11, ఏప్రిల్ 2011, సోమవారం

వారసత్వం ఎవరిది ?

ఇదేం చిత్రమో కానీ దేశానికి స్వాతంత్య్రం లభించి ఆరు దశాబ్దాలు నందమూరి తారక రామారావు కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ ని ఏర్పాటు చేశారు. చిత్రంగా ఇప్పుడు ఆ పార్టీ కి మూడో తరం వారసుడు ఎవరా ? అనేదానిపై కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి . తన తరువాత తన కొడుకు కు వారసత్వం లభించలనేది బాబు ప్రయత్నం. సినిమాల్లో రామారావు వారసత్వం తన కుమారుడికి దక్కినట్టుగానే దేశం వారసత్వం తన కుమారుడికి దక్కాలనేది హరికృష్ణ ప్రయత్నం. వారసత్వ పోరులో లోకేష్ నిలుస్తాడా? జూనియర్ గెలుస్తాడ చూడాలి. గడిచిపోయినా ప్రజాస్వామ్యంలో సైతం మన వాళ్లు వారసత్వానికే పెద్ద పీట వేస్తున్నారు. మీడియా ఫలానా పార్టీ కచ్చితంగా గెలుస్తుందంటే ప్రజలు దానికి వ్యతిరేక పార్టీని గెలిపిస్తున్నారు.్ఫలానా గొప్ప నాయకుడికి ఫలానా వ్యక్తి చట్ట ప్రకారం వారసుడని తేలిస్తే, ప్రజలు మాత్రం మరొకరిని వారసునిగా ఎన్నుకుంటున్నారు. తమిళ నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంజిఆర్ వారసురాలిగా భార్య పదవి చేపడితే ప్రజలు మాత్రం జయలలితే నిజమైన వారసురాలని తేల్చేశారు. ఎంజిఆర్ భార్య ముఖ్యమంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతే జయలలిత మాత్రం శాశ్వత వారసురాలిగా మిగిలిపోయారు. ఇక్కడ ఎన్టీఆర్ విషయంలో అలానే జరిగింది. మా అబ్బాయే నా వారసుడు అని ఆయన ప్రకటిస్తే అదీ ఆచరణకు నోచుకోలేదు, ముచ్చటపడి చేసుకున్న రెండో భార్య వారసురాలిగా నిలువలేదు, చివరి రోజుల్లో తాను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబే చివరకు వారసునిగా నిలిచిపోయారు. దేశానికి స్వాతంత్య్రం లభించి అరవై ఏళ్లవుతున్నా దేశంలో ఇంకా వారసత్వ రాజకీయాలే నడుస్తున్నాయి. హీరో కొడుకు హీరో అవుతున్నాడు, హీరోయిన్ కూతురు హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేస్తోంది అలాంటప్పుడు ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావాలా? వద్దా? బహుశా ఈ మాట పైకి చెప్పకపోయినా ఇదే ఉద్దేశంతో జగన్ ఓదార్పు యాత్రకు బయలు దేరారు. ప్రధానమంత్రుల సంతానం ప్రధాన మంత్రి కావడం దేశంలో సర్వసాధారణం కానీ ముఖ్యమంత్రుల విషయంలో మాత్రం ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. నెహ్రూ కుమార్తె ఇందిర ప్రధాని అయ్యారు. ఇందిర కుమారుడు రాజీవ్ ఆ పదవి చేపట్టారు. ఇప్పుడు రాజీవ్ కుమారుడు రాహుల్ పట్ట్భాషేకానికి ఉత్సాహపడుతున్నారు. దేశంలో పాటించిన ఈ సంప్రదాయం రాష్ట్రంలో పాటించవద్దా? అనేది కొందరి వాదన. అదేం చిత్రమో కానీ అటు కాంగ్రెస్ ఇటు టిడిపిలో వారసత్వం విషయంలో ఒకే మార్గంలో పోతున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులు అవుతున్నా, మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రికి కూడా ఆ భాగ్యం దక్కలేదు. పెద్ద చవన్ కొడుకు చిన్న చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరుణానిధి కొడుకు పట్ట్భాషేకానికి సిద్ధమవుతున్నారు. ఇక కర్నాటకలో దేవగౌడ ఆయన కొడుకు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావద్దనే నిబంధన అటు కాంగ్రెస్ పాటిస్తోంది, ఇటు టిడిపి పాటించింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా టిడిపిని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వారసత్వం విషయంలో సైతం అచ్చంగా ఇలానే జరిగింది. బాలయ్యే నా వారసుడు అని ఆయన అధికారంలో వెలిగిపోతున్నప్పుడే మదన పల్లిలో ప్రకటిస్తే, అల్లుడు గారు అరిచిగీపెట్టి ఆ మాటను ఉపసహంరించుకునేట్టు చేశారు. ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నాక, చట్ట ప్రకారం ఆయనకు నేనే వారసురాలిని అని రెండో భార్య ప్రకటించుకున్నా, కొడుకు నేనే వారసుడ్ని అని పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్లినా ఓటర్లు మాత్రం అటు భార్యను, ఇటు కొడుకులను కాకుండా అల్లుడినే వారసుడిగా గుర్తించారు.

ఇందిర మనవడు రాహుల్ ప్రధాన మంత్రి పదవి కోసం సిద్ధపడుతున్నప్పుడు ముఖ్యమంత్రి కొడుకుగా నేనెందుకా పదవి చేపట్టకూడదు అంటూ జగన్ ఓదార్పు యాత్రకు బయలుదేరారు. 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా అధిష్టానం మాత్రం దానికి ససేమిరా అంది.

జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి కొడుకులు ఎవరూ ఆ పదవికి దరిదాపుల్లోకి చేరుకోలేక పోయారు. తొలి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి మొదలుకుని ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య కుటుంబం వరకు అందరి పరిస్థితి అదే. టి అంజయ్య భార్య ఎమ్‌పి ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం అయ్యారు . పివి నరసింహారావు మరే తెలుగువాడు అందుకోలేనంత స్థాయికి వెళ్లినా రాష్ట్రంలో మాత్రం బలమైన వార సుడిని తయారు చేయలేకపోయారు.

మెజారిటీ లేకపోయినా ఐదేళ్లు కేంద్రంలో ఆయన సమర్ధవంతంగా ప్రధానిగా పని చేశారు కానీ రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీ ఉన్నా ముఖ్యమంత్రిగా రెండో వార్షికోత్సవం సైతం చేసుకోలేకపోయారు. కుమారుడు రాజకీయాల్లోకి వచ్చినా తండ్రి ప్రధానిగా ఉన్నందున మంత్రి పదవి స్థాయికే పరిమితం అయ్యారు. రాజకీయాల్లో రాటుదేలిన మర్రి చెన్నారెడ్డి సైతం తన స్థానాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో కుమారునికి అవకాశాలు కల్పించలేదు. సనత్‌నగర్ అసెంబ్లీ స్థానానికే ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి పరిమితం అయ్యారు.

ఇక నాదెండ్ల భాస్కర్‌రావు పాపం ఆయన ఉన్నదే నెల రోజుల ముఖ్యమంత్రి కాబట్టి, ఆయనకే సరైన ఠికాణా లేనప్పుడు వారసుడిగా కుమారునే్నం తయారు చేయగలరు. స్వశక్తితోనే ఆయన కుమారుడు డిప్యూటీ స్పీకర్ స్థాయి వరకు వచ్చారు. చండ శాసనుడిగా పేరు పొందిన జలగం వెంగళరావు కొడుకులు ఎమ్మెల్యే టికెట్‌కు మించి ఎదగలేక పోయారు. దామోదరం సంజీవయ్య కుర్చీని సర్దుకునే లోపే అధికారం నుంచి దిగిపోవలసి వచ్చింది . కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కొడుకు ఎంపి టికెట్ వరకు ఎదిగారు.

రాటుదేలిన రాజకీయ నాయకుడు కాసు బ్రహ్మానందరెడ్డి కొడుకు సైతం సేమ్ టూ సేమ్ అన్నట్టు ఎమ్మెల్యేకే పరిమితం అయ్యారు. రాజకీయాల్లో భవనం వెంకట్రామ్‌కు వారసత్వమే లేదు. ఇటు వైఎస్‌ర్ కొడుకు జగన్ విజయం సాధిస్తే పాత సంప్రదాయాన్ని బద్ధలు కొట్టినవారవుతారు. ఇటు చంద్రబాబు సైతం వారసున్ని ప్రవేశపెట్టేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి ఇటు తాను మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, అటు కొడుకు వ్యాపారంలో స్థిరపడాలి, నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా, తరువాత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, అబ్బాయిని రంగ ప్రవేశం చేయించాలనేది ఆయన ఆలోచన. ముందు ముందుఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం