తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది. నిజంగానే మనది చిత్రమైన తెలుగు జాతి. తెలుగమ్మాయి సినిమాలో అచ్చం తెలుగమ్మాయిలా కనిపించాలంటే పరాయి భాష అమ్మాయే మనకు శరణ్యం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, కానీ ఇక్కడ పాఠశాలల్లో తెలుగులో మాట్లాడితే దొంగ మెడలో పలకపై పేరు రాసి పోలీస్ స్టేషన్‌లో ఫోటో అంటించినట్టు మెడలో ఇకపై తెలుగు మాట్లాడం అని రాయించి ఎండలో నిలబెడతారు.
రాష్ట్రం ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత కూడా తెలుగునాడుకు వెళదామని తెలుగు పరిశ్రమ ఆలోచించలేదు. ఎలాగోలా తెలుగునాడుకు వచ్చాక ఇక్కడ హీరోయిన్లు తమిళ, కేరళ, గోవా అందగత్తెలు, విలన్లు హిందీవాళ్లు. బాబోయ్ డబ్బింగ్ సినిమాల ధాటిని తట్టుకోలేం అంటూ తెలుగు సినిమా పెద్దలు చేతులెత్తేశారు. మా వల్ల కాదు కానీ మీరే ఏదో ఒక చట్టం చేసి డబ్బింగ్ సినిమాల నుండి మమ్ములను రక్షించమంటున్నారు.
సినిమాల సంగతి వదిలేద్దాం మన టీవీల విషయానికి వద్దాం అంటే తెలుగు టీవీలన్నీ డబ్బింగ్ టీవీలుగానే కనిపిస్తున్నాయి.
సినిమాల సంగతి వదిలేద్దాం మన టీవీల విషయానికి వద్దాం అంటే తెలుగు టీవీలన్నీ డబ్బింగ్ టీవీలుగానే కనిపిస్తున్నాయి.
తెలుగు చానల్స్‌లో ఆసక్తిగా చూసే సీరియల్ పేరు ఏదైనా చెప్పండి అది కచ్చితంగా తమిళ సీరియలే అవుతుంది. న్యూస్ చానల్ విషయంలో పాతాళంలో ఉన్న జెమిని ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ విషయంలో మాత్రం టాప్‌లో నిలిచింది. దానికి కారణం ప్రధానంగా డబ్బింగ్ సీరియల్స్. ప్రధానంగా ఒకప్పటి హీరోయిన్ రాధికకు చెందిన రాడాన్ సంస్థ నిర్మిస్తున్న తమిళ సీరియళ్లే తెలుగునాట ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌ను ఏలేస్తున్నాయి.
అవి తమిళ సీరియల్స్ అని కూడా మన వారికి బాగా తెలుసు. అందుకే రేపు ఏమవుతుంది, లేక వచ్చే వారం ఏమవుతుంది అనేది తెలుసుకోవడానికి తమిళ చానల్‌ను సైతం చూసేస్తున్నారు. భాష అర్ధం కాకపోయినా దృశ్యాన్ని బట్టి విషయం అర్థమవుతుంది కదా! ఒకవేళ ఆ సీరియల్ వచ్చే సమయానికి చూసే అవకాశం లేకపోతే కూడా బాధపడడం లేదు తమిళ చానల్ చూసి విషయం అర్థం చేసుకుంటున్నారు. మన తెలుగు చానల్స్ తమిళ సంస్కృతిని తెలుగువారికి ఇంతగా అలవాటు చేసేశారు. తెలుగును నమ్ముకోవడం కన్నా పరాయి భాషపై ఆధారపడడమే ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్ విజయరహస్యం అనుకున్నట్టుగా ఉంది ‘మా’ టీవి సైతం అదే బాట పట్టింది. అయితే తమిళంలో హిట్టయిన సీరియల్స్ ‘సన్’ టీవీ వారివి కావడం, అవన్నీ వారికే చెందిన జెమినీలో వస్తుండడం వల్ల మా వాళ్లు తమిళం కన్నా హిందీ మిన్న అనుకున్నారు. అప్పటి వరకు ఉన్న హిందీ చానల్స్ అన్నింటిని వెనక్కి నెట్టి దూసుకెళుతున్న కలర్స్ చానల్‌ను ‘మా’ వాళ్లు నమ్ముకున్నారు. కలర్స్ హిందీలో హిట్టయిన హిందీ సీరియల్స్ అన్నీ మాలో చక్కగా తెలుగులో వచ్చేస్తున్నాయి. జీ తెలుగు చానల్స్‌లో ఇప్పుడు మంచి పాపులారిటీ ఉన్న సీరియల్స్ చిన్నారి పెళ్లికూతురు ( హిందీలో బాలికా వధు) వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కలర్స్ హిందీ డబ్బింగ్ సీరియల్సే. ఇక సోనీ హిందీలో బాగా పాపులర్ అయిన సిఐడిని ‘మా’లో ప్రసారం చేస్తున్నారు. ఇక ‘సన్’లో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న లక్ష్మీ, కళ్యాణి, వసంతం, ఝాన్సీ సీరియల్స్ తెలుగు డబ్బింగ్‌తో జెమినిలో తెలుగులో ప్రసారం చేస్తున్నారు.
దేశంలో ఒక ప్రాంతానికి చెందిన సంస్కృతి మరో ప్రాంతానికి తెలియాల్సిన అవసరం ఉంది. అది అవసరం కూడా. కానీ డబ్బింగ్ కార్యక్రమాల ద్వారా జరుగుతున్నది అది కాదు. చివరకు తెలుగు సీరియల్స్ అంటే తమిళ సంస్కృతితోనే ఉండాలనుకునే విధంగా మారింది పరిస్థితి. మన సంస్కృతి, మన ఆచారాలు, మన వ్యవహారాల మీద, మన భాష మీద మనకు ఏ మాత్రం అభిమానం లేకపోవడమే దీనికి కారణం. సిఐడిలో క్రైం స్టోరీలు వస్తాయి. ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారో సిఐడి బృందం చేధిస్తుంది. ఇదీ కథ దీనికి మనకు హిందీ హత్యలే కావాలా? తెలుగునాట హత్యలు జరగవా? మనకు క్రైం కథలు లేవా?
సరే తమిళనాడు మన పొరుగు రాష్ట్రం, దక్షిణాది వాళ్లమే కాబట్టి కొంత వరకు మనకూ వాళ్లకూ పోలికలు ఉంటాయి తేడా తెలియదు అందుకు డబ్బింగ్ చేసేస్తున్నారని సమర్థించుకోవచ్చు. కానీ చివరకు హిందీ సీరియల్స్ విషయంలో సైతం అదే జరుగుతుంది కదా! ఉత్తరాది వారి ఆచార వ్యవహారాలకు, తెలుగు వారికి చాలా తేడాలు ఉంటాయి. సీరియల్స్‌కు వచ్చేసరికి అలాంటి తేడాలేమీ పెద్దగా ఇబ్బంది కలగడం లేదు. ఇతర భాషల సీరియల్స్‌ను డబ్బింగ్ చేసి చూపడం నేరం కాదు, తప్పు కాదు కానీ ఇదే అలవాటైతే మరి మన తెలుగు కళాకారులు ఏం కావాలి, తెలుగుదనం ఏం కావాలి, మన సంస్కృతి మనం మరిచిపోమా? ప్రసార మాధ్యమాలను మనం ఎంత తీవ్రంగానైనా విమర్శించవచ్చు, తిట్టుకోవచ్చు కానీ అవి సమాజంపై చూపే ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం.
సరే తమిళనాడు మన పొరుగు రాష్ట్రం, దక్షిణాది వాళ్లమే కాబట్టి కొంత వరకు మనకూ వాళ్లకూ పోలికలు ఉంటాయి తేడా తెలియదు అందుకు డబ్బింగ్ చేసేస్తున్నారని సమర్థించుకోవచ్చు. కానీ చివరకు హిందీ సీరియల్స్ విషయంలో సైతం అదే జరుగుతుంది కదా! ఉత్తరాది వారి ఆచార వ్యవహారాలకు, తెలుగు వారికి చాలా తేడాలు ఉంటాయి. సీరియల్స్‌కు వచ్చేసరికి అలాంటి తేడాలేమీ పెద్దగా ఇబ్బంది కలగడం లేదు. ఇతర భాషల సీరియల్స్‌ను డబ్బింగ్ చేసి చూపడం నేరం కాదు, తప్పు కాదు కానీ ఇదే అలవాటైతే మరి మన తెలుగు కళాకారులు ఏం కావాలి, తెలుగుదనం ఏం కావాలి, మన సంస్కృతి మనం మరిచిపోమా? ప్రసార మాధ్యమాలను మనం ఎంత తీవ్రంగానైనా విమర్శించవచ్చు, తిట్టుకోవచ్చు కానీ అవి సమాజంపై చూపే ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం.
ఇలా తమిళ, హిందీ సీరియల్స్‌కే పరిమితం అయితే కొంత కాలానికి తెలుగుదనం మనకు అదేదో మరో గ్రహానికి సంబంధించిన ఆచారాల్లా అనిపించవచ్చు. ‘మా’లో గతంలో చక్కని తెలుగు సీరియల్స్ వచ్చేవి. అమ్మమ్మ.కామ్, రాధా మధు వంటి తెలుగు సీరియల్స్‌లో తెలుగుదనం ఉట్టిపడేది. వంశీ మా పసలపూడి కథలు బాగా ఆకట్టుకున్నాయి. అమృతం సీరియల్ బాగా ఆకట్టుకొంది. అమ్మమ్మ .కామ్ ప్రధానంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించింది. ప్రేక్షకులు ఎక్కువ మంది చూస్తున్నారు, వ్యయం తక్కువ ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో చానల్స్ ఇలా డబ్బింగ్ సీరియల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక రకంగా ఇవి వ్యవసాయ రంగంలో జెనిటిక్ విత్తనాల వంటివన్నమాట! రైతుకు ఎక్కువ పంట కావాలి, ఒక్కసారి జెనిటిక్ విత్తనాలకు అలవాటు పడితే తరువాత ఆ పొలంలో మన విత్తనాలు మొలకెత్తవు. చచ్చినట్టు జెనిటిక్ విత్తనాల కోసం పరిగెత్తాలి. తెలుగుతనం మరిచిపోతే తెలుగు వారి పరిస్థితి అలానే అవుతుంది.
కొన్ని కార్టూన్ చానల్స్, డిస్కవరీ చానల్, సినిమా చానల్స్ అచ్చంగా డబ్బింగ్ చానల్స్‌గానే నిర్వహిస్తున్నారు. వాటి సంగతి వేరు. ఆయా అంశాలపై ఇంగ్లీష్‌లో అర్థం చేసుకోలేని వారికి ఈ తెలుగు డబ్బింగ్ చానల్స్ బాగానే ఉపయోగపడతాయి. కానీ సీరియల్స్ సంగతి అలా కాదు తమిళ, హిందీ సీరియల్స్‌ను తెలుగు వాటిగానే మభ్యపెడుతూ ప్రసారం చేస్తున్నారు. తెలుగు సినిమా వారికి బలమైన సంఘం ఉంది, పలుకుబడి గల వారున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి విషయంలో సందేహాలు ఉండొచ్చు కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి జివోలనైనా విడుదల చేయించుకునే బలం విషయంలో తెలుగు సినిమా వాళ్లను తక్కువగా అంచనా వేయలేం. కానీ టీవి రంగానికి చెందిన వారికి సంబంధించి ఇలాంటి బలమైన సంఘాలేమీ లేవు. పైగా ఈ ధోరణిని బహిరంగంగా విమర్శిస్తే అలాంటి వారిని చానల్స్ వాళ్లు బహిష్కరించే అవకాశం కూడా లేకపోలేదు. తమిళ, హిందీ చానల్స్‌లో వస్తున్న సీరియల్స్ లాంటిలో ఉండే కథలు మన తెలుగు నాట దొరకవా?
డబ్బింగ్‌లే తప్ప సొంత ఆలోచనలకు అవకాశం ఇవ్వరా? ఈ టీవి ఇలాంటి డబ్బింగ్ వ్యవహారాలకు దూరంగానే ఉన్నా, మితిమీరిన ఆంక్షల వల్ల ఆ చానల్‌లో మంచి తెలుగు సీరియల్స్ రావడం లేదు. సుమన్ రెండు, మూడు వారాలకో సినిమాతో ప్రేక్షకులపై కక్షకట్టినట్టుగా విజృంభించేస్తున్నారు. అయితే డబ్బింగ్ సీరియల్స్ లేకపోతే సుమన్ సినిమాలు, సుమన్ తరహా సీరియల్సే దిక్కు. పాపం తెలుగు ప్రేక్షకులు.
మీ ఆవేదన నూరు పాళ్ళు నిజం. తమిల సీరియల్స్ని టోకుగా దిగుమతి చేసుకునే జెమిని టీవీ, ఇక్కడినుంచి ఒక్క తెలుగు సీరియల్నైనా తమిళ్ లొకి డబ్ చేస్తోందా ? తెలుగు వాళ్ళంటే వీళ్ళకు లోకువ. జెమిని టీవీ చూడ్డం చాలా ఇబ్బంది గా వుంటుంది. ఇప్పుడు మా టీవీ చూడాలన్నా చిరాకు వేస్తోంది.
రిప్లయితొలగించండితమిళ సినిమాలకు తమిళ భాషలోనే పేరు పెట్టాలని తీర్మానించుకొని అమలు చేస్తున్నారు. ఈ విషయంలో పొరుగు వారినుంచి మనం నేర్చుకోవాలి.
నిజమే! మెట్టెల సవ్వడి ఇంకా శివయ్య సీరియళ్ళు మా ఇంట్లో ముందు అరవంలో చూసి ఆ పై తెలుగు లో చూసి మురిసిపోయేవారు.
రిప్లయితొలగించండిమురళి గారు, మాలాంటి సామాన్యల ఆవేదనకు మీ పోస్టులో అద్దం పట్టారు. ఒకప్పుడు సినిమాలే అనుకుంటే ఇప్పుడు సీరియళ్ళుకూడా డబ్బింగ్ గోలతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీరియల్స్ తెలుగు భాషకు చేస్తున్న ద్రోహాన్ని ఉపేక్షించి ఊరుకోవడానికి ఎంతమాత్రం వీలులేదు. వీటిగురించి నా పరిశీలనను ఓ పోస్టుగా రాయాలనుకున్నాను. తప్పకుండా రాస్తాను.
రిప్లయితొలగించండిమీరు చెప్పిన పోలిక ఎంతో చక్కగా అతికింది. టీవీఛానెల్స్ నాటుతున్న జెనెటిక్ విత్తనాలు ఇక తెలుగు సంప్రదాయాన్ని, సంస్కృతిని అణగదొక్కుతూ చేస్తున్న చేయబోతున్న హాని గురించి ఎంచక్కా పోల్చారు.
good analysis
రిప్లయితొలగించండిడబ్బింగ్ సీరియల్స్ హింస, హీరోయిన్ల కొరత తెలుగు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష. బాగా చెప్పారు మురళీ గారు .
రిప్లయితొలగించండివీటిని ప్రోత్సహించడం ఎప్పుడు మానుకుంటామే :(
రిప్లయితొలగించండిబాగా చెప్పారు...
రిప్లయితొలగించండిఎంతో చక్కగా వ్రాశారు! మీరు వ్రాసిన దానిలో ఆవేదనంతా చక్కగా కనిపిస్తోంది. మన తెలుగు వాళ్ళల్లో నటించే ఆసక్తి ఉన్నా వాళ్ళని పైకి రానీయరు. ఎప్పుడూ దూరపు కొండలు నునుపు, మోజు కదా! అలాగే మన సంస్కృతి, సంప్రదాయాలంటే రోజు చూసేవే కదా అని దాని మీద మొగ్గు చూపే మన జనాలు కొన్నాళ్ళకి మన సంప్రదాయాలని వేరే ఏదయినా ఛానల్ వాడు ప్రసారం చేస్తే చూసి నేర్చుకుంటారేమో?
రిప్లయితొలగించండినిన్న ట్రైన్‌లో నా ఫోన్‌లో తెలుగు అక్షరాలు కనిపించక ఈ లింక్ చదవలేదు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర కాదు, ఒరిస్సా. 1936కి ముందు మద్రాస్ రాష్ట్రంలోని గంజాం, విశాఖపట్నం జిల్లాలలోని ఒడియా మాట్లాడే గ్రామాల్లో తెలుగు మీడియం పాఠశాలలు నడిపేవాళ్ళు. దాంతో ఒడియావాళ్ళు ప్రత్యేక ఐడెంటిటీ కోసం ఉద్యమించి బీహార్, మద్రాస్ రాష్ట్రాలలోని ఒడియా మాట్లాడే ప్రాంతాలని విభజించాలని డిమాండ్ చేశారు. సీరియల్ డబ్బింగా, కాదా అనేది తరువాత విషయం. ఆ సీరియళ్ళలో హింసతో పాటు భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే సెకండ్ హ్యాండ్ లాంటి పదాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సీరియళ్ళని కుటుంబ సభ్యులతో కలిసి ఎలా చూస్తున్నారు? రేపు వీళ్ళ కుటుంబాలలోనే ఎవరికైనా భర్త చనిపోయిన తరువాత లేదా విడాకులు తీసుకున్న తరువాత రెండో పెళ్ళి సంబంధం వెతికినప్పుడు ఎవడైనా 'సెకండ్ హ్యాండ్ నాకు నచ్చలేదు' అని అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి కుళ్ళు భావజాలాన్ని చూపించే సీరియళ్ళు తమిళంలో తీస్తే ఏమిటి, మలయాళంలో తీస్తే ఏమిటి, తెలుగులో తీస్తే ఏమిటి?
రిప్లయితొలగించండిinta deepga inni vishyalu rayadaniki time ela spare chestunnavu hates of to you and BEST OF LUCK
రిప్లయితొలగించండి