4, జులై 2023, మంగళవారం

బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -65

బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -65 ----------------------------------------- మీకు చంద్రబాబు అర్థం కావడం లేదు . ఆయన తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ చేత సీకులు అమ్మించగలరు . నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు . మనతో చెప్పిస్తున్నారు అంటూ చంద్రబాబు ముందే మాట్లాడే సరికి అంతా విస్తు పోయారు . సంక్షిప్తంగా చెప్పాలిసింది చెప్పి కిందకు వచ్చాను . ప్రెస్ క్లబ్ లో సమావేశం . వేదికపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు , జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి , దేవులపల్లి అమర్ ఇంకా చాలా మంది హేమా హేమీలు ... ఒక్కో జర్నలిస్ట్ మైకు ముందుకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది కాబట్టి మధ్య నిషేధం ఎత్తి వేయండి అని తన అభిప్రాయాన్ని చెబుతున్నారు . జీవితంలో అప్పటికి మైకు ముందు మాట్లాడింది . రెండో లేక మూడో సారి మాత్రమే . ఒకే ఒక సారి .ఏడవ తరగతి చదువుకునే రోజుల్లో వ్యాసరచనలో మొదటి బహుమతి వస్తే మైకు ముందు మాట్లాడమంటే చమటలు పట్టాయి . కానీ మాట్లాడుతున్న జర్నలిస్ట్ లు అందరూ ఆమధ్య నిషేధం ఎట్టి వేయాలి అని మాట్లాడుతుంటే కోపం , ఆవేదన , చిరాకు అన్నీ కలిసి మైకు పట్టుకునేట్టు చేశాయి . అభిప్రాయం సేకరణ అనేది ఉట్టి డ్రామా .. అసలు మధ్య నిషేధ ఉద్యమమే పెద్ద రాజకీయ డ్రామా . ఆ డ్రామాకు ముయింపు పలకడానికి చంద్రబాబు అభిప్రాయం సేకరణ అనే డ్రామాకు శ్రీకారం చుట్టారు . జర్నలిస్ట్ లకు సంబంధించిన సమస్య కాకుండా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఏకైక ఉద్యమం మద్య నిషేధం . మద్యనిషేధం విధించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉదమించిన జర్నలిస్ట్ లు , నిషేధం ఎట్టి వేయాలి అని ప్రెస్ క్లబ్ సమావేశం లో ఉత్సాహంగా ఎలుగెత్తి చాటడం చిరాకేసింది . చంద్రబాబు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొన్న తరువాతనే దానిపై ఆయన అభిప్రాయ సేకరణ జరిపి , అందరి అభిప్రాయం తో ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెబుతారు . అది ఆయన స్టైల్ .... అంతకు ముందు ప్రముఖ సంఘసేవకురాలు మద్యనిషేధం కోసం ఆందోళన చేశారు . దాన్ని గుర్తు చేస్తూ బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ తో సీకులు అమ్మిస్తారు అన్నాను . అంత తీవ్రమైన కామెంట్ చేసినా బాబు మౌనంగానే విన్నారు . అప్పుడు వార్తలో ఉన్న జర్నలిస్ట్ జగన్నాధ నాయుడు నేనన్న మాటలు రాశారు . బాబు ఎలాగూ నిషేధం ఎత్తివేస్తారు , మనం ( జర్నలిస్టులం ) చెబితే ఎత్తి వేశారు అనే పేరు మనకెందుకు అని నా అభిప్రాయం . ******** కాంగ్రెస్ ను అధికారం నుంచి దించేందుకు మద్యం అంశాన్ని వాడుకున్నారని , ఆమధ్య నిషేధ ఉద్యమం జరిపారు అనేది బహిరంగ రహస్యం . ఐతే చివరకు ఎన్టీఆర్ ను బాబు దించేయడం వెనుక మద్య నిషేధ అంశం ఉంది అనేది ఓ బలమైన విమర్శ .. 1990 -91 ప్రాంతంలో సంగారెడ్డిలో ఉన్నప్పుడు మద్యనిషేధ ఉద్యమం ... రాజకీయాల్లోకి రావాలి అనుకొంటున్న బి ఎన్ శాస్త్రి అనే ఓ బ్యాంకు ఉద్యోగి రాత్రి పార్టీలో రాజకీయాల్లోకి ఎలా రావాలి అని చర్చ . మెదక్ లో దేవయ్య అనే జర్నలిస్ట్ మద్య నిషేధం ఉద్యమం కోసం పెద్ద సభ పెడుతున్నాడు . రేపే వేళ్ళు అని సలహా . రాజకీయ నాయకులు ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ అంతకు ముందు మందు అలవాటు ఉన్న దేవయ్య జిల్లాలో ఉద్యమాన్ని జరిపితెలిసినంత వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు మందు ముట్టలేదు . ఈ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో మద్య నిషేధం ఉద్యమానికి జనానికి మందు పోయించి టీడీపీ వాళ్ళు లారీలో సభకు తరలించారు అని వార్త చదివాను . ***** 1994 ప్రాంతంలో గోదావరికి వరదలు . తెలంగాణ జర్నలిస్ట్ లకు కరువు వార్తలు , ఎంకౌంటర్ ల వార్తలు , ఆకలి వార్తలు కవర్ చేసిన అనుభవం ఉంటుంది కానీ వరదల వార్తల అనుభవం తక్కువ . సమాచార శాఖ వాళ్ళు వాహనం ఏర్పాటు చేసి వరదల వార్తల కోసం ఏటూరు నాగారం తీసుకువెళ్లారు . ఆల్ ఇండియా రేడియోలో పని చేసే జైపాల్ రెడ్డి , ఈనాడు శ్రీ రామ్ , నేనూ ఇంకా కొందరం వెళ్ళాం .వరద ప్రవాహాన్ని దాటుకొంటూ స్థానికుడు ఒకడు నాటు పడవలో వస్తే ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చిన జైపాల్ రెడ్డి మైకు పెట్టి అడిగితే , వరదలు మునిగిపోతాం ,తరలిస్తాం అని వీళ్ళు ఇలానే చెబుతారు మాకు తెలియదా అన్నాడు . అంత వరదలోనూ సాహసోపేతంగా అతను నాటు పడవలో ఇటు వైపు ఎందుకు వచ్చాడు అంటే మద్యం కోసం . అతని మాటలు అందరం విన్నాం . ***** అప్పటికి సారా నిషేధం అమలులో ఉంది . సంపూర్ణ మధ్య నిషేధం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వరంగల్ జిల్లా నుంచి ఈనాడులో వార్తల ఉద్యమం . తొలుత ఈనాడు నెల్లూరు జిల్లాల్లో సారా నిషేధం కోసం ఉద్యమం జరిగింది . ఈనాడు శ్రీరామ్ అప్పుడు నెల్లూరు జిల్లా రిపోర్టర్ . ఈనాడు నెల్లూరులో ప్రారంభం అయిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించింది . మిగిలిన మీడియా అనుసరించక తప్పలేదు . ఈనాడు శ్రీరామ్ నెల్లూరు నుంచి వరంగల్ జిల్లాకు బదిలీ అయ్యారు . వరంగల్ ఈనాడులో సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమం మొదలైంది . నిజంగా ప్రజలు సంపూర్ణ మద్య నిషేధం కోసం ఉద్యమించారా ? అంటే నేనే కాదు ఆ శ్రీ రామ్ కూడా వరదలో కూడా మందు కోసం వచ్చిన వారిని చూశారు . ఎన్టీఆర్ ను అధికారంలోకి తీసుకురావడంలో మద్య నిషేధ ఉద్యమం కీలక పాత్ర వహించింది . అదే మద్యం ఆయన్ని అధికారం నుంచి దించేట్టు చేసింది అని ప్రచారం . **** కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సారాయి నిషేధం విధిస్తే , ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం విధించారు . సంపూర్ణ నిషేధంలో స్టార్ హోటల్స్ లో మాత్రం మద్యం లభించేది . తరువాత బాబు సీఎం అయ్యారు . వైస్రాయ్ హోటల్ లోనే నిర్ణయం జరిగింది .. బాబు మద్య నిషేధం ఎట్టి వేస్తారు అని వార్తలు వచ్చాయి . కానీ బాబు రాగానే ఎన్టీఆర్ సంపూర్ణ నిషేధం అన్నారు కానీ అది సంపూర్ణం కాదు అంటూ స్టార్ హోటల్స్ లో కూడా నిషేధం విధించారు . అప్పుడే సంపూర్ణ నిషేధం ఎత్తివేయడం ఖాయం అనిపించింది . బాబు నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు . నిషేధం ఎత్తివేశారు . ఈ మధ్య హౌసింగ్ సొసైటీ మీటింగ్ లో శ్రీ రామ్ కలిస్తే వరదలో నాటు పడవ మీద వచ్చి మందు కొనుక్కొని పోవడం , మీరేమో వరంగల్ కేంద్రంగా సంపూర్ణ నిషేధ ఉద్యమం అని రాయడం అంటూ సరదాగా గుర్తు చేసుకున్నాం . మంచి ఉద్దేశం తో మద్యానికి వ్యతిరేకంగా రాశాను . అలా జరిగింది అని గుర్తు చేసుకున్నారు . ***** ఇంతా చెప్పి మీరు తాగుతారో లేదో చెప్పలేదు అని అనుమానమా ? మద్య నిషేధం కోసం రాష్ట్రవ్యాప్తంగా గొప్ప ఉద్యమం చేసిన టీడీపీ 2004 ఎన్నికలకు ముందు మీడియాకు మందు పార్టీ ఇచ్చింది . యల్ వి యస్ ఆర్ కే ప్రసాద్ అని మీడియా ఇంచార్జ్ మీరు తాగి తీరాల్సిందే అని పట్టు పట్టారు . 2004 ఎన్నికల్లో మీరు గెలవగానే తాగుతాను ప్రామిస్ అని గట్టిగా చెప్పాను . అతనుగేలుస్తామని మురిసిపోయారు . 2004 ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే విషయమ లోనాకు అంత విశ్వాసం ఉండేది . మద్య పానం అనే ఒక భయంకరమైన వ్యసనంను రాజకీయ ఎత్తుగడ గా మార్చి ప్రజలకు ద్రోహం చేశారు . - బుద్దా మురళి

16 కామెంట్‌లు:

  1. మురళి గారు , నేను పేపర్ చదివినప్పుడు, ఏర్పరుచుకున్న అభిప్రాయాలు మీ ఆర్టికల్స్ చదువుతుంటే అవన్నీ గాలికి ఎగిరినట్టు ఎగిరి పోతున్నాయి . ఎక్కడో మారుమూల గ్రామం లో చదివేవాళ్ళకి ఈ వార్త ఎందుకు వచ్చింది అన్న ఆలోచనకి సమాధానం ఊహకి కూడా అందదు . ఆ వార్త రాసిన జర్నలిస్ట్ , management కి తప్ప . ఇప్పటి నుండి నేను వార్తలు చదివే తీరు లో కొంచెం అయినా మార్పు వస్తుంది . నేను కనీసం ఇంకో ఇద్దరినీ అయినా ఎడ్యుకేట్ చేస్తాను . మీ సమకాలీకులు అందరు ఇంత నిర్మొహమాటంగా రాసి ఉంటె మాకు ఇంకా చాలా విషయాలు తెలిసేవేమో . చాల మంది ఎందుకో పై పై నా రాసే వదిలేస్తారు . నేను ఒక ఫేమస్ జర్నలిస్ట్ ని అడిగాను , బ్లాగుల్లో, ఎందుకు కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు రాస్తారు, ఆ ఇన్సైడ్ స్టోరీస్ రాయొచ్చు కదా అని. మౌనమే ఆయన సమాధానం . మీ టైం ఇలా కేటాయిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు సర్ .

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడంటే సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి రాయడానికి అవకాశం . ఎందుకు రాయరు అనడానికి ఒక్కొక్కరికి ఓ కారణం ఉండవచ్చు . ఓ ఉదాహరణ సినిమా వాళ్ళు ఎవరైనా తొటి నటులు హీరోలు దేవుళ్ళు అని కీర్తిస్తారు . ms రెడ్డి ఉన్నది ఉన్నట్టుగా రాశారు . ఎన్టీఆర్ తో సహా అందరి గురించి ఎందుకంటే ఆయన వయసు 90+ . ఆయనకు ఆ వయసులో సినిమాలు అవసరం లేదు , ఎవరి సహాయం అవసరం లేదు కాబట్టి నిజాయితీగా రాశారు . బుక్ బయటకు వచ్చాక కలకలం . వారి కుమారుడు ( జబర్దస్త్ ప్రొడ్యూసర్ ) ఆ  బుక్స్ అన్ని వెనక్కి తీసుకున్నారు . ఎందుకంటే వారికుమారుడికి ఇంకా సినిమా జీవితం ఉంది 

    రిప్లయితొలగించండి
  3. ఈ అమృతమథనం బ్లాగు టపాలను అప్పుడప్పుడు చదువుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. ఒక్కొక్కొరికి ఒక్కొక్క దృక్కోణం ఉంటుంది. ఈ అమృతమథనం బ్లాగరు గారి శైలి సుభగంగానే ఉంది. దృక్కోణమూ స్పష్టంగానే ఉంది. నిర్మొగమాటంగానూ వ్రాస్తున్నారు, తమతమ అనుకూలతలూ వ్యతిరేకతలూ స్పష్టంగానే తెలిసేలా వ్రాస్తున్నారు. అయితే అన్నీ నిజాలేనా అంటే నిజాలే అని నమ్మటం మానటం చదువరుల యిష్టం. ఒకరకంగా ఒక పార్టీకీ ఒక వ్యక్తికీ బలంగా వ్యతిరేకప్రచారం చేస్తున్నప్పుడు అన్నీ నిజాలే చెబుతున్నామన్నానమ్మటం అంతసులభం కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు ఐబీఎం లో పని చేశారు కదా సుదీర్ఘ కాలం . మీరు ఐబీఎం గురించి ఏదైనా చెప్తే అది నమ్ముతారు జనం. నేను పని చేయలేదు కాబట్టి నేను చెప్తే నమ్మరు . ఇది కూడా అంతే . ఇంకా చెప్పాలంటే ఇలాంటి స్టోరీస్ ఎవరు చెప్పరు , మనకెందుకు లే అయిపొయింది కదా , ఎందుకు అవన్నీ ఇప్పుడు అని . అందరు ఇలానే అనుకుంటే, ఒక వార్త పబ్లిష్ అవ్వడానికి వెనక ఎన్ని ఆలోచనలు (మంచి , చేడు ), ఎన్ని లెక్కలు ఉంటాయో ఎప్పటికి తెలియదు . మీరు ఎంకరేజ్ చేయడం మంచిది .

      తొలగించండి
    2. అదే ఒక ప్రధానసమస్య కదండీ. అందుకని వ్రాసేవారు మరింత బాధ్యతగా ఉండాలి. మనకు తెలిసిన పార్శ్వ్యం గురించి విపరీతంగా వ్రాస్తూ ఇతరాలను ఉపరిస్పర్శగా చెప్పటం వలన తప్పుడు సంకేతాలు వెళ్తాయి - మన ఉద్దేశాలు నిర్దోషం ఐనా సరే.

      తొలగించండి
    3. శ్యామలీయం గారు ఎంకరేజ్ చెయ్యాలంటే.. చంద్రబాబుకి భజన చెయ్యాలి. ఇది లోకంలో అందరికీ తెలిసిందే.

      తొలగించండి
    4. శ్యామలీయం గారు నా రాతల పట్లమీకు ఎలాంటి అభిప్రాయం అయినా  ఏర్పడ వచ్చు అది మీ ఇష్టం .. ప్రజలు ఇలా అనుకుంటున్నారు , ఇలా అనుకునే అవకాశం ఉంది అనేది ఉట్టి మాట .. విశ్లేషకులు , భావిస్తున్నారు , ప్రజలు ఇలా అనుకుంటున్నారు అనే మాటను జర్నలిస్ట్ లు ఎన్ని కోట్ల మంది తో మాట్లాడి రాస్తారో నాకు బాగా తెలుసు . బ్లాగ్ లో చదివేది  50- 100 మంది . ఇందులో ప్రజలు అనుకుంటున్నారు ఇనుకొంటారు అనే పెద్ద మాటలు ..... మీరు ఏం అనుకుంటే అనుకోండి మీ ఇష్టం .. పాపం ప్రజలెందుకు ? 

      తొలగించండి
  4. 95 నుంచి 2014-15 వరకు అంటే దాదాపు 20 ఏళ్ళు టీడీపీ బీట్ రిపోర్టర్ ను ఆ 20 ఏళ్ళ కాలం లో ఆ పార్టీకి  సంబంధించి ప్రతి రోజు ప్రతి కీలక  సంఘటన రిపోర్టర్ గా కవర్ చేశాను . జిల్లాల్లో వేరు హైదరాబాద్ లో మొత్తం ఆ పార్టీ బీట్ చూడడం వల్ల ఆ పార్టీ వ్యవహారాలే రాశాను ఎక్కువగా . మీకు వారి మీద ఉండే అభిమానం కావచ్చు లేదా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మీడియా వారిని చూపించిన కోణం వల్ల కావచ్చు . మీకు వారిపై ఒక విధమైన అభిప్రాయం ఏర్పడడం .. దానికి భిన్నంగా ఉన్న రాతల్లో అనుమానం రావడం అత్యంత సహజం ... 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొరబడుతున్నారు. మీరు ఫలానా పార్టీ వ్యవహారాలు ఎక్కువగా వ్రాయటం గురించి చెప్పిన మాట చాలా సబబుగా ఉంది. కాని నాఅభిప్రాయాలు ఏపార్టీవారిని ప్రత్యేకంగా అభిమానించేవి కావండి. మీరు ఒకే పార్టీని గురిచేసుకొని వ్రాయటం వలన ప్రజలకు కలిగే అభిప్రాయం గురించి ప్రస్తావించా నంతే.

      తొలగించండి
    2. >>"మీరు ఒకే పార్టీని గురిచేసుకొని వ్రాయటం వలన ప్రజలకు కలిగే అభిప్రాయం గురించి ప్రస్తావించా నంతే."

      "నాకు అలాంటి అభిప్రాయంకలిగిందంతే" అని రాసుంటే గౌరవంగా వుండేది.

      తొలగించండి
    3. ఏక పక్షంగా ఒకే పార్టీ కి అనుకూలంగా వార్తలు ఇచ్చే మీడియా వల్ల అనేక ఏళ్లుగా అసలు వాస్తవాలు బయటికి రాలేదు. తద్భిన్నం గా వ్రాసే విలేకరులు అరుదు. అయితే ప్రస్తుత సామాజిక మాధ్యమాల వల్ల కొంతమేరకు నిజాలు బైటికి వచ్చి ఛానెళ్లు పత్రికలు ఇచ్చే వార్తలను ప్రజలు పూర్తిగా విశ్వసించడం లేదు. మీడియా ఛానెళ్లు పత్రికలను ఆయా పార్టీల ప్రచార మాధ్యమం గానే పరిగణిస్తున్నారు.

      MSM విశ్వసనీయత కోల్పోయింది అని చెప్పవచ్చు.

      తొలగించండి
    4. >>నాకు అలాంటి అభిప్రాయంకలిగిందంతే" అని రాసుంటే గౌరవంగా వుండేది.

      >>నాకు అలాంటి అభిప్రాయంకలిగిందంతే" అని రాసుంటే గౌరవంగా వుండేది.

      ఇక్కడ ఎవరు ఎవరి నుంచి గౌరవం ఆశించి కామెంట్లు వేస్తున్నారు,కొంచెం విశ్లేషించి చెప్పండి!చిన్న కామెంటు వెయ్యటానికి సైతం శ్యామలీయం గారు చిరుస్వప్నాల వారినుంచి గౌరవాలు ఆశించి దడుస్తూ దడుస్తూ వెయ్యాలి కాబోలు.ఉన్నది లేనట్టూ లేనిది ఉన్నట్టూ మనసులో ఉన్నది ఒకటైతే పైకి ఒకటి చెబుతూ ఉంటే చిరుస్వప్నాల వారికి బాగుండేది,కదూ!

      తొలగించండి
  5. మీరు బహుశా ఫేస్ బుక్ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పేరాలుగా విడదీసి ప్రచురిస్తే చదవడానికి సౌకర్యంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  6. నా చిన్నప్పటి నుండి నేను ఈనాడు మాత్రమే చదువుతున్నట్టు గుర్తు . వేరే పేపర్ కూడా కన్పించేది కాదు. ఎదో నాసిరకంగా ఉండేవి ఆ పేపర్ లు . ఆంధ్ర భూమి అనుకుంట. నేను ఎంత గుడ్డి గా నమ్మేవాణ్ణి అంటే , ఈనాడు లో వచ్చేది మాత్రమే నిజం అని, మిగతా అంతా అబద్దం అని నా బుర్రలో నాటుకుపోయింది .
    ఈనాడు బాబు గారి పల్లకి మోసే టైం లో , అయితే, నా దృష్టి లో బాబు లాంటి నాయకుడు లేడు , రాలేదు, రాబోడు . అంత మైకం ఉండేవాడిని . ఆయన తప్ప ఇంకొకరు మన దేశాన్ని బాగుచేయలేరు . కేంద్రం లో ఆయన ప్రధానమంత్రి పదవి వద్దన్నాడని చదివినప్పుడు తెగ బాధపడిపోయాను ( ఆ ఫ్రంట్ పేరు గుర్తులేదు , గుజ్రాల్ గారు ప్రధానమంత్రి అనుకుంట అప్పుడు ).
    ఇప్పుడు తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది ఇంతలా మోసపోయాను ఏంటి అని అనిపిస్తుంది , ఇప్పుడు ఏ పేపర్ ఏ పార్టీ దో తెలిసిపోయింది కాబట్టి వార్తలు నమ్మడం లేదు . కానీ గ్రామాల్లో ఇప్పటికి నాలానే ఉన్నారు జనం.
    ఒకప్పుడు పేపర్ ల కి ఎంత విలువ ఉండేది అంటే , ఏదైనా న్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు , పేపర్ లో కూడా వచ్చింది అంట అని చెప్పుకునేవారు . ఈనాడు ఆ నమ్మకాన్ని బాగా వాడుకుని బాబు గారిని పల్లకి ఎక్కించింది .

    రిప్లయితొలగించండి
  7. వెంకట్ గారు ధన్యవాదాలు .. మీలానే నేనూ ఈనాడును గుడ్డిగా నమ్మేవాడిని . జర్నలిస్ట్ కాకముందు ...  ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఈనాడు ప్రభావం వల్ల ఇందిరాగాంధీ ఒక్కరే ఈ దేశానికి ప్రధాన సమస్య .. ఆమె మరణిస్తే దేశంలోని సమస్యలు అన్నింటికీ పరిష్కారం అనుకునే వాడిని . బహుశా అప్పుడు నేను 8-9 తరగతి చదువుతూ ఉండవచ్చు .  నెహ్రూ కాలం చూడలేదు . ఇందిరాగాంధీ తరువాత అంతటి ధైర్యం , సమర్ధత గల నాయకులను చూడలేదు .  కానీ ఈనాడు ప్రభావం అలా ఉండేది . 

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం