అద్భుతం... అద్భుతం.. వాహ్ .... నాకు మాటలు రావడం లేదు... ఇలాంటి పదాలు మన తెలుగు చానల్స్‌లో చాలా సార్లు వినే ఉంటాం. వంటల కార్యక్రమంలో వంట రుచి చూడగానే వావ్ అనే మాట తప్పనిసరిగా వినిపిస్తుంది. వంటకు ఉప్పు తప్పనిసరి అన్నట్టు తెలుగు చానల్స్ వంటల కార్యక్రమంలో వావ్ పదం వినిపించాల్సిందే! కానీ ఇది అలాంటి వావ్ కాదు ఆ పదాలకు జీవం పోసిన దృశ్యం అది. అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో కనిపించిన దృశ్యం అది. ఈసారి కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి మానవ సంబంధాల కోణాన్ని కూడా కలిపారు. అందుకేనేమో అందరినీ కట్టిపడేసింది ఈసారి కెబిసి. హాట్ సీట్‌పై భర్త ఉంటే భార్య కుటుంబ సభ్యులతో మాట్లాడించడం, భార్య ఉంటే భర్తతో మాట్లాడడం, అప్పుడప్పుడు భారతీయ వివాహ వ్యవస్థలోని గొప్పతనాన్ని చెప్పడం, అమితాబ్ తన కుటుంబం గురించి చెప్పడం వంటి వాటితో కార్యక్రమం రక్తికట్టింది.
నెలకు నాలుగున్నర వేలు సంపాదిస్తూ, తన నత్తివల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సామాన్యుడు అమితాబ్ ముందు ఆత్మవిశ్వాసంతో ఆడి 50 లక్షలు గెలిచాడు. ఏడు జన్మల్లోనూ నా జీతం ద్వారా ఇంత సంపాదించలేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పేదరికంలో కనీసం మరణించిన తండ్రి ఫోటో కూడా చూడలేదు, పదవ తరగతి పాస్ కాకముందే చదువు మాని పొలం పని చూసుకోవలసి వచ్చింది. కెబిసి మళ్లీ చదవాలనే కోరిక రగిల్చింది. మళ్లీ చదవడమే కాదు ఏకంగా అమితాబ్ ముందు హాట్‌సీట్‌పై కూర్చొని తన జీవిత లక్ష్యాన్ని సాధించుకున్నాడో సామాన్యుడు అతను ఇప్పటికీ పొలం పని చేస్తాడు. ఇలాంటి దృశ్యాలు ఈసారి కెబిసిలో ఎన్నో కనిపించాయి.
దేశంలో వెనుకబడ్డ రాష్ట్రం బీహార్ ... అందులో మరింత వెనుకబడిన గ్రామం నుండి సుశీల్‌కుమార్ అనే యువకుడు కెబిసి హాట్‌సీట్‌లో కూర్చున్నాడు. అతని జీతం నెలకు ఆరున్నరవేల రూపాయలు. కెబిసి రెండుసార్లు అమితాబ్‌తో నిర్వహించిన తరువాత ఒకసారి షారుఖ్ ఖాన్‌తో నిర్వహించారు. అమితాబ్‌తో కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని స్టార్‌ప్లస్ ప్రారంభించి, కోటి రూపాయల బహుమతి నిర్ణయించారు. దానితో మరో చానల్ పోటీగా అనుపమ్‌ఖేర్‌తో రెండు కోట్లరూపాయల బహుమతితో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. కెబిసిని ఒకసారి షారుఖ్‌ఖాన్‌తో నిర్వహించారు. కానీ అది అమితాబ్ తరహాలో ఆకట్టుకోలేక పోయింది. అంతా తెలిసిన కార్యక్రమమే ఇందులో ఆసక్తి ఏముంటుంది అని మొదట్లో అనిపించింది. 13 ప్రశ్నలు అన్నింటికి సరైన సమాధానాలు చెబితే గతంలో కోటి రూపాయల బహుమతి, ఇప్పుడు ఐదు కోట్ల బహుమతి. ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు వారే చెబుతారు అందులో ఏది సరైనదో చెబితే చాలు. దీనికి నాలుగు లైఫ్ లైన్లు కూడా ఉంటాయి. ఇంతోటి దానికి అన్ని కోట్ల రూపాయల బహుమతా అనిపిస్తుంది.
కానీ కార్యక్రమం చూశాక అభిప్రాయం మారుతుంది. బాగానే క్లిక్ అయింది. మళ్లీ ఇప్పుడు ఐదుకోట్లతో కొత్తగా ఏం చూపిస్తారు అనిపించింది. ప్రసారాలు ప్రారంభం అయ్యాక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇది జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన కార్యక్రమమే కానీ దాన్ని మానవీయ కోణంతో చూపించారు. కార్యక్రమంలో ఎంతగా విజయం సాధించారంటే నాలుగు లైఫ్ లైన్లలో నిపుణుడి సలహా కూడా ఒకటి ఉంటుంది. బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ 50లక్షల రూపాయలు గెలిచిన తరువాత కోటి రూపాయల ప్రశ్నకు నిపుణుడి సహాయం కోరారు. లాల్‌బహద్దూర్ శాస్ర్తీ తన పెళ్లిలో ఖాదీతో కట్నంగా ఏం తీసుకున్నారు అనేది ప్రశ్న. సుశీల్ కుమార్‌కు దాని సమాధానం తెలియదు. చరఖా అని నిపుణడు సలహా ఇచ్చాడు. సుశీల్‌కుమార్‌కు కోటి దక్కాయి. ఆ సమయంలో సుశీల్ కుమార్ ముఖంలోని ఆనందాన్ని చూసి జాతీయ పత్రికకు సంపాదకుడైన నిపుణుడు సైతం భావోద్వేగానికి గురికాకుండా ఉండలేకపోయారు. తన కళ్లను తుడుచుకున్నారు. సరిగ్గా అమితాబ్ సైతం అలాంటి ఉద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే సుశీల్ కుమార్ బీహార్‌లోని ఒక మారుమూల గ్రామం నుండి వచ్చాడు. నెలకు ఆరున్నర వేల రూపాయలు సంపాదిస్తాడు. కూలిపోయిన పెంకుటిల్లు, పేద కుటుంబం. సుశీల్‌కుమార్ ఆనందాన్ని తట్టుకోలేక పోయాడు.
తన జీవితంలో షూ ధరించడం ఇది రెండవ సారి కెబిసిలో పాల్గొనేందుకు షూ ధరించి వచ్చానని చెప్పుకున్నాడు. చివరి ప్రశ్నకు సైతం సమాధానం చెప్పి అతను ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు. అమితాబ్ సైతం ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. తాను నిబంధనలకు భిన్నంగా మీ సీటు వద్దకే వచ్చి చెక్ ఇస్తున్నానని చెప్పారు. తానెంతగా భావోద్వేగానికి లోనైంది అమితాబే చెప్పుకున్నారు. కోటి రూపాయలు గెలిచాక చెక్ ఇవ్వడం ఆనవాయితీ కానీ తాను కోటి రూపాయల చెక్ కూడా ఇవ్వడం మరిచిపోయానని, తరువాత ఇచ్చారు. సుశీల్‌కుమార్‌కు ఐదు కోట్ల రూపాయల బహుమతి లభించడం తనకు ఎంత సంతోషాన్ని కలిగించిందో అమితాబ్ తన బ్లాగ్‌లో ప్రత్యేకంగా రాశారు. సుశీల్ కుమార్ పెంకుటిల్లును, అతని పేద జీవితాన్ని టీవిలో ప్రత్యేకంగా చూపించారు. ఆ దృశ్యాలు చూపిన వారు అతను విజయం సాధించినప్పుడల్లా చప్పట్లతో ప్రోత్సహించారు. చివరి ప్రశ్నకు సమాధానం చెప్పి ఐదుకోట్ల బహుమతి పొందినప్పుడు కార్యక్రమంలో ఉన్నవారే కాదు టీవీల ముందున్నవారు సైతం భావోద్వేగం నుండి తప్పించుకోలేకపోయారు. ఈసారి కెబిసిలో ఇలాంటి దృశ్యాలు చాలానే చోటు చేసుకున్నాయి.
ఒక సాధారణ మహిళ మూడు లక్షల రూపాయల అప్పు చేశాం అదిప్పుడు ఆరులక్షలైంది. సంపాదించిందంతా వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది అని చెప్పింది. ఆ మహిళ ఆరులక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు తప్పు సమాధానం చెప్పి కిందికి వెళితే మాకు చాలా బాధగా ఉంటుంది అని అమితాబ్ చెప్పడం కదిలించింది. చివరకు ఆ మహిళ 50 లక్షల రూపాయలు గెలుచుకుంది. డబ్బుతో జనరల్ నాలెడ్జి ఏమిటి? అనే విమర్శ ప్రారంభంలోనే వచ్చింది. క్రైం కథలో, ఏడుపుగొట్టు కథలతోనో ప్రజలను హింసించే వాటికన్నా ఇలాంటి కార్యక్రమాలు ఏ కోణంలో చూసినా అభినందించదగినదే. పేదరికాన్ని గ్లామరైజ్ చేశారనే విమర్శ రావచ్చు, రేటింగ్ పెంచుకునే జిమ్మిక్కులు అనే విమర్శ రావచ్చు. కానీ వీక్షకులను కట్టిపడేసి విధంగా ఉంది కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొనే వారి కుటుంబం గురించి, వారి ఇంటిని, ఆ ప్రాంతాన్ని, మిత్రులను చూపడం బాగుంది. ఐదుకోట్ల రూపాయల బహుమతి పొందిన సుశీల్‌కుమార్ నేటి యువతకు, పాజిటివ్ ఆలోచనలకు అద్దం పట్టేవిధంగా ఉన్నారని అమితాబ్‌తో పాటు నిపుణులు కొనియాడారు.
అమితాబ్‌కున్న ఇమేజ్, అతను నటించిన సినిమాలు, అతని పట్ల ప్రజల్లో ఉండే అభిమానం కెబిసి విజయానికి దోహదం చేసింది. వాటన్నింటికి తగ్గట్టు టీవి కార్యక్రమాన్ని ఇలా నిర్వహించాలి అనుకునేట్టుగా అమితాబ్ దీన్ని నిర్వహిస్తున్నారు. ఆయన తప్ప మరెవరూ ఇలాంటి కార్యక్రమానికి సరిపోరు. షారుఖ్ ఖాన్ బాలివుడ్ బాద్షాగా నిలిచినా కెబిసిలో మాత్రం అమితాబ్ ముందు వెలవెలబోయారు. ఆ తరువాత మరోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తే సక్సెస్ అవుతుందని బాగానే అంచనా వేశారు. అమితాబ్ ఆ అంచనాలను నిజం చేశారు. భార్యాభర్తల గురించి హాస్యోక్తులతో అమితాబ్ కార్యక్రమానికి జీవం పోశారు. బిగ్ బిగా తన పేరుమీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి దివాళా తీసిన తరువాత కెబిసి ద్వారానే అమితాబ్ తిరిగి నిలదొక్కుకోవడం విశేషం. అందుకే పట్టుదలతో కృషి చేసిన సామాన్యులను ఆయన మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో ప్రోత్సహించారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగునాట మనం ఆశించడం అత్యాశే అవుతుందేమో!

మురళి గారు ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయంతో నూరుశాతం ఏకీభవిస్తున్నాను . నటునిగా అందరూ ఆయన అభిమానులే అయినా వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తీరుకి అమితాబ్ కి సలాం అనక తప్పదు. అప్పుడప్పుడూ అతను చెప్పే వ్యక్తిగత విషయలానుంచీ గ్రహించ వలసింది కూడా చాలా వుంటుంది. ఎంత పెద్దవాళ్ళయినా సాంప్రదాయాలని పాటించడం, భార్యా భర్తలమధ్య జరిగే చిన్న చిన్న ముచ్చట్లు సందర్భానుసారంగా అమితాబ్ చెప్పటం బావుంటుంది . ఈ కార్యక్రమంలో హాట్ సీట్ కి వచ్చిన సామాన్యులు కనపరిచే ఆత్మవిశ్వాసం చూస్తూ మనమూ ఉద్వేగానికి గురవ్వకుండా వుండలేం.
రిప్లయితొలగించండిబాగుందండి. బాగా రాశారు. ఈ సిరీస్ కె.బి.సి బాగుంది.
రిప్లయితొలగించండి@లలిత గారు ఆ కార్యక్రమం చూసినప్పుడు నేను కూడా బావోద్వేగానికి గురయ్యాను . సోమవారం ప్రసరమైనదనిలో సాదారణ రైతు అయిన యువకుడి ఆత్మవిశ్వాసం నాకు బాగా నచ్చింది .దేవుడు నోరు ఇచ్చినప్పుడు తిండి కూడా ఇస్తాడు అంటూ ఆత్మవిశ్వాసంతో పలికిన విధానం నచ్చింది .
రిప్లయితొలగించండి@శిశిర గారు నచ్చినందుకు థాంక్స్.. నిజమేనండి ఆలోచన ఎవరిదో కానీ ఇంతకు ముందు వచ్చిన వాటికన్నా ఈ సిరీస్ బాగుంది
ఆత్మ విశ్వాసం అని గొప్పగా చెప్పడానికి సుశీల్ కుమార్ ఒక గొప్ప ఉదాహరణ. ఒకవేళ బహుమతి పొందలేకపోయినా అతని భావోద్వేగం ని సహజంగానే చూసి ఉండేవారం. కుటుంబ జీవనం మనిషిని నేలపై నిలబెడుతుంది. ప్రాధమిక అవసరాలు తీరని చోట నుండి ఆత్మ విశ్వాసం మొలకెత్తి అంత ఘనమైన బహుమతి అందుకునిఆనందం అంబరాన్ని తాకిన తరుణం లోను అతని లోని సాధారణ మనిషి తనం నాకు బాగా నచ్చింది. చాలా అందమైన,అద్భుతమైన వీక్షణం గా మనసు పొరలలో ఉండి పోతుంది. మీరు ఆ కార్యక్రమాన్ని చూసి ఇక్కడ చెప్పిన విధం చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి భావోద్వేగం.ధన్యవాదములు మురళీ గారు.
రిప్లయితొలగించండిadbhuthanga vrasav !!! programme chudani vallu evarina unte vallu idi chadivi kadilipoyela undi. nuvvu cheppindi aksharala nijam . aksharalu lakshalynantha nijam
రిప్లయితొలగించండిచాలా బాగా రాశారు. బాగుంది. యూ ట్యూబ్ లింక్ ఏదైనా పెట్టండి, వీలుంటే.
రిప్లయితొలగించండిబుద్దా మురళి గారికి నమస్సులు.....
రిప్లయితొలగించండిఅమితాబ్ కార్యక్రమం మీద మీ రచన చాలా బావుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంపిక ఎలా చేస్తారో , దానికి మనం ఏం చేయాలో దయచేసి తెలుపగలరు. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉంది.... ఎంపిక విధానానికి సంబంధించి పూర్తి వివరాలు ( వయసు, చదువు, ఆర్థిక స్థోమత, ఇతర అర్హతలు.....) పొస్ట్ రాస్తే ఆంధ్రప్రదేశ్ లోని యువకులెందరికో ప్రయోజనకరంగా ఉంటుంది కదా .......
ధన్యవాదాలు.....
నా మెయిల్:
tpraovja@gmail.com
@వనజవనమాలి @దేవి @చందు @. పిఆర్ తమిరి గారు మీ అందరికీ నచ్చినందుకు థాంక్స్ . దాదాపు అందరి ఇళ్ళలోనూ కుటుంబం కలిసి భోజనం చేసే సమయంలో ఈ కార్యక్రమం వస్తుంది. కుటుంబ విలువల గురించి విలున్నప్పుడల్లా అమితాబ్ చెప్పడం బాగుంది. మనను మనం సమిక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తమిరి గారు సోనీలో ఈ కార్యక్రమం రాత్రి ౯.౩౦ కి వస్తుంది . గతం లోనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు సంప్రదించమని ఫోన్ నుంబెర్స్ ఇచ్చారు , ఇప్పుడు ఇవ్వడం లేదు ఐతే రోజూ కార్యక్రమంలోనే ఒక ప్రశ్న అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పవచ్చు . నెట్ లో సోనీ చానల్ కార్యక్రమం లో కూడా దీని గురించి ఉంది
రిప్లయితొలగించండినిజంగా మీ వ్యాసం చదివాకా ఈ ప్రోగ్రాం చూడాల్సింది అనిపిస్తుంది నాకు..
రిప్లయితొలగించండినేను సుమన్ బాబు సినిమాలు, ఎప్పుడైనా సెన్సేషనల్ వార్తలు తప్ప టీవీ మానేశాను. ఒక కోటి బహుమతి గా ఇచ్చే రోజుల్లో చూసేదాన్ని.
చాలా బావు౦ద౦డి, సుశీల్ గురి౦చి చూసి చాలా ఆనందం వేసింది
రిప్లయితొలగించండి