబు చెప్పగానే హాజరైన వారు చప్పట్లతో హోరెత్తించారు . బాబు గారు ఎంత సంతోష పడ్డారో .... తాను చేస్తున్నది అంతా మంచే అని మీడియా వారే అర్థం చేసుకోవడం లేదు అనేది చంద్రబాబు ఉపన్యాస సారాంశం . చప్పట్లతో మీడియాకు జ్ఞానం ప్రసాదించండి అన్నట్టుగా ఆయన పిలుపు . వైస్ రాయ్ హోటల్ సమావేశ మందిరం లో ఆ పిలుపు బాగా పని చేసింది . వచ్చిన వారంతా మీడియా వైపు చూస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు చెప్పిన దానికి మద్దతు పలికారు .
*****
తానా సభలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఉపన్యాసంలో ఒక ఎన్ ఆర్ ఐ అడిగిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రశ్నకు ఒక ఎకరానికి గంట సమయం విద్యుత్ సరిపోతుంది . మూడు ఎకరాలకు మూడు గంటలు సరిపోతుంది అని చెప్పారు . ఈ వీడియో అందరూ విన్నదే నేను కొత్తగా చెప్పనవసరం లేదు . కానీ అక్కడ గమనించాల్సిన విషయం రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలు అనగానే అందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు . అసలే అమెరికా , తానా సభ , వారంతా యువకులు ... ఉచిత విద్యుత్ అంటే వారికి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది ఆ చప్పట్లతో తెలిసిపోతుంది .
********
1996-97 ప్రాంతం లో వారాసిగూడలో ఉండేవాళ్ళం . సెల్ ఫోన్ లేదు ల్యాండ్ లైన్ ఫోన్ . మనల్ని ఉత్తమ జంటగా ఎంపిక చేశారు . హోటల్ కు వచ్చి బహుమతి తీసుకోమ్మన్నారు అని వార్త . అప్పుడప్పుడే ఇలాంటి మోసాలకు శ్రీకారం చుట్టిన కాలం అది . వాడి బొంద అదేదో బోగస్ అయి ఉంటుంది , జర్నలిస్ట్ అనే వాడు ఉత్తమ భర్త ఏమిటీ ? ఉదయం బయటకు వెళ్ళాడు అంటే అర్ధరాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు ఉత్తమ భర్తనా ? .. ఇలాంటివి నమ్మొద్దు అని చెబితే .. ఒక సారి వెళ్లి వద్దాం మోసం ఐతే తెలుస్తుంది కదా ? అంటే సరే అని వెళ్ళాం . ఇది బోగస్ నేను ముందే చెప్పాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు . కానీ చాలా మంది తమకేదో గొప్ప అవార్డు వచ్చినట్టు కుటుంబ సభ్యులను తీసుకోని వచ్చారు . రియల్ ఎస్టేట్ వ్యాపారాలు , ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రకాల వాళ్ళు .. వాడి బోగస్ స్కీమ్ అంటగట్టడానికి ఒక్కో టేబుల్ లో ఒకడు వివరాలు చెబుతున్నాడు . ఓ కుర్రాడు నాకు అలా చెబుతుంటే , . ఇదంతా బోగస్ నాకు తెలుసు , ఇక్కడ పని చేసే బదులు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా చేరు మంచి సంపాదన ఉంటుంది అని ఆ కుర్రాడికి సలహా ఇచ్చాను . ఎవరైనా వాడి స్కీములో చేరగానే అందరితో చప్పట్లు కొట్టించేవారు . సకుటుంబ సపరివారంగా వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యుల ముందు పరువు పోతుంది అని స్కీమ్ లో చేరడం చూశా . నిర్వాహకుడిది మోసం అని తెలుసు చప్పట్లు కొట్టించడం ద్వారా మిగిలిన వారిపై ఒత్తిడి తీసుకు వచ్చే అతని ఐడియా భలే ఉంది అనిపించింది .
********
మన ముందున్న వారే ప్రపంచం అనుకుంటే చావు దెబ్బ తింటాం . బోగస్ స్కీముల వాడి లక్ష్యం హోటల్ లో ఉన్న ఆ కొద్ది మందే కాబట్టి వారి ముందు చప్పట్లు కొట్టించి బోల్తా కొట్టించవచ్చు .
కానీ కోట్లమందిని పాలించాలి అనుకునే వాళ్ళు కొద్ది మంది చప్పట్ల నే అందరి చప్పట్లు అనుకుంటే దెబ్బ తింటారు .
వైస్ రాయ్ హోటల్ సమావేశంలో కొద్ది మంది చప్పట్లనే ప్రజలందరి చప్పట్లుగా నమ్మించాలి అని చూసిన బాబుకు 2004 ఎన్నికల ఫలితాలతో విషయం తెలిసి వచ్చింది . తానా సభలో చప్పట్లకు మురిసిపోయిన నాగం కు తెలంగాణ వచ్చాక విషయం అర్ధమైంది . తానా లో కుర్రాళ్ళ చప్పట్ల కు రేవంత్ అప్పటికప్పుడు మురిసిపోయినా ... సమాధానం కాలం చెబుతుంది .
-బుద్దా మురళి
10, జులై 2023, సోమవారం
ఎడిటర్ ఇంట్లో పెళ్లి అచ్చం టీడీపీ మినీ మహానాడే ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -70
ఎడిటర్ ఇంట్లో పెళ్లి అచ్చం టీడీపీ మినీ మహానాడే ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -70
--------------------------------------
ఓ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గున్న ఏనుగులా ఉన్న పిల్లాడిని చూసి వీడెవడో మినీ మహానాడులా ఉన్నాడంటాడు . రిపోర్టర్ గా ఎన్నో మహానాడులు , మినీ మహానాడులు కవర్ చేసిన నాకు ఈ డైలాగ్ చాలా బాగా నచ్చింది . ఎన్ని సార్లు విన్నా నవ్వువస్తుంది . మహా అంటే భారీ . మినీ అంటే చిన్నది . మినీ మహానాడు ఏంటో ? చిన్న పెద్ద నాడు అన్నట్టు .
ఆంధ్రభూమిలో ఎడిటర్ ఇంట్లో పెళ్లి అంటే అచ్చం మహానాడు తలపించేది . మహానాడులా వేలమంది కాకపోయినా వందల మందికి మహానాడు స్థాయిలోనే అట్టహాసంగా ఉండేది . మినీ మహానాడును తలపించేది . కళ్ళకు కని,పించేది దగ్గరగా చూసినప్పుడు విషాదం గా కనిపించింది కొన్ని రోజులు గడిచిన తరువాత ( అంటే దూరంగా ) అది గుర్తు చేసుకుంటే మన మీద మనకే నవ్వు వస్తుంది . ఎడిటర్ ఇంట్లో మినీ మహానాడు అప్పుడు కంటికి నిద్ర లేకుండా కష్టపడిన మిత్రులు ఇప్పుడు పడి పడి నవ్వుతూ ఆ రోజులు గుర్తు చేసుకున్నారు . రాజకీయ నాయకులను మించి నీతులు చెప్పిన , ఇంకా చెబుతున్న విశ్రాంతి ఎడిటర్ లు ఎడిటర్ గా ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో పెళ్ళికి కూడా అదేదో సీతారాముల కళ్యాణం ఊళ్ళో వాళ్లంతా తలో బాధ్యత తీసుకోవాలి అన్నట్టు పత్రికలో పని చేసే వారందరికీ బాధ్యతలు అప్పగించడాన్ని తమ హోదాను దుర్వినియోగం చేయడం అనుకోలేదు . అదేదో దైవ కార్యంలో మీ అందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నాను , మీ జీవితం ధన్యమైంది పో అన్నట్టు వ్యవహరించారు . ఈ దైవ కార్యంలో నేను ఎలాంటి బాధ్యత చేపట్ట లేదు కానీ అందరికీ అప్పగించిన బాధ్యతలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎంజాయ్ చేశాను . అచ్చం టీడీపీ మహానాడు ఏర్పాట్లను తలపిస్తోంది అనుకున్నాను .
****
డక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి ( 1938లో డక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక , అదే సమయంలో తెలంగాణ పేరుతో తెలుగు పత్రిక పెట్టారు . నిజాం కు భయపడి తెలంగాణ పత్రిక మూసివేసి 1960లో ఆంధ్రభూమి తెచ్చారు . ) పత్రికలు పెట్టిన మొదిలియార్ అంతగా ప్రయోజనం పొందింది లేదు . రోజూ నిజాం రాజుకు భయపడుతూ పత్రిక నడిపారు . తరువాత ఇద్దరు కొడుకులు కీచులాడుకొని టి చంద్ర శేఖర్ రెడ్డికి అమ్మేశారు . చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు డిసి లోన్ ఫ్రాడ్ కేసులో జైలులో ఉన్నారు . ఎనిమిదిన్నర దశాబ్దాల డీసీ చరిత్రలో అత్యధికంగా ఆర్థికంగా , మానసికంగా , అమ్మి రకాలుగా ప్రయోజనం పొందిన వారు ఎవరైనా ఉన్నారా ? అంటే 25 సంవత్సరాల పాటు ఎడిటర్ గా ఉండి పత్రిక పెట్టిన వారికన్నా , కొన్న వారికన్నా ఎక్కువ ప్రయోజనం పొందింది , బాధ్యత లేని అధికారం అధికారం అనుభవించింది ఎడిటర్ శాస్త్రి . ( బాధ్యత లేని అధికారం అనే మాట డీసీ మిత్రుడు ఇచ్చిన కితాబు ) ఆర్ధిక ప్రయోజనాలు ఒక వైపు ఐతే చివరకు యాజమాన్యం సైతం ఉపయోగించుకొని విధంగా ఇంట్లో పెళ్ళికి ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకున్నారు .
*********
టీడీపీని విధానాల పరంగా ఎంతైనా విమర్శించవచ్చు , పాలనను తప్పు పట్టవచ్చు కానీ ఆ పార్టీ నిర్వహించే మహానాడు ఏర్పాట్లను శత్రువు సైతం మెచ్చుకొని తీరుతాడు . అంత అద్భుతంగా ఉంటాయి . మంత్రి వర్గంలో ఎన్ని శాఖలు ఉంటాయో , అదే రీతిలో మహానాడుకు కమిటీలు ఉంటాయి . అంటే నగరాన్ని అలంకరించే కమిటీ మొదలు కొని , వాహనాల కమిటీ భోజన కమిటీ , వసతి కమిటీ ఇలా అన్ని పనులకు కమిటీలు ఉంటాయి . అంటే ఎండా కాలం కాబట్టి ఐదు నిమిషాలకోసారి మజ్జిగ , మంచి నీళ్లు అందించే కమిటీ కూడా ఉంటుంది . మంత్రి పదవి అప్పగిస్తే ఎలా మురిసి పోయి పని చేస్తారో ఈ కమిటీల్లో కూడా అలా పని చేసేవారు . ఆతిధ్యం లో ఎక్కడా లోటు రాదు . వేల మంది వచ్చినా భోజనం , వసతి వంటి సౌకర్యాలకు లోటు ఉండేది కాదు .
2004లో మహానాడు భారీ సభ జరిపి ప్రపంచ చరిత్రలో ఇంత భారీ ఏర్పాట్లు , సభ జరగలేదు . దీని బ్లూ బుక్ తరయారు చేస్తున్నాం అని సభ తరువాత బాబు ప్రకటించారు . ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది అది వేరే విషయం . జనరంజకంగా ఎలా పాలించాలి , అద్భుతంగ మహానాడు ఎలా నిర్వహించాలి అనేవి రెండూ వేరు వేరు విషయాలు ..
అచ్చం ఎడిటర్ కూడా అంతే పత్రికను ఎలా నడపాలి అనే దాని కన్నా ఎలా సొంతంగా ఉపయోగించుకోవాలి అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు .
*******
ఎడిటర్ ఇంట్లో పెళ్లి అంటే ఆఫీస్ లో నెల రోజులు అదే హడావుడి . కొత్త బంధువులు వచ్చి క్యాబిన్ లో కూర్చుంటే రిపోర్టర్ ను పిలిచి ఏమయ్యా గాడిదలను కాస్తున్నావా ? అని తిట్లు . ఆమ్మో చాలా పవర్ ఫుల్ అని బంధువులు ఆశ్చర్య పోవడం . నెల రోజులు ఇదో వినోదంగా సాగేది . కాంగ్రెస్ అగ్రనాయకులంతా పెళ్ళికి వచ్చేట్టు చేయడం కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ బాధ్యత, నన్ను టీడీపీ బాస్ వద్దకు తీసుకువెళ్లడం అంటే పిల్లిని సంకలో పెట్టుకొని వెళ్లడమే . పెళ్ళికి రావాలి అనుకున్న బాబు కూడా నా రాతలు - వాతలు గుర్తుకువచ్చి రాడు అని తెలుసు అందుకే ఆ బాధ్యత మరో రిపోర్టర్ కు అప్పగించారు .
విద్యా సంస్థలతో సంబంధాలు ఉండే రిపోర్టర్ విద్యా సంస్థల బస్సులు ఉచితంగా తీసుకురావాలి . ట్రాన్స్ కో వార్తల రిపోర్టర్ ట్రాన్స్ కో కార్లు , ఇలా ప్రతివారు తమ తమ బీట్ ల నుంచి లభించే సౌకర్యాలు కల్పించాలి . కల్పించారు . స్ట్రింగర్స్ కు వచ్చే పారితోషకం అంతంత మాత్రమే . వారు సేవలు అందించాలి , ఆ సేవలకు సొంత డబ్బు చెల్లించాలి . చెల్లించారు . వై యస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ బీట్ చూసిన రిపోర్టర్ కాస్త చలాకీ గా ఉండేవాడు . పరిచయాలు ఎక్కువ .దీనితో ఎక్కువ భారం పడింది.
.వైయస్సార్ తో పాటు మంత్రులు కూడా ఆ రిపోర్టర్ పరిచయం వల్ల వచ్చి పెళ్ళిలో అతన్నే పలకరిస్తుండడంతో , ఏదో ఉద్యోగానికి ఎసరు వచ్చేట్టుగా ఉంది అని అతను కాస్త దూరం వెళ్లి నిలబడ్డాడు.
మా సిస్టర్స్ పెళ్లిళ్లు చేశాను , కూతురు పెళ్లి చేశాను కానీ ఎప్పుడూ ఇంత కష్టపడలేదు , పంక్షన్ హాలులో పడుకోలేదు . ఎడిటర్ కోసం ఆ పని చేయాల్సి వచ్చింది అని అప్పుడు బాధగా , ఇప్పుడు జోకులేస్తూజ్ఞాపకాలను పంచుకున్నాడు ఓ మిత్రుడు .
తెలంగాణ ఏర్పడిన తరువాత ఇలాంటి వైభోగానికి బ్రేక్ పడింది .
***************
యజమాని ఇంట్లో పెళ్లి జరిగితే కనీసం పలానా వారికి ఇన్విటేషన్ ఇచ్చిరా అనే చిన్న పని కూడా ఎవ్వరికీ చెప్ప లేదు . కానీ పెద్ద ఉద్యోగి అయిన ఎడిటర్ మొత్తం ఆఫీస్ ను వాడుకున్నా పట్టించుకోక పోవడం అనేది ఆశ్చర్యమే . ఈ నిర్లక్ష్యవైఖరే యజమానిని జైలుకు పంపితే పెద్ద ఉద్యోగి తరతరాలకు సరిపోయేట్టు సంపాదించుకునేట్టు చేసింది .
- బుద్దా మురళి .
9, జులై 2023, ఆదివారం
93 అతని వయసు. 55 ఏళ్ళ నుంచి మీడియా కు అతనే అధ్యక్షుడు ... నియంతృత్వం రాజ్యమేలే మీడియాలో కార్మిక హక్కులు - సంఘాలు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -69
93 అతని వయసు. 55 ఏళ్ళ నుంచి మీడియా కు అతనే అధ్యక్షుడు
నియంతృత్వం రాజ్యమేలే మీడియాలో కార్మిక హక్కులు - సంఘాలు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -69
----------------------------------
సంజీవ రెడ్డి కో హటావో - ఆంధ్రభూమికో బచావో ... కొన్ని వందల మంది జర్నలిస్ట్ లు డక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు చేరి నినాదాలు చేస్తున్నారు . 85 సంవత్సరాల డిసి చరిత్రలో , 65 ఏళ్ళ యూనియన్ చరిత్రలో , యూనియన్ అధ్యక్షుని గా 55 ఏళ్ళ సంజీవ రెడ్డి చరిత్రలో డిసి కార్యాలయం ముందు అంతమంది జర్నలిస్ట్ లు చేరి అలా నినాదాలు చేయడం మొదటి సారి . నెల నెల జీతం చెల్లిస్తూ , ఉద్యోగ భద్రత ఉన్నప్పుడు సగటు జీవి తన కుటుంబం కోసం బానిసత్వాన్ని సైతం స్వీకరిస్తాడు . జీతం లేదు , ఉద్యోగం లేదు పొమ్మన్నప్పుడు ఎవడి మీదైనా తిరుగుబాటుకు సిద్ధం అవుతాడు . రెండేళ్ల క్రితం అదే జరిగింది . డిసి కార్యాలయం ముందు చేరి సంజీవ రెడ్డి కో హటావో , ఆంధ్రభూమికి హటావో అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు . ఆ రోజే కాదు , ఈ రోజుకూ ఉద్యోగులు ఎవరూ మేనేజ్ మెంట్ ను విమర్శించరు . ఉద్యోగంలో ఉన్నప్పుడే కాదు రిటైర్ అయ్యాక కూడా ...
నినాదాలు ఇస్తే ఏమైంది ?
సంజీవ రెడ్డిని హటావో - ఆంధ్రభూమికో బచావో అంటే సంజీవరెడ్డికి పంపించి ,భూమిని రక్షించారా ? అంటే .. చేశారు కానీ పూర్తిగా రివర్స్ గా చేశారు . సంజీవ రెడ్డిని రక్షించి , భూమిని మూసేశారు . ఐతే ఘనత వహించిన నాయకులు గ్రాడ్యూటీ లేకుండా పంపాలని చూసినా మేనేజ్ మెంట్ ఒక్కొక్కరికి దాదాపు పది లక్షల వరకు గ్రాడ్యూటీ , దాదాపు అంతే మొత్తం ఏడాది జీతం బకాయిలు ఇచ్చి పంపించారు . కార్మికులు ఎక్కడైనా యాజమాన్యానికి వ్యతిరేకంగా , కార్మిక సంఘం అధ్యక్షునికి మద్దతుగా పోరాడుతారు . ఇక్కడ మాత్రం రివర్స్ . కార్మికులు అధ్యక్షుడిని వ్యతిరేకిస్తే , యమజన్యం మాత్రం అతనికి అండగా నిలుస్తుంది . వేజ్ బోర్డు అమలు చేసినా , ఏం జరిగినా సంజీవరెడ్డికి కార్మికుల జీతం కోసి గండ పెండేరమో , బంగారు కడియ మో తొడిగేవారు . యాజమాన్య ప్రాయోజిత యూనియన్ . అధ్యక్షుడి తీరు అలా ఉన్నా , ఆఫీస్ లో ఉండే కార్మిక నాయకులు మాత్రం చాలా మంది కార్మికుల కోసం చిత్తశుద్ధితో కృషి చేసే వారు . వారు లేక పోతే ఎడిటర్ చాలా మందిని బూడిద చేసి మందులో కలుపుకొని తాగేసేవాడు .
*****
ప్రపంచ కార్మిక సంఘాల చరిత్రలో ఇదో రికార్డ్ . రోజూ వార్తలు అందించే పత్రికలు కూడా ఈ రికార్డ్ ను గుర్తించ లేదు . . ఒక దినపత్రికకు 55 ఏళ్ళ నుంచి ఒకరే కార్మిక సంఘం అధ్యక్షుడుగా ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేదు . గతంలో లేదు , కచ్చితంగా భవిష్యత్తులో రాదు . చిన్నా చితక పత్రిక కాదు . సుదీర్ఘమైన చరిత్రగల , ఉమ్మడి రాష్ట్రంలో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ దినపత్రిక డక్కన్ క్రానికల్ గ్రూప్ కార్మిక సంఘానికి జి సంజీవ రెడ్డి అధ్యక్షుడు . 93 ఏళ్ళ సంజీవరెడ్డి కి పోటీ లేదు , రాదు , యాజమాన్యం రానివ్వదు . 1938 లో డక్కన్ క్రానికల్ ను రాజ్ గోపాల్ మొదిలియార్ అనే తమిళ వ్యక్తి ప్రారంభించారు . కీస్ హై స్కూల్ తో పాటు అనేక విద్యా సంస్థలు , వ్యాపార సంస్థల్లో వీరి భాగస్వామ్యం ఉంది . ప్రారంభం అయింది .దాదాపు అదే సమయంలో తెలంగాణ పత్రిక పేరుతో తెలుగు పత్రిక ప్రారంభించి , నిజాం తో గొడవ ఎందుకు లే అని మూసేశారు . 1960లో ఆంధ్రభూమి తీసుకువచ్చారు .
1957లో డక్కన్ క్రానికల్ కార్మిక సంఘం ఏర్పాటు అయింది . ముఖ్యమంత్రిగా పని చేసిన టి. అంజయ్య కూడా డక్కన్ క్రానికల్ యూనియన్ అధ్యక్షునిగా చేశారు . తరువాత వెంకటేశం అనే కార్మిక నాయకుడు . తరువాత 1968 లో జి సంజీవరెడ్డి యూనియన్ అధ్యక్షులు అయ్యారు . ఇప్పటికీ 55 ఏళ్ళ నుంచి ఆయనే అధ్యక్షుడు . డీసీ ప్రారంభించిన రాజగోపాల్ మొదలియార్ ఇద్దరు కుమారుల మధ్య వివాదం తలెత్తడంతో యూనియన్ అధ్యక్షునిగా ఉన్న సంజీవరెడ్డి తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డిని తీసుకువచ్చి డిసి కొనేట్టు చేశారు . దీనితో యాజమాన్యం ఆశీస్సులతో సంజీవరెడ్డి శాశ్వత అధ్యక్షునిగా ఉండిపోయారు . కార్మిక సంఘానికి అతను యాజమాన్యం తరపు అధ్యక్షుడు . దాదాపు మూడు దశాబ్దాల్లో ఎప్పుడు మాట్లాడినా భూమిని మూసేస్తారు అంటూ పెద్ద మనసుతో చెప్పిన గొప్పవారు .
55 ఏళ్ళ నుంచి గెలుస్తున్నారు అంటే అభిమానం ఉంటేనే కదా ? అనిపించవచ్చు . ఓటింగ్ జరిగితే కదా తెలిసేది . ఓటింగ్ ఉండదు , అంతా ఏకగ్రీవమే . ఒక వేళ ఉన్నా అధ్యక్షుడు మినహా మిగిలిన వాటికి ఉంటుంది . 87 నుంచి 2017 వరకు ఉద్యోగం చేసిన నేను మూడు దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఓటింగ్ చూడలేదు , ఓటు వేయలేదు .
ఆంధ్రప్రభలో పి జనార్దన్ రెడ్డి సోదరుడు యూనియన్ నాయకుడిగా ఉండేవారు . చాలా బలమైన యూనియన్ అని పేరు . ఈ రెండు మీడియా సంస్థల్లో మాత్రమే బలమైన యూనియన్ . మిగిలిన సంస్థల్లో యూనియన్ ఉందని ఎవరికీ తెలియదు . రికార్డుల్లో ఉంటుంది దేవతా వస్త్రాల్లా .. కనిపించదు .
ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో యూనియన్ ఉంటాయా ? ఏమో తెలియదు . అక్కడ చాలా ఛానల్స్ లో దిన దిన గండం ఆరు నెలల ఆయుస్సు అన్నట్టు ఉంటుంది . మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు అని సిబ్బంది దారిలో బైఠాయించినప్పుడు అప్పటికప్పుడు యూనియన్ తాత్కాలికంగా ఏర్పడుతుంది . మూడు నెలలు జీతాలు ఎందుకు ఇవ్వరు అంటే , సంస్థకు కట్టుబడి ఉంటారు ఎక్కడికీ వెళ్లరు అందుకే ఇవ్వం అని ఓ చోటా ఛానల్ ఓనర్ అద్భుతమైన సిద్ధాంతం చెప్పారు .
*****
ఓ జర్నలిస్ట్ వామపక్ష కార్మిక నాయకుడికి ఫోన్ చేసి అన్నా నాకు అన్యాయం జరిగింది . ఆధారాలు అన్నీ ఉన్నాయి . మీరే న్యాయం చేయాలి అని చెప్పగానే నిమిషాల్లో ఆ కార్మిక నాయకుడు అతని ముందు వాలి పోయాడు . చెప్పన్నా ఆ కార్మిక ద్రోహి ఎవరో వాడి సంగతి తేలుద్దాం , పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ ఎర్ర డైలాగులన్నీ ఏకరువు పెట్టాడు . ఆ జర్నలిస్ట్ ఆధారాలు అన్నీ ఆ ఎర్రన్న ముందు పెట్టాడు . అవి చూడగానే ఆ ఎర్రన్న ముఖం నల్లబడింది . ఏంటన్నా నువ్వు మరీను మా పార్టీ పత్రిక గురించే నన్ను ఫైట్ చేయమంటున్నావు . జోక్ చేస్తున్నావా అని వెళ్ళిపోయాడు . మెదక్ జిల్లాకు చెందిన మురళీ అనే జర్నలిస్ట్ విషయంలో ఇది వాస్తవంగా జరిగింది . కేసు ఏమైందో తెలియదు కానీ అతను కోర్ట్ కువెళ్ళాడు . రాజీకి పిలిచారు అని ఓ ఐదేళ్ల కలిసినప్పుడు చెప్పాడు . కార్మికుల హక్కుల గురించి మీడియా ఎక్కువగా రాస్తుంది కానీ మీడియాలో అవి ఉండవు .
********
48 ఏళ్ళ క్రితం 75లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రతి యేటా క్రమం తప్పకుండా ఎమర్జెన్సీ ఆకృత్యాలు అంటూ మన మీడియా తద్దినం పెట్టినట్టు వ్యాసాలు రాస్తూ హక్కుల అణిచివేత గురించి పూర్తి పేజీ వ్యాసాలు ప్రచురిస్తుంది . ఇందులో విశేషం ఏమీ లేదు ఇది అందరికీ తెలిసిందే . ఐతే ఆ వ్యాసం రాసే జర్నలిస్ట్ , ఎడిట్ చేసే సబ్ ఎడిటర్ , ప్రచురించే బాస్ వీరంతా నిత్యం తమ తమ మీడియా సంస్థల్లో అణిచి వేతను అనుభవిస్తున్న వారే . హక్కులంటే ఏమిటో ఉద్యోగంలో చేరినప్పుడే మరిచిపోయిన వారు . ఇందిరా గాంధీ 75 నుంచి 77 వరకు కేవలం 21 నెలలు మాత్రమే అత్యవసర పరిస్థితి విధించింది . మెజారిటీ మీడియాలో మాత్రం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయినంతవరకు అత్యవసర పరిస్థితి అనుభవించాల్సిందే .
ఎవరైతే ఏదైతే తాము కాదో అది అని చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు అంటాడు ఓషో . విలువలు పాటించని రాజకీయ నాయకుడే విలువల గురించి ఎక్కువగా మాట్లాడతారు . మీడియాలోనూ అంతే హక్కులు , చట్టాల గురించి , కార్మికులకు జరిగే అన్యాయాల గురించి ఎక్కువగా రాసే మీడియాలో వాటిని పాటించడం ఉండదు . వీటిని పాటించక పోయినా వ్యాపార పత్రికలు కొంత నయం . వామపక్ష పత్రికల్లో మరీ అన్యాయం . వ్యాపార పత్రికలతో పోటీ పడి ప్రకటనలు సంపాదిస్తారు కానీ ఉద్యోగులకు జీతాలు అంతంత మాత్రమే . హక్కుల గురించి కావాలంటే పది పేజీల పత్రికలో ఐదు పేజీలు రాయగలరు కానీ ఆచరణలో శూన్యం . వాపపక్ష పత్రికల కన్నా వ్యాపార పత్రికలే ఈ విషయంలో కొంత నయం .
********
మీడియాలో కార్మిక సంఘాలు ఉండవా ? కార్మికులకు హక్కులు ఉండవా ? అంటే ఎందుకు ఉండవు . రికార్డుల్లో అద్భుతంగా ఉంటాయి . ఆచరణలోనే ఉండవు . రికార్డులు ముఖ్యం కానీ ఆచరణదేముంది . న్యాయమూర్తులు ఆలయాలను సందర్శించినప్పుడు ఎంత పెద్ద పత్రికలో నైనా పెద్ద ఫొటోతో వార్తలు వస్తాయి . ఎందుకు వస్తాయి అంటే వస్తాయి అంతే ...
ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినంత వరకు డక్కన్ క్రానికల్ గ్రూప్ (ఆంధ్రభూమి )పత్రికల్లో , ఇండియన్ ఎక్ప్ ప్రెస్ ( ఆంధ్రప్రభ ) లో యూనియన్ చాలా బలమైంది . నిజంగా బలమైందే ఐతే వీటి ప్రెసిడెంట్ ను నిర్ణయించేది మాత్రం యాజమాన్యమే . ఇక మిగిలిన పత్రికల్లో సంఘాల సంగతి ఏమిటీ అంటే పెద్ద పెద్ద కుంభకోణాలను వెలికి తీసిన జర్నలిస్ట్ లు కూడా తమ పత్రికలో కార్మిక సంఘం ఉందని , ఉంటే ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అనేది పరిశోధించినా చెప్పలేరు . ఓ రోజు ఓ పత్రిక మిత్రుడితో మాట్లాడుతూ పోనీ రికార్డ్ లో యూనియన్ నాయకుడిగా ఎవరి పేరు ఉందో కనీసం వారికైనా తెలుసా ? అని అడిగితే , ఏమో అన్నాడు . జర్నలిస్టుల జీత భత్యాలు , సౌకర్యాలు , ఎలా ఉండాలో తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం వేజ్ బోర్డు ను నియమిస్తుంది . ఒక్కటంటే ఒక్క పత్రికలో కూడా ఇప్పుడు వేజ్ బోర్డు సిఫారసులు అమలు కావడం లేదు . చాలా మంది జర్నలిస్ట్ లకు వేజ్ బోర్డు అంటూ ఒకటి ఉంటుందనే తెలియదు . కార్మిక హక్కుల ఉద్యమాలకు నాయకత్వం వహించే వామపక్షాల మీడియాలో దీని గురించి అడగడం అనే ఆలోచన రావడం అంటే బొందితో కైలాసానికి వెళ్లాలనే అత్యాశ లాంటిదే .
*******
డిసి యూనియన్ లో అధ్యక్షుడు ఎప్పుడూ మూసేస్తారు .. మూసేస్తారు అని నెగిటివ్ గా మాట్లాడినా ఆఫీస్ లో నాయకత్వం వహించిన విజయకుమార్ , ఆనంద్ , బాలకృష్ణ వంటి వారు తమ శక్తి మేరకు సిబ్బంది హక్కుల కోసం కృషి చేసేవారు . ఐదేళ్ల క్రితం చేసిన లెక్కల్లో ఏదో తేడా వచ్చిందని గ్రహించి , నిరూపించి ఆ మేరకు జీతం పెంచడం తో పాటు ఐదేళ్ల బకాయిలు ఇప్పించారు . పాత సినిమాలో విలన్ ఆర్ నాగేశ్వర్ రావు లా భారీకాయం తో భయపెట్టేట్టు ఉండేవారు ఆనంద్ అనే యూనియన్ నాయకుడు . ఎడిటర్ ఏంటీ ఓనర్ కూడా చూస్తే చాలు భయపడాలి . ఎంతో మందికి అండగా నిలిచాడు . వి ఆర్ యస్ ఇచ్చి ఒక్కొక్కరిని బయటకు పంపి యూనియన్ ను నిర్వీర్యం చేశారు . చివరకు తామే నిర్వీర్యం అయ్యారు .
****
గతం లో ప్రతి తెలంగాణ జిల్లా నుంచి కనీసం ఒక్కరైనా ఆంధ్ర నుంచి వచ్చిన వారు శాసన సభ్యలుగా ఉండేవారు . తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లి గెలిచింది ఇద్దరే . ఒకరు పి శివశంకర్, రెండో వారు పివి నరసింహారావు ... వీరు ప్రధాని హోదాలో నంద్యాల నుంచి గెలిస్తే , శివశంకర్ సామాజిక వర్గం తో గెలిచారు . కానీ ఆంధ్ర , తెలంగాణ ,రాయలసీమ , ఉత్తరాంధ్ర , నెల్లూరు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఉమ్మడి రాష్ట్రం నలుమూలలా గెలిచిన ఏకైక కార్మిక నాయకుడు జి సంజీవరెడ్డి . రాష్ట్రంలో ఎక్కడ ఎడిషన్ పెట్టినా అక్కడ యూనియన్ కు మేనేజ్ మెంట్ నే సంజీవరెడ్డికి అధ్యక్షున్ని చేసేది . వారి అనుబంధం ఫెవికాల్ లాంటిది . ..
****
సరే ఇప్పుడు హక్కులను అమలు చేయమంటావా ? అంటే చేయమని చెప్పడానికి నేనెవరిని , చేయడం లేదు అని చెబుతున్నాను అంతే ..
పేరు గుర్తుకు వచ్చాక చెబుతాను హైదరాబాద్ లో ఒక వామపక్ష వాది ప్రింటింగ్ ప్రెస్ పెట్టి నిబంధనలను తూచా తప్పకుండా పాటించి కార్మికులకు జీతాలు , సౌకర్యాలు కల్పించారు . ఏడాది లోపే నిండా మునిగిపోయి వ్యాపారం ఎత్తేశాడు . నీతులు చెప్పేవారు పాటించరు . పాటించేవారు నిండా మునిగిపోతారు .
బుద్దా మురళి
7, జులై 2023, శుక్రవారం
నక్సల్ గా వణికించాడు ... జర్నలిస్ట్ గా ఎడిటర్ కాటుకు బలయ్యాడు ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -68
నక్సల్ గా వణికించాడు ... జర్నలిస్ట్ గా ఎడిటర్ కాటుకు బలయ్యాడు ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -68
--------------------------------------------------------
ఎడిటర్ , నేనూ ప్లై ఓవర్ కింద నిలబడి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం ...ప్రేమలు , బంధాలు అన్నీ మాట్లాడుకున్నాం ... ఒకరి భుజం మీద ఒకరం చేయి వేసుకోని కబుర్లు చెప్పుకున్నాం అంటూ కేఎన్ చారి మురిపెంగా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు . ఓపెన్ గా ఏమైనా మాట్లాడుకునే స్నేహం ఉండడం వల్ల మధ్యలోనే ఆపేసి ... చూడు చారి ఇప్పుడు సంతోషంగా చెబుతున్నావు కానీ దెబ్బ తింటావు ... నా మాట విను ... నువ్వు సైనికుడివి సైనికుడితో స్నేహం చేయాలి కానీ రాజుతో స్నేహం చేయకూడదు .. రాజుతో స్నేహం చేస్తే నీ తప్పు ఉండవచ్చు , రాజుదే తప్పు కావచ్చు బలయ్యేది సైనికుడే అని చెబుతుంటే చారి నవ్వి భుజం మీద కొట్టి వెళ్లి పోయాడు ... నువ్వు సిద్ధాంతాలను చదివి ఉండొచ్చు నేను జీవితాన్ని చదివాను అన్నాను ... ఊహించినట్టే రాజు కాటుకు సైనికుడు దారుణంగా బలయ్యాడు . పోలీసుల తూటాల నుంచి తప్పించుకున్నంత ఈజీ కాదు మనిషి కాటు నుంచి తప్పించుకోవడం అని చారికి అంతిమ దశలో అర్థమై ఉటుంది . సగం వయసులోనే తనువు చాలించాడు . నేను పక్కా ఫ్యామిలీ మాన్ ను కుటుంబం పట్ల నా బాధ్యత నాకు ముఖ్యం . చారి దీనికి పూర్తిగా భిన్నం . ఐనా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది ... అతను మరణించిన తరువాతే అతని నక్సల్స్ జీవితం , లక్షల రూపాయల డెన్ కు బాధ్యుడుగా పని చేసింది తెలిసింది .
********
కెసిఆర్ కు మంత్రిపదవి రాకపోవడం వల్లనే తెరాస పుట్టింది . తెలంగాణ ఉద్యమం జరిగింది అని చాలా మంది భావిస్తుంటారు . 2001లో తెరాస పుడితే అంతకన్నా దాదాపు మూడు నాలుగేళ్ల ముందే ఈ అంశం పై కెసిఆర్ ఆధ్వర్యం లో విస్తృతంగా అధ్యయనం జరిగింది . తార్నాకలో ఒక ఆఫీస్ తీసుకోని అధ్యయనం జరిపేవారు . ఆ అధ్యయనంలో పని చేసింది చారి , మరో రిపోర్టర్ రామకృష్ణ . కొన్ని ప్రాంతాల్లో పేదరికం ఎందుకు ఉంటుంది , కొందరు పేదరికంలో ఎందుకు ఉండి పోతారు సమాజం ఇలా ఎందుకు ఉంది , మారాలి అంటే ఏం చేయాలి అని అధ్యయనం జరిగేది . చారి ఈ పనిలో ఉండేవాడని ఒక సారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ స్వయంగా శాసన సభలో చెప్పిన తరువాతనే అందరికీ తెలిసింది .
కేఎన్ చారి ఒకప్పుడు నక్సలైట్ .... నక్సలైట్ గా ఉన్నప్పుడు వణికించాడు ... చాలా మందిలానే జనజీవన స్రవంతిలో కలిసి తరువాత ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా అటు నుంచి ఆంధ్రభూమికి ముందు కరీం నగర్ అటు నుంచి 95 లో హైదరాబాద్ కు వచ్చాడు . జిల్లాల్లో పని చేసి నేనూ 95లోనే హైదరాబాద్ కు వచ్చాను . చారి దాదాపు అదే సమయంలో హైదరాబాద్ వచ్చారు . ఆఫీస్ కు సంబంధించినంతవరకు ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం . ఎడిటర్ ఆఫీస్ లో ప్రతి మనిషిని ... ప్రతి మనిషిని అంటే ఎడిటోరియల్ సిబ్బంది మొదలుకొని అటెండర్ వరకు ...
*************
ఎడిటర్ స్నేహం తో చారి వెలిగిపోతున్నాడు . కనకాంబరరాజు ను వారపత్రిక ఎడిటర్ గా తొలగించిన తరువాత చారిని ఎడిటర్ చేయబోయారు . ఏం జరిగిందో అది రద్దయింది . తరువాత ఢిల్లీ ప్రతినిధి గా పంపడానికి ఆర్డర్ తో సహా అన్నీ పూర్తయ్యాయి . ఉత్సాహం ఆగక ఢిల్లీలో ఉండే కృష్ణారావుకు ఫోన్ చేసి ఢిల్లీ వచ్చేస్తున్నా , తెలుగు వాళ్ళం అందరం కలిసి పని చేద్దాం అంటూ ఉపన్యాసం . సమాచారం ఎడిటర్ వరకు వచ్చి ఇగో దెబ్బతిని ఆర్డర్ రద్దు చేశారు .
పాశం యాదగిరి జర్నలిజం లో ఉన్న సీనియర్ లు అందరికీ తెలిసిన పేరు . మేనేజ్ మెంట్ ద్వారా యాదగిరి ఢిల్లీ రిపోర్టర్ గా చేరారు . చేరారు కానీ ఒక్క వార్త కూడా రాలేదు . ఎందుకంటే ఓనర్ యాదగిరిని ఉద్యోగంలోకి తీసుకున్నారు . ఆ రోజుల్లో ఓనర్ కన్నా శాస్త్రిదే అధికారం ఎక్కువ . ఒక్క వార్త కూడా వేయవద్దని ఆదేశం . యాదగిరి ఫోన్ చేసి ఏమైంది వార్తలు వేయడం లేదు అని అడిగితే నీ వార్తలు వేస్తే ఎడిటర్ మా ఉద్యోగం తీసేస్తాడు అని సమాధానం . మీ అందరి ఉద్యోగాలు తీయడం ఎందుకు ? నేనే వెళ్ళిపోతాను అని యాదగిరి లాంటి సీనియర్ నెలకు మించి ఉండలేక పోయారు .
నేను మిత్రులతో జోక్ గా చెప్పేవాడిని . ఆంధ్రభూమి తన సొంతం అని ఎడిటర్ అనుకుంటున్నారు అక్కడి వరకు పరవాలేదు . మేనేజ్ మెంట్ కూడా ఆంధ్రభూమి ఎడిటర్ దేమో అనుకుంటున్నారు అని ..
ఏం జరిగిందో ఎక్కడ బెడిసిందో కానీ చారి ని ఎడిటర్ వేటాడడం మొదలు పెట్టారు . జూనియర్ ఐన సబ్ ఎడిటర్ అబ్దుల్ కు సహాయకుడిగా పని చేయమంటే చారి అక్కడకూ వెళ్ళాడు . ఐనా పగ చల్లారలేదు . ఏదో వంకతో ఉద్యోగం నుంచి వెళ్లిపోయేట్టు చేశారు . బతకాలి కాబట్టి తప్పఁడు అన్నట్టు ప్రకటనలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే పని మొదలు పెట్టారు . ఈ పనితో ఎడిటర్ కు ఎలాంటి సంబంధం ఉండదు ఏజెన్సీ ల వాళ్ళు ఇంగ్లీషులో ప్రకటన ఇస్తే తెలుగులో అనువాదం చేయాలి . ఒక్కో ప్రకటన అనువాదానికి 200 రూపాయలు ఇచ్చే వారు . ఆ పని చేస్తుండగా చూసి .. ఆ పని చేయడానికి కూడా వీలులేదని ఎడిటర్ ఆపేయించారు .
ఒకప్పుడు లక్షల రూపాయల నక్సల్స్ డెన్ చూసిన చారి మా జేబుల్లో 50 - వంద రూపాయలు ఉన్నా చేయి పెట్టి తీసుకునే స్థితికి వచ్చాడు . చివరకు ఆఫీస్ క్యాంటిన్ కూపన్లు తీసుకునేవాడు . ఒక వైపు మనిషి విషపు కాటుతో విలవిల లాడుతుంటే , మరో వైపు షుగర్ కాటేసింది .
********
ఓ రోజు వారాసిగూడ కేఫ్ లో నేనూ , చారి , ఎక్స్ ప్రెస్ రామకృష్ణ మాట్లాడుకుంటుంటే , చారికి అన్యాయం జరుగుతుంటే నీ లాంటి వాడు కూడా మాట్లాడాడా ? అని రామకృష్ణ అడిగాడు . ప్లై ఓవర్ కింద వర్షపు చినుకుల్లో తడుస్తూ ప్రేమ కబుర్లు చెప్పుకున్నాం అని చారి చెప్పినప్పుడు .. వద్దు దెబ్బ తింటావ్ అని చెప్పాను కానీ నన్ను కూడా తీసుకువెళ్ళు అని చెప్పలేదు అడుగు అని బదులిచ్చాను .
వసీరా కవి భూమిలోనే పని చేసేవారు . నేను ఎడిటర్ కు క్లోజ్ అనుకోని ఓ సారి ... రాజు ఒక రహస్య పని అప్పగించినప్పుడు పని పూర్తి అయ్యాక వాడిని చంపేయాలి అనేది చాణుక్యుని నీతి అని నర్మగర్భంగా చెప్పల్సింది చెప్పారు . నాకు తెలుసు నేను నా ప్రాణం కన్నా కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తా .. ఆ కుటుంబం కోసం నాకు ఉద్యోగం ముఖ్యం ..నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పాను .. ఉన్నాను .
******
ఆరోగ్యం క్షిణించి దసరా పండుగ రోజు చారి మరణించారు . రామకృష్ణ ఫోన్ చేసి ఎడిటర్ కు చెబితే పండుగ రోజు ఏంటీ అని చిరాకు పడి ఫోన్ పెట్టేశాడు . చారిని స్మరించుకుంటూ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో రెండు సార్లు వ్యాసాలు వచ్చాయి . భూమిలో సింగిల్ కాలం వార్త కూడా రాలేదు .
మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది చారినే .. లక్ష్మీపార్వతి తో మాట్లాడి 96లో ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయించారు . తరువాత బీజేపీ నుంచి గెలిచారు . చారి వల్లనే తానూ రాజకీయాల్లోకి వచ్చాను అని చారి పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు . చారి అంత్యక్రియల్లో వరవరరావు , గద్దర్ వంటి ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు .
**********
తప్పంతా ఎడిటర్ దే అని చెప్పడం నా ఉద్దేశం కాదు . కాటు వేయడం పాము లక్షణం . కాటు వేటుకు పడకుండా జాగ్రత్తగా ఉండడం మనిషి బాధ్యత .ఎడిటర్ బాధ్యత ఎంత ఉందో ,, చారిది కూడా అంతే బాధ్యత ఉంటుంది . సిద్ధాంతాలు , విప్లవాలు , గాడిద గుడ్లు మనిషి చనిపోతే రోడ్డున పడే కుటుంబాన్ని ఆదుకోవు .... మన కాళ్ళు నెల మీద ఉండాలి .
-బుద్దా మురళి
6, జులై 2023, గురువారం
మీడియా బాస్ ల నియంతృత్వం ఎలా ఉండేదంటే ఉద్యోగం మానేసినా భయం వెంటాడుతూనే ఉంటుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -67
మీడియా బాస్ లా నియంతృత్వం ఎలా ఉండేదంటే
ఉద్యోగం మానేసినా భయం వెంటాడుతూనే ఉంటుంది ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -67
---------------------------------------
మీరు ఎడిటర్ కు చెబుతారేమో చెప్పుకోండి . నేనేమీ భయపడను అంటూ కాసింత కోపంతో అతను అనగానే నాకు నిజంగానే ఒక్కసారి భయం వేసింది . అతని వైపు అలానే చూస్తూ ఉండి పోయాను . మీడియాలో బాస్ ల నియంతృత్వం , సిబ్బందిని బానిసల్లా చూస్తూ మానసికంగా ఎంత హింసిస్తున్నారో ఒక్క సారి తలుచుకొంటూ అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాను . ఎడిటర్ లు మానసికం గా వేధించడం గురించి తెలుసు . కానీ దాని ప్రభావం ఇంతగా ఉంటుంది అని తెలియదు . ఆంధ్రభూమిలో ఒక సబ్ ఎడిటర్ కుర్చీలో కూర్చొని అలా పని చేస్తూనే మరణించాడన్ని చూసిన వాడిని , ఆంధ్రప్రభలో బాసిజం తో మానసికంగా దెబ్బ తిన్న వారి గురించి తెలిసిన వాడిని . దాదాపు మీడియా అంతటా ఆ కాలంలో కొంచం ఎక్కువ , కొంచం తక్కువ అంటా ఇంతే . ఐనా అతను అన్న మాట ఆశ్చర్యం కలిగించింది . అతని మీద ఒక వైపు జాలి మరోవైపు అతను ఎంత క్షోభ అనుభవించాడో అనే సానుభూతి . ఆంధ్రభూమి ఆఫీస్ గేటు బయట మిత్రులతో కలిసి టీ తాగుతుంటే అక్కడ కనిపించారు . నన్ను చూసి మీరు ఎడిటర్ కు చెప్పినా భయపడను అన్నారు . పివిడియస్ ప్రకాష్ అనే జర్నలిస్ట్ . ఎడిటర్ వేధింపులను తట్టుకోలేక అతను అంతకు ముందే భూమి నుంచి వెళ్ళిపోయి దాదాపు మూడేళ్లు అవుతుంది . మంచి రచయిత . స్వాతి వారపత్రికలో ఎన్నో కథలు వచ్చాయి . భూమి నుంచి వెళ్లి పోయాక ఫ్రీ లాన్సర్ గా స్వాతితో పాటు పలు పత్రికల్లో రాస్తే వచ్చే పారితోషకమే అతని సంపాదన . చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు సంబంధించి పత్రికల్లో , మరికొన్ని పత్రికల్లో రాసి వారిచ్చే పారితోషకం తో గడిపేవారు . ఆంధ్రభూమిలో పర్మనెంట్ ఉద్యోగి . వెజ్ బోర్డు సిప్ఫారసులు అమలు చేస్తారు కాబట్టి మంచి జీతం . ఎడిటర్ కు ఎక్కడ కోపం వచ్చిందో సబ్ ఎడిటర్ గా కావాలని లెక్క లేనన్ని పేజీలు కంపోజింగ్ చేయించేవారు . ఎలాగైనా హింసించాలి అనే ఏకైక లక్ష్యం . అతనికి అర్థమా అయింది , నన్ను ఉంచరు ని ఐనా పని చేస్తుంటే సంగారెడ్డికి బదిలీ చేశారు . రెండు మూడు పత్రికలు మాత్రమే మంచి జీతాలు ఇచ్చే రోజులు . ఒక దానిలో ఉద్యోగం పోతే మరో దానిలో దొరికే అవకాశం లేదు . ఎలక్ట్రానిక్ మీడియా , యూ ట్యూబ్ లేని రోజులు . తొందరపడి రాజీనామా చేయవద్దు అని చెప్పినా అతను రాజీనామా చేశారు . మూడేళ్ళ తరువాత ఆంధ్రభూమివద్ద కనిపించి తాను ఎడిటర్ కు భయపడను అని చెప్పారు . అతనితో ఏమీ అనలేదు కానీ మిత్రులతో మాట్లాడుతూ ప్రకాష్ ఎంతగా భయపడుతున్నాడో ఆ ఒక్క మాటతో అర్థం అవుతుంది అన్నాను . సంస్థ నుంచి బయటకు వెళ్లి మూడేళ్ళ తరువాత ఎడిటర్ కు నేను భయపడను అంటున్నాడు అంటే ఎంత భయపడ్డాడు , భయపడుతున్నాడో అర్థం అవుతోంది అన్నాను . సంస్థలో పనిచేస్తున్న నేను ఎడిటర్ మీద జోకులేసి మాట్లాడుతుంటే మూడేళ్ళ క్రితం వెళ్లిపోయిన అతను భయ పడడం లేదు అంటున్నాడు అంటే భయం తెలుస్తుంది అన్నాను . బయటివారు ఇలాంటి పరిస్థితి ఊహించరు , నమ్మడం కూడా కష్టమే . కానీ ఆ రోజుల్లో ఉండే పరిస్థితిని ఆసరాగా తీసుకోని కొందరు ఎడిటర్ లు , బాస్ లు తమలోని రాక్షస ప్రవృత్తిని బయటపెట్టుకునేవారు .
******
బావమరిది పెళ్లి బావ హడావుడి
ఈనాడు ఎండీ రమేష్ బాబు బంధువు చెన్నయ్య చౌదరి అని టీడీపీ మీడియా ఇంచార్జ్ గా ఉండేవారు . ఒకసారి బంధువుల ఇంట్లో ఏదో పంక్షన్ రమేష్ బాబు రాత్రికి రాత్రే తిరుగుప్రయాణం అవుతుంటే నువ్వు లేకుంటే ఏదో ఈనాడు ఆగిపోతుంది అని ఆ హడావుడి ఏమిటీ ? ఈ రోజు ఉండి ఉదయం వెళ్ళమంటే .. నేను ఈ రాత్రికి వెళ్ళాక పోతే ఈనాడు ఆగిపోదు , యధావిధిగా తెల్లవారు జామునే పత్రిక వస్తుంది నా సమస్య కూడా అదే అన్నారట . మనం లేకపోయినా పత్రిక యధావిధిగా వస్తుంటే మన ఉద్యోగానికి ఎసరు వస్తుంది అని .. అందుకే మనం లేనిదే పత్రిక రాదు అనుకోవాలి అంటే ఉండాల్సిందే అని వెళ్లిపోయారని చెన్నయ్య ఓ సారి చెప్పారు . సరదాగా చెప్పినా అక్షర సత్యం . చాలా మంది అప్పటి ఎడిటర్ లు తాము లేనిదే పత్రిక రాదు అనే అభిప్రాయం కలిగించేందుకు తెగ ప్రయత్నించేవారు . శాస్త్రి బావమరిది పెళ్లి తెనాలిలో జరిగితే ఆ రోజుల్లో అప్పటికప్పుడు నానా తంటాలు పడి తెనాలి లాడ్జ్ లో తాత్కాలిక ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టించేందుకు ఎంత ఇబ్బంది పడింది మిత్రులు కథలు కథలుగా చెబుతారు. ఎడిటర్ లేక పోతే పేపర్ మరింత బాగా వస్తుందేమో అని వారి భయం . నా లాడ్జ్ లో తాత్కాలికం గా నైనా ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టించేందుకు మీరెవరు ? అని లాడ్జ్ ఓనర్ గొడవ , రిసెప్షన్ వద్దకు వెళ్లి ఫోన్ మాట్లాడను నా రూమ్ లో ఉండాల్సిందే అని ఎడిటర్ .. ఇద్దరి మధ్య నలిగిపోయిన రిపోర్టర్ లు . ఇలాంటివి ఓనర్ కు తెలియవా ? అంటే తెలుసు కానీ వ్యాపారులు తమకు ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం పై దృష్టి పెట్టి తక్కువ లాభం , ఎక్కువ చికాకులు అనుకునే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలను ఎవరో ఒకరిని నమ్మి అప్పగిస్తారు . అలాంటి అదృష్టం శాస్త్రిని వరించింది . పత్రిక గతిని మార్చింది లేదు , సర్క్యులేషన్ పెంచింది లేదు . కానీ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ప్రయోజనం పొందారు .
*** **
ఆంధ్రప్రభ పాత యాజమాన్యం లోనూ ఇదే పరిస్థితి . శాస్త్రి ఈ లక్షణాలను ఆంధ్రప్రభ నుంచే నేర్చుకొని భూమికి వచ్చాడు అంటారు . ఓ సారి సుందరం( ఎక్స్ ప్రెస్ ) , దీక్షితులు( ప్రభ ) ఢిల్లీ వెళ్లారు . అప్పుడు ఢిల్లీలో వై యస్ ఆర్ రాజశేఖర్ రెడ్డి వీరికి ఆతిధ్యం . ఆ పార్టీలో ద్రోణం రాజు సత్యనారాయణ కూడా ఉన్నారు . ఒక రౌండ్ అయ్యాక ( దీక్షితులు మద్యం తీసుకోరు ) ఏ ..... లు పేపర్ ను చంద్రప్రభగా మార్చేశావ్ అంటూ ద్రోణం రాజు అనగానే , ఏం చెబుతాడో అని వైయస్ ఆసక్తి చూపించారు . ఆ మరుసటి రోజు దగ్గుబాటి ఇంట్లో ఆతిధ్యం . అప్పుడు బాబు , దగ్గుబాటి విడిపోయారు . దగ్గుబాటి ల్యాండ్ లైన్ నుంచి తొలుత సుందరం ఆఫీస్ కు ఫోన్ చేసి ఏం పెడుతున్నారు అంటూ క్లాస్ తీసుకోని బాబు ఫోటో పెట్టాలి అని ఆదేశం . సుందరం ను అనుసరించే దీక్షితులు ప్రభకు ఫోన్ చేసి బాబు ఫోటో మొదటి పేజీలో పెట్టండి లేక పోతే వా..... ..... తాడు అంటూ ఆదేశం . దగ్గుబాటి ముందే దగ్గుబాటి వ్యతిరేకి ఫోటో పెట్టాలని, లేక పోతే .... ఆదేశించడం అక్కడున్న జర్నలిస్ట్ నవ్వుకున్నారు .
ప్రభ పాత యాజమాన్యం కాలం లో ఎడిటర్ మైసూరు స్వామి భక్తుడు . ఆ స్వామి ఎడిటర్ కూతురుకు మెడిసిన్ లో సీటు ఇప్పించాడు . మైసూరు వెళ్ళడానికి బెంగళూరు అఫీసియల్ టూర్ పెట్టుకునే వారు ఆఫీస్ ఖర్చుతో స్వామి దర్శనం , కూతురు చదువు తెలుసుకోవచ్చు అని . బెంగళూరు వచ్చేప్పుడు లాడ్జ్ లో రూమ్ ఎలా ఉంది ? బాత్రూం ఎలా ఉందో ఒక రోజు ముందే వెళ్లి చూసి వచ్చే బాధ్యత అక్కడి తెలుగు రిపోర్టర్ ది . అది తెలిసిన తమిళ మేనేజర్ ఒకరు మీరు వెళ్లి బాత్రూం ఎలా ఉందో చూసి వస్తే నేను ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళతాను. మీరు రిపోర్టర్ మీరు అలా చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చారు . వెళితే మేనేజర్ తో సమస్య , వెళ్లక పోతే ఎడిటర్ తో సమస్య నరకం అనుభవించాను అని ఆ కాలం బాధలను ఓ జర్నలిస్ట్ గుర్తు చేసుకున్నారు . కాలం అందరికీ పాఠం చెబుతుంది అన్నట్టు వీరిలో కొందరు దయనీయ స్థితిలో మరణించారు . కొందరు క్యూలో ఉన్నారు . ఇలాంటి పద్ధతీ , పాడు లేని మేనేజ్ మెంట్ విధానాల వల్ల అటు ప్రభ యాజమాన్యం , ఇటు భూమి యాజమాన్యం తగిన మూల్యం చెల్లించింది . ప్రభ అమ్ముకున్నారు . భూమి మూతపడింది . జ్యోతి మూతపడి , యాజమాన్యం మారింది .
*******
ఏం చెప్పదలచుకున్నారు అంటే ?
కాలం మారింది . ఐనా అంత గొప్పగా ఏమీ లేదు . ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకొంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అంటాను .
5, జులై 2023, బుధవారం
అత్తా అల్లుడు మధ్యలో మామ లక్ష్మీ పార్వతి చిటికే సి పిలిస్తే బాబు వాలిపోయారు ... ఆ పార్టీ అంతరంగికులు అంతా ఒకే పత్రిక వాళ్ళు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -66
అత్తా అల్లుడు మధ్యలో మామ
లక్ష్మీ పార్వతి చిటికే సి పిలిస్తే బాబు వాలిపోయారు ...
ఆ పార్టీ అంతరంగికులు అంతా ఒకే పత్రిక వాళ్ళు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -66
-----------------------------------
1994 వరంగల్ లో టీడీపీ సమావేశం .వేదికపై ఒక వైపు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఉంటే అదే వేదిక చివరి వైపు చంద్రబాబు . లక్ష్మీ పార్వతి వేలు చూపుతూ పిలవగానే చంద్రబాబు పరిగెత్తుకెళ్లారు . ఆమె ఏదో చెబుతుంటే చెవి ఒగ్గి విని తల ఊపి తిరిగి తన స్థానంలోకి వచ్చి కూర్చున్నారు . ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి జంట ఓ వెలుగు వెలిగిపోతున్న సమయంలో చూసిన దృశ్యం ఇది . ఎంత రాజకీయం అయినా , వారి కుటుంబంలో అందరూ రాజకీయ నాయకులే అయినా ఆ దృశ్యం ఎందుకో నచ్చలేదు . ఎంతైనా ఆమె అత్త , అతను అల్లుడు అలా పిలవడం ఏమిటి అనిపించింది . అత్త పిలుపులో అజ్ఞానం ఉందని , అల్లుడు అలా పరిగెత్తడంలో రాజకీయం దాగుందని చాలా కాలం తరువాత కానీ అర్థం కాలేదు .
*****
ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల వైభోగం అలా వెలిగిపోతున్నప్పుడు చిత్రంగా ఆ కుటుంబం లో నాయకులు అందరికీ ఆంధ్ర జ్యోతి వారే అంతరంగికులుగా ఉండేవారు . ఎన్టీఆర్ , లక్ష్మీ పార్వతి , చంద్రబాబు నాయుడు , దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రధానంగా నలుగురు పవర్ సెంటర్స్ గా ఉండేవారు .వీరిలో ఒకరంటే ఒకరికి పడక పోవచ్చు కానీ చిత్రంగా వీరందరికీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ లే ఒక్కొక్కరికి ఒకరు అంతరంగికులు . వారితో మనసు విప్పి మాట్లాడుకునేవారు . ఎంత గొప్ప రిపోర్టర్ అయినా , ఎంత సీనియర్ రిపోర్టర్ అయినా నాయకులు మనసు విప్పి తమతో పంచుకున్న విషయాలు ఆఫీస్ కు వెళ్లి ఎడిటర్ వద్ద మనసు విప్పి చెప్పాల్సిందే . అంటే లక్ష్మీ పార్వతి , దగ్గుబాటి వంటి వారు మనసు విప్పి మాట్లాడిన విషయాలు ఎడిటర్ వెంకట్రావుకు చేరే అవకాశాలు ఉంటాయి . యేవో కొన్ని ఎడిట్ అయిన విషయాలు తప్ప . వెంకట్రావు చంద్రబాబుకు అంతరంగికులు . పూర్వం రాజుల కాలంలో సైన్యాధ్యక్షుడు రాజు మీద కుట్ర పన్ని తన వారినే రాజు వద్ద అంతరంగికులుగా చేర్చినట్టు చిన్నప్పుడు కథల్లో చదివాను , రిపోర్టర్ ను అయ్యాక స్వయంగా చూశాను . ఎన్టీఆర్ ను బాబు గద్దె దించడాన్ని వెంకట్రావు సమర్ధిస్తూ రక్తపాతం లేకుండా ప్రశాంతంగా అధికార మార్పిడి జరిగింది అని మెచ్చుకున్నారు . ప్రజాస్వామ్యం లో వెన్నుపోట్లు ఉంటాయి కానీ రక్తపాతం ఎందుకుంటుంది . ఒక్క చుక్క రక్తం కారకుండా గొంతు నులమడం ఉంటుంది కానీ రక్తం ఎందుకు పారుతుంది .
అధికారంలో ఉన్నప్పుడు ఈ కుటుంబం మొత్తానికి జ్యోతి రిపోర్టర్ లు అంతరంగికులు అయితే అధికారం పోయాక లక్ష్మి పార్వతికి ఆంధ్రభూమి వాళ్ళు అంతరంగికులుగా మారడం విచిత్రం .
చిక్కడపల్లి లోకల్ రిపోర్టర్ మొదలుకొని చిక్కడపల్లిలో ఉండే ఎడిటర్ శాస్త్రి వరకు అందరూ లక్ష్మీ పార్వతికి అంతరంగికులుగా మారారు .
*****
అధికారం అంతా పోయి ... మహాసామ్రాజ్యం కూలిపోయిన తరువాత కనిపించే దృశ్యం బంజారాహిల్స్ లో ఎన్టీఆర్ నివాసం వద్ద కనిపించేది . అలాంటి రోజుల్లో ఓ సమాచారం కోసం లక్ష్మీపార్వతి ఫోన్ చేసినప్పుడు వరంగల్ లో నేను చూసిన ఆనాటి సంఘటన గుర్తు చేశాను . అల్లుడిని అలా పిలవడం తప్పు కదా ? అని అడిగితే .. నువ్వు అదే చూశావు .. ఓ సారి నేను ఎన్టీఆర్ విమానం దిగి వస్తుంటే నా సూట్ కేస్ పట్టుకొని వచ్చాడు తెలుసా అని చెప్పుకొచ్చారు . అందుకే అల్లుడు అ క్కడున్నారు , మీరు ఇక్కడున్నారు అనుకున్నాను .
****
బాబు సీఎం అయ్యాక వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు . సామూహికంగా అందరితో ఒకే సారి మాట్లాడితే అది ప్రెస్ కాన్ఫరెన్స్ , అదే విషయాన్ని ఒక్కొక్కరికి విడిగా చెబితే అది ఇంటర్వ్యూ . ఇలా ఉండేది వారి ఇంటర్వ్యూ . మనం ఏం అడిగినా వారు చెప్పదలుచుకున్నది చెబుతారు . దీని వల్ల ఇంటర్వ్యూ అన్ని పత్రికల్లో ఒకేలా వచ్చేది . ఓ రోజు హిందూ రిపోర్టర్ నాతో నేను ఎక్కువ సమయం వేచి ఉండలేను , ఇద్దరం కలిసి వెళదాం సరేనా అంటే సరే అని వెళ్లాం .
నా ఒక్కరితో తో ఐతే ఆ మాట అనకపోయేవారేమో హిందూ రిపోర్టర్ ఉండడం వల్ల మనసు విప్పి ఒకే ఒక మాట చెప్పారు . లక్ష్మీ పార్వతికి కొద్దిగా నైనా రాజకీయం తెలిసి ఉంటే నా రాజకీయ జీవితం ఉండేది కాదు అని బాబుమనసులో మాట చెప్పారు . చిటికెలు వేసి పిలిచినా , సూట్ కేసు మోసినా లక్ష్మీపార్వతి తన విజయం అనుకున్నారు కానీ ... బాబు మనసులో ఏ వ్యూహం రూపుదిద్దుకుంటుందో ఊహించలేక పోయారు . అవమానాలు సహించిన వాడే బలంగా ప్రతీకారం తీర్చుకుంటాడు . ఒకవేళ నువ్వు బయటకు పంపాలి అనుకుంటే పంపించేయాలి . గిల్లుతూ గిచ్చుతూ కాలం వెల్లిబుచ్చుతుంటే ప్రతీకారంతో రగిలిపోయి సమయం వచ్చినప్పుడు కాటేస్తే కోలుకోలేరు . లక్ష్మీపార్వతి గిచ్చితే , సమయం వచ్చినప్పుడు బాబు ఏకంగా కాటేశారు . రాజకీయం వైకుంఠ పాళీ .
- బుద్దా మురళి
4, జులై 2023, మంగళవారం
బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -65
బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు
మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -65
-----------------------------------------
మీకు చంద్రబాబు అర్థం కావడం లేదు . ఆయన తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ చేత సీకులు అమ్మించగలరు . నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు . మనతో చెప్పిస్తున్నారు అంటూ చంద్రబాబు ముందే మాట్లాడే సరికి అంతా విస్తు పోయారు . సంక్షిప్తంగా చెప్పాలిసింది చెప్పి కిందకు వచ్చాను . ప్రెస్ క్లబ్ లో సమావేశం . వేదికపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు , జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి , దేవులపల్లి అమర్ ఇంకా చాలా మంది హేమా హేమీలు ... ఒక్కో జర్నలిస్ట్ మైకు ముందుకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది కాబట్టి మధ్య నిషేధం ఎత్తి వేయండి అని తన అభిప్రాయాన్ని చెబుతున్నారు . జీవితంలో అప్పటికి మైకు ముందు మాట్లాడింది . రెండో లేక మూడో సారి మాత్రమే . ఒకే ఒక సారి .ఏడవ తరగతి చదువుకునే రోజుల్లో వ్యాసరచనలో మొదటి బహుమతి వస్తే మైకు ముందు మాట్లాడమంటే చమటలు పట్టాయి . కానీ మాట్లాడుతున్న జర్నలిస్ట్ లు అందరూ ఆమధ్య నిషేధం ఎట్టి వేయాలి అని మాట్లాడుతుంటే కోపం , ఆవేదన , చిరాకు అన్నీ కలిసి మైకు పట్టుకునేట్టు చేశాయి .
అభిప్రాయం సేకరణ అనేది ఉట్టి డ్రామా .. అసలు మధ్య నిషేధ ఉద్యమమే పెద్ద రాజకీయ డ్రామా . ఆ డ్రామాకు ముయింపు పలకడానికి చంద్రబాబు అభిప్రాయం సేకరణ అనే డ్రామాకు శ్రీకారం చుట్టారు . జర్నలిస్ట్ లకు సంబంధించిన సమస్య కాకుండా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఏకైక ఉద్యమం మద్య నిషేధం . మద్యనిషేధం విధించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉదమించిన జర్నలిస్ట్ లు , నిషేధం ఎట్టి వేయాలి అని ప్రెస్ క్లబ్ సమావేశం లో ఉత్సాహంగా ఎలుగెత్తి చాటడం చిరాకేసింది . చంద్రబాబు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొన్న తరువాతనే దానిపై ఆయన అభిప్రాయ సేకరణ జరిపి , అందరి అభిప్రాయం తో ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెబుతారు . అది ఆయన స్టైల్ .... అంతకు ముందు ప్రముఖ సంఘసేవకురాలు మద్యనిషేధం కోసం ఆందోళన చేశారు . దాన్ని గుర్తు చేస్తూ బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ తో సీకులు అమ్మిస్తారు అన్నాను . అంత తీవ్రమైన కామెంట్ చేసినా బాబు మౌనంగానే విన్నారు . అప్పుడు వార్తలో ఉన్న జర్నలిస్ట్ జగన్నాధ నాయుడు నేనన్న మాటలు రాశారు . బాబు ఎలాగూ నిషేధం ఎత్తివేస్తారు , మనం ( జర్నలిస్టులం ) చెబితే ఎత్తి వేశారు అనే పేరు మనకెందుకు అని నా అభిప్రాయం .
********
కాంగ్రెస్ ను అధికారం నుంచి దించేందుకు మద్యం అంశాన్ని వాడుకున్నారని , ఆమధ్య నిషేధ ఉద్యమం జరిపారు అనేది బహిరంగ రహస్యం . ఐతే చివరకు ఎన్టీఆర్ ను బాబు దించేయడం వెనుక మద్య నిషేధ అంశం ఉంది అనేది ఓ బలమైన విమర్శ ..
1990 -91 ప్రాంతంలో సంగారెడ్డిలో ఉన్నప్పుడు మద్యనిషేధ ఉద్యమం ... రాజకీయాల్లోకి రావాలి అనుకొంటున్న బి ఎన్ శాస్త్రి అనే ఓ బ్యాంకు ఉద్యోగి రాత్రి పార్టీలో రాజకీయాల్లోకి ఎలా రావాలి అని చర్చ . మెదక్ లో దేవయ్య అనే జర్నలిస్ట్ మద్య నిషేధం ఉద్యమం కోసం పెద్ద సభ పెడుతున్నాడు . రేపే వేళ్ళు అని సలహా . రాజకీయ నాయకులు ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ అంతకు ముందు మందు అలవాటు ఉన్న దేవయ్య జిల్లాలో ఉద్యమాన్ని జరిపితెలిసినంత వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు మందు ముట్టలేదు . ఈ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో మద్య నిషేధం ఉద్యమానికి జనానికి మందు పోయించి టీడీపీ వాళ్ళు లారీలో సభకు తరలించారు అని వార్త చదివాను .
*****
1994 ప్రాంతంలో గోదావరికి వరదలు . తెలంగాణ జర్నలిస్ట్ లకు కరువు వార్తలు , ఎంకౌంటర్ ల వార్తలు , ఆకలి వార్తలు కవర్ చేసిన అనుభవం ఉంటుంది కానీ వరదల వార్తల అనుభవం తక్కువ . సమాచార శాఖ వాళ్ళు వాహనం ఏర్పాటు చేసి వరదల వార్తల కోసం ఏటూరు నాగారం తీసుకువెళ్లారు . ఆల్ ఇండియా రేడియోలో పని చేసే జైపాల్ రెడ్డి , ఈనాడు శ్రీ రామ్ , నేనూ ఇంకా కొందరం వెళ్ళాం .వరద ప్రవాహాన్ని దాటుకొంటూ స్థానికుడు ఒకడు నాటు పడవలో వస్తే ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చిన జైపాల్ రెడ్డి మైకు పెట్టి అడిగితే , వరదలు మునిగిపోతాం ,తరలిస్తాం అని వీళ్ళు ఇలానే చెబుతారు మాకు తెలియదా అన్నాడు . అంత వరదలోనూ సాహసోపేతంగా అతను నాటు పడవలో ఇటు వైపు ఎందుకు వచ్చాడు అంటే మద్యం కోసం . అతని మాటలు అందరం విన్నాం .
*****
అప్పటికి సారా నిషేధం అమలులో ఉంది . సంపూర్ణ మధ్య నిషేధం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వరంగల్ జిల్లా నుంచి ఈనాడులో వార్తల ఉద్యమం . తొలుత ఈనాడు నెల్లూరు జిల్లాల్లో సారా నిషేధం కోసం ఉద్యమం జరిగింది . ఈనాడు శ్రీరామ్ అప్పుడు నెల్లూరు జిల్లా రిపోర్టర్ . ఈనాడు నెల్లూరులో ప్రారంభం అయిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించింది . మిగిలిన మీడియా అనుసరించక తప్పలేదు . ఈనాడు శ్రీరామ్ నెల్లూరు నుంచి వరంగల్ జిల్లాకు బదిలీ అయ్యారు . వరంగల్ ఈనాడులో సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమం మొదలైంది . నిజంగా ప్రజలు సంపూర్ణ మద్య నిషేధం కోసం ఉద్యమించారా ? అంటే నేనే కాదు ఆ శ్రీ రామ్ కూడా వరదలో కూడా మందు కోసం వచ్చిన వారిని చూశారు . ఎన్టీఆర్ ను అధికారంలోకి తీసుకురావడంలో మద్య నిషేధ ఉద్యమం కీలక పాత్ర వహించింది . అదే మద్యం ఆయన్ని అధికారం నుంచి దించేట్టు చేసింది అని ప్రచారం .
****
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సారాయి నిషేధం విధిస్తే , ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం విధించారు . సంపూర్ణ నిషేధంలో స్టార్ హోటల్స్ లో మాత్రం మద్యం లభించేది . తరువాత బాబు సీఎం అయ్యారు . వైస్రాయ్ హోటల్ లోనే నిర్ణయం జరిగింది .. బాబు మద్య నిషేధం ఎట్టి వేస్తారు అని వార్తలు వచ్చాయి . కానీ బాబు రాగానే ఎన్టీఆర్ సంపూర్ణ నిషేధం అన్నారు కానీ అది సంపూర్ణం కాదు అంటూ స్టార్ హోటల్స్ లో కూడా నిషేధం విధించారు . అప్పుడే సంపూర్ణ నిషేధం ఎత్తివేయడం ఖాయం అనిపించింది . బాబు నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు . నిషేధం ఎత్తివేశారు .
ఈ మధ్య హౌసింగ్ సొసైటీ మీటింగ్ లో శ్రీ రామ్ కలిస్తే వరదలో నాటు పడవ మీద వచ్చి మందు కొనుక్కొని పోవడం , మీరేమో వరంగల్ కేంద్రంగా సంపూర్ణ నిషేధ ఉద్యమం అని రాయడం అంటూ సరదాగా గుర్తు చేసుకున్నాం . మంచి ఉద్దేశం తో మద్యానికి వ్యతిరేకంగా రాశాను . అలా జరిగింది అని గుర్తు చేసుకున్నారు .
*****
ఇంతా చెప్పి మీరు తాగుతారో లేదో చెప్పలేదు అని అనుమానమా ?
మద్య నిషేధం కోసం రాష్ట్రవ్యాప్తంగా గొప్ప ఉద్యమం చేసిన టీడీపీ 2004 ఎన్నికలకు ముందు మీడియాకు మందు పార్టీ ఇచ్చింది . యల్ వి యస్ ఆర్ కే ప్రసాద్ అని మీడియా ఇంచార్జ్ మీరు తాగి తీరాల్సిందే అని పట్టు పట్టారు . 2004 ఎన్నికల్లో మీరు గెలవగానే తాగుతాను ప్రామిస్ అని గట్టిగా చెప్పాను . అతనుగేలుస్తామని మురిసిపోయారు . 2004 ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే విషయమ లోనాకు అంత విశ్వాసం ఉండేది .
మద్య పానం అనే ఒక భయంకరమైన వ్యసనంను రాజకీయ ఎత్తుగడ గా మార్చి ప్రజలకు ద్రోహం చేశారు .
- బుద్దా మురళి
3, జులై 2023, సోమవారం
జర్నలిస్ట్ లను అడవిలోకి ఎందుకు తీసుకు వెళ్తుంది ఎస్పీ చెప్పాక .... నీ ప్రాణం నీకు ముఖ్యం ... బాస్ దేవుడు కాదు ... జర్నలిస్ట్ జ్ఞాపకం 64
ఎమ్మెల్లే సుధీర్ కుమార్ ను నక్సల్స్ విడుదల రోజు ఏమైందంటే ...
జర్నలిస్ట్ లను అడవిలోకి ఎందుకు తీసుకు వెళ్తుంది ఎస్పీ చెప్పాక ....
నీ ప్రాణం నీకు ముఖ్యం ... బాస్ దేవుడు కాదు
జర్నలిస్ట్ జ్ఞాపకం 64
--------------------------------
ఇదీ విషయం సార్ రమ్మంటున్నారు వస్తారా ? అని పోలీస్ కానిస్టేబుల్ చెప్పగానే యెగిరి గంతేశాము . నలుగురం జర్నలిస్టులం ఆ కానిస్టేబుల్ వెంట నడిచాం .
1991 మే నెల .. నక్సల్స్ ప్రభావం ఉదృతంగా ఉన్న రోజులు అవి . నక్సల్స్ తమ డిమాండ్ల కోసం శాసన సభ్యులను , అధికారులను ముమ్మరంగా కిడ్నాప్ చేస్తున్న రోజులు అవి. మాజీ కేంద్రమంత్రి పి శివశంకర్ కుమారుడు మలక్ పేట శాసన సభ్యులు పి . సుధీర్ కుమార్ ను హైదరాబాద్ నగరంనడి బొడ్డులో , పట్టపగలే నక్సల్స్ కిడ్నాప్ చేశారు . ( పట్టపగలే అని ఏదో అలా రాసేస్తాం కానీ నగరం నడి బొడ్డున ఐతేనేం ఓ కొసకు ఐతే నేం , పట్టపగలు ఐతే నేం ,ఉదయం ఐతేనేం కిడ్నాప్ కిడ్నాపే ) . దింతో రాష్ట్రమంతా ఉద్రిక్తత వాతావరణం . అప్పుడు కేంద్రంలో , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే . పి శివశంకర్ అంటే కాంగ్రెస్ లో కీలక వ్యక్తి . సుధీర్ కుమార్ శాసన సభ్యులు . దాంతో నక్సల్స్ ఎందుకు కిడ్నాప్ చేశారు , ఎక్కడ ఉంచారు అనే ఆసక్తి సహజమే . అందరిలానే మెదక్ జిల్లా జర్నలిస్ట్ లం ఏమవుతుందా ? అని ఎదురు చూస్తున్నాం . ఇలాంటి సమయం లో నక్సల్స్ సుధీర్ కుమార్ ను కిడ్నాప్ చేసి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అడవుల్లో పెట్టారని , అడవికి దగ్గరగా ఉన్న ఒక సర్పంచ్ ఇంట్లో వదిలి పెట్టారు అని సమాచారం . అడవికి సమీపం లో ఉన్న ఆ సర్పంచ్ ఇంటికి వెళుతున్నాను , మీరూ వస్తారా ? అని అప్పటి మెదక్ జిల్లా పోలీస్ సూపరిండెంట్ నండూరి సాంబశివరావు జర్నలిస్ట్ ల వద్దకు కానిస్టేబుల్ ను పంపించారు . 91 ప్రాంతంలో జర్నలిస్ట్ లకు ఫోన్ , వాహనం వంటి సౌకర్యాలు అంతంత మాత్రమే . అలాంటి సమయంలో తన కారులో సుధీర్ కుమార వద్దకు తీసుకువెళతాను అని ఎస్పీ చెబితే , పరిగెత్తకుండా ఏ రిపోర్టర్ అయినా ఎలా ఉంటారు .
*****
ఎస్పీ , ఆయన గాన్ మెన్ , జర్నలిస్టులం సంగారెడ్డి నుంచి కారులో నర్సాపూర్ వైపు ప్రయాణం . ఇంత క్లిష్ట సమయంలో ఎస్పీ పెద్ద మనసుతో తన కారులో తీసుకువెళుతున్నందుకు మనసులోనే ఎన్ని సార్లు కృతజ్ఞత చెప్పుకున్నామో . అడవికి , వెళ్ళల్సిన చోటుకు చేరువ అవుతున్నాం అనగా ఎస్పీ నేను మిమ్ములను నాతో పాటు ఎందుకు తీసుకువెళుతున్నానో తెలుసా ? అని అడిగితే మా కోణం లో మేం సమాధానం చెప్పాము . మా సౌకర్యమ కోసమే మీరు తీసుకువెళుతున్నారు అని కోరస్ గా పలికాం . అయన పోలీసు నవ్వు నవ్వి ... పోలీసు నవ్వు అంటే ఏమిటో తెలియదు కానీ, బాగుందని వాడేస్తున్నాను .. భైరవ్ సింగ్ షేఖావత్ ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు . అప్పటి ఉమ్మడి రాష్ట్రం లో హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ ఇద్దరూ ఓ సభలో పాల్గొన్నారు . దేవేందర్ గౌడ్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు . షేఖావత్ అది గమనించి ఏ ఉద్దేశంతో అన్నారో కానీ పోలీసు నవ్వు నమ్మడానికి వీలులేదని చమత్కరించారు .
మమ్ములను ఎందుకు తనతో తీసుకువెళుతున్నారో మేం చెప్పిన సమాధానం సరైనది కాకపోవడం తో ఎస్పీ నే చెప్పారు .
నర్సాపూర్ అడవుల్లో సుధీర్ కుమార్ ను నక్సల్స్ దాచారు . ఇంతకు ముందే దగ్గరలో ఉన్న సర్పంచ్ ఇంట్లో వదిలి వెళ్లారు అని సర్పంచు నుంచి ఫోన్ వచ్చింది . ఈ సమాచారం నిజం కావచ్చు , కాకపోవచ్చు . సుధీర్ కుమార్ ను వదిలామని చెబితే సాధారణంగా ఎస్పీ వస్తారు కదా ? ఎస్పీ ని టార్గెట్ చేసేందుకు ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంది . నక్సల్స్ సర్పంచు ను పట్టుకొని ఈ మాట చెప్పమంటే చెబుతాడు అదేం పెద్ద కష్టం కాదు . నేను కారులో వస్తున్నాను అని నన్ను టార్గెట్ చేయవచ్చు . కారులో నాతో పాటు జర్నలిస్ట్ లు ఉన్నారు అంటే , నాతో పాటు మీరూ పోతారు , తమకు చెడ్డ పేరు వస్తుంది అని టార్గెట్ చేయకుండా వదిలి వేయ వచ్చు .. ఒక వేళ దాడి చేసినా నాతో పాటు మీరూ అందరం పోతాం దీని వల్ల జనానికి నక్సల్స్ పట్ల సానుభూతి పోతుంది అంటూ ఎస్పీ చెప్పుకుంటూ పోతుంటే ... అమ్మ ఎస్పీ అని అడవిని చేరుకున్నాక వణికి పోయాం .
*****
ఎస్పీ ఉహించినట్టుగా ఏమీ జరగలేదు .. ఊరులోకి ప్రవేశించాక సర్పంచు ఇల్లు చేరాక ముందే సుధీర్ కుమార్ , సర్పంచు కొంతమంది గ్రామస్తులతో కలిసి మాకు ఎదురుగా వచ్చారు . చేతిలో ఉన్న కెమెరాతో ఆ సమూహాన్ని తీసిన ఫోటో మరుసటి రోజు డక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి మొదటి పేజీ అలంకరించింది . ఎస్పీ కూడా సంతోష పడ్డారు ఆ ఫొటోలో తన కృషి కూడా రికార్డ్ అయిందని ... నండూరి సాంబశివరావు తెలివైన వారు . యస్సి హాస్టల్స్ కు సంబంధిని ఓ వార్త అపుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . చంద్రబాబు , ప్రతిభాభారతి శాసన సభ్యుల బృందంతో వచ్చి నారాయణ ఖేడ్ హాస్టల్ వద్ద ఆందోళన అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్లే కిష్టా రెడ్డి నేను అత్యాచారం చేశాను అని ఆరోపించి ధర్నా చేశారు కదా అది నిరుపించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు అని ఆయన ఆందోళన . ఉద్రిక్తత . ఎస్పీ రెండు వైపులా వారిని తోసేశాడు . ఆయనకు కొంత సేపటి తరువాత అనుమానం వచ్చింది . విపక్షానికి చెందిన బాబు , ప్రతిభా భారతి వంటి వారిని తోసేశాను . మీడియా ఏమైనా వ్యతిరేకంగా రాస్తుందా ? అని కొద్ది సేపటి తరువాత పిలిచి . ట్రెండు పార్టీల వారి వల్ల ఉద్రికత్త పరిస్థితి చేయి దాటి పోయేట్టు ఉందని ఇరు వర్గాలను తోసేశాను . నేను చేసిన దానిలో తప్పు ఏమైనా ఉందా ? అని అడిగితే లేనే లేదని సమాధానం చెప్పాము . విభజన తరువాత నండూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ డిజిపి అయ్యారు .
*****
జర్నలిస్ట్ అనే వాడికి వార్తలకు సంబంధించి విపరీతమైన ఆకలి ఉంటుంది . ఎస్పీ అనే కాదు సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆడుకుంటుంది . పూర్తి కాలం జీతం ఇంట్లో వారికి గ్రూప్ వన్ నుంచి వారి వారి హోదా మేరకు ఉద్యోగం ఇస్తారు . మనిషిని తీసుకు రాక పోవచ్చు కానీ ఆర్థికంగా లోటు లేకుండా చేస్తారు . మరి జర్నలిస్ట్ పోతే ?
కనీసం నివాళి కూడా ఉండదు . అతని మరణంతో ఖాళీ అయిన స్థానం కోసం అంత్యక్రియలు పూర్తి కాకముందే ప్రయత్నాలు జరుగుతాయి . ఆఫీస్ వాళ్ళు కూడా ఆ ఖాళీలో ఎవడిని భర్తీ చేయాలి అని చూస్తారు కానీ ,.. అతని మరణం వల్ల వాళ్ళింటో ఖాళీని గుర్తించరు . ఇది అమానుషం కాదు అత్యంత సహజం .
చాల్లే జర్నలిస్ట్ లు అంటే ఏదో త్యాగ జీవులు అని రాస్తున్నారు .. మాకు తెలియదా వారి సంగతులు అనిపించడం కూడా అత్యంత సహజం . ఇల్లు కడుతున్నా బెదిరింపులు , ఇసుక వ్యాపారం చేస్తున్నా బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు . కొందరు అరెస్టయ్యారు . కొందరు దర్జాగా అలా బ్లాక్ మెయిల్ చేస్తూ బతికేస్తున్నారు అనుకుంటున్నారా ? అలా అనుకోవడంలో అస్సలు తప్పు లేదు . ఇలాంటి కేసులు ఎన్నో నాకూ తెలుసు . ఇలాంటి వారు లెక్క లేనంత మంది ఉన్నారు . ఇదీ నిజమే . అలా కాకుండా చేసే వృత్తికి పరిమితమై బతుకుతున్న వారూ అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ సంఖ్య లో ఉన్నారు ఇదీ కూడా నిజమే .
ఎన్నో సౌకర్యాలు ఉండే ఎస్పీ స్థాయి అధికారి తాను పోతే ఎలా అని ఆలోచించినప్పుడు , నువ్వు పోతే కుటుంబం అనాధ అవుతుంది అని తెలిసిన జర్నలిస్ట్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి .
*****
నిజామాబాద్ లో ఓ జర్నలిస్ట్ ఎంకౌంటర్ వార్త సేకరణ కోసం పోలీసులతో పాటు బస్సులో వెళ్లారు . కిందికి దిగడమే ఆలస్యం నక్సల్స్ తూటాలకు బలయ్యారు .
శ్రీకాకుళం లో ఏనుగుల దాడులు సర్వసాధారణం . ఏనుగుల గుంపు ఊరి మీద పడి భీబత్సం సృష్టిస్తుంటే ఆంధ్రప్రభ స్థానిక విలేఖరి ఫోటో తీశారు . కెమెరా ఫ్లాష్ తనపై పడగానే ఏనుగు అతన్ని వెంబడించి తొక్కి చంపేసింది . తాను ప్రెస్ డ్యూటీ చేస్తున్నాను అని అతని మనసులో ఉంటుంది . దాని ప్రకారమే ముందుకు వెళ్తాడు . కానీ ఏనుగుకు అది తెలియదు అనే విషయం మనకు తెలియాలి . బాస్ ఆదేశించాడు ఏమైనా చేసేద్దాం ఏమీ కాదు అనుకోవద్దు బాస్ దేవుడు కాదు . ప్రకృతి దేవుడు . అన్నీ ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతాయి . మన బాస్ చెప్పినట్టు జరగవు . ఓ మీడియా కింగ్ స్టూడియోకు అద్వానీ వచ్చినప్పుడు చాలా ఏళ్ళ క్రితం ఓ కెమెరా మెన్ మీడియా కింగ్ ను , అద్వానీని కెమెరాలో బంధిస్తూ తనను తాను మరిచి పోవడం తో హెలికాఫ్టర్ రెక్కలు బలయ్యాడు .
వృత్తిని దైవంగా భావించాలి అదే సమయంలో తన కోసం ఎదురు చూసే కుటుంబం ఉంటుందని గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి . ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే తిట్టు కాదు ఎరుకలో ఉండడం అని.....
బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)