నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెరిగి పోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె...
నింగికి నే నెరిగి పోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె...
మల్లయ్య అనే పేరు వినగానే మీకేం గుర్తుకు వస్తుంది. ఒక పల్లెటూరి సాధారణ వ్యక్తి అనిపిస్తుంది కదూ! మరి మాల్యా అనే పేరు వింటే ఎంత ఆధునికంగా ఉందీ పేరు ఆ పేరు వినగానే అందమైన ముద్దుగుమ్మల మధ్య వెలిగిపోయే ఆధునికుడు గుర్తుకు వచ్చి తీరుతాడు. నిజానికి ఆ రెండు పేర్లు ఒకరివే. మల్లయ్య అనే గ్రామీణ పేరును ఆయన స్టైల్‌గా మాల్యా అని మార్చుకున్నారు అంతే ఇది విజయమాల్యాలోని రెండు కోణాలకు ఉదాహరణ. ఈ వారమంతా తెలుగులో అట్టడుగు స్థానంలో ఉన్న స్టూడియో ఎన్ మొదలుకొని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టాప్‌లో ఉన్న చానల్స్ వరకు పలు చానల్స్ విజయమాల్యాపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి.
ఒక వ్యక్తి అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పుడు, కీర్తి ప్రతిష్టలు గడించినప్పుడు అతన్ని అభినందించడానికి తహతహలాడినా ఎక్కడో ఒక మూల అతని స్థితిపై అసూయ ఉండడం మానవ నైజం. అత్యున్నత స్థితిలో ఉన్న ఆ వ్యక్తి జారి కింద పడితే మన ఇగో సంతృప్తి చెందుతుంది. మనం అతనిలా ఎదగలేకపోయామే అనే అసంతృప్తి నుండి మనం బయటపడతాం. అందుకే శిఖరంపై ఉన్నవారిని చూసి అభినందించే మనమే శిఖరం నుండి జారి పడిన తరువాత వీడు ఇలాంటి వాడు అని నేను ఎప్పుడో అనుకున్నాను అని చెప్పడానికి తహతహలాడతాం. అందుకే శ్రీశ్రీ పై కవిత చెప్పారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోతే ఆశ్చర్యపోయిన వారే నేలకు రాలినప్పుడు నిర్దాక్షిణ్యంగా ఉంటారు.
విజయమాల్యా దృశ్య ప్రధానమైన వార్త. బిజినెస్ అనేది కంటికి అందంగా కనిపించే దృశ్యం కాదు. బిజినెస్ చానల్స్‌లోనైనా, న్యూస్ చానల్స్‌లోనైనా బిజినెస్ వార్తలు ఎక్కువగా అంకెల రూపంలోనే ఉంటాయి. ఒక వ్యక్తి వ్యాపారంలో ఎదిగినా పతనం అయినా వార్తలన్నీ అంకెల రూపంలో ఉంటాయి. అందుకే అవి పెద్దగా ఆసక్తి కలిగించవు. కానీ విజయమాల్యా వ్యాపారం దృశ్య రూపంలో కనిపిస్తారు. అలాంటిలాంటి దృశ్య రూపం కాదు కంటికి ఇంపైన దృశ్య రూపం. అందుకే విజయమాల్యా కింగ్ ఫిషర్ విమానయాన సంస్థ నష్టాల్లో ఉందని, ప్రభుత్వం నుండి సహాయం కోరిందనే విషయం తెలియగానే న్యూస్ చానల్స్ విజృంభించాయి. విజయ మాల్యా విలాస వంతమైన జీవితమే ఈ పరిస్థితికి కారణమని తేల్చి చెప్పాయి. మద్యం వ్యాపారం సాగించే యుబి గ్రూప్ ఏటేటా అందమైన అమ్మాయిల అర్ధనగ్న క్యాలండర్‌లను ముద్రిస్తుంది. ఈ క్యాలండర్‌లపై దేశంలో మహా క్రేజ్. ప్రధానంగా ఇంగ్లీష్ చానల్స్ అన్నీ ఈ క్యాలండర్ ముద్రణపై నెలల తరబడి ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తాయి. క్యాలండర్ కోసం అమ్మాయిలు అందాలను ఆరబోస్తుంటే చానల్స్ వాటిని చూపించి తరించేవి. విలాసవంతమైన జీవితాన్ని గడపడం ద్వారానే మాల్యా కింగ్ ఫిషర్‌ను నష్టాల బాట పట్టించాడని తేల్చి పారేసిన చానల్స్ అతను విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారైనా అది తప్పని చెప్పారా? మోడల్స్ కోసం మాల్యా ఖర్చు చేస్తే ఉత్తి పుణ్యానికి వారి అందాలను తమ చానల్స్‌లో చూపిస్తున్నామని మురిసిపోయి కవిత్వాన్ని కలిపి ఆ అందాలను చూపించారు కానీ ఒక్కసారైనా, ఒక పారిశ్రామిక వేత్త అర్ధనగ్నంగా ఉన్న అందగత్తెలతో ఇలా ఫోజులివ్వడం ఏమిటని విమర్శించారా?
పతనం అయ్యాడనుకుని ఇప్పుడు అన్ని చానల్స్ అతనికి నీతులు చెబుతున్నాయి. రాజకీయ నాయకులు సైతం టీవిల్లో అలాంటి విమర్శలే చేశారు. ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఆతను విచ్చలవిడిగా జీవితాన్ని గడిపి నష్టం వస్తే ప్రభుత్వ సహాయం ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఒకవేళ విజయమాల్యా విలాసవంతమైన జీవితం గడపడం తప్పు అని మీడియా భావిస్తే, అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు నిలదీయాల్సిన బాధ్యత మీడియాకు లేదా? మరి ఆ పని ఎందుకు చేయనట్టు.
నిజానికి అతని విలాసవంతమైన జీవితానికి, కింగ్ ఫిషర్ దెబ్బతినడానికి ఎలాంటి సంబంధం లేదు. సహజమైన ఈర్ష్యతో అలాంటి విమర్శలు సహజమే. దాదాపుగా విమానయాన సంస్థలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌లెన్స్ పీకలోతు నష్టాల్లో కూరుకుపోయింది. మరి ఎవరి విలాసవంతమైన జీవితం వల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్ నష్టాల్లో ఉంది. వాటి నష్టాలకు, విలాస జీవితానికి సంబంధం లేదు.
నిజానికి అతని విలాసవంతమైన జీవితానికి, కింగ్ ఫిషర్ దెబ్బతినడానికి ఎలాంటి సంబంధం లేదు. సహజమైన ఈర్ష్యతో అలాంటి విమర్శలు సహజమే. దాదాపుగా విమానయాన సంస్థలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌లెన్స్ పీకలోతు నష్టాల్లో కూరుకుపోయింది. మరి ఎవరి విలాసవంతమైన జీవితం వల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్ నష్టాల్లో ఉంది. వాటి నష్టాలకు, విలాస జీవితానికి సంబంధం లేదు.
1984లో విజయ మాల్యా యునైటెడ్ బ్రేవరీస్ గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి యుబి గ్రూప్ దూకుడుకు ఎదురే లేదు. తొలి 15 ఏళ్ల కాలంలో 63.9 శాతం గ్రోత్‌రేట్ ఉందంటే మాల్యా వ్యాపార సామర్థ్యం అర్థమవుతుంది. ప్రపంచంలో మద్యం ఉత్పత్తి దారుల్లో అతని సంస్థ రెండో స్థానంలో ఉంది. అతను విలాసవంతమైన జీవితం గడిపిందే యుబి గ్రూప్ చైర్మన్‌గా. దాదాపు మూడు దశాబ్దాల నుండి అతను యూబి చైర్మన్‌గా విలాసవంతమైన జీవితానే్న గడుపుతున్నారు. అందమైన అమ్మాయిలతో ఫోటోలు దిగడం, డ్యాన్స్ చేయడం, మొహమాటం లేకుండా మద్యం తాగుతున్నట్టు ఫోజులు ఇవ్వడం అతనికి అలవాటే. అవే దృశ్యాలను ఇప్పుడు టీవిల్లో చూపుతున్నారు. అతను చేసేదే మద్యం వ్యాపారం అయినప్పుడు మద్యం తాగడం తప్పు అన్నట్టు ఉండాల్సిన అవసరం అతనికెందుకు? 2006లో కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించారు. విమానయాన వ్యాపారంలో దెబ్బతిన్నారు. దానికి నిబంధనలే కారణమంటారు. విమానయాన వ్యాపారంలో ఒడిదుడుకుల గురించి చానల్స్ కథనాలు ప్రసారం చేస్తే బాగుండేది కానీ అలా కాకుండా అతను విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అంటూ మోడల్స్‌తో కలిసున్న దృశ్యాలు చూపి హడావుడి చేశారు. వడ్డీ రాయితీ వంటి సహాయాన్ని మాల్యా కోరితే కొందరు పారిశ్రామిక వేత్తలు స్పందన చిత్రంగానే ఉంది. పేదవాడికి ఉచిత విద్యుత్, రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడాన్ని సైతం తప్పు పట్టే కొందరు, పారిశ్రామిక వేత్తలకు మాత్రం వేలకోట్ల రాయితీలు ఇచ్చి తీరాల్సిందేనంటూ వాదించడం చిత్రంగానే ఉంది.
తండ్రి నుండి దూరంగా సాధారణ జీవితం గడిపిన మాల్యా తండ్రికి చేరువై తండ్రి నిర్మించిన మద్యం రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా విస్తరించాడు. అతని జీవితం ఒక సక్సెస్ సినిమా ఫార్ములాకు ఏ మాత్రం తక్కువ కాదు. కింద పడినా తిరిగి కోలుకునే శక్తి అతనికుంది. ఇక విలాస వంతమైన జీవితం గడపడం అవసరమా? నిర్ణయించుకోవలసింది అతనే... చానల్స్ కాదు...
ఐశ్వర్య ప్రసవం
తండ్రి నుండి దూరంగా సాధారణ జీవితం గడిపిన మాల్యా తండ్రికి చేరువై తండ్రి నిర్మించిన మద్యం రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా విస్తరించాడు. అతని జీవితం ఒక సక్సెస్ సినిమా ఫార్ములాకు ఏ మాత్రం తక్కువ కాదు. కింద పడినా తిరిగి కోలుకునే శక్తి అతనికుంది. ఇక విలాస వంతమైన జీవితం గడపడం అవసరమా? నిర్ణయించుకోవలసింది అతనే... చానల్స్ కాదు...
ఐశ్వర్య ప్రసవం
అమితాబ్ తాతయ్యారు. సినిమా వాళ్ల పెళ్లి అంటే చానల్స్ హడావుడి అంతా ఇంతా కాదు. హీరోయిన్లు గర్భవతి అయితే, ప్రసవవేదన చానల్స్ పడతాయి. హీరోలు, హీరోయిన్లు, సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు. వాళ్లూ మనుషులే ... వాళ్లకూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ ఎందుకో చానల్స్ ఈ విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడవు. సినిమా వాళ్ల పెళ్లి అంటే వాళ్ల అభిమానుల్లో సహజంగా ఆసక్తి ఉంటుంది. చానల్స్ మధ్య పోటీ ఉంటుంది. ఒక చానల్ ప్రసారం చేస్తే మేం ఎక్కడ మిస్సవుతామో అని పోటీపడతారు. దాంతో వాళ్లు పెళ్లికి పిలిచినా పిలవకపోయినా చానల్స్ హడావుడి చేస్తాయి. చివరకు మా పెళ్లికి దయచేసి మీరు రావద్దు అని ముందుగానే తిరస్కార పత్రం( ఆహ్వానపత్రానికి వ్యతిరేకం) ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చేసినా మిగిలిన వారి విషయంలో పెద్దగా పట్టించుకోలేదు కానీ అమితాబ్‌కున్న పలుకుబడి వల్ల జాతీయ చానల్స్ సంయమనం పాటించాయి. చానల్స్ వాళ్లు ముందుగానే స్వయం నియంత్రణ విధించుకుని ఆస్పత్రిని చూపవద్దు, ఐశ్వర్య రాయ్ ప్రసవానికి సంబంధించి వారిచ్చిన క్లిప్పింగ్స్ తప్ప ఎలాంటివి ప్రసారం చేయవద్దని ఆంక్షలు విధించడం బాగానే పని చేసింది. అయితే కొన్ని తెలుగు చానల్స్‌లో మాత్రం అప్పుడే పుట్టిన శిశువు జాతకాన్ని చెప్పేశాయి, ఏ పేరు పెట్టాలి, మొదటి అక్షరం ఏముండాలో తెలుగు చానల్స్‌లో తెలుగు జోస్యులు తేల్చి చెప్పారు. హిందీ, ఇంగ్లీష్ చానల్స్ ఆంక్షలను పాటిస్తే తెలుగు చానల్స్ కొద్దిపాటి హడావుడి చేసినా సోషల్ సైట్స్‌లో మాత్రం కొందరు ఐష్ శిశువుకు జన్మనివ్వడంపై అనాగరికమైన కుళ్లు జోకులు వేసుకున్నారు. అమితాబ్ లాంటి పలుకుబడి గల వ్యక్తుల కోసం చానల్స్ స్వీయ ఆంక్షలు విధించుకుంది. మరి ఈ నియమాలు అందరికీ వర్తించవా? అంత పలుకుబడి లేని హీరోయిన్ల గురించి ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేయవచ్చు, వారి పెళ్లిలో పిలవకపోయినా వెళ్లి గందరగోళం చేయవచ్చు, అదే పలుకుబడి ఉన్నవారికైతే ఆంక్షలు విధిస్తారు. వ్యక్తులను బట్టి కాకుండా స్వీయ నియంత్రణ అందరి విషయంలోనూ చానల్స్‌కు అవసరం.
ఆఖరికి మనం మనల్ని ముంచుతున్న వాళ్ళని పోగుడుతున్నాము
రిప్లయితొలగించండిఏమి చెయ్యగలం ఒకరిమీద అక్కసు ఇంకొకరిని పొగుడుతూ చూపించడం మనందరికీ అలవాటేగా.
మన తెలుగు చానెళ్ళు, వార్తా పత్రికల సీరియస్ జర్నలిజం పట్ల మీకు భ్రమలు ఉన్నట్లున్నాయ్.
రిప్లయితొలగించండినేనయితే వీటిని వినోదసాధనాలుగానే భావిస్తున్నాను.
ఇది నేను బాధతోనే చెప్తున్నాను.
పచ్చళ్ళు, గనులు, రియల్ ఎస్టేట్ బినామి డబ్బులతో నడిచే వ్యాపార సంస్థలు ఇంకెలా ఉంటాయ్!
AALOCHANAATMAKAMGAA UNDI.
రిప్లయితొలగించండిWell written! I agree with most of what you said..
రిప్లయితొలగించండిExcellent analysis. Correct kingfisher not alone in crisis. Air India and jet airways also in trouble. Let us see what this stupid channels going to say
రిప్లయితొలగించండి