30, ఏప్రిల్ 2011, శనివారం

రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం ఇష్టమే, వాల్మికి రామాయణం ఇష్టమే

బాబా పై బ్లాగ్స్ లో రకరకాల  కామెంట్స్ వస్తున్నాయి. వీటిలో కొన్ని బాబా ను  దేవునిగా కీర్తిస్తూ, వస్తుంటే కొన్ని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నాయి.  ఎవరి అభిప్రాయాలూ వారివి . బాబా బ్రమున్నారు. కుటుంబం కోసం భక్తుల డబ్బు ఉపయోగించుకోలేదు. బాబాను నమ్మి విరాళాలు ఇస్తే, వాటిని పేదలకు ఉచిత వైద్యం , నీరుఅందించేందుకు కర్చు చేశారు. దేశాన్ని దోచేస్తున్న నాయకులు వదిలేసి  మంచి చేసిన వారిని తిట్టడం ఎందుకు. మేధావులు బాబా ను తిడుతున్నా సామాన్యులు మాత్రం ఆయన చేసిన మంచినే గుర్తు చేసుకుంటున్నారు.  బాబా ను సమీప బందువులు చూసి వచ్చిన వార్తను టివి లో చూశాక ఒకరు దేవునుకి సమీప బందువులు ఉంటారా అని ఒకరు బ్లాగ్లో రాశారు. ఓ మిత్రుడు  నిజామే కదా దేవుడికి బందువులు ఉంటారా అని నవ్వాడు.  రాక్షస బందువులు బ్లాగ్స్  నిర్వహిస్తూ, కామెంట్స్ చేస్తున్నప్పుడు దేవుడికి సమీప బందువులు ఎందుకు ఉండరు అని అని నవ్వుతు చెబితే అతనుకూడా నవ్వాడు.  దేవుడు అంటే ఎవరు అని నిర్వచించుకుంటే సమాదానం దొరుకుతుంది. పన్నెండు చేతులు, ఆరు కాళ్ళు ఉంటేనే దేవుడు అనుకుంటే బాబా లో దేవుడు కనిపించరు . పేదలకు నిరు, వైద్యం అందించిన వారు దేవుడు అనుకుంటే బాబా లో దైవం కనిపిస్తారు. నేను నాస్తికత్వాన్ని ఇష్టపడతాను , దైవత్వాన్ని ఇష్టపడతాను. రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం ఇష్టమే,  వాల్మికి రామాయణం ఇష్టమే .   మానవత్వాన్ని అంతకన్నా ఎక్కువగా ఇష్టపడతాను. సహాయం చేసే అవకాశం లేక్కపోయిన మంచి కనిపించినప్పుడు అభినందిద్దాం 

14 కామెంట్‌లు:

  1. వర్ణ వ్యవస్థని బలపరిచిన రామాయణాన్ని నేను అంగీకరించలేను. సత్యసాయి బాబా విషయానికి వస్తే అతను కేవలం విరాళంగా వచ్చిన డబ్బులతో సమాజ సేవ చేశాడు కానీ సొంత డబ్బు పైసా ఖర్చు పెట్టలేదు. భక్తి పేరు చెప్పకపోతే విరాళం ఇవ్వని స్థితిలో ఉండడం సామాజిక దుస్థితి కాదా? మనిషి సామాజిక బాధ్యత ఎరిగి సమాజ సేవ చెయ్యాలి కానీ మంత్రాలు, మహిమలు లాంటి మూఢ నమ్మకాల పేరుతో కాదు.

    రిప్లయితొలగించండి
  2. చెట్టు మీద పండ్లున్నాయి కదా, ఒక రాయి వేసి చూద్దాం అనుకునే 'స్వయం ప్రకటిత' మేధావుల కబోది కళ్ళకి ఇతరులు చేసే మంచి కనిపించదు. మీరు చెప్పినట్లుగా, వారిది రాక్షసజన్మ అని ఒదిలేయడమే.

    రిప్లయితొలగించండి
  3. నేను నాస్తికత్వాన్ని ఇష్టపడతాను , దైవత్వాన్ని ఇష్టపడతాను.
    Great sir, you are one in billion sir. World is running only because of deeep thinkers like you. Keep posting such stuff.

    రిప్లయితొలగించండి
  4. “There are two sides to every issue: one side is right and the other is wrong, but the middle is always evil.” -Ayn Rand

    రిప్లయితొలగించండి
  5. నీవు హిందువుననుకొని ఆలోచిస్తే ఇస్లాంలో అంత తప్పే కనిపిస్తుంది . ముస్లిం ననుకొని ఆలోచిస్తే హిందుత్వలో అంత తప్పే అనిపిస్తుంది . ఏ మతానికి చెందినవాడిని అనుకోకుండా ఆలోచిస్తే నీకు హిందుత్వాలోని అద్భుతం కనిపిస్తుంది, ఇస్లాంలోని అద్భుతం కనిపిస్తుంది .. ఓషో రజనీష్ సరిపోయిందా మృత్యుంజయ

    రిప్లయితొలగించండి
  6. ఎవరో అజ్ఞత మొత్తం ప్రపంచం తరపున మాట్లాడేస్తున్నాడు. ఎవరిని ఏమి అనలేం గవర్నమెంట్ ఇష్టమొచ్చినట్టు కాంట్రాక్టులు ఇచ్చేస్తుంది అని ఒకవైపు భాదపడుతుంటే మరో వాపు ఎవరిని అడగకుండానే మొత్తం ప్రపంచం తరపున మాట్లాడే కాంట్రాక్టులు తీసుకుంటున్నారు

    రిప్లయితొలగించండి
  7. బాబా తన సొంతడబ్బులు ఖర్చు పెట్టలేదు ఐనా ఆయనను బాబా అన్నారు.మరి వారు సంపాదించిన డబ్బు దానం చేసిన బిల్ గేట్స్,వారెన్ బఫెట్ లాంటి వారిని ఏమనాలి.

    రిప్లయితొలగించండి
  8. గుడుంబాశంకర్‌30 ఏప్రిల్, 2011 5:00 PMకి

    ఈమ్మాట్లాడుతునారు మీరు? నాస్తికత్వాన్ని ఇష్టపడడమా? ఇంకేమన్నా ఉందా? నాస్తిక బ్రమ్మల్లో మిమ్మల్నీ కలిపేసి మీమీద యుద్ధాలు లేవదీయాల్సి ఉంటుంది. మా మలకన్న విన్నాడంటే ముందు నన్ను చంపుతాడు. ఓక బ్లేడు, చెంబుడు నీళ్ళు ఉంటే ఇవ్వండి బోడిగుండునైపోతా, లీటర్‌ కిరోసిన్‌ ఉంటే ఇవ్వండిం అమరుణ్ణైపోతా .

    రిప్లయితొలగించండి
  9. Read discussion on Baaba.

    http://blaagadistaa.blogspot.com/2011/04/blog-post_23.html

    రిప్లయితొలగించండి
  10. BILL GATES EARNING IS SOME WHAT O.K.BECAUSE HE USED HIS BRAIN FOR TECHNIAL KNOWLEDGE AND BROUGHT TO THE WORLD.
    BUT WAREN BUFFET IS A CAPITALIST HE INVESTED MOST OF HIS MONEY IN SHARE MARKET WHICH IS A GAMBLING AND CHEATING OTHERS. OTHER WISE HOW CAN HE MAKE MONEY IN MARKET SPECULATIONS,
    BUT BABA ASKED OR INOTHER SENSE HE ASKED TO DONATE MONEY FOR A GOOD CAUSE, THAT , WHICH IS VOLUNTERY.
    BILL GATES DESIGN IS COMPULSORY FOR SOME VERSIONS OF COMPUTRERS BUT LINUX WHICH IS A FREE SOFTWARE BUT LESS PRESENTATION TO THE WORLD.

    రిప్లయితొలగించండి
  11. నేను నాస్తికత్వాన్ని ఇష్టపడతాను , దైవత్వాన్ని ఇష్టపడతాను. రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం ఇష్టమే, వాల్మికి రామాయణం ఇష్టమే .రెందింటిని ఎలా ఇస్టపడతారొ అర్ధం కావటం లెదు

    రిప్లయితొలగించండి
  12. మృత్యుంజయ కామెంట్ పై నా కామెంట్ చదవండి అర్థమౌతుందేమో

    రిప్లయితొలగించండి
  13. సాయిబాబా చిన్నప్పుడు సత్యనారాయనరాజుగా ఉన్నప్పుడే నాకు తెలుసును.నేను సైన్సుకు విరుద్ధమైన మహిమలను నమ్మను.సత్యసయిబాబాగా ఆటను మారినతర్వాత ఒక్కసారే చూసాను.మహిమల సంగతి ఎలావున్నా ,ఆయన చేసినవి ప్రజోపకారమైన మంచి పనులే కదా?వైద్యం,విద్య, నీటి సరఫరా ఇంకేమ్చేయ్యాలి? తనస్వంత డబ్బు కాకపోవచ్చును. దేసవిదేసాల దాతల విరాళాలే కావచ్చును. ఆయనపై భక్తీ వలననే కదాఅన్ని కోట్ల దానం లభించింది. మనమేవరూ ,చివరకు ప్రభుత్వం కూడాచెయ్యలేని కార్యాలు సాధించేరు .ఆయన్ను ,భాగవతారంగా కాకపోయినా, గొప్ప వ్యక్తిగా మనం గౌరవించాలి. కులమతజాతిభేదాలకుఅతీతంగా విస్వప్రేమనే బోధించారు.ఆయనను నిందించడం తప్పని నా అభిప్రాయం. ఆయననిర్మించిన సంస్థలన్నీ సక్రమంగా TrasTuvaaru నిర్వహించేటట్లు ప్రజలు,ప్రభుత్వమూ, చూస్తె చాలు. అదే మనము ఆయనకు అర్పించేనివాళి.రమణారావు.ముద్దు

    రిప్లయితొలగించండి
  14. సంఘ మిత్ర గారు థాంక్స్ . మీ అబిప్రాయమే నా అభిప్రాయం .మీలాంటి పెద్దవారు నా మాట సమర్దించినందుకు మరో సారి థాంక్స్ అనవసర వాదనలు వద్దని కొన్ని కామెంట్స్ ప్రచురించలేదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం