12, ఏప్రిల్ 2011, మంగళవారం

తిక్క యాంకర్లు తల తిక్క చర్చలు : సరదా కబుర్లు

ముఖాన్ని ఒకసారి టీవి వైపు తిప్పుతూ , కొద్ది సేపటికి మళ్లీ  పేపర్ల ఫైలు తిరగేస్తూ చలపతి తనలో తానే నవ్వుకోసాగాడు ఏంట్రా అదిఎన్నికలు జరిగి పోయాయి పలితాలు వస్తుంటే పాత పేపర్లు అంత ఆసక్తిగా చదువుతున్నావు ఏమిటి విశేషం.  అంటూ గోవిందం వచ్చాడు. ‘‘పాత పేపర్లో ఎన్నికల గురించి వచ్చిన వార్తలను ఫలితాలు వచ్చిన తరువాత చదువితే భలే సంతోషంగా ఉందిరా! అంటూ చలపతి తన నవ్వుకు కారణం చెబుతూ మళ్లీ నవ్వసాగాడు.


 హోరాహోరి పోరు, అభ్యర్థులపై వ్యతిరేకత,ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ , దేశం దూసుకెలుతున్నాయి .వీరిద్దరి మద్య జగన్ బెంబేలెత్తి పోతున్నాడు. అన్ని నియోజాక వర్గాల్లో దేశం కు మంచి పట్టు ఉంది. సీనియర్లను రంగం లో దించారు. జగన్ కు  మైనారిటీలు దూరం,  ప్రజల్లో నమ్మకం లేదు. . హేమాహేమీలను రంగంలో నిలిపిన టిడిపి ’’అంటూ చలపతి వరుసగా చదవుతూ నవ్వు ఆపుకోలేక పోయాడు.
 గోవిందం ఆ నవ్వుతో శ్రుతి కలుపుతూ‘‘ సర్లేరా! టీవిలో ఆ చర్చ చూడు మరింత నవ్వుతావు’’ అంటూ టీవి వాల్యూమ్ పెంచాడు.
జగన్ కు మూడో స్థానం తప్పదు అంటూ అప్పటివరకు వాదిస్తూ వచ్చిన విశ్లేషకుడు పలితలతో పాటు స్వరం మార్చాడు 


‘‘మనం అనుకున్నట్టుగానే ఈ ఎన్నికల్లోజగన్   విజయం సాధించిం. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. 
 మనం అనుకున్నట్టే జరిగింది.’’ దీనిపై మీరేమంటారు అని తెల్లముఖం వేసుకుని ఆలోచిస్తున్న తింగరయ్యను టీవి యాంకర్ చిదానందం అడిగాడు. ‘‘నిజమే నండి రోజూ మీ చానల్‌కు నన్ను పిలిచే మీరు సామాన్యులు కాదు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంత కచ్చితంగా అంచనా వేసిన వారు నా మూడు దశాబ్దాల జర్నలిజం చరిత్రలో మరొకరు లేరు.


 అసలు నేను జర్నలిజంలోకి రావడమే చిత్రంగా జరిగింది. ‘‘ నువ్వెందుకూ పనికి రావురా బడుద్దాయి, నా కడుపున చెడబుట్టావు, ఏ ఒక్క పనీ సరిగా చేయవు, ఎవర్నీ సుఖంగా ఉండనివ్వవు, నువ్వు సుఖంగా ఉండవు, జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పావా? అబద్ధాలే... నీ జీవితమంతా అబద్ధాలే ఎందుకు పనికొస్తావురా?’’ అని మా నాన్న తిట్టేవాడు అలాంటి నేను దేశం గర్వించదగ్గ జర్నలిస్టునయ్యాను. - అంటూ తింగరి చెప్పుకుంటూ పోతుంటే యాంకర్ మధ్యలో అడ్డుతగలి ఔనండి తింగరి గారు నా జీవితం కూడా అచ్చం అలానే ఉంది.
 పెళ్లిళ్ల షూటింగ్‌లో మనకు ఎదురు లేదు ఓసారి పెళ్లి క్యాసెట్ పోగొడితే పెళ్లి కొడుకు తండ్రి కత్తి పట్టుకుని అరేయ్ నువ్వెలా బతికుంటావో చూస్తారా? అంటూ నా కోసం పరిగెత్తుకొస్తే ఇలా హైదరాబాద్‌లో తేలాను. టీవిలో స్థిరపడ్డాను. వాడు ననే్నమీ చేయలేక టీవిలో కనిపించే నన్ను చూసి జీర్ణం చేసుకోలేక ఆ మధ్య ఓసారి టీవివిని విసిరిగొట్టాడట! తిక్కవెదవ. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని, టీవిని విసిరిగొట్టి నా ఎదుగుదలను ఆపాలనుకోవడం మూర్ఖత్వం ఏ మంటారు’’అని చిదానందం అడిగాడు.
గులాబీ కండువా వేసుకున్నాయన చిరాగ్గా ‘‘ఇలా అయితే నేను ఇక్కడి నుంచి వాకౌట్ చేస్తాను. ఎన్నికల ఫలితాలపై చర్చ అని పిలిచి మీలో మీరే మాట్లాడుకుంటే ఇక నేనెందుకు’’ అని కోపంగా అడిగాడు. 


తింగరయ్య చిన్నబుచ్చుకుని ‘‘మీరలా మాట్లాడవద్దు ప్రజలు మీపై గురుతర బాధ్యతను పెట్టారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కనివ్వకుండా ఘన విజయం సాధించిన మీరు ఎంతో ఓర్పుతో ఉండాలి. మూడు దశాబ్దాల జర్నలిజం జీవితం అంటే ఏమనుకుంటున్నారు.


 సమయం వచ్చినప్పుడు మా గురించి మేం చెప్పుకోకపోతే ఇక మా గురించి చెప్పేదెవరు? అయినా మీరు విజయం సాధిస్తారని ముందుగా ఊహించిందే.. ఇక మీరు చెప్పుకోవడానికి ఏ ముంటుంది’’ అని తింగరయ్య కోపంగా అడిగాడు. ‘‘చెప్పేదేమీ లేనప్పుడు పిలిచిందెందుకో?’’ అని గులాబీ అతను భలే ప్రశ్న అడిగాననుకున్నాడు.‘‘ పిలిచిన వారందరినీ మాట్లాడించేందుకు కాదు, మేం మాట్లాడింది వినడానికి కూడా పిలుస్తాం మీరా విషయం గ్రహించాలి.
 మా చానల్‌లో పెట్టుబడి పెట్టిన వారు మధ్య మధ్యలో వస్తుంటారు. వారి మాటలకు మేమే కాదు మీరూ విలువ ఇవ్వాలి ’’ అంటూ చిదానందం సమాధానం తో కసురుకున్నాడు. పక్కనున్న హస్తవాసికి మండుకొచ్చింది సరే మీ చావు మీరు చావండి. నా అభిప్రాయం నేను చెప్పి తగలడతాను అని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
 ‘‘అసలే మా తెలుగు  ఆత్మగౌరవం డిమాండ్ తగ్గిందని మేము ఏడుస్తుంటే   మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. మా ఓట్లు లేకుంటే ఎవరైనా విజయం సాధిస్తారా?  అన్నీ మా ఓట్లే అని పచ్చాయని ఎర్రబోయిన ముఖంతో ఆవేశంగా పలికాడు. ఔను మీ ఓటర్లకు మీపై కన్నా మీ ప్రత్యర్థులపైనే నమ్మకం ఎక్కువ అని తింగరాయన చమత్కరించాడు.
 అక్కడున్న అందరూ తలో మాట అంటుండడంతో ఎవరేమన్నారో ఎవరికీ వినిపించలేదు. ఇంతటి గందరగోళం మధ్య అసలు నోరు మెదపకుండా ఉన్నమౌ నయ్య వైపుఅంతా ఆసక్తిగా చూశారు ఏం చెపుతాడో అని   . అదేమీ కాదు. అసలు శనివారం నాడు పోలింగ్ జరగకపోయినందు వల్లనే ఫలితాలు ఇలా వచ్చాయి అని  మౌ నయ్యచెప్పగానే అంతా విస్తుపోయారు. ఇదేం వాదం శనివారం పోలింగ్ జరగకపోతే ఇలా వచ్చాయానే మాటలో పస లేదు అని అంతా ముక్తకంఠంతో అన్నారు. వౌనయ్య మెల్లగా ‘‘ మీరు చేసిన వాదనల్లో ఎంత పసుందో? నా మాటల లోనూ అంతే పసుంది ’’ అని ముక్తా యంచాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం